Kerala cm vijayan
-
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్‌లో దిగ్గజాలు (ఫొటోలు)
-
కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..!
తిరువనంతపురం: కేరళ పేలుళ్ల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రార్థన సెంటర్లో టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లోకి దుండగులు పేలుడు పదార్ధాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన అనంతరం సెంటర్లో దట్టమైన పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు లోనైన ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. 'ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అన్నారు. అటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేరళ సీఎం విజయన్‌తో ఫొన్లో మాట్లాడారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
ఐదుకి చేరిన నిఫా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 706 మంది..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హై రిస్క్ జోన్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిఫా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన
కోచి: నటి భావనను కిడ్నాప్ చేసి, వేధింపులకు గురిచేసిన ఘటనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితులెవరినీ వదిలిపెట్టబోమని, వారిని శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారని, కేసును త్వరితగతిన విచారించాలని ఆదేశించినట్టు తెలిపారు. కేరళ అడిషనల్ డీజీపీ సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు వేధించిన సంగతి తెలిసిందే. దుండగులు భావనను కారులో బందీగా చేసుకుని కారును కోచి నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఫొటోలు, వీడియోలు తీశారు. చదవండి: హీరోయిన్ను కారులో బందీగా చేసి..