నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన | actress kidnapping and molestation case: 3 accused arrested | Sakshi
Sakshi News home page

నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన

Published Sun, Feb 19 2017 1:00 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన - Sakshi

నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన

కోచి: నటి భావనను కిడ్నాప్ చేసి, వేధింపులకు గురిచేసిన ఘటనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితులెవరినీ వదిలిపెట్టబోమని, వారిని శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారని, కేసును త్వరితగతిన విచారించాలని ఆదేశించినట్టు తెలిపారు.

కేరళ అడిషనల్ డీజీపీ సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు.

దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు వేధించిన సంగతి తెలిసిందే. దుండగులు భావనను కారులో బందీగా చేసుకుని కారును కోచి నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఫొటోలు, వీడియోలు తీశారు.

చదవండి: హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement