kandula
-
‘జాహ్నవి’ మృతిపై అనుచిత వ్యాఖ్యలు..విధుల నుంచి అధికారి తొలగింపు
సియాటెల్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారిపై వేటు పడింది. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్‌ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ విభాగం గురువారం ధ్రువీకరించింది. అతడికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని కూడా తెలిపింది. అయితే, అడెరర్పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించలేదు. జనవరి 23వ తేదీన సియాటెల్‌లో కెవిన్ డేవ్ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్ అడెరర్ చులకన చేస్తూ మాట్లాడటంపై తీవ్ర దుమారం చెలరేగింది. అడెరర్ బారీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సియాటెల్ పోలీస్ విభాగం పేర్కొంది. -
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’
సియాటెల్‌లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సైతం అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్ ఆర్డరర్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ అడెరెర్ రాసిన లేఖను సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్ తన లేఖలో వివరించారు. అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్, డేనియల్ అడెరెర్‌కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. మరోవైపు డేనియల్ అడెరెర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
భంగపడ్డ మహిళా నేత ‘రాఖీ’ అస్త్రం.. వర్క్‌వుట్ అవుతుందా?
ప్రతీ పండుగా ఓ సెంటిమెంటే.. ఎన్నికల కాలంలో ప్రతీ సెంటిమెంటూ ఓ రాజకీయాస్త్రమే. అలాంటి ఆసక్తికర సెంటిమెంట్ రాజకీయాలకు ఇప్పుడు రాఖీ పండుగా ఓ అస్త్రంగా మారుతోందక్కడ. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో పాటు.. సిట్టింగ్‌పై తిరుగుబావుటా ఎగరేసిన ఆ మహిళా నేత.. అవసరమైతే బీఆర్ఎస్ రెబల్‌గా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడక్కడ రాఖీలు కడుతూ.. కార్మిక క్షేత్రంలో సోదరభావాన్ని పెంచే యత్నం చేస్తోంది ఆ మహిళామణి. రామగుండంలో రాజకీయాలు చాలాకాలంగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు అసమ్మతి నేతలు తిరుగుబాటు ప్రకటించినా.. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో గులాబీ బాస్ చందర్‌కే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, మంత్రుల బుజ్జగింపులతో కొంత సద్దుమణిగినట్టు తాత్కాలికంగా కనిపించినా.. అసమ్మతి నేతల్లో ఆ జ్వాలలు మాత్రం ఆరడం లేదు. అందులో పాలకుర్తి జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఆశావహ నేత కందుల సంధ్యారాణిది కూడా కీలకపాత్రే. అయితే, చందర్‌కు టిక్కెట్ కేటాయించాక.. ఆయన అనుచరులు ఆమెను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ వారం క్రితం సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన సంధ్యారాణి.. ఇప్పుడు రామగుండంలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ( ఫైల్ ఫోటో ) అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో.. సంధ్యారాణి ఇప్పుడు రాఖీపండుగ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. కార్మిక క్షేత్రమైన సింగరేణిలో వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు.. ప్రతీ గనిలో పర్యటిస్తూ తనకు మద్దతు ప్రకటించాలంటూ రాఖీ కడుతూ సోదరభావంతో కూడిన సెంటిమెంట్ ను వారిలో తీసుకొస్తున్నారు సంధ్యారాణి. చదవండి: అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్న క్రమంలో.. కొంత అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్న చోట అవి మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరోవైపు నేతలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టి వాటిని ఓట్లుగా మల్చుకునే క్రమంలో ప్రతీ అంశాన్నీ తమకనుకూలమైన అస్త్రంగా మల్చుకునే యత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఇండిపెండెంట్లకు కూడా పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్యేలను మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోల్ బెల్ట్ ఏరియా రామగుండంలో ఆ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకునేందుకు.. ఇప్పుడు రాఖీ సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు కందుల సంధ్యారాణి. -
రామగుండం.. ఎమ్మెల్యే టికెట్ నాదే..
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో అధికార, విపక్ష పార్టీల నేతలు జనం బాట పట్టారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ గడప గడపకూ పార్టీ అంటూ వివిధ పేర్లతో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. అయితే రామగుండం నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు.. అధికార పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికే పోటాపోటీగా ఎమ్మెల్యే ఆశావహులు రహస్య సమావేశం నిర్వహించి పాదయాత్రలు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు, కార్పొరేటర్లు, కార్మిక నాయకులు అభ్యర్థులుగా తమకు తాము ప్రకటించుకొని టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. జిల్లా అధ్యక్షుడికే తప్పని ‘ఇంటి పోరు’ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను ఒక్కతాటి పైకి తీసుకవచ్చి, పార్టీని బలోపేతం చేయాల్సిన కోరుకంటి చందర్‌పై ఇంటిపోరును సరిదిద్దలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు, కార్యకలాపాలు చేయని ఆశావహులు, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేరుగా పాదయాత్రల పేరుతో రంగంలోకి దిగుతుండటంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్‌లకే టికెట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే చందర్ ‘ప్రజాచైతన్య యాత్ర ‘పేరుతో గడప గడపకూ పార్టీ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేలా పర్యటిస్తున్నారు.కాగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యే కోరుకంటికి వ్యతిరేకంగా రహస్యంగా పలు దఫాలుగా సమావేశమై, కోరుకంటికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని ప్రకటనలు చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకు పోటాపోటీగా శనివారం నుంచి పాదయాత్రలు మొదలు పెట్టి కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకుంటామనడం, ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపుకోసం పాటుపడుతామని ప్రకటించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే కోరుకంటి మాత్రం ఈ పరిణామాలని్నంటినీ చాలా చిన్నవిగా భావిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ తమకే అంటూ ప్రకటించుకున్న నాయకులపై జిల్లా అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలకు పూనుకోకుండా ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో ఆశావహులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు, స్వచ్ఛంద సంస్థల పేరుతో వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ గెలుపే లక్ష్యంగా పాదయాత్ర రామగుండంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అరడజనుకు పైగా పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ పాతిపెల్లి లక్ష్మి భర్త పాతిపెల్లి ఎల్లయ్య, టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ఆశిస్తున్నవారంతా తమ తమ సామాజిక వర్గాల బలాలు, బలహీనతలు, ఖర్చులు, పెట్టుబడులను అంచనా వేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలతో పాదయాత్రల పేరిట ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోలేటి దామోదర్ పాదయాత్రలతో కాకుండా సీఎం కేసీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యంతో టికెట్ సాధించే పనిలో ఉన్నారు. అధికార పార్టీలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఎలాంటి నియంత్రణలు, క్రమశిక్షణ చర్యలు లేకుండా పోయాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యానికి సంకేతమా లేక అంతర్గత కలహాలకు నిదర్శనమా అర్థం కావడం లేదని సగటు గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి ఆశావహుల డివిజన్ బాట గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆశావహులు సిద్ధమయ్యారు. శనివారం నుంచి రామగుండం నియోజకవర్గంలో డివిజన్లు, గ్రామాలు, గనులపై పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పాతిపెల్లి ఎల్లయ్య తెలిపారు. ఈమేరకు నాయకులు సమావేశమైన ఈవిషయాన్ని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రజల బాట పట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. బస్తీలు, గ్రామాలు, గనుల బాట చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా అనుసరిస్తూ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని ఆశావహులు పేర్కొన్నారు. -
ముగ్గురు పిల్లల్నీ చంపేసి.. దంపతుల ఆత్మహత్య!
- మంత్రాలు చేస్తున్నారంటూ అవమానించడంతో దారుణం - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాదం - మంత్రాలు చేస్తోందంటూ సొంత చెల్లెలిపైనే అన్నావదినల దాడి.. కలత చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం - పిల్లలకు ఉరివేసి చంపేసి.. ఆపై దంపతులూ బలవన్మరణం - మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఈటల.. ముగ్గురిపై కేసు నమోదు సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్ పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతాం.. వారి బాధ చూడలేక మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం.. కానీ ఓ తల్లిదండ్రులు తమ ముగ్గురు కన్నబిడ్డలనూ తమ చేతులతోనే చంపేశారు.. ఒకరి తర్వాత ఒకరికి ఉరివేశారు. వారి మృతదేహాలను మంచంపై వరుసగా పడుకోబెట్టి.. తల్లిదండ్రులు కూడా ఉరివేసుకున్నారు.. మంత్రాలు చేస్తున్నారంటూ దగ్గరివారే నిందలు వేసి అవమానించడాన్ని భరించలేక ఆ కుటుంబం దారుణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో ఆదివారం వేకువజామున ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురూ పదేళ్లలోపు పిల్లలే కావడం, ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. తాము చనిపోతే కూతుళ్లు ఎలా బతుకుతారోనన్న ఆవేదనో.. తమపై వచ్చిన మచ్చకు కూతుళ్లను ఎక్కడ వేధిస్తారనుకున్నారోగానీ.. కన్నబిడ్డలను తమ చేతులతోనే చంపేసిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది. కొంతకాలంగా అనుమానాలు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన చిన్నబత్తుల రాజయ్య, లచ్చమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు కొద్దిరోజుల కింద మరణించాడు. రెండో కుమార్తె కొమురమ్మకు కందుగుల గ్రామానికి చెందిన గంట కొమురయ్యతో పదేళ్ల కింద వివాహం చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఎల్లమ్మ (9), కోమల (6), అంజలి (4) ఉన్నారు. ఈ కుటుంబం కులవృత్తి (గంగిరెద్దుల) అయిన యాచక వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా కొమురమ్మ తమపై మంత్రాలు చేస్తోందని, అందుకే తమ ఆరోగ్యం బాగుండడం లేదని ఆమె అన్న కొమురయ్య, అతడి భార్య పెద్ద రాజమ్మ, చనిపోయిన తమ్ముడి భార్య చిన్నరాజమ్మ అనుమానిస్తున్నారు. వారు దీనిపై తరచూ గొడవపడుతుండడంతో కొమురమ్మ కొంతకాలంగా పుట్టింటికి వెళ్లడమే మానేసింది. అయితే ఇటీవల కొమురమ్మ తల్లిదండ్రులు రాజయ్య, లచ్చమ్మ మానకొండూర్ మండల కేంద్రానికి నివాసాన్ని మార్చడంతో.. అప్పుడప్పుడూ వారి వద్దకు వెళ్లి వస్తోంది. అప్పు చెల్లిస్తానని తీసుకెళ్లి.. రాజయ్య గతంలో కొమురమ్మ వద్ద రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము తిరిగిస్తానంటూ కుమార్తెను, అల్లుడిని మానకొండూర్‌కు పిలిపించుకున్నాడు. అయితే పెద్ద రాజమ్మ అనారోగ్యంతో ఉందని, ఆమెను సిద్దిపేట జిల్లా ధూళికట్టలోని ఓ చర్చికి తీసుకెళ్లారని వారికి సమాచారం వచ్చింది. దీంతో రాజయ్య, కొమురమ్మ, కొమురయ్యలు ధూళికట్టకు వెళ్లారు. కానీ అక్కడ కొమురమ్మను అన్నావదినలతో సహా తండ్రి కూడా తీవ్రంగా దూషించినట్లు తెలిసింది. ‘నువ్వు మంత్రాలు చేయడం వల్లే మాకు ఇలా జరుగుతోంది.. రోగాల పాలవుతున్నం.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్..’అంటూ దాడికి కూడా పాల్పడినట్లు సమాచారం. దీంతో కొమురమ్మ దంపతులు బాధతో ఇంటి ముఖం పట్టారు. ఈ అవమానం తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆవేదనతో వారిని చంపి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బోనాలు చేసుకుంటున్నామంటూ.. కొమురమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెల్లో చిన్న కుమార్తె వారివద్దే ఉండగా.. హుజూరాబాద్‌లోని బాల సదనంలో ఎల్లమ్మ ఐదో తరగతి, కోమల రెండో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం బాల సదనానికి వచ్చిన కొమురయ్య తమ ఇంట్లో బోనాలు చేసుకుంటున్నామని, తమ పిల్లలను పంపించాలని వార్డెన్‌కు లెటర్ రాసిచ్చి వెంట తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి ముగ్గురు కుమార్తెలకు ఉరివేసి.. అనంతరం దంపతులు కూడా ఉరి వేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. నిన్నటి వరకు తమతో కలిసి చదువుకున్న, ఆటలాడుకున్న ఎల్లమ్మ, కోమల మృతి చెందారనే తెలియడంతో బాల సదనంలో విద్యార్థులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురిపై కేసు నమోదు కొమురమ్మ దంపతుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చిగురుమామిడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు కొమురయ్య అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కొమురమ్మ అన్న చిన్నబత్తుల కొమురయ్య, అతడి భార్య రాజమ్మ, మరో అన్న భార్య పెద్ద రాజమ్మలపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఇలాంటి ఘటనలు బాధాకరం: ఈటల కందుగుల ఘటన విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో కొమురమ్మ దంపతులు, పిల్లల మృతదేహాలను సందర్శించారు. ఈ ఘటన బాధాకరమని.. సంచార తెగల్లో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ ‘మంత్రాల’గొడవలు! కందుగుల గ్రామంలోని గంగిరెద్దులకాలనీలో రెండేళ్ల కింద కూడా మంత్రాల నెపంతో కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాజా ఘటనలో ఆత్మహత్య చేసుకున్న కొమురయ్య బంధువైన ఓ మహిళ మంత్రాలు చేస్తోందంటూ కొండయ్య అనే ఓ వ్యక్తి గొడవకు దిగాడు. అయితే ఆ కులానికి చెందిన పెద్ద మనుషులు ఇరు వర్గాల నుంచి రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న మహిళను కాగుతున్న నూనెలో చేతులు పెట్టాలని, చేతులు కాలకుంటే మంత్రాలు చేయలేదని నమ్ముతామని తీర్మానించినట్లు తెలిసింది. ఆ మహిళ వేడి నూనెలో చేతులు పెట్టగా కాలలేదని.. దాంతో కొండయ్య డిపాజిట్ సొమ్మును వదిలి గ్రామం నుంచే వెళ్లిపోయినట్లు తెలిసింది. అప్పట్లో ఈ వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లగా.. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించినట్లు సమాచారం. -
ఇష్టారాజ్యంగా పన్నుల పెంపు
ప్రభుత్వం తీరుపూ మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ ఆగ్రహం కడియం : శాస్త్రీయమైన హేతుబద్దత లేకుండా పంచాయతీల్లో పన్నులు పెంచుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ అన్నారు. శనివారం ఆయన కడియంలో స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేఽశారు. మూడు నాలుగు రెట్లు ఒకేసారి పన్నులు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2000 సంవత్సరానికి ముందు టాక్స్ రివిజన్ విధానం ఉండేదన్నారు. ఆ తర్వాత ఏటా 5 శాతం టాక్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. వీటిని కాదని కేవలం పంచాయతీరాజ్ కమిషనర్ డీవో లెటర్ ద్వారా కలెక్టర్ల విచక్షణ మేరకు పంచాయతీల్లో పన్నులు పెంచేస్తున్నారన్నారు. బ్రిటష్ పాలనను గుర్తుకు తెచ్చే ఈ విధానం ఎంత వరకు సబబని దుర్గేష్ ప్రశ్నించారు. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. సాచురేషన్ విధానంలో భాగంగా ఆ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. చేనేత కుటుంబాల్లో 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పురుషులకు 50 ఏళ్లు, మహిళలకు 55 ఏళ్లు ఉండాలని జీవో తీసుకువచ్చారు. ఇది మహిళల పై చూపుతున్న వివక్ష కాదా? అని దుర్గేష్ ప్రశ్నించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెట్టి మహిళలు, పురుషులు సమానమని చెబుతున్న చంద్రబాబు చేనేత కార్మికుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నూటికి 90 మంది ఉన్న నర్సరీ రైతులపై విద్యుత్ చార్జీలు, ట్యాక్స్‌ల భారం మోపితే చిన్న రైతుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. రూ.ఐదు కోట్లతో నర్సరీ రైతులకు ఉపయోగపడే కన్వెన్షన్ సెంటర్‌ను అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి మంజూరు చేశారన్నారు. దానిని తక్షణం పూర్తి చేసే చర్యలు చేపట్టాలని కోరారు. డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, మాజీ సర్పంచ్‌లు గట్ట నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉప సర్పంచ్ చిక్కాల బాబులు, స్థానిక నాయకులు ముద్రగడ జెమి, పల్లి చిన్న, తూపాటి చిన్న, పాటంశెట్టి సునీల్‌కుమార్, బొబ్బిలి ప్రసాద్, గాద పెద్దబ్బులు, రత్నం విజ్జయ్య, గాద రామన్న, అంబటి రాజరత్నం పాల్గొన్నారు.