karunas
-
ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు
నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభించడంతో తమిళనాట ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్ బ్యాగ్‌లను అధికారులు సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా అలారం మోగడంతో వెంటనే వారు అలర్ట్ అయ్యారు.నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న భద్రతా అధికారులు ఆయన ప్రయాణాన్ని రద్దు చేసి విచారణ జరిపారు. బ్యాగులోకి బుల్లెట్లు ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు. దీంతో తన వద్ద లైసెన్స్ తుపాకీ ఉందని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. అయితే, అత్యవవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో బ్యాగులో ఉన్న బుల్లెట్ల బాక్సును గమనించలేదని కరుణాస్ తెలిపారు. ఆయన మాటలను రికార్డ్ చేసుకున్న అధికారులు మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. -
ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
చెన్నై: నటుడు కరుణాస్ మళ్లీ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈయన నటిస్తున్న చిత్రానికి 'ఆధార్' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ రిత్విక కథానాయకిగా నటిస్తోంది. పీఎస్ రామ్‌నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నిల క్రియేషన్స్ పతాకంపై అళగమ్మై మగన్ శశికుమార్ ఆర్యూఎం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో షూటింగ్ కార్యక్రమం ప్రారంభమైన ఈ చిత్రానికి మనోజ్ నారాయణన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆ పోస్టర్లతో నా భార్యకు గుండెపోటు
- నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ - పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చెన్నై: ఉద్దేశపూర్వకంగా తనను, కుటుంబాన్ని దారుణంగా కించపరుస్తోన్నవారిని శిక్షించాలని కోరుతూ సినీ నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ చెన్నై పోలీస్‌కమీషనర్‌కు ఫిర్యాదుచేశారు. అన్నా డీఎంకే తరఫున తిరువాడాళై నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణాస్.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో శశికళకు మద్దతుగా నలిచిన విషయం తెలిసిందే. అయితే కరుణాస్.. శశికళకు మద్తతు పలకడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22న కరుణాస్ పుట్టినరోజు సందర్భంగా విమర్శలజడి శృతిమించింది. కరుణాస్ ఫొటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్టర్లను ముద్రించి గోడలపై అంటించారు. ఈ పరిణామాలతో కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజిలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భావ స్వాతంత్ర్యం పేరుతో తనను కించపరచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజక వర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని..అందులో నాకు వచ్చిన ఓట్లు 76 వేల 786 అని తెలిపారు. తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15 వేలు అని, ఓటు హక్కును వినియోగించుకోని వారి సంఖ్య 80 వేలు ఉందన్నారు. మొత్తం మీద తనకు, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రెండు లక్షల మంది ఉన్నారని అన్నారు. తనను కించపరచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం తన నియోజక వర్గం అయిన తిరువాడాళైకు కార్యకర్తలతో కలిసి వెళ్లిన కరుణాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీపా పేరవైకి చెందిన కొందరు కరుణాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపో లీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పంపారు. -
నడిగర్ సంఘం పదవికి రాజీనామా చేస్తా..
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు నటుడు, శాసన సభ్యుడు కరుణాస్ వెల్లడించారు. హాస్యనటుడిగా, కథానాయకడిగా ప్రాచుర్యం పొందిన ఈయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లోనూ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడా పదవి నుంచి వైదొలగనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. దీని గురించి ఆయన తె లుపుతూ యుక్త వయసు లోనే తాను నటుడవ్వాలని కలలు కనే వాడినన్నారు. అది నెరవేరిందని,అయితే రాజకీయవాదినవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఆశ పడడం మానవ సహజం అనీ,అయితే అత్యాశ కూడదని అన్నారు.45 చిత్రాలలో నటించానని ముఖ్యమంత్రి కావాలనుకోవడం దురాశే అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రాజకీయాలు అంత సులభం కాదన్నారు. నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో పలు గ్రామాలు తిరిగి నటీనటుల ఆర్థిక పరిస్థితిని తెలుకున్నామన్నారు. అదే విధంగా శాసన సభ ఎన్నికల్లో వేలాది గ్రామాలు తిరిగి ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నానన్నారు. నడిగర్‌సంఘం సభ్యుల సమస్యలను చాలా వరకూ పరిష్కరించానని, సంఘం భవన నిర్మాణ నిధికి స్టార్స్ క్రికెట్‌ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇక ఒక శాసనసభ సభ్యుడిగాప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒక నటుడిగా నడిగర్‌సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొగలనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ఉంచుతానని చెప్పారు. -
కరుణాస్‌కు హైకోర్టులో ఊరట
తమిళసినిమా: నటుడు కరుణాస్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. హాస్యనటుడిగా, కథానాయకుడిగా ప్రాచుర్యం పొందిన కరుణాస్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆయన తిరువానటనై నియోజక వర్గం అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అభ్యర్థిత్వం చెల్లదంటూ రామనాథపురం జిల్లాకు చెందిన రాజీవ్‌గాంధీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను రామనాథపురం జిల్లా తిరువా టనై నియోజక వర్గం నుంచి నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. తనతో పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. కరుణాస్ ఇదే నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన అన్నాడీఎంకే సభ్యుడు కాదని, ముక్కులత్తూర్ పడై సంఘానికి నిర్వాహకుడుగా పేర్కొన్నారు. నామినేషన్ దరఖాస్తులో నిబంధనలకు విరుద్ధంగాఅన్నాడీఎంకే అభ్యర్థిగా పేర్కొన్నారని ఆరోపించారు. అన్నాడీఎంకేను గుర్తింపు పొందిన పార్టీ అని దాని గుర్తును అందులోని సభ్యులే ఉపయోగించుకోవాలన్నారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ఇతరులు వాడుకోరాదని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరుణాస్ వేసిన నామినేషన్ చెల్లదని, దానిని నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.కృపాకరన్, మురళీధర న్ సమక్షంలో గురువారం విచారణకు వచ్చింది. వారి వాదనలు విన్న న్యాయమూర్తులు ఎన్నికల అధికారులు వెల్లడించిన అభ్యర్థుల పట్టికలో ఉన్న పేరును తొలగించాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని, ప్రతి వాదికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
లోడుక్కు పాండిగా కరుణాస్
హాస్యనటుడు కరుణాస్ మరోసారి కథానాయకుడిగా తెరపైకి రానున్నారు. హాస్యపాత్రలో తనకంటూ ఒక బాణీని ఏర్పరచుకుని ప్రాచుర్యం పొందిన కరుణాస్ అంబా సముద్రపు అంబాని చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత కథానాయకుడిగా పలు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలు సాధించకపోవడంతో హాస్యపాత్రపై దృష్టి సారించిన ఆయన తాజాగా మరోసారి లోడుక్కు పాండిగా హీరోగా రానున్నారు. విశేషం ఏమిటంటే కరుణాస్ నటుడిగా పరిచయమైన నందా చిత్రంలో ఆయన పాత్ర పేరు లోడుక్కు పాండి. ఈ పాత్ర కరుణాస్‌కు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడా పేరునే సినిమా టైటిల్‌గా పెట్టుకుని తెరపైకి రానున్నారు. ఎ.విక్టరీ క్రియేషన్స్, జి.పిక్చర్స్ అధినేతలు భరద్వేష్, బి.శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీస్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా సక్సేనా కథానాయకిగా పరిచయమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇతరులను మోసం చేయడం మరొకరి అవకాశాన్ని అక్రమంగా పొందటంలాంటి జీవితం కంటే సక్రమ మార్గంలో జీవిస్తే విజయాన్ని పొందవచ్చని మోసపూరితంగా చేజిక్కించుకునే విజయం శాశ్వతం కాదని చెప్పే ఇతివృత్తంతో రూపొంది స్తున్న చిత్రం లోడుక్కు పాండి అని వివరించారు. ఈ చక్కని సందేశాన్ని వినోదభరితంగా చెప్పనున్నట్లు చిత్రం కోసం ప్రత్యేకంగా రూ.16 లక్షల వ్యయంతో భారీ సెట్‌ను రూపొందించి చిత్రీకరించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.