kejrival
-
బీజేపీ గూండాలతో కేజ్రీవాల్‌ను చంపించే ప్రయత్నం: సీఎం ఆతిశీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన దరిమిలా ముఖ్యమంత్రి ఆతిశీ ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి భారతీయ జనతా పార్టీ శిక్షణ పొందిన గూండాలను పంపిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా చేస్తున్నదని స్పష్టమవుతోందన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను చంపడానికి నేరస్తులు, గూండాలను పంపినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న రోహిత్ త్యాగి అని, అతను ఎప్పుడూ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పక్కనే ఉంటాడన్నారు. ఆయన పర్వేష్ వర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడన్నారు.अरविंद केजरीवाल पर हमला करने वाले BJP के गुंडे Hardcore Criminal‼️♦️ केजरीवाल जी पर हमला करने वाला एक शख़्स राहुल उर्फ शैंकी था। यह व्यक्ति प्रवेश वर्मा के साथ रहता है ♦️ इस शख़्स के ऊपर Arms Act समेत डकैती, मारपीट और जान से मारने की कोशिश जैसे कई केस दर्ज हैं@AtishiAAP pic.twitter.com/CozzJ4k0Lf— AAP (@AamAadmiParty) January 19, 2025ఈ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై 2011లో దొంగతనం కేసు, హత్యాయత్నం కేసు నమోదయ్యాయని, ఈ నేరానికి అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఆతిశీ(atisi) పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న మూడవ వ్యక్తి సుమిత్ అని, అతనిపై దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం కేసులు నడుస్తున్నాయన్నారు. శనివారం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన ముగ్గురు గూండాలు సాధారణ బీజేపీ కార్యకర్తలు(BJP workers) కాదని, శిక్షణ పొందిన గూండాలు, నేరస్తులని.. వారిపై నమోదైన కేసులను చూస్తే తెలుస్తుందని ఆతిశీ పేర్కొన్నారు. దీనిని చూస్తుంటే ఎన్నికల భయంతో బీజేపీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తున్నదని ఆమె ఆరోపించారు.ఈ ప్రమాదం తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏమీ స్పందించలేదని ఆతిశీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ కు గరిష్ట అధికారం ఉన్నప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కిల్లర్ తరహా వ్యక్తులు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కోసం ప్రచారం చేయడానికి వచ్చారా లేదా అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. వారు ఢిల్లీకి ఎందుకు వచ్చారు? అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రతిరోజూ దాడి జరుగుతోందని, తాజాగా జరిగిన ఘటన అరవింద్ కేజ్రీవాల్ హత్యకు జరిగిన కుట్ర అని సంజయ్‌సింగ్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం -
Viral Video: గుజరాత్ లో కేజ్రీవాల్ కోసం వికలాంగుడి ప్రచారం..
-
మార్చి 31న కేజ్రీవాల్ నిరాహార దీక్ష..?
-
ముంగిట్లోకి సర్కారు సేవలు
న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం. ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు. ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్‌లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. -
కోట్లు మా బిడ్డల్ని తిరిగి తెస్తాయా?
న్యూఢిల్లీ : తీవ్ర విషాదాన్ని నింపిన ఢిల్లీలోని ఉపహార్ సినిమాహాల్ అగ్నిప్రమాదం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కిందికోర్టు వారికి విధించిన జైలు శిక్షను రద్దు చేసి, రూ. 60 కోట్ల జరిమానా విధించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ తీర్పును అంగీకరించొద్దని విజ్ఙప్తి చేస్తూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. వాళ్లు చెల్లించే పరిహారం చనిపోయిన తమ బిడ్డలను తిరిగి ఇస్తుందా అని ఉపహార్ బాధితుల సంఘం అధ్యక్షురాలు నీలం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కేజ్రీవాల్... సుప్రీం తీర్పు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తీర్పును తాము అంగీకరించమని కేజ్రీవాల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భారత న్యాయ వ్యవస్థపై బాధిత కుటుంబ సభ్యుల్లో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఉపహార్ కేసులో అన్సల్ సోదరులకు కిందికోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పటికే వాళు శిక్షను అనుభవించారని పేర్కొంటూ బాధితులకు 60 కోట్ల రూపాయాలను పరిహారాన్ని చెల్లిస్తే సరిపోతుందని బుధవారం న్యాయస్థానం తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. 1997 జూన్ 13న బోర్డర్ అనే సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన 59 మందిలో నీలం కృష్ణమూర్తి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో గత 18 సంవత్సరాలుగా ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. -
నేడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
-
జెడ్ ప్లస్ భద్రతకు కేజ్రీవాల్ నో!
-
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
చేయాల్సినవి చాలా ఉన్నాయ్.. అన్నీ చేస్తాం!
-
ఫోర్త్ ఎస్టేట్ : కేజ్రీవాల్.. అర్జునుడా? అభిమన్యుడా?
-
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు!
-
'మోదీ వచ్చి ఏడు నెలలైనా ఏమీ చేయలేదు'
-
మోదీకి కేజ్రీ(స)వాల్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో, రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని మోదీ శనివారం రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు అమిత్ షా కూడా హాజరు కానున్నారు. మరోవైపు ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా మోదీకి వ్యతిరేకంగా ఆప్ పార్టీ పోస్టర్లు అంటించింది. -
ఆ తప్పు మళ్ళీ చేయను!
-
ఢిల్లీలో ఇంకా ఎన్నాళ్లిలా..?
-
నేతలతో ఆడుకుంటున్నారు..!
-
మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
-
కేజ్రీవాల్...'క్రేజీ'వాలా..!
-
కన్ఫ్యూజింగ్ మాస్టార్
-
AAP పై వరుస దాడులు
-
'రాజకీయ వ్యూహంతోనే కేజ్రీవాల్ రాజీనామా'
-
అవినీతే ప్రచారాస్త్రంగా సార్వత్రిక ఎన్నికలకు ఆప్
-
రాజీనామా దిశగా కేజ్రీవాల్...?