Kasargode district
-
గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
తిరువనంతపురం:కేరళలోని ఓ గుడిలో వేడుకల సందర్భంగా బాణసంచాకు ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కాసర్గోడ్ నీలేశ్వరంలోని వీరర్కవు గుడిలో కాళియట్లం ఉత్సవాల్లో సోమవారం(అక్టోబర్ 28) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.గాయపడ్డవారిని కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గుడిలో బాణసంచా నిల్వ చేసిన గదికి మంటలంటుకోవడం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే వాటిని కాల్చాలన్న నిబంధనను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. #Kasargod Firecracker room caught fire at veerakaav temple https://t.co/3tqCteOJXf pic.twitter.com/4TU0dkLZOb— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) October 28, 2024 ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
కేరళలో కలకలం
తిరువనంతపురం: కేరళలోని కాసర్గొడ్ జిల్లాకు చెందిన 16 మంది ముస్లిం యువకులు కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. గత నెల రోజుల నుంచి కనిపించకుండాపోయిన వీరు సిరియా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. తీర్థయాత్రకు దేశం విడిచి వెళ్లారని, తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తమ గమ్యస్థానానికి చేరుకున్నామని తనకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని మరొకరు వెల్లడించారు. మాయమైన ముస్లిం యువకులు సిరియా లేదా ఇరాక్ లోని అంతర్యుద్ధ ప్రాంతాలకు చేరుకునివుంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు. అదృశ్యమైన వారిలో భార్య, ఎనిమిది నెలల బిడ్డ ఉన్న డాక్టర్ ఉన్నాడు. వీరంతా త్రిక్కరిపూర్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని కాసర్గొడ్ ఎంపీపీ కరుణాకరణ్ తెలిపారు. తీర్థయాత్రకు వెళ్లిన వీరంతా తిరిగి రాకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయం కోరారని చెప్పారు. 16 మంది యువకుల కుటుంబ సభ్యులు శుక్రవారం సీఎం పినరయి విజయన్ ను కలిశారు. కనిపించకుండా పోయిన వారు ఎక్కడున్నారో గుర్తించాలని కోరారు.