kirit somaiah
-
మోదీకి థ్యాంక్స్.. లోక్‌సభలో లొల్లి.. గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీని తాకింది. పార్లమెంటులోని లోక్‌సభలో ఎన్నికల ఫలితాలు ధుమారం రేపాయి. ప్రతిపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి లేచి బెంచ్‌లపై నిల్చొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇంతకీ సభలో ఏం జరిగిందంటే.. సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే, లోక్‌సభ ప్రారంభంకాగానే ట్రెజరీ విభాగానికి చెందిన బీజేపీ ఎంపీ కిరిట్ సోమయా తొలి ప్రశ్న అడగాల్సి ఉంది. అయితే, ఆయన అందుకు బదులు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయింది, గుజరాత్లో మరోసారి బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నేను ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఆయన చర్యను తప్పుబట్టాయి. వెంటనే తమ స్థానాల్లో నుంచి నిల్చొని కేంద్రం వ్యతిరేక నినాదాలు చేశాయి. స్పీకర్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో సభను వాయిదా వేశారు. -
రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సభ్యుడొకరు లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈశాన్య ముంబై ఎంపీ అయిన కిరీట్ సోమయ్య స్పీకర్‌కు ఈ నోటీసు అందజేశారు. దీనిపై ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. గురువారం నాడు రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధానమంత్రివి 'ప్రతీకార రాజకీయాలు' అంటూ ప్రస్తావించడం తెలిసిందే. తన నియోజకవర్గమైన అమేథీలో ఫుడ్ పార్కును రద్దుచేయాలనుకుంటున్నారని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ సోమయ్యతో పాటు కొందరు బీజేపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. కానీ ఆ సమయానికి రాహుల్ సభలో లేరు. నినాదాల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ సభను పావుగంట సేపు వాయిదా వేశారు. రాహుల్ సభను తప్పుదోవ పట్టించారని, వాస్తవానికి ఫుడ్ పార్కును నిర్వహించలేమంటూ సదరు కంపెనీయే వెనక్కి వెళ్లిందని కిరీట్ సోమయ్య అన్నారు. -
ఎదురు దెబ్బలు!
సాక్షి, ముంబై: పోలీసు కొలువుల భర్తీ సర్కారును ఇరకాటంలో పడేస్తోంది. భర్తీ ప్రక్రియలోభాగంగా ఐదు కిలోమీటర్ల పరుగు పరీక్షలో పాల్గొన్న నలుగురు యువకులు మృత్యువాత పడడంతో నియామక ప్రక్రియపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా అటువంటివేవీ నియామకం చేపడుతున్న ప్రదేశంలో కనిపించకపోవడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులందాయి. మరోవైపు పత్రికలు, మీడియాలో వస్తున్న కథనాలను ఆధారంగా చేసుకొని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. సంబధిత అధికారులపై చర్య తీసుకోండి: సోమయ్య భర్తీ ప్రక్రియ జరుగుతున్న స్థలాన్ని స్వయంగా పరిశీలించిన కేంద్రమంద్రి కిరీట్ సోమయ్య రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన పిటిషన్‌పై స్పందించిన కమిషన్ మరణాలపై దర్యాప్తు జరిపి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఎస్ఆర్ బన్నుర్మఠ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సంభవించిన నలుగురు అభ్యర్థుల మరణాలపై జూలై 8లోగా నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇదిలావుండగా నియామక ప్రక్రియ చేపడుతున్న ప్రాంతాల్లో అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, షెల్టర్లు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేవని సోమయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోనే పరుగు పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల మరణాలకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆయన పిటిషన్లో కోరారు. అంతేకాక మృతిచెందిన అభ్యర్థుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. కనీస సదుపాయాలేవి?: హైకోర్టు పోలీసు భర్తీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అపశ్రుతులపై సోమవారం ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఈ ఘటనలపై ప్రభుత్వం, పోలీసుశాఖ సమాధానమివ్వాలని సూచించింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలి వచ్చే విషయం తెలిసి కూడా వారికి కనీస సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. అలాగే పోటీలు నిర్వహించేందుకు సరైన మైదానాలు ఎంపిక చేయలేదని, మండుటెండలో పరుగు పరీక్షలు నిర్వహించడంవల్ల నలుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కోర్టు మండిపడింది. దీనిపై ప్రభుత్వం, పోలీసు శాఖ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.