Kollam district
-
జస్ట్ మిస్.. క్షణం ఆలస్యం అయ్యుంటే ఎంత ఘోరం జరిగుండేదో
సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటి పాములు ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి ఎగబడుతున్నాయి. రోడ్లు, ఇళ్లు, బస్సు.. ఇలా ఎక్కడ చూసినా అనుకోని అతిథుల్లా ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఎక్కువ శాతం పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇలా ప్రమాదకరమైన పాములు కంటపడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థి సెకన్ల వ్యవధిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొల్లా జిల్లాలోని కూన్నతుర్లో జరిగింది. స్కూల్ యూనిఫాం ధరించి ఉన్న ఓ విద్యార్తి ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నిల్చొని ఉంటాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి గేట్ మూసేస్తుండగా.. పక్కనే పాము ఉండటాన్ని గమనించాడు. పాముని చూసి భయంతో వెంటనే అడుగు ముందుకు వేయగా.. పాము ఒక్కసారిగా అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి లోపలికి పరుగెత్తుకెళ్లాడు. అనంతరం తన తల్లిని తీసుకొచ్చి పామును చూపిస్తుండగా అది మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. చదవండి: చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. అబ్బాయి అదృష్టం బాగుంది. జస్ట్ మిస్.. క్షణం ఆలప్యం అయ్యుంటే పాము కాటుకు గురయ్యేవాడు. ఈ మధ్య పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సూచిస్తున్నారు. -
విద్యార్థి ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే.. ఆడియో క్లిప్ వైరల్
తిరువనంతపురం: సాయం చేయాల్సిందిగా కోరుతూ ఓ పదవ తరగతి విద్యార్థి తన నియోజకర్గ ఎమ్మెల్యేకు కాల్ చేశాడు. సాయం సంగతి దేవుడేరుగు.. కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు. ‘‘నా నంబర్ ఎవరు ఇచ్చారు.. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ ఎమ్మెల్యే. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు.. కేరళ, కొల్లాం సీపీఐ (ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌కు రెండు రోజుల క్రితం అతడి నియోజకవర్గానికి చెందిన ఓ పదవి తరగతి విద్యార్థి కాల్ చేశాడు. తను ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చెప్పి.. ఎమ్మెల్యేను సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్ నీకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నానని చెప్పగా.. ముఖేష్ ఆగ్రహంతో ‘‘నీ స్నేహితుడి ముఖం పగలకొట్టాలి.. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్ తీసుకుని నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ దురుసుగా మాట్లాడాడు. విద్యార్థి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనకు భయపడిన సదరు విద్యార్థి తప్పయ్యింది సార్.. క్షమించండి అని కోరాడు. కానీ ముఖేష్ విద్యార్థి మాటలు వినకుండా.. అతడిపై మండి పడ్డాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే ముఖేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముఖేష్ దీనిపై వివరణ ఇస్తూ.. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిలో ముఖేష్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాకు అవిరామంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. గంటలో నా ఫోన్ చార్జింగ్ అయిపోతుంది. ఎవరేవరో నాకు కాల్ చేసి.. మా ఏరియాలో కరెంట్ లేదు.. రైళ్లు ఎందుకు సక్రమంగా తిరగడంలేదని.. ఏవేవో ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.. ప్లాన్ ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా కాల్ చేస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం లభించలేదు. ఇక ఆ రోజు కూడా నేను జూమ్ మీటింగ్‌లో ఉండగా ఓ విద్యార్థి నాకు కాల్ చేసి ఇలానే మాట్లాడాడు. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను. ఆ విద్యార్థి నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. సమావేశం డిస్టర్బ్ అయ్యింది. ఆ కోపం, విసుగులోనే నేను సదరు విద్యార్థిని కోడతాను అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని’’ ఎమ్మెల్యే ముఖేష్ తెలిపారు. -
ఫేస్బుక్ ప్రియుడి కోసం బిడ్డ ప్రాణం బలి.. తీరా అతని కోసం వెతికితే..
తిరువనంతపురం: ప్రాంక్ సరదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ బాలింత తన పసి బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాలు.. కొల్లాం జిల్లాలోని కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన రేష్మా అనే వివాహితకు ఫేస్బుక్లో ఆనంద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఎప్పడూ కలుసుకోలేదు. అయితే, అప్పటికే రేష్మా ఒక పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది. మరోవైపు ఫేస్బుక్ ప్రియుడు.. ఏదేమైనా ఇంట్లో నుంచి రావాలని. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన రేష్మా తన బిడ్డను అడ్డు తొలగించుకుని ఆనంద్ తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. పసి బిడ్డను దగ్గరలో గల రబ్బరు తోటల్లో వదిలి వెళ్లిపోయింది. తరువాత పసిబిడ్డను స్థానికులు గమనించి ఆస్పత్రి కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు వెలుగు చూశాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఫేస్బుక్ ప్రియుడు ఆనంద్ జాడ లేకపోవడంతో రేష్మా తిరిగి ఇంటికి వచ్చింది. అదే సమయంలో పసికందు మృతి కేసులో పోలీసులు విచారణ చేపట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఆనంద్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అయితే, ఆనంద్ అనే వ్యక్తి లేనే లేడని పోలీసుల విచారణలో తేలింది. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆనంద్ అనే పేరుతో ఎవరో చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ఆర్యా, గ్రీష్మా ఆత్మహత్య శిశువు మృతి కేసు విచారణ కొనసాగుతుండగానే రేష్మా బంధువులు ఆర్య, గ్రీష్మా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్ కార్డు వివరాల ఆధారంగా రేష్మాతో ఫేస్బుక్ చాటింగ్ చేసింది ఆమె బంధువులు ఆర్య, గ్రీష్మా అని వెల్లడైంది. రేష్మాతో ‘ప్రాంక్’ చేద్దామని ఆ ఇద్దరూ ఆనంద్ అనే ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌తో కథంతా నడిపించారని ఆర్య, గ్రీష్మా స్నేహితుడొకరు పోలీసులకు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ‘ప్రాంక్’ పేరిట పసి ప్రాణం పోవడానికి కారకులం అయ్యామనే తీవ్ర మనోవేదనకు వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దుబాయ్ వచ్చిన విష్ణు ఇక ఈ కథ మొత్తం దుబాయ్‌లో ఉంటున్న రేష్మా భర్తకు తెలియకపోవడం గమనార్హం. భార్య ప్రెగ్రెంట్‌గా ఉన్నప్పుడు దుబాయ్ వెళ్లిన విష్ణు ఆమెను జూన్‌లో అరెస్టు చేసినప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన బిడ్డ చనిపోవడం, ఆ కారణంగా మరో ఇద్దరు బంధువులు ప్రాణాలు తీసుకోవడం తెలుసుకున్న విష్ణు నిశ్ఛేష్టుడయ్యాడు. మరోవైపు తమ భార్యలు ఏ కారణంతో నదిలో దూకి చనిపోయారో తెలియని ఆర్యా, గ్రీష్మా భర్తలు నిజం బయటపెట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. -
చరిత్ర సృష్టించిన 105 ఏళ్ల బామ్మ
కొల్లామ్ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం మాత్రం ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. వయసుమీద పడ్డవారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. దేశంలోనూ వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో వృద్దులు కూడా ఉన్నారు. తాజాగా కరోనా వైరస్‌తో మూడు నెలలపాటు పోరాడిన కేరళకు చెందిన 105 ఏళ్ల బామ్మ బుధవారం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది.(పూజారితో పాటు 16 మంది పోలీసులకు కరోనా) వివరాలు.. కొల్లామ్ జిల్లాలోని ఆంచల్ పట్టణానికి చెందిన 105 ఏళ్ల ఆస్మా బీవీ ఏప్రిల్ 20న కరోనా బారిన పడ్డారు. ఆమెకు తన కూతురు ద్వారా వైరస్ సంక్రమించినట్లు తెలిసింది. కుటుంబసభ్యులు ఆస్మా బీవీని చికిత్స కోసం కొల్లామ్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వయసు రిత్యా ఆస్మా వైరస్ దాటికి తట్టుకుంటుందా అన్న అనుమానం అక్కడి వైద్యులకు కలిగింది. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దాదాపు మూడు నెలల పాటు కరోనాతో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. ఆస్మా విజయంతంగా కరోనా నుంచి బయటపడడంతో వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న అతి పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించినట్లు వైద్యాధికారులు తెలిపారు. చికిత్స సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు చట్టుముట్టినా ఆమె తన ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనాతో దైర్యంగా పోరాడిందని వెల్లడించారు. ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు ఒక మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు కేరళకు చెందిన 93ఏళ్ల థామస్ అబ్రహం కరోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే కేరళకు చెందిన ఆస్మా బీవీ వైరస్ నుంచి కోలుకొని దేశంలోనే అతిపెద్ద వయస్కురాలిగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కరోనాను జయించిన ఆస్మా బీవీని ప్రశంసించారు. తనకు వైరస్ సోకిందని తెలిసినా అంత పెద్ద వయసులోనూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదంటూ మెచ్చుకున్నారు. కేరళలో కరోనాతో బాధపడుతున్న పెద్ద వయస్కుల వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందిని శైలజ అభినందించారు. కాగా కేరళలో కొత్తగా 903 కరోనా కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 21,797గా ఉంది. కాగా మరణాల సంఖ్య 68కి చేరింది. -
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్‌కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్‌కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది. -
ఎందుకు అడ్డుకోలేకపోయారు?
కొచ్చి: పుట్టింగల్ ఆలయ అగ్నిప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాపు జరపాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పుట్టింగల్ దుర్ఘటనపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. చట్టవిరుద్ధంగా బాణసంచా పేలుళ్లు నిర్వహించారని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆలయ ప్రాంగణంలో బాణసంచా కాల్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. అనుమతి ఇవ్వకుంటే బాణసంచా ఎలా కాల్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అనుమతి లేనప్పుడు ఆలయ ప్రాంగణంలోని బాణసంచాను పోలీసులు ఎందుకు పట్టుకురానిచ్చారని, కాల్పులను ఎందుకు అడ్డుకోలేకపోయారని సూటిగా నిలదీసింది. పేలుళ్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం విధుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఘోర విపత్తుకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు, కొల్లాం జిల్లా అధికార యంత్రాగం వేర్వేరుగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పుట్టింగల్ ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాల్పులు సందర్భంగా పేలుడు సంభవించడంతో 109 మంది మృతి చెందగా, 300 మందిపైగా గాయపడ్డారు. -
పుట్టంగల్ ఘటనలో ఐదుగురి లొంగుబాటు
కొల్లాం: పుట్టంగల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అయిదుగురు ఆలయ అధికారులు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆలయ ట్రస్టీ అధ్యక్షుడు జయలాల్, సెక్రటరీ జె కృష్ణకుట్టీ, ట్రెజరర్ శివప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు సురేంద్రన్ పిళ్ళై, రవీంద్రన్ పిళ్ళై లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం వీరంతా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కొల్లాంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో జరిగే కాళికా దేవి ఉత్సవాల్లో ఆదివారం నిర్వహించిన బాణసంచా వేడుక వికటించి 110మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 383మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనపై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసు ఇవాళ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది. -
కేరళ అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురి అరెస్ట్
కొల్లం: పుట్టంగల్ ఆలయంలో మారణహోమానికి కారణమైనవారిలో ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసంచా పేలుడుతో సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ డీజీపీ తెలిపారు. మరోవైపు పుట్టంగల్ ఆలయంలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని పోలీసు అధికారుల బృందం ఈ ఉదయం పరిశీలించింది. భారీ పేలుడుకు దారితీసిన కారణాలను అన్వేషించింది. గుడి' మంటల్లో మృతి చెందిన వారి సంఖ్య 107 అని కేరళ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కొల్లాం జిల్లా పరువూర్లోని పుట్టంగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా పేలుడు సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుంది. బాణసంచా నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలో నిప్పురవ్వలు పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. 107 మంది ప్రాణాలు కోల్పోగా, 383 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు తిరువనంతపురం మెడికల్ కాలేజీ, కొల్లాంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. -
'అవసరమైతే ముంబై, ఢిల్లీకి తరలిస్తాం'
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్ పుట్టింగళ్ దేవీ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అవసరమైతే క్షతగాత్రులను ముంబై లేదా ఢిల్లీకి తరలించి మెరుగైన వైద్యం అందించడానికి సాయం చేస్తామని మోదీ చెప్పారు. బాధితులను ఆదుకునే విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో మాట్లాడానని చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటన జరగడం చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని పరిశీలించిన మోదీ స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కొల్లాం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, అధికారుతో సమావేశమై చర్చించారు. పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. -
పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన మోదీ
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో అగ్నిప్రమాదం జరిగిన పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అంతకుముందు కొల్లాంలో మోదీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను మోదీకి వివరించారు. మోదీ, చాందీ, కేంద్ర మంత్రి జేపీ నద్దా కలసి.. కొల్లాంలోని ఏఏ రహీం స్మారక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని మోదీ తనతో కేరళకు తీసుకువెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరువనంతపురం వచ్చారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఆయనకు కేరళ గవర్నర్ పి సదాశివం, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో కొల్లాంకు చేరుకున్నారు. పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన వార్త వినగానే మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని ఆదేశించారు. చదవండి: (మహావిషాదం: 100 మందిపైగా మృతి) (మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు) -
అవి కూడా పేలివుంటే...
కొల్లమ్: కేరళలో కొల్లమ్ జిల్లా పుట్టింగళ్ దేవీ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 100 మందిపైగా మృతి చెందారు. 200 మందిపైగా గాయపడ్డారు. బాణాసంచా పేలుడు ధాటికి ఆలయం ప్రాంగణంలోని కట్టడాలు కుప్పకూలింది. పెద్ద ఎత్తున వ్యాపించిన అగ్నికీలల్లో వందమందిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత ఘటనా స్థలంలో దృశ్యాలు భీతిగొల్పుతున్నాయి. పేలని బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో లభ్యమైన పేలుడు పదార్థాలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇవి కూడా పేలివుంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పెద్దమొత్తంలో రక్తం అవసరమవుతుందని, రక్తదాతలు ముందు రావాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మహావిషాదానికి కారణమైన పట్టింగళ్ ఆలయ బోర్డు అధికారులపై కేసు నమోదు చేశారు. బాధితుల వివరాల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నంబర్లు: 0474 2512344, 9497960778, 9497930869 -
మహావిషాదం: 100 మందిపైగా మృతి
కొల్లమ్: కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో 100 మందిపైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా పేల్చిన బాణసంచా భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.\ పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాణాసంచా పేలుడు సందర్భంగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసిపడడంతో శరవేగంగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భక్తులు విలవిల్లాడారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే బాణాసంచా పేలుడు భక్తుల మృతికి కారణమవడం గమనార్హం.