Kharif crop cultivation
-
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్‌లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
పంటలు ఫుల్.. ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో ఆల్‌టైమ్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: ఈసారి వానాకాలం (ఖరీఫ్) సీజన్లో.. తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 2020 ఖరీఫ్‌లో 1,35,63,492 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేశారు. అప్పటికది ఆల్‌టైమ్ రికార్డు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికి 1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీంతో 2020 నాటి రికార్డును తిరగరాసినట్టయ్యింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 1.03 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగు విస్తీర్ణం, ఆ తర్వాత నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఈ ఏడాది గణనీయంగా పెరగడం విశేషం. సీజన్ ఇంకా ఉండటంతో ప్రస్తుత విస్తీర్ణం మరింత పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వరి కూడా రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఈ పంట ప్రతిపాదిత సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలే. కానీ ఏకంగా 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇంకా ఈ నెలాఖరు వరకు నాట్లు పడతాయని భావిస్తున్నారు. గతేడాది (2021) వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. లక్ష్యం 1.43 కోట్ల ఎకరాలు.. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బుధవారం నాటికే 1,35,75,687 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, చెరువులు నిండటం, మంచి వర్షాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమయ్యాయి. అత్యధికంగా వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గుచూపగా కంది, సోయాబీన్ ఇతర పంటలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 49.98 లక్షల ఎకరాల్లో పత్తి వాస్తవానికి ఈసారి పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు. పత్తికి గతేడాది మార్కెట్లో గణనీయంగా ధర పలకడంతో ఈసారి దానివైపు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పత్తి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కీలక సమయంలో కురిసిన భారీ వర్షాలు పత్తి సాగుపై ప్రభావం చూపించాయి. అప్పటికే వేసిన పత్తి పంట లక్షలాది ఎకరాల్లో మునిగి పాడై పోయింది. చాలా ప్రాంతాల్లో రెండోసారి వేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు 49.98 లక్షల ఎకరాలకే పత్తి పరిమితమయ్యింది. దీంతో ఊపందుకున్న వరి రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఇక కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.61 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.33 లక్షల ఎకరాల్లో వేశారు. 26 జిల్లాల్లో వంద శాతానికిపైగా సాగు రాష్ట్రంలో 26 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో 139 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లాలో 84 శాతం సాగైంది. ఆదిలాబాద్ జిల్లాలో 107 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 119 శాతం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 112 శాతం, కరీంనగర్ జిల్లాలో 104, పెద్దపల్లి 105, జగిత్యాల 115, రాజన్న సిరిసిల్ల 119, సంగారెడ్డి 115, వరంగల్ 106, హనుమకొండ 103, జనగాం 126, భద్రాద్రి కొత్తగూడెం 113, వికారాబాద్ 116, మహబూబ్‌నగర్ 117, నారాయణపేట, యాదాద్రి జిల్లాల్లో 110, వనపర్తి 102, గద్వాల 100, నల్లగొండ 114, సూర్యాపేట 116 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి. పుష్కలంగా నీరు, కరెంటు వానాకాలం పంటల సాగు తెలంగాణలో ఆల్‌టైం రికార్డు సాధించింది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
ముందే మద్దతు ధర.. సీజన్ ప్రారంభంలోనే ప్రకటన
కడప అగ్రికల్చర్: ఏ పంట సాగు చేసుకుంటే లాభదా యకంతోపాటు గిట్టుబాటు అవుతుందనే విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు గాను ఖరీఫ్ సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కూడా సీజన్‌కు ముందుగానే పంటల వారీగా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జాబితాను రాష్ట్రాలకు అందజేస్తూ రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించింది. పంటల వారీగా రైతులు సాగుకు పెడుతున్న పెట్టుబడులు, వస్తున్న దిగుబడులు, మార్కెట్లో పలుకుతున్న ధరలు, అన్నదాతకు లభిస్తున్న నికరాదాయం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా మినియం సపోర్టు ప్రైసెస్(ఎంఎస్సీ) ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 17 పంటలకు మద్దతు ధరను ప్రకటించి రైతులకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 20 రకాల పంటలకు గాను 17 రకాలకు ప్రకటన ఖరీఫ్‌నకు సంబంధించి జిల్లాలో సాగయ్యే 20 రకాల పంటలకు గాను ఈ ఏడాది 17 రకాలకు మద్దతు ధర(ఎంఎస్పీ)ని ప్రకటించింది. జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, పసుపు, మిరపతోపాటు పలు రకాల పంటలకు మద్దతు ధరను ప్రకటించారు. ఇందులో వరిధాన్యంపై రూ.100, జొన్నలు 232, సజ్జలు 100, రాగులు 201, కందులు, వేరుశనగ 300, పత్తి 335, మినుములు 300, పెసలు 480, సోయాబీన్ 350, సన్‌ఫ్లవర్‌పై రూ.385 మేర ధరను పెంచారు. ఆర్బీకే ద్వారా.. పంట చేతికొచ్చిన సమయంలో బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలు ఉంటే.. వరి, వేరుశనగ, కంది, పసుపులతోపాటు పలు పంటలను ఆర్బీకే వేదికగా కోనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్ సహకారంతో మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఏపీ సీడ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గతేడాది వరి, పసుపు కొనుగోలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లో జిల్లాలో వరి, పసుపు కొనుగోలు చేశారు. రైతులకు డబ్బులను కూడా ఆన్లైన్ ద్వారా ఖాతాలకు జమ చేశారు. చాలా పంటలకు మద్దుతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా చాలా పంటలకు మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించుకుని సంబంధిత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోంది. గిట్టుబాధ ధర కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హిమశైల, ఏడీ, మార్కెటింగ్ శాఖ, వైఎస్సార్ జిల్లా -
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
ముందుగానే నీటి విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమయ్యే రోజే గోదావరి డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ సాగును రైతులు ముందుగా చేపడతారు. సకాలంలో పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. నవంబర్‌లో తుపాన్ల ప్రభావం ప్రారంభమయ్యేలోగా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. తద్వారా ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి కాగానే సకాలంలో రబీ పంటల సాగు చేపట్టవచ్చు. నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా సాగు చేసుకునే వెసులుబాటను రైతులకు కల్పించాలన్నది సీఎం జగన్ సంకల్పం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందుచూపుతో నీటి నిల్వ.. ఖరీఫ్ పంటకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో పులిచింతల, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నిల్వ చేసేలా జలవనరులశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మే 12న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, లభ్యతను సమీక్షించిన సీఎం జగన్ ఆయకట్టుకు ముందుగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో ఐఏబీ (నీటి పారుదల సలహా మండలి) సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ముందుగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని, సకాలంలో పంటల సాగు చేపట్టాలని రైతులను చైతన్యం చేసింది. వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండటంతో వరుసగా 2019, 2020, 2021లో ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నీటి లభ్యత బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదీ కోటి ఎకరాలకు నీళ్లందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు ► పోలవరంలో నిల్వ చేసిన నీటిని రివర్ స్లూయిజ్‌ల ద్వారా విడుదల చేసి గోదావరి డెల్టాకు బుధవారం నుంచే సరఫరా చేయనున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 33.14 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్‌కు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఈ నెల 10 నుంచే నీరు విడుదల కానుంది. ► పెన్నా బేసిన్‌లోని సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు జూన్ 10 నుంచే నీటిని సరఫరా చేస్తారు. ► గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటితో ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూలై 15 నుంచి నీటిని సరఫరా చేస్తారు. ► గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ► తుంగభద్ర డ్యామ్, సుంకేశుల బ్యారేజీపై ఆధారపడ్డ హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ ఆయకట్టుకు లభ్యత ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ముందస్తు.. మస్తు!
సాక్షి, అమరావతి: ఈసారి ముందస్తు ఖరీఫ్ సాగుతో మంచి దిగుబడులొస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 దశాబ్దాల తర్వాత 15–30 రోజులు ముందుగానే కాలువలకు నీటిని వదలనుండటంతో వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా పంటలు చేతికందనున్నాయి. గత ఖరీఫ్‌లో 165 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయగా అకాల వర్షాలు, వైపరీత్యాలతో 159.82 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 171.62 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆహార ధాన్యాల్లో రికార్డు ఆహార ధాన్యాల దిగుబడులు గతేడాది 77.35 లక్షల టన్నులు రాగా ఈసారి ఖరీఫ్‌లో 95.16 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. 2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 87.77 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈసారి అంతకు మించి వస్తాయంటున్నారు. వైపరీత్యాల ప్రభావంతో గతేడాది ధాన్యం దిగుబడి 70.96 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈసారి 85.58 లక్షల టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా. 2019లో రికార్డు స్థాయిలో 80.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి నమోదైంది. భారీగా పెరగనున్న చెరకు ధాన్యం తర్వాత ఈసారి చెరకు దిగుబడులు గణనీయంగా రానున్నట్లు అంచనా. 2019లో 67.17 లక్షల టన్నులు, 2020లో 41.15 లక్షల టన్నులు, 2021లో 36.54 లక్షల టన్నుల చెరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 50.15 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. అపరాలు గతేడాది 1.14 లక్షల టన్నుల దిగుబడులు రాగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2.18 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది. నూనె గింజల్లో ప్రధానంగా వేరుశనగ గతేడాది 5.40 లక్షల టన్నుల దిగుబడి రాగా ఈసారి 8.28 లక్షల టన్నులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న గతేడాది 4.41 లక్షల టన్నులు రాగా ఈ ఏడాది 5.74 లక్షల టన్నులొస్తుందని భావిస్తున్నారు. ఇలా ప్రధాన పంటల దిగుబడులు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముందస్తు సాగుతో సత్ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్ కోసం సాగునీటి ప్రణాళికను ప్రకటించింది. ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నాటికి పంటలు చేతికి వచ్చేలా ప్రణాళికకు అనుగుణంగా సాగు చేపడితే సత్ఫలితాలు సాధించవచ్చు.ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతన్నలు ముందస్తు సాగుకు సిద్ధం కావాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
తొలకరికి ముందే రైతన్నకు ‘భరోసా’
కరువన్నదే కానరాలేదు.. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ప్రతి రిజర్వాయర్ సకాలంలో నిండి కళకళలాడింది. అనంతపురం లాంటి కరువు జిల్లాతో సహా అన్ని చోట్లా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు మూడేళ్లుగా అత్యధికంగా సాగు నీరిచ్చాం. నేల తల్లి, వ్యవసాయం, మన గ్రామం, మన సంస్కృతి, రైతు కూలీలు, రైతుల కష్టంపై అవగాహన, మమకారం ఉండాలి. కానీ గత పాలకులకు ఇవేవీ లేవు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్ మొదలు కాకముందే.. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే.. జూన్ కంటే ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచా, కర్మణా గట్టిగా నమ్మి మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. రైతుల స్థితిగతులను మార్చేలా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి క్రమం తప్పకుండా క్యాలెండర్‌ను అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ నేరుగా జమ చేశారు. పథకం కింద ఈ నెలాఖరున అందించే సాయంతో కలిపితే మొత్తం రూ.3,758 కోట్లు రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయంగా జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను రుచి చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా.. వైఎస్సార్ రైతు భరోసాను అర్హులైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ భూములు) సాగు చేస్తున్న రైతులందరికీ అమలు చేస్తున్నాం. వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది రైతు భరోసా సాయాన్ని ఇవాళ గణపవరం వేదికగా విడుదల చేస్తున్నాం. తొలి విడత కింద ఖరీఫ్ సీజన్ మొదలుకాక ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.13,500 ఏటా అందచేస్తున్నాం. రైతన్నలకు మూడేళ్లలో రూ.1,10,093 కోట్లు నాలుగో ఏడాది మొదటి విడత సాయంగా ఇవాళ రూ.5,500 గణపవరం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పీఎం కిసాన్ పథకంలో భాగంగా మరో రూ.2 వేలను నెలాఖరుకి కేంద్రం విడుదల చేస్తుంది. ఏటా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు సుమారు రూ.7 వేల కోట్లను ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే అందిస్తున్నాం. ప్రస్తుతం అందిస్తున్న సాయాన్ని కూడా కలిపితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వైఎస్సార్ రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లైంది. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో రైతులకు రూ.1,10,093 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. రికార్డు స్థాయిలో దిగుబడి గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా గత మూడేళ్లలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. వడ్డీలేని రుణాలకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.782 కోట్లు ఇవ్వగా ఇప్పుడు మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు అందచేశాం. పారదర్శకంగా ఈ–క్రాప్, పరిహారం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా పంట నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పారదర్శకంగా ఈ–క్రాప్ అమలు చేస్తున్నాం. ఉచిత పంటల బీమాతో ఆదుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ.. రైతులకు మేలు చేయాలనే మంచి మనసుతో ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా దురదృష్టవశాత్తూ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను గత పాలకుల్లా వదిలేయకుండా, సాకులు చెప్పకుండా... పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా, కౌలు రైతులకు సీసీఆర్టీ కార్డులున్నా బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నాం. ఇంత పారదర్శకంగా చేస్తుంటే చంద్రబాబు దత్త పుత్రుడైన ఓ పెద్ద మనిషి రైతు పరామర్శ యాత్రకు బయలుదేరారు. కానీ ఆ యాత్రలో పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి రూ.7 లక్షలు పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారు. మనసు లేని నాయకుడు.. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగన్న నాయకుడు, రైతుల గుండెలపై గురిపెట్టి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబే. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో రుణమాఫీ చేస్తానని నమ్మించి ఐదేళ్లలో కేవలం రూ.15 వేలు కోట్లు మాత్రమే విదిల్చాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మి రైతులు మోసపోగా, తాకట్టుపెట్టిన వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నా మనసు కరగని నాయకుడు చంద్రబాబు. -
ఏపీ: ఖరీఫ్ సాగు కోసం ప్రణాళికలు సిద్ధం
సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఖరీఫ్ సాగుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. రసాయనిక ఎరువులు, విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు గత ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్‌లో సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది జిల్లాలో భారీ వర్షాలు కురవడంతోపాటు జిల్లాలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం కృష్ణా జలాలతో నింపింది. వేసవిలోనూ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పైకి చేరడంతో వేలాది బోరు బావుల్లోనూ పుష్కలంగా నీరు చేరింది. దీంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది సాగు మరింత పెరగనుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింతగా పంటల సాగు ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగును మరింత పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో వేరుశనగ, వరి, శనగ తదితర పంటలు సాగు చేస్తారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో వరితోపాటు పసుపు, మిరప, పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరి, చెరుకు, రాయచోటి ప్రాంతంలో మామిడి, వేరుశనగ, సన్‌ఫ్లవర్, ఇతర కూరగాయల పంటలు విరివిగా సాగు చేస్తారు. 2019 ఖరీఫ్‌లో 73,792 హెక్టార్లలో పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌లో 1,10,127 హెక్టార్లలో, 2021 ఏడాదిలో 1,24,000 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాగును మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 68,756 క్వింటాళ్ల పంపిణీకి ప్రతిపాదనలు వచ్చే ఖరీఫ్‌లో 68,756 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 14,602 క్వింటాళ్లు కేబీ రకం వేరుశనగ విత్తనాలు, 1500 క్వింటాళ్లు నారాయణి రకం, 1000 క్వింటాళ్లు టీఏజీ–24 రకం విత్తనాలు, అలాగే 950 క్వింటాళ్ల మినుములు, 692 క్వింటాళ్లు ఎల్బీజీ–752 రకం మినుము విత్తనాలు, 418 క్వింటాళ్లు పీబీజీ–104 రకం విత్తనాలకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు 339 క్వింటాళ్లు పెసర, 39,870 క్వింటాళ్లు శనగలు, 7500 క్వింటాళ్ల జీలుగ, 1100 క్వింటాళ్ల జనుము, 200 క్వింటాళ్ల పిల్లి పెసర తదితర విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అన్నదాతలకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక అన్నదాతలకు మరింత ప్రోత్సాహం లభిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి యేటా 2,98,673 మంది రైతులకు ఆర్థికసాయం అందిస్తుండగా, సున్నా వడ్డీ పంట రుణాల కింద 90,000 మందికి సుమారు రూ. 50 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక పంటల బీమా కింద 2,89,922 మందికి రూ. 777.50 కోట్లు లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 2,23,016 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేశారు. మరోవైపు తగిన మేర సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేదు జిల్లాలో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. బోరు బావుల కింద కూడా సాగు పెరగనుంది. వచ్చే ఖరీఫ్‌లో 1,35,100 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయబోతున్నాము. – నాగేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్ సాగు 1.35 లక్షల హెక్టార్లపైనే గత ఏడాది ఖరీఫ్‌లో 1,24,058 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం దీనిని 1,35,100 ఎకరాలకు పైగా పెంచాలన్నది లక్ష్యం. ప్రధానంగా 33,994 హెక్టార్లలో వరి, 23,698 హెక్టార్లలో పత్తి, 23,149 హెక్టార్లలో వేరుశనగ, 3,578 హెక్టార్లలో కంది, 2563 హెక్టార్లలో సన్‌ఫ్లవర్, 2,603 హెక్టార్లలో శనగ, 177 హెక్టార్లలో పెసర, 276 హెక్టార్లలో జొన్న, 43 హెక్టార్లలో చెరకు, 2828 హెక్టార్లలో పసుపు, 4833 హెక్టార్లలో ఉల్లిగడ్డలు, 948 హెక్టార్లలో చీనీ, 1754 హెక్టార్లలో టమాటా తదితర పంటలను సాగు చేయించాలన్నది లక్ష్యం. మొత్తంగా 1,35,100 హెక్టార్లలో ఖరీఫ్ సాగును అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆసరాతో డ్వాక్రా సంఘాలు బలోపేతం -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా 'వైఎస్సాఆర్ రైతు భరోసా' తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రైతులు ఇబ్బంది పడకూడదని.. ‘ఈరోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 52.38 లక్షల రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా రైతుల ఖాతాల్లో నేరుగా రూ.3,928 కోట్లు జమ చేస్తున్నాం. ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది’. ‘కోవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ వైఎస్సార్ రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం’. 23 నెలలు. రూ.89 వేల కోట్లు.. ‘ఈ 23 నెలల పాలన చూస్తే, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు.. వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా మీ బిడ్డ, నేరుగా బటన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా సామాజిక తనిఖీలు చేసి, ఏ ఒక్క అర్హుడు మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించాం. ప్రతి పేదవాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం’. రైతు భరోసా. రూ.17,029 కోట్లు.. ‘ఒక్క రైతులను గమనిస్తే, ఇవాళ అర కోటికి పైగా రైతులకు రూ.3,298 కోట్లు వారి ఖాతాల్లోకి వరసగా మూడో ఏడాది తొలి విడతగా వేస్తున్నాము. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద అక్షరాలా రూ,17,029 కోట్లు ఇచ్చామని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను’. రైతన్నలకు మొత్తం రూ.68 వేల కోట్లు.. ‘ఇక ఈ 23 నెలల్లో రైతన్నలకు వివిధ పథకాల కింద నేరుగా అక్షరాలా అందించిన సహాయం రూ.68 వేల కోట్లకు పైగానే ఉందని గర్వంగా చెబుతున్నాను’. ఏయే వాటికి ఎంతెంత?.. ‘రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు మొత్తం రూ.17,029 కోట్లు ఈ 23 నెలల కాలంలో ఇవ్వగలిగాం. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలు కూడా కలుపుకుంటే అక్షరాలా 67.50 లక్షల రైతులకు రూ.1,261 కోట్లు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా 15.67 లక్షల రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇవ్వగలిగాం’. ‘ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ 23 నెలల్లో అక్షరాలా రూ.1038 కోట్లు ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలకు కోసం అక్షరాలా రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం’. ‘ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద ఈ 23 నెలల కాలంలో అక్షరాలా రూ.17,430 కోట్లు ఖర్చు చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను. పగలే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేశాం’. ‘గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు మీ బిడ్డ తీర్చాడు. విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు వెచ్చించామని గర్వంగా చెబుతున్నాను’. ‘శనగ రైతులకు బోనస్ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1224 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నాను. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50 కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1560 ఖర్చు చేశామని తెలియజేస్తున్నాను’. ఇంత కన్నా ఏం రుజువు కావాలి? ‘ఆ విధంగా ఈ 23 నెలలో రాష్ట్రంలో రైతన్నల కోసం అక్షరాలా రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?’. ప్రతి రైతుకూ పథకంలో మేలు.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ఆర్ఓఎఫ్ఆర్) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నాం’. ‘రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులకు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి మాత్రమే ఉంది. అదే ఒక హెక్టారు (2.5 ఎకరాల) వరకు భూమి ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం, ఆ రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను’. చెప్పిన దాని కంటే ఎక్కువ.. ‘మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలు చూసి, చెప్పిన దాని కన్నా ఒక ఏడాది ముందుగానే, ఇస్తామన్న దాని కన్నా మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 13 వేల 500 చొప్పున, అయిదేళ్లలో మొత్తం 67 వేల 500 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా రైతన్నలకు రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను’. ఈ నెలలోనే మరో రూ.2 వేల కోట్లు.. ‘ఖరీఫ్ సాగు ఇప్పుడు మొదలవుతోంది. పెట్టుబడి కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఇవాళ మొదటి విడత పెట్టుబడి సాయం చేస్తున్నాం. అదే విధంగా వైయస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈనెల 25న దాదాపు 38 లక్షల రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు అందించబోతున్నామని చిరునవ్వుతో చెబుతున్నాను’. వారిని ఆదుకోవడమే లక్ష్యంగా.. ‘దాదాపు 5 కోట్లు జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు కానీ.. మరీ ముఖ్యంగా ఉన్న పేద వర్గాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ 23 నెలల పరిపాలన సాగిందని ప్రతి రైతుకు చెబుతున్నాను’. మాట నిలబెట్టుకున్నాను.. ‘ఎన్నికల సమయంలో మామూలుగా పార్టీలు 600 పేజీల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మనమంతా చూశాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించి, దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావిస్తామని చెప్పి, తూచ తప్పకుండా ఈ 23 నెలల కాలంలో మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా అమలు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను’. కోవిడ్‌తో యుద్ధం.. ‘ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్‌ను సమూలంగా తీసేయాలి అంటే, వాక్యినేషన్ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసు’. వ్యాక్సిన్లు–వాస్తవ పరిస్థితి.. ‘దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్‌ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్‌లు ఇవ్వాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్‌లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్లు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగాం’. ‘ఇక రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్‌లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్‌ల చొప్పున 4 కోట్లు డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సీన్లు కావాల్సి ఉండగా, అక్షరాలా మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి’. అందుకు కారణం? ‘దేశంలో ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అనంటే, దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మాత్రమే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ నెలకు కోటి, సీరమ్ సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి’. ‘కాబట్టి కోవిడ్‌తో సహజీవనం తప్పని పరిస్థితి. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మరోవైపు దాంతో సహజీవనం తప్పదు. మనకున్న పరిస్థితిలో మనం వేస్తున్న అడుగులు అందరూ గమనించాలి’. అవి జీవితంలో భాగం కావాలి.. ‘కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూ పోయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, రైతులు తమ పని చేసుకుపోవాలి’. చివరగా.. ‘ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, రైతులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో నాలుగు అడుగులు ముందుకు వేసి, ఇవాళ రైతు భరోసా వరసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాము. దీంతో రైతన్నలకు మంచి జరగాలని ఆశిస్తూ, దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’.. అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపారు: కురసాల కన్నబాబు ‘ కొన్ని విన్నప్పుడు అవి సాధ్యమవుతాయా? అనిపిస్తుంది. కానీ సీఎం వైస్ జగన్, అలా సాధ్యం చేసి చూపారు. గత ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు. కానీ మీరు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. ఎవరైనా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ పోతున్నారు. సొంతంగా సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన, ఆలయాల భూములను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతులు ఇంకా రాష్ట్రంలో భూములు సాగు చేస్తున్న యానాం రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఆదుకుంటూ చరిత్ర సృష్టించారు. ఈ స్థాయిలో రైతులకు మీరు అండగా నిలుస్తున్నందుకు మీకు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’. ఎంపీ బాలశౌరి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డితో పాటు, పలువురు అధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చదవండి: ఏపీ: పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల ఏపీ: రూ.1,200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలలు -
కష్టకాలంలో రైతుకు ఆర్థిక భరోసా.. నేడే పెట్టుబడి సాయం
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కావడానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద గురువారం తొలి విడత సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది 79,472 కుటుంబాలకు అదనంగా ప్రయోజనం ఈ ఏడాది అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,52,263 మంది ఉండగా (యానాం రైతులతో కలిపి), భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చెందిన 865 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 79,472 రైతు కుటుంబాలు అదనంగా లబ్ధి పొందనున్నాయి. ఈ ఏడాది 32,083 మంది కౌలుదారులు కొత్తగా లబ్ధి పొందనున్నారు. 50,52,263 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద తొలి విడతగా రూ.2 వేల చొప్పున కేంద్రం రూ.1010.45 కోట్లు సర్దుబాటు చేస్తుండగా, రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.2,778.74 కోట్లు సాయమందిస్తోంది. ఇక భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారుల కుటుంబాలకు రూ.7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొలి విడతగా రూ.139.69 కోట్లు సర్దుబాటు చేస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది కౌలుదారులతో సహా అర్హత పొందిన 52,38,517 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ కింద రూ.1010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి వైఎస్సార్ రైతు భరోసా–పీఏం కిసాన్ కింద తొలివిడతగా రూ.3928.88 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత రెండేళ్లలో రూ.13,101 కోట్లు సాయం అందించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,071.80 కోట్లు అందించనుంది. మొత్తంగా మూడేళ్లలో అన్నదాతలకు రూ.20,172.8 కోట్ల లబ్ధి చేకూరుతోంది. మూడు విడతల్లో సాయం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7,500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్‌లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. -
నేలకు పులకింత
సకాలంలో వర్షాలు కురుస్తుండటం, సొంతూరులోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికిపైగా విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. దీంతో ఈ ఖరీఫ్‌లో గ్రామాలు పచ్చదనం సంతరించుకుని కళకళలాడుతున్నాయి. సాక్షి, అమరావతి: తొలకరి పైర్లతో పుడమి కళకళలాడుతోంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికి పైగా నాట్లు పూర్తి అయ్యాయి. అదునులో కురుస్తున్న వానలు, సకాలంలో అందిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులో నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉండడం రైతన్నలకు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండడంతో డెల్టా ప్రాంతాలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. నైరుతి రుతుపవనాలకు అల్పపీడనాలు తోడుకావడంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 12 జిల్లాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో మాత్రం మామూలు స్థితిలో ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి 212.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 328.3 మిల్లీమీటర్లు కురిసింది. 22 లక్షల హెక్టార్లకు చేరిన సాగు ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ఇప్పటికే దాదాపు 22 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు. మామూలుగా అయితే ఇప్పటికి 19 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంది. కానీ, అన్ని రకాల సానుకూల పరిస్థితుల నేపథ్యంలో అదనంగా రెండు లక్షల హెక్టార్లలో విత్తారు. గత ఏడాది ఇదే కాలానికి 13.98 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల్ని వేయడం గమనార్హం. 6.23 లక్షల హెక్టార్లకు చేరిన వరిసాగు... ఖరీఫ్ ప్రధాన పంటల్లో ఒకటైన వరి సాగు ఇప్పటికే 6.23 లక్షల హెక్టార్లకు చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో వరి 14.97 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ఇందులో ఇప్పటికి 6.23 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేశారు. గత ఏడాది ఇదే కాలానికి 4.81 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగు కావడం గమనార్హం. ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టాలో వరినాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ముందుగా వేసిన జొన్న, సజ్జ, మొక్కజొన్న పైర్లు ఏపుగా పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్ కుడికాల్వకు త్వరలో నీటిని వదిలే అవకాశం ఉండడంతో రైతులు భూముల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 7లక్షల హెక్టార్లలో వేరుశనగ ఇక రెండో అతిపెద్ద పంటయిన వేరుశనగ విత్తడం దాదాపు ముగింపు దశకు చేరింది. మామూలు సాగు విస్తీర్ణం 7.04 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే దాదాపు 7 లక్షల హెక్టార్లకు చేరింది. మొత్తంగా ఇప్పటివరకు ఆహార ధాన్యాల పంటలు 29 నుంచి 50 శాతం వరకు వేశారు. జొన్న, నువ్వు, సోయాబీన్, పత్తి, ఉల్లి పంటల సాగు 51 నుంచి 75 శాతం మధ్య, రాగి, వేరుశనగ పంటలు 76 నుంచి వంద శాతం మధ్య వేశారు. రాయలసీమ జిల్లాల్లో పంటల్ని విత్తడం తుది దశకు వచ్చింది. విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మిగతా అన్ని ప్రాంతాలలో పంటల్ని వేయడం ముమ్మరమైంది. ఇదిలా ఉంటే.. ముందుగా వేసిన వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు పంటలకు అక్కడక్కడా తెగుళ్లు సోకినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించి నివారణ చర్యలు సూచిస్తున్నారు. వేరుశనగ సస్యరక్షణ ఇలా... ► జూలై తొలి వారంలో విత్తిన వేరుశనగలో కలుపు నివారణ మందుల్ని పిచికారీ చేయకుంటే పంట 20–25 రోజుల వయసులో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిర్ను ఎకరాకు 300 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లుకోవాలి ► రసం పీల్చే పురుగు, గొంగళి పురుగులను అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ► మొదలు కుళ్లు (కాలర్ రాట్) ఎక్కువగా ఉంటే హెక్సాకొనజోల్ కూడా కలిపి పంటపై చల్లుకోవాలి. ► 5 శాతం వేప గింజల కషాయాన్ని చల్లి రసం పీల్చే పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి.రాంబాబు రైతులకు సలహా ఇచ్చారు. -
పచ్చని సిరి... వరి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1.02 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సర్కారుకు నివేదిక పంపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గణనీయంగా కురవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, 26.79 లక్షల ఎకరాలు (111%) సాగు కావడం గమనార్హం. పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.32 లక్షల ఎకరాలకు (105%) చేరింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.46 లక్షల ఎకరాలు (76%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.18 లక్షల ఎకరాలు (88%) సాగైంది. పురుగుల దాడి సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.3 లక్షల ఎకరాలు (82%) సాగైంది. 11 జిల్లాల్లో వంద శాతంపైగా విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో 122 శాతం చొప్పున విస్తీర్ణంలో పంటలు సాగవడం గమనార్హం. నిర్మల్ జిల్లాలో 116 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వరిపై స్టెమ్ బోరెర్ అనే పురుగు దాడి చేస్తుంది. ఇక మహబూబ్‌నగర్, గద్వాల, ఖమ్మం, జనగాం జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి చేస్తోంది. జనగాం, జగిత్యాల జిల్లాల్లో పత్తిపై పచ్చ పురుగు దాడి చేస్తోందని వ్యవసాయ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో లోటు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 611.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 597.6 మిల్లీమీటర్లు (–2%)నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే 28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
ఆశల చిగురు!
మొదలైన ఖరీఫ్ పంటల సాగు * సాగర్ కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక * నీటి విడుదల కోసం రేపు బోర్డుకు లేఖ రాయనున్న రాష్ట్రం * ఎస్సారెస్పీ కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వస్తుండటంతో రైతుల ఆశలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరుల కింద జోరుగా ఖరీఫ్ పంటల సాగు జరుగుతుండగా భారీ ప్రాజెక్టుల కింద సాగుకు రైతులు నడుం బిగిస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో సాగు పరిస్థితి దారుణంగా తయారైంది. 2014-15లో మొత్తం లక్ష్యంలో కేవలం 7.90 లక్షల ఎకరాలే సాగవగా 2015-16 నాటికి అది 72 వేలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీరు చేరుతుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే ఎగువ నుంచి భారీ ప్రవాహాలతో కృష్ణమ్మ వస్తుండటంతో జూరాల కింద పంటల సాగుకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 1,04,741 ఎకరాల మేర ఉండగా ఇప్పటికే 80వేల ఎకరాలకు పైగా సాగు మొదలైనట్లు తెలుస్తోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ల కింద 4.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవగా ఇప్పటికే నీటి విడుదల ప్రక్రియ మొదలైంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 2.50 లక్షల ఎకరాల మేర సాగు పుంజుకున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, ఇప్పటికే నీటి నిల్వ 165 టీఎంసీలకు పెరగడంతో మరో రెండు వారాల్లో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవాకశాలున్నాయి. దీనివల్ల ఆలస్యంగా అయినా ఎడమ కాల్వ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాల్లో కనీసం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాగర్ నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగు అవసరాలకు నీటిని విడుదల చేసేలా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బోర్డుకు అధికారులు మంగళవారం లేఖ రాయనున్నారు. ఎస్సారెస్పీ కింద ఖరీఫ్ కార్యాచరణ షురూ రెండేళ్లుగా నిస్సారంగా ఉన్న ఎస్సారెస్పీలోకి ఈ ఏడాది 45 టీఎంసీల మేర నీరు రావడం, మరింతగా ప్రవాహాలు కొనసాగుతుండటం ఆయకట్టు రైతాంగానికి ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలు 17.18 టీఎంసీలు విడుదల చేయడంతోపాటు లోయర్ మానేరు డ్యామ్‌కు 10 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాలకు 3.95 టీఎంసీలు విడుదల చేయాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. మొత్తంగా ప్రాజెక్టు కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో 30 వేల ఎకరాలకు సెప్టెంబర్ తొలి వారంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కింద పంప్హౌస్ట్రయల్ రన్‌ను ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్నారు. -
ఆగస్టు దాకా అంతేనా..!
రాష్ట్రంలో ఎండిన ప్రాజెక్టులు.. 528 టీఎంసీల నీటి లోటు - ప్రస్తుతం లభ్యత జలాలు 152.8 టీఎంసీలు..ఇందులో గరిష్టంగా వాడుకోదగ్గ నీరు 5 టీఎంసీలే - జూన్ నుంచే మెరుగైన వర్షాలు కురిసినా ఆగస్టు వరకు సాగునీటిపై చెప్పలేని పరిస్థితి - మంచి వర్షాలు రాకుంటే 20 లక్షల ఎకరాలపై ప్రభావం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటల సాగు కష్టతరమే కానుంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఎండిపోయి ఖాళీ కావడం ఖరీఫ్ సాగుకు గుదిబండగా మారనుంది. జూన్ నుంచే మంచి వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లో నీరు చేరేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనన్న సంకేతాలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడం, అక్కడి నుంచి దిగువకు నీరొచ్చే అవకాశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం సాగును మరింత క్లిష్టతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి సుమారు 15 లక్షల ఎకరాలపై నేరుగా, మరో 5 లక్షల ఎకరాలపై పరోక్షంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగుపై ఎలాంటి ప్రణాళికను సిధ్దం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత అంతటి లోటు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. 2002-03లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులన్నీ ఎండిపోగా మళ్లీ ఇప్పుడు అంతటి లోటు ఏర్పడిందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 152.81టీఎంసీల మేర మాత్రమే నిల్వలు న్నాయి. ఈ సమయానికి ఉండాల్సినదానికన్నా 528 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలోనూ వాడుకోదగినవి కేవలం 5 టీఎంసీలే. జూన్‌లో సకాలంలో వర్షాలు కురిసినా ముందుగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిండాల్సి ఉంటుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి చేరే నీటిలో సుమారు 90 నుంచి 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన కూడా ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 20 లక్షల ఎకరాలపై ప్రభావం.. సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితిల్లో ఆ ప్రభావం మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండగా, జూరాల కింద లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టంగా మారుతుంది. దీనికి తోడు ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద కొత్తగా ఈ ఖరీఫ్‌లో 6.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించారు. ఒకవేళ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే గడ్డు పరిస్థితులు తప్పవు. మరో పక్క ప్రాజెక్టుల ద్వారా చెరువులు నిండని పక్షంలో మరో 5 లక్షల ఎకరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. -
ఆశలకు జీవం
జిల్లా వ్యాప్తంగా వర్షాలు - రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం - పొలాలు పదునెక్కడంతో సాగుకు సమాయత్తం - ఇప్పటికే వేసిన పంటలకు మేలు - సాగర్ నీటి విడుదల కోసం వరి రైతుల నిరీక్షణ సాక్షి, గుంటూరు: ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. బీడుగా మిగులుతాయనుకున్న పంట భూములు మంగళ, బుధవారాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు పదునెక్కడంతో కొత్త ఆశలు చిగురించారు. ఖరీఫ్ పంటల సాగు పనులు జూన్ మొదటివారంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది జాప్యమైంది. కొద్దిమంది రైతులే ముందుగా పంటలు వేశారు. మిగిలినవారంతా వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణ ఫలించి.. వరుసగా రెండు రోజులు వర్షాలు కురియటంతో భూములు తడిసి ముద్దయ్యూరుు. దీంతో సాగు పనులు ఊపందుకున్నారు. ముఖ్యంగా పత్తి, మిర్చి రైతులు గురువారం నుంచి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు అధికంగా పండించే పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యూరు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలో అత్యధికంగా మాచర్లలో 18 సెంటీమీటర్ల వర్షం పడగా మిగిలిన చోట్ల 5 నుంచి 8 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ముందుగా వేసిన పత్తి పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెరగనున్న పత్తి సాగు విస్తీర్ణం.: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది 1,01,038 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉంది. అయితే ఎక్కువమంది రైతులు పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తుండటంతో అదనంగా 50 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మిర్చి 1,34,079 ఎకరాలు, వరి 4,33,114 ఎకరాల్లో వేయాల్సి ఉంది. సాగర్ కాలువల ద్వారా నీరు విడుదలైతే వరి వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసమే నీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సాగు నీటి విడుదల జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు వేసిన వరిలో అధిక శాతం వెద పద్ధతిలో సాగు చేస్తున్నదే కావటం గమనార్హం. రుణాలు అందక ఇబ్బందులు వర్షాలు కురియటంతో సాగుకు సమాయత్తమైన రైతులు పెట్టుబడులు ఎలా పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామంటూ అధికార టీడీపీ చెప్పిన మాటలు నమ్మిన రైతులు రుణాలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించటం లేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. -
పంటల ‘బీమా’ నుంచి జిల్లాకు మినహాయింపు
మోర్తాడ్: ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి జాతీయ పంటల బీమా పథకం నుంచి మన జిల్లాకు కంపెనీ యాజమాన్యం మినహాయింపునిచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జిల్లాలో సాగవుతున్న పంటలకు ఈ పథకం వర్తింప చేయకుండా కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో సాగయ్యే పత్తి, మిరప, బత్తాయి, ఆయిల్ఫామ్ పంటలకు మాత్రమే బీమా వర్తింప చేస్తూ జాతీయ పంటల పథకాన్ని అమలు చేస్తున్న అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనను జారీ చేసింది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోరు బావులను ఆధారం చేసుకుని రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలను ఈ సీజనులో సాగు చేస్తున్నారు. ప్రతి ఖరీఫ్ సీజనుల్లో పంటల సాగుకు రైతులు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్ సంస్థకు చెల్లించేవారు. ఒకవేళ రైతులు పంట రుణాలు తీసుకోకపోతే బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియంను చెల్లించే అవకాశం ఉంది. ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బీమా చేసే విషయంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. మిరప, బత్తాయి, పత్తి పంటలకు మాత్రమే బీమాను వర్తింపచేస్తూ.. మిగిలిన పంటలను మినహాయించింది. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సాగు అవుతున్న పత్తి, మిరప, బత్తాయి పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నారు. రైతులకు తప్పిన భారం గతంలో పసుపు పంటకు అత్యధికంగా ఎకరానికి రూ.2,500 వరకు ప్రీమియం వసూలు చేసేవారు. వరి, సోయా, మొక్కజొన్న పంటలకు కొంత తక్కువ ప్రీమియం ఉండేది. ఈసారి వర్షాలు కురవక పోవడంతో పంటల పరిస్థితి ఎలా ఉంటుందోననే సంశయంతో బీమా సంస్థ మన జిల్లాకు మినహాయింపు ఇచ్చింది. దీంతో రైతులు తమకు బీమా ప్రీమియం చెల్లించే భారం తప్పిందని చెబుతున్నారు. ప్రతీ సీజన్‌ల్లో పంటల బీమా చెల్లించినా తమకు ఎప్పుడు కూడా నష్టపరిహారం అందలేదని వారు పేర్కొంటున్నారు.