గురువారం కామారెడ్డిలో రైతు దీక్ష స్థలాన్ని పరిశీలిస్తున్న కొండా రాఘవరెడ్డి, శివకుమార్, సిద్ధార్థరెడ్డి తదితరులు
- పదకొండు నెలలుగారైతులకు సర్కార్ చేసిందేమీలేదు
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
కామారెడ్డి: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపిం చారు. గురువారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సీఎస్‌ఐ గ్రౌండ్స్‌లో జరుగనున్న రైతుదీక్ష వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పదకొండు నెలలుగా రైతులకు చేసిందేమీ లేదన్నారు. సీఎంగా వైఎస్సార్ ఒక్క సంతకంతో రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇప్పిం చారని చెప్పారు.
లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ రూ. 25 వేలు మాత్రమే మాఫీ చేశారని, కొత్త రుణాల జాడలేదన్నారు. ఈ నెల 10నకామారెడ్డిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే రైతుదీక్షకు జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సర్కారుకు కనువిప్పు కలిగించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గాదె నిరంజన్‌రెడ్డి, బీష్మ రవీందర్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.