Konda Raghavareddy
-
ప్రజలను మభ్యపెడుతున్న ఇద్దరు ‘చంద్రులు’
తెనాలి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వల్లభాపురం సమీపంలో కృష్ణానది ఒడ్డున ఆదివారం కొండా వారి కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు, కేసీఆర్ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. ఆయా ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. -
భూ స్కామ్‌లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భూ స్కామ్‌లు మితిమీరి పోయాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో జరిగే భూ దందాల్లో పాలక ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు భూములపై వచ్చే ఆరోపణలపై విచా రణ కోరే అవకాశం లేదన్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసు కొని సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. విశాఖ భూముల కుంభకోణంలో ఏపీలో సీఎం కుమా రుడు లోకేష్, ఆయన పార్టీ వారే పాత్రధారులని తెలిపారు. తెలంగాణలోని మియాపూర్ భూ కుంభకోణంలో ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఆయనపై ఏపీ సీఎం బాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మిగతా సమయాల్లో నీతులు వల్లె వేసే బాబు తమ పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి గురించి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అలవిగాని విషయాలపై మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఇప్పుడేమీ మాట్లాడటం లేదేమని నిలదీశారు. హైదరాబాద్ నగరంలోని చాలా భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ దగ్గరి వారి పాత్ర ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. -
సీఎంను కలవనీయలేదని రైతు ఆత్మహత్యాయత్నం
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఘటన - పంటలు ఎండిపోయి.. ఐదు లక్షలు అప్పులుండటంతో మనస్తాపం - గతంలోనూ ఆత్మహత్యాయత్నం.. ఆదుకుంటామని ప్రభుత్వ పెద్దల హామీ - సీఎంను కలసి బాధలు చెప్పుకోవాలని వచ్చిన ఆలూరు రైతు మల్లేశ్ - అనుమతి లభించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం సాక్షి, హైదరాబాద్, గట్టు: అందరికీ తిండిపెట్టే వాడే అయినా ఎవరికీ పట్టని రైతన్న అతను.. ఒకటి తరువాత ఒకటిగా ఐదు బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ నీరు పడక ఆందోళన చెందాడు. ఎండుతున్న పంటలు.. అప్పుల భారం.. ఏం చేయాలో తోచక సీఎం వద్ద గోడు వెళ్ల బోసుకుని సాయం కోరాలనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రిని కలిసేందుకు భద్రతా సిబ్బం ది అనుమతించక తీవ్ర నిరాశకు లోనయ్యాడు. క్యాంపు కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జోగు ళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరుకు చెందిన రైతు మల్లేశ్ (36) వ్యథ ఇది. ర్యాలంపాడు రిజర్వాయర్ ముంపు గ్రామ మైన ఆలూరుకు చెందిన రైతు రాంపురం కుర్వ మల్లేశ్. ఆయనకు భార్య సత్యమ్మ, కూతురు మోనిక, కొడుకు అయ్యప్ప ఉన్నారు. వారికి గ్రామశివారులో 2.07 ఎకరాల మెట్ట పొలం ఉంది. అందులో మల్లేశ్ గత మూడేళ్లుగా ఐదు బోర్లు వేశాడు. అందులో ఒక్కదానిలోనే నామ మాత్రంగా నీళ్లు పడ్డాయి. మల్లేశ్ అటు బోర్ల కోసం, ఇటు పంట పెట్టుబడుల కోసం ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన దిగు బడి రాక, గిట్టుబాటు ధర లభించక ఆవేదన చెందాడు. దీంతో 2015లోనే ఆత్మహత్య చేసు కోవడానికి ప్రయత్నించాడు. అయితే మల్లేశ్ పరిస్థితి గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వా ల్సిందిగా సీఎం పేషీ నుంచి రెవెన్యూ అధి కారులకు ఆదేశాలు వచ్చాయి. ఆదుకుంటా మని మల్లేశ్‌కు ప్రభుత్వ పెద్దలు, అధికారులు హామీలిచ్చారు కూడా.. అయినా సాయం అందకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. ప్రభుత్వం ఆదుకోలేదనే ఆవేదనతోనే.. ఏడాది కింద మల్లేశ్ గుడిసె కాలిపోయింది. అందులో ఆయన కుటుంబసభ్యుల సామాన్లు కాలిపోయాయి. దీంతో మల్లేశ్ జీవితంపై విరక్తి చెందాడు. సీఎం కేసీఆర్‌ను కలసి బాధలు చెప్పుకోవాలనుకొని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. భద్రతా సిబ్బంది లోనికి వెళ్లనివ్వక పోవడంతో వెంట తెచ్చు కున్న పురుగుల మందు తాగాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే మల్లేశ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్లేశ్ కోలుకుం టున్నాడని, ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. మల్లేశ్ కుటుంబసభ్యులను కలిసిన కలెక్టర్ సీఎం క్యాంపు ఆఫీసు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మల్లేశ్ కుటుంబాన్ని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ కలిశారు. ఆలూరులోని పొలంలో ఉన్న గుడిసె వద్దకు వెళ్లిన ఆయన.. మల్లేశ్ భార్య సత్యమ్మకు ధైర్యం చెప్పారు. కుటుంబ వివరాలు సేకరించి, సమస్యలు తెలుసుకున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే.. ఆస్పత్రిలో చికిత్స అనంతరం మల్లేశ్ మీడియాతో మాట్లాడారు. అప్పులు తీర్చే మార్గం లేక సీఎంను కలిసేందుకు వచ్చానని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పారు. తనలాగే ఎంతో మంది రైతులు బోర్లు వేసినా నీళ్లు రాక, పంటలు పండక, అప్పుల పాలై బాధలు పడుతున్నారని... వాళ్లందరి బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్లానుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటికైనా తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలని కోరారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుంది సీఎం కేసీఆర్ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని... ముఖ్యమంత్రికి రైతుల ఉసురు తగులుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర రాక, బోర్లు వేసినా నీళ్లుపడక రైతులు అప్పుల పాలవుతున్నారని.. ఆవేదనతో రోజుకొకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన తుగ్లక్‌ను మరిపిస్తోందని.. ఉద్యమాల ద్వారానైనా పాలకుల కళ్లు తెరిపిద్దామనుకుంటే కుటిల రాజకీయాలతో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి -
కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి
-
కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్‌లో అబద్ధాలు చెప్పారని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అవహేళన చేస్తూ మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు తగదని అన్నారు. కేసీఆర్ భాష, యాస మార్చుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు. -
4, 5 వారాల్లోనే చర్య తీసుకోవాలి : వైఎస్సార్సీపీ
హైకోర్టు సూచనలను స్వాగతిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 90 రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు హైకోర్టు చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ తెలిపింది. స్పీకర్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం ప్రోదిగొలిపేలా కోర్టు సూచించినట్లు 90 రోజుల వ్యవధి కాకుండా, 4, 5 వారాల్లోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ముగ్గురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము 5, 6 పర్యాయాలు స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించినా ఇంతవరకు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై తాము కూడా పార్టీపరంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయాలని కోరారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రకారం ఎమ్మెల్యేలు విలీనమైనంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదని చెప్పారు. తాము టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగానే, స్పీకర్ కార్యాలయం ఆగమేఘాలపై శాసనసభాపక్షం విలీనమైనట్లు బులిటెన్ ఇవ్వడం సరికాదన్నారు. కేవలం ఎమ్మెల్యేలు కాకుండా పార్టీలు విలీనమైతేనే అది విలీనంగా గుర్తింపు పొందుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవించేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు నిప్పు అయితే ఎందుకు తప్పించుకుంటున్నారు?
- వైఎస్సార్సీపీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి - దర్యాప్తును త్వరగా ముగించాలని కేసీఆర్‌కు వినతి సాక్షి, హైదరాబాద్: తనకు తాను నిప్పురవ్వ అని ప్రచారం చేసుకునే ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో 14 నెలలుగా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రశ్నించింది. తాజాగా ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణకు ఆదేశించినా, దానిపై చంద్రబాబు మాట్లాడకుండా ఏవో సొల్లు కబుర్లు చెబుతూ, దీనిపై తాను స్పందించడమేమిటి.. అడ్వొకేట్లు చూసుకుంటారని చెప్పి తప్పించుకోచూస్తున్నారని.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదని, ఒక రాష్ట్రానికి సీఎం అని, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం తప్పిదం చేసి యావత్ 6 కోట్ల తెలుగు ప్రజలకు తలవంపులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు ఈ కేసును త్వరితంగా దర్యాప్తు చేసి నిందితులను తేల్చేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును పునర్విచారించాలని కోర్టు ఆదేశించిన వెంటనే గవర్నర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత అడ్వొకేట్ జనరల్, ఏసీబీ డీజీ ఏకేఖాన్లు కలుసుకుని వివరాలు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, కేసీఆర్‌తో లోపాయికారిగా అవగాహనకు వస్తారని ప్రజల్లో జరుగుతున్న ప్రచారానికి ఆస్కారమివ్వకూడదని పేర్కొన్నారు. విచారణలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ కేసులో గతంలోనే ప్రాథమిక విచారణ పూర్తయినందున సెప్టెంబర్ 29 వరకు ఆగకుండా త్వరితంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2న ఘనంగా వైఎస్సార్ వర్ధంతి..: ప్రజల మనిషిగా గుర్తింపు పొంది, జనరంజక పాలనను అందించిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఒక ఏపీకో, తెలంగాణకో పరిమితమైన నేత కాదని, యావత్ దేశంపై ఆయన ముద్ర ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలకు అతీతంగా ఆయన అభిమానులున్నారన్నారు. 2న పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండలంలో వైఎస్ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
'కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు'
హైదరాబాద్: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ఆర్ సీపీ అని ఆ పార్టీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని పొంగులేటిని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీ మారుతున్నందున పొంగులేటి తన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని రాఘవరెడ్డి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో సుచరితకే తమ పార్టీ మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. -
ప్రజల గుండెల్లో నేటికీ వైఎస్
షర్మిల పరామర్శ యాత్రకు అపూర్వ స్పందన త్వరలోనే జిల్లాలో మూడో విడత యాత్ర వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి భూపాలపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ తనయ, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేటలో శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవరెడ్డి మాట్లాడారు. మహానేత వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 73 మంది చనిపోయారని, మొదటి, రెండో విడత యాత్రల్లో షర్మిల 62 కుటుంబాలను పరామర్శించారని చెప్పారు. మూడో విడతలో భాగంగా మిగిలిన భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలోని 11 కుటుంబాలను ఈ నెల 21, 22 తేదీల్లో పరామర్శిస్తారని తెలిపారు. జిల్లాలో షర్మిల చేపట్టిన తొలి, మలి విడత యాత్రలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. యాత్ర విజయవంతానికి సహకరించిన ప్రజలు, వైఎస్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసులు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యూత్ర సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు. నల్లకాల్వలో తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట కోసం ఆరేళ్లయినా ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. -
ప్రజల గుండెల్లో వైఎస్‌ది చెరగని ముద్ర: కొండా
నర్సంపేట : నిరుపేద, పేద కుటుంబాలకు చెందిన ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అం దించిన సేవలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ అకాల మరణం చెందారని తెలుసుకుని గుండెపగిలి చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్ తనయుడు, వైఎస్సార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా ఆయన సోదరి షర్మిల ఈ నెల 7 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారని వివరించారు. ఆమె జిల్లాలోని జనగాం మీదుగా పాలకుర్తి నియోజకవర్గానికి చేరుకొని ఎడ వెంకన్న కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారని చెప్పా రు. 7న 6 కుటుంబాలు, 8న 7 కుటుంబాలు, 9న 4 కుటుంబాలు, 10న 7 కుటుంబాలు, 11న 5 కుటుంబాలను పరామర్శిస్తారని వెల్లడించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వరంగల్ జిల్లాకు వస్తుండగా.. కొంతమంది అడ్డుకుంటున్నారనే సమాచారంతో మనస్తాపానికి గురై గుండె పగిలి నర్సంపేటలో మృతి చెందిన ఎల్లయ్య కుటుంబాన్ని సైతం నాలుగో రోజు షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. -
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలోనే శ్రద్ధ!
పదకొండు నెలలుగారైతులకు సర్కార్ చేసిందేమీలేదు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కామారెడ్డి: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపిం చారు. గురువారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్స్‌లో జరుగనున్న రైతుదీక్ష వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పదకొండు నెలలుగా రైతులకు చేసిందేమీ లేదన్నారు. సీఎంగా వైఎస్సార్ ఒక్క సంతకంతో రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇప్పిం చారని చెప్పారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ రూ. 25 వేలు మాత్రమే మాఫీ చేశారని, కొత్త రుణాల జాడలేదన్నారు. ఈ నెల 10నకామారెడ్డిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే రైతుదీక్షకు జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సర్కారుకు కనువిప్పు కలిగించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గాదె నిరంజన్‌రెడ్డి, బీష్మ రవీందర్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'బిల్ట్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి'
జిల్లాలో మూసివేతకు గురైన బిల్ట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్ సీసీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్ జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అకాల వర్షాలు తదితర కారణాలరీత్యా వరంగల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్: పో్లీస్ శాఖకు కొత్త ఇన్నోవా వాహనాలు కాదు, మొత్తం పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో పరామర్శలు, సానుభూతి, ఎక్స్‌గ్రేషియాలతో చేతులు దులుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో మరణించింది దోపిడీ దొంగలేనని హొం మంత్రి, పోలీసులు నిర్ధారిస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ గ్యాస్ పైప్ లైన్ బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జి.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సురేష్‌రెడ్డి ఇదివరకు సూరారం కార్పొరేటర్‌గా పనిచేశారు. పార్టీలో చురుకైన వ్యక్తిగా పేరున్న సురేష్‌రెడ్డి.. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, త్వరలో కార్యచరణ ప్రకటించనున్నామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమితులైన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. రాష్ట్ర కార్యదర్శులుగా ఏనుగు మహిపాల్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), జి.సూర్యనారాయణరెడ్డి (మల్కాజిగిరి), కె.అమృతాసాగర్ (ఇబ్రహీంపట్నం) నియమితులయ్యారు. అదేవిధంగా అనుబంధ శాఖల్లోనూ జిల్లా నేతలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ముస్తాక్ అహ్మద్ నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ విభాగం పగ్గాలను జార్జ్ హార్బర్ట్కు అప్పగించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా సీనియర్‌నేత కొండా రాఘవరెడ్డి, కూకట్‌పల్లికి చెందిన సత్యం శ్రీరంగం నియమితులయ్యారు. సమరశీల ఉద్యమాలు చేపడతా నగర పరిధిలోని బస్తీలు, రూరల్ మండలాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల ఉద్యమాలు చేపడతా. హైదరాబాద్ నగరంతో మిళితమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజవర్గాలతోపాటు, గ్రామీణ నియోజవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. - కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధి