కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్
కర్నూలు : కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు గతరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
అయితే తమ నుంచి సేకరించిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ యాజయాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. తమ డిపాజిట్లు తమకు ఇప్పించాలంటూ బాధితులు పోలీసులను కోరుతున్నారు.