Karimnaga
-
'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!
ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో స్వదేశ్ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.భర్త నేర్పించాడు!ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్ క్లాస్ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్‌తో ఏదైనా చేయాలనుకున్నారు. రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్‌దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్ సెట్ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.మార్కెట్ బాగుంది!‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్ బాగుంది. మెమెంటోలుగా పీకాక్ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్‌లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్ చార్జ్ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.ప్రధాని ప్రశంస!జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.జీఐ ట్యాగ్ వచ్చింది:మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఈ కళకు కేంద్రం. కరీంనగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్‌కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది.భద్రమైన కళఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్‌దాన్, పాన్దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్ వేజ్‌లు, పాత్రలు, వాల్ ఫ్రేమ్‌లు, టేబుల్ టాప్ షో పీస్‌లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు. (చదవండి: -
మానేరు నదికి పర్యాటక శోభ : మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్ : చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మానేరు నదికి పర్యాటక శోభ లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మానేర్ నది 365 రోజులు జలకళతో పర్యాటకులను ఆకర్షించనున్నదని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ దిగువన మానేరు నది పై 87.90 లక్షలతో నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి తీగలవంతెన వద్ద మంత్రి గంగుల కమలాకర్ శంఖుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలకు తాగు.. సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వృధాగా గోదావరిలో కలిసే నీటిని అరికట్ట వచ్చని తెలిపారు. అలాగే ఏడాది పొడవున మానేరు నదిలో 10 కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుందని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఈ ఐదు చెక్ డ్యాంలతో పాటు ఇరుకుల్ల వాగు పై మరో మూడు చెక్ డ్యాంలు కరీంనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాగులో నీళ్లు నిలపడం వల్ల కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు శివారు కాలనీల్లో, చుట్టూ పక్కల గ్రామాలకు భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు ,తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిఅయితే రేటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రోపోజల్ పంపిస్తామని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం తో మానెరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు పడిందని రానున్న రోజుల్లో మానేరు నది పర్యాటక రంగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. -
కరీంనగర్లో బీజేపీకి బ్రహ్మరథం
సాక్షి, కొత్తపల్లి: కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తి పంచాయతీ పరిధిలోని షేకాబీకాలనీ, బుడిగజంగాలకాలనీ, ముదిరాజ్‌కాలనీ, గౌడకాలనీ, హనుమాన్‌నగర్, చింతకుంట పరిధిలోని టీఆర్కే నగర్లో సోమవారం ప్రచారం నిర్వహించిన సంజయ్‌కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రలోభపెట్టినా లొంగకుండా నిండు మనస్సుతో తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం మారుతి, నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కడార్ల రతన్‌కుమార్, పర్వతాల మల్లేషం, ఎడ్ల లక్ష్మణ్, పాదం శివరాజ్, పొన్నాల రాము, భూమేష్, దండు అంజయ్య, దుర్గం అంజయ్య, బి.లక్ష్మీరాజం, డి.సంతోష్, శ్రావణ్‌కుమార్, చరణ్, చింతల ఆంజనేయులు, చందు, భూమేష్, ఉపేందర్ పాల్గొన్నారు. ఒక్క అవకాశమివ్వండి స్వచ్ఛమైన, నీతివంతమైన పరిపాలన కోసం ఒక్కసారి బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కోరారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హన్మాన్నగర్, చంద్రపురికాలనీల్లో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, కాశెట్టి శేఖర్, గాండ్ల శ్రీనివాస్, అభిలాష్, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. మాఫియా శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం కరీంనగర్‌సిటీ: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ దందాలు కొనసాగించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్‌లు వ్యాపారులను వేధించారని, వారి అనుచరులతో నడుస్తున్న మాఫియా శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల కార్యాలయంలో గుమాస్తాల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
ధర్మగుండంలోకి కొత్తనీరు..
వేములవాడ: శివకల్యాణోత్సవానికి హాజరైన లక్షలాది మంది భక్తులతో ధర్మగుండం నీళ్లు అపరిశుభ్రంగా మారడంతో ఆలయ అధికారులు వాటిని తొలగించి కొత్తనీరు నింపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం వరకు ఎల్ఎండీ నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీరు ధర్మగుండం కింది మెట్ల వరకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు నింపనున్నట్లు ఈఈ రాజయ్య తెలిపారు. ఈనెల 25న సీతారాముల కల్యాణోత్సవానికి మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో ముందుస్తుగా చర్యలు చేపట్టారు. దీంతో గురువారం భక్తులు షవర్ల వద్ద స్నానాలు చేశారు. -
హాట్‌హాట్‌గా..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నిధులున్నా రోడ్లు, తాగునీటి పైపులైన్ పనులు చేయకుండా అధికారులు ప్రజలను నరకయాతన పెడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ‘2011 నుంచి దాదాపు రూ.7 కోట్ల మేర నిధులున్నా ఖర్చు చేయడం లేదు. అండర్‌గ్రౌండ్ పనులతో నగరం నాశనమైంది. మండలంలో తాగునీటి పథకాలకు కరెంటు కోసం డబ్బులు కట్టినా కనెక్షన్ ఇవ్వడం లేదు. గత డీఆర్సీలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల విషయమై చర్చించినా లాభం లేదు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే చిత్తశుద్ధిలేదు. అధికారులు కనీసం రివ్యూ చేయడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం?’ అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన ఆదేశాలకే దిక్కులేదని, నగరంలో అభివృద్ధి ఊసేలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని చెప్తున్నామని, అలా ప్రతిపాదనలు రాక తిప్పిపంపాల్సి వస్తోందని కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. ఇలాగైతే బల్దియా అధికారుల తీరును సీరియస్‌గా తీసుకోవాల్సివస్తుందని ఇన్చార్జి మంత్రి పొన్నాల హెచ్చరించారు. అవసరమైన పనులకు సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలు రూపొం దించాలని, అందుబాటులో ఉన్న నిధులకు అదనంగా 20 శాతం పనులు తీసుకోవాలని సూచిం చారు. భూగర్భ డ్రైనేజీ పనులపై గంగుల, ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్కీం పూర్తి చేయాలంటే మరో రూ.150 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని, హడ్కో రుణం కోసం ప్రయత్నిద్దామని పొన్నాల సూచించారు. తాగునీటి పథకానికి ఆటంకాలు.. రామగుండం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీటిని మళ్లించే స్కీంకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సరఫరా, రాజీవ్ రహదారి విస్తరణలో సమస్యలను ప్రస్తావించారు. ‘రూ.65 కోట్లతో 25వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు పంపాను. మున్సిపాలిటీకి ఎస్సారెస్పీ నుంచి తాగునీరు అందించాలని కోరాను. నాలుగేళ్లవుతున్నా అతీగతీ లేదు. రాజీవ్హ్రదారి విస్తరణ పనుల్లో లోపాలు ఎత్తిచూపినా పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. తాను మున్సిపల్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగాా అప్పటి ముఖ్యమంత్రిపై ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధికి ఆటంకం కలుగలేదని గుర్తుచేశారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ఒక టీఎంసీ నీటిని మళ్లించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అంగీకరించలేదన్నారు. 2011లో ఎస్సారెస్పీ అనుమతించిన డాక్యుమెంటు తనదగ్గరుందని సత్యనారాయణ స్పష్టం చేశారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని, నీటి కేటాయింపును ఎలా నిరాకరిస్తారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ సంకుచిత ధోరణి సరికాదని అనగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. పెన్షన్లు, ఇళ్ల పంపిణీపై కూడా ఈటెల, శ్రీధర్‌బాబు సై అంటే సై అంటూ సవాలు చేసుకున్నారు. సకలజనుల సమ్మె సమయంలో తెలంగాణలో పోలీసుల పహారాలో పెన్షన్లు పంచారని, ఇప్పుడేమయిందని ఈటెల ప్రశ్నించారు. పెన్షన్లు తదితర ప్రయోజనాలు కల్పించకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఈటెల అన్నారు. తామిచ్చినన్ని పెన్షన్లు ఎవరివ్వలేదని, తమకు కూడా అందుకు అభ్యంతరం లేదని శ్రీధర్‌బాబు జవాబిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడే సమయంలో రామగుండం నీటి విషయాన్ని తిరిగి లేవనెత్తారు. మంత్రి నీటి పథకాన్ని అడ్డుకున్నారని పేర్కొనడం అర్థరహితమని, సమీక్షల్లో వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. తాను వాస్తవాలే చెప్పానని సోమారపు వివరిస్తుండగానే శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని లక్ష్మణ్‌కుమార్‌ను వారించారు. మంథనిలో రోడ్లు అద్దంలాగా ఉంటే పక్కన ఉన్న తన నియోజకవర్గంలో మాత్రం అధ్వానంగా ఉన్నాయని, తాను టీడీపీ సభ్యుడిని కాబట్టి వివక్ష చూపుతున్నారని పెద్దపల్లి శాసనసభ్యుడు విజయరమణారావు విమర్శించారు. ‘నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎస్సారెస్పీ నుంచి సాగునీరందించాలని ప్రతిపాదిస్తే పట్టించుకోకపోవడంతో వందల ఎకరాలు ఎండిపోయాయి. డీఆర్సీలో చెప్పిన దాంట్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన విమర్శలకు దిగగా ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ అభ్యంతరం తెలిపారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ లబ్ధికోసం ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని మధుయాష్కి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధం లేని, ఇక్కడ పరిష్కారానికి అవకాశం లేని అంశాలను ఎందుకు చెప్తున్నారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా విజయరమణారావు, పొన్నం ప్రభాకర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. అనవసరంగా అరవకంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేయగా అదేస్థాయిలో విజయరమణరావు సమాధానమిచ్చారు. మాది రెండు కళ్ల విధానం కాదని పొన్నం, తామే నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నట్టు విజయరమణారావు పరస్పరం చురకలేసుకున్నారు. మంత్రులు పొన్నాల, శ్రీధర్‌బాబు కూడా విజయరమణారావు మీడియాలో ప్రచారం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ తప్పుబట్టారు. వీరిమధ్య వాగ్వివాదం జరుగుతున్నా సమావేశంలో ఉన్న టీడీపీ సభ్యుడు సుద్దాల దేవయ్య మౌనంగానే ఉన్నారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించేందుకు సమయం లేదని భావించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గాల వారీగా ప్రధాన సమస్యలను మాత్రమే ప్రస్తావించాలని శాసనసభ్యులను కోరారు. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై ఆయా నియోజకవర్గ సమన్వయ అధికారులు వచ్చే నెల 5లోగా పరిశీలించి పరిష్కారదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అవసరాలు తీర్చాకే ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్‌కు తరలించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని గత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించి నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిస్తే సమగ్ర నివేదిక కావాలన్నారని, పది నెలలు గడుస్తున్నా నివేదిక తయారు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 48 మోడల్ స్కూళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. 18న డీఆర్సీ... జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశం అక్టోబర్ 18న నిర్వహిస్తామని ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గత సమావేశంలోనూ, ఈ సమీక్షలోనూ సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదికలతో అధికారులు సమావేశానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షకు డుమ్మా... చాలాకాలం తరువాత జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఇన్చార్జి మంత్రి పర్యటన రెండు రోజుల క్రితమే ఖరారయ్యింది. సమయం తక్కువగా ఉండడంతో శాసనసభ్యులకు సమీక్ష సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని స్వయంగా పొన్నాల లక్ష్మయ్యే ఇచ్చారు. అయినా కేటీఆర్, రమేష్‌బాబు, కె.విద్యాసాగరరావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు హాజరుకాలేదు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్, ఎల్.రమణ, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకరరెడ్డి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చేతి ధర్మయ్య, జేసీ అరుణ్‌కుమార్, జగిత్యాల సబ్‌కలెక్టర్ శ్రీకేశ్ తదితరులు పాల్గొన్నారు.