kothapet
-
హైదరాబాద్ లో విషాదం
-
సామాజిక సాధికారతకు జై కొట్టిన కొత్తపేట
సాక్షి అమలాపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన సామాజిక సాధికారతకు కొత్తపేట జై కొట్టింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలిరావడంతో కొత్తపేట మెయిన్ రోడ్డు జన గోదావరిని తలపించింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. యువత మోటార్ సైకిల్ ర్యాలీతో యాత్రను అనుసరించారు. ప్రజలు పూలు జల్లుతూ భారీ గజమాలలతో ఎదురేగి యాత్రకు స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తపేట సభలో పాల్గొన్నారు. సీఎం జగన్ సామాజిక విప్లవం, సంక్షేమ పాలనను వివరించినప్పుడు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయం చేసింది జగన్ ఒక్కరే: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే నని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో వారి వాళ్లకు, ఆయన పార్టీ వాళ్లకు మాత్రమే పని చేయాలని చెప్పారన్నారు. సీఎం జగన్ మాత్రం కులం, మతం, పార్టీలు అని చూడకుండా ప్రతి పేదవాడికీ మేలు చేయాలని చెప్పారని, అదే చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషి నభూతో నభవిష్యతి అని చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీర మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎంపీలు అయ్యారంటే అందుకు జగన్ కారణమన్నారు. ఇది దేశంలోనే ఒక చరిత్ర: మంత్రి చెల్లుబోయిన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్ ఈ వర్గాలను అక్కున చేర్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. చంద్రబాబు పాలనలో వివక్షకు గురైన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి, సంక్షేమ పథకాల ద్వారా వారి అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు. పేదలవైపు ఉన్నది జగన్ ఒక్కరే: శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న పోరాటంలో పేదల వైపు ఉన్నది జగన్ ఒక్కరేనని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల వారికి ఉన్నత పదవులు అందించి, ఈ వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారని వివరించారు. జగన్ గెలుపు మన అవసరం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరమని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇంతమంది వెనుకబడిన, దళిత వర్గాల వారం వేదిక మీద ఉన్నామంటే సీఎం జగనే కారణమని అన్నారు. వెనుకబడిన వారిని జగన్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా గుర్తించారని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని, దీని వల్ల వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతోందని వివరించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ: ఎంపీ మార్గాని భరత్ గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు తేవడంలో జగన్ ఒక శక్తిలా పని చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారో తీసేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
కోససీమ జిల్లా కొత్తపేటలో ఘనంగా ప్రభల ఊరేగింపు
-
Hyderabad: కొత్తపేట్ పండ్ల మార్కెట్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో కొత్తపేట్ పండ్ల మార్కెట్ శుక్రవారం పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. కమీషన్ ఏజెంట్లకు ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం అందించారు. షాపుల్లో, షెడ్లల్లో ఉన్న సామగ్రి తీసుకెళ్లాలని నోటీసులు పెట్టారు. కొత్తపేట్ నుంచి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో బాటసింగారానికి తరలించారు. అక్కడ పండ్ల దిగుమతులు పెరగడంతో వ్యాపారులు, హమాలీలతో మార్కెట్ కళకళలాడుతోంది. గతంతో పోలిస్తే బాటసింగారంలో క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ అధికారులు కూడా పెరిగిన పండ్ల దిగుమతులతో రైతులకు, వ్యాపారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు చేసినట్లు కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి తెలిపారు. (చదవండి: సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన) -
ముక్కలైన కొత్తపేట్ పండ్ల మార్కెట్.. తలో దిక్కు..
సాక్షి,హైదరాబాద్: పోయిన దసరా రోజున బాటసింగారంలో ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగడంలేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సాగక తిరిగి కొత్తపేట్ పరిసరాలకే చేరుకున్నారు. రూ.కోట్లతో సకల సౌకర్యాలు కల్పించామని మార్కెటింగ్‌శాఖ ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు కొత్తగా ఏర్పాటు చేసిన బాటసింగారం వైపు ఆసక్తి కనబర్చడంలేదు. కొంతమంది కమిషన్ ఏజెంట్లు కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం నిలిపివేశారు. మరికొందరు ఎల్బీనగర్ చుట్టు పక్కల స్థలాలు అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కొత్తపేట్ పరిసరాల్లో రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. దీంతో గతంలో ప్రాంగణంలో కొనసాగిన వ్యాపారం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నులకొద్దీ వచ్చే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌కు రావడం నిలిచిపోయింది. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాటసింగారానికి ససేమిరా.. కమిషన్ ఏజెంట్లు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుని ఎల్బీనగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ అధికారులు బలవంతంగా బాటసింగరానికి తరలించినా అక్కడ వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు అధికారుల బెదిరింపులతో బాటసింగారం వెళ్లి ఎంట్రీ చేసుకొని వచ్చి మళ్లీ కొత్తపేట్ ప్రాంతంలోనే పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్లపై విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారులు తుదకు వ్యాపారమే మానివేయడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో దిగాలుగా కూర్చున్న వ్యక్తి పేరు ఫరీద్. గతంలో కొత్తపేట్ మార్కెట్లో పండ్లు విక్రయించేవాడు. ఆ మార్కెట్‌ను మూసివేయడంతో ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. బాటసింగారంలో పండ్ల అమ్మకాలు సరిగా ఉండవనే ఉద్దేశంతో కొత్తపేట్ రహదారిపైనే ఇలా పండ్లు విక్రయిస్తున్నాడు. విక్రయాలు సక్రమంగా లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడి పేరు హనుమంతు. కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేయడంతో కొంత కాలం వ్యాపారం చేయలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ అవసరాల కోసం మార్కెట్ చుట్టపక్కల స్థలం అద్దెకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. బాటసింగారం వెళ్లలేక మార్కెట్‌కు దగ్గరలో పండ్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండ్లు విక్రయిస్తున్న ఈ వ్యక్తి జహంగీర్ కొత్తపేట్ మార్కెట్‌ను మూసేసిన తర్వాత కొన్ని రోజులకు అధికారులు బలవంతం చేయడంతో బాటసింగారం వెళ్లాడు. అక్కడ వినియోగదారులు లేకపోవడంతో తిరిగి కొత్తపేటకే చేరుకున్నాడు. బాటసింగారంలో వ్యాపారం చేద్దామంటే వినియోగదారులు రావడం లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నాడు. -
కొత్తపేట్ పండ్ల మార్కెట్ మూసివేతకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ పండ్ల మార్కెట్ తరలింపునకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి బాటసింగారంలో మార్కెట్ కార్యకలపాలు ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముత్యంరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు తీర్మానించామన్నారు. ఇప్పటికే కొత్తపేట్ పండ్ల మార్కెట్ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మార్కెట్ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకు రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని కోరారు. బాటసింగారంలో మార్కెట్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చదవండి: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే.. -
మానసిక స్థితి సరిగా లేదని భూతవైద్యం.. ఆఖరికి యూపీలో
సాక్షి, విజయవాడ: కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన యువతి శవమై తేలింది. ప్రేమ పేరిట నమ్మించి తనతో పాటు తీసుకువెళ్లిన యువకుడి చేతిలో హత్యకు గురైంది. వివరాలు.. స్థానిక చిట్టినగర్‌కు చెందిన ఫాతిమా(21) అనే యువతి ఈనెల 10 నుంచి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురి మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఫాతిమాకు మతిస్థిమితం లేకపోవడంతో చికిత్స కోసం ఆమె తండ్రి.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వాసిఫ్‌ను పిలిపించారు. అతడు ఫాతిమాకు భూతవైద్యం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యం పేరుతో మరో స్నేహితుడు తయ్యబ్ సాయం సాయంతో వాసిఫ్ ఫాతిమాను ట్రాప్ చేశాడు. ఇందులో భాగంగా ఢిల్లీకి ఆమెకు టికెట్ తీయించగా.. ఫాతిమా ఒంటరిగానే అక్కడికి రైలు ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వాసిఫ్, తయ్యబ్, ఫాతిమా ముగ్గురూ కలిసి యూపీలోని సహరన్‌పూర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే... ఈనెల 10వ తేదీన ఫాతిమా కనిపించకపోవడంతో, అదేరోజు ఆమె తండ్రి కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు... తన కుమార్తె ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు వెళ్లిందని తెలుసుకున్న ఫాతిమా తండ్రి.. తన స్నేహితులతో కలిసి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అతడి ఆచూకీ కనుగొని.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా తానే యువతిని హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమెకు సంబంధించిన బంగారం కూడా తన వద్దే ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఫాతిమా హత్యకు గురైందన్న చేదు నిజం తెలియడంతో... అత్యాచారం చేసి చంపేసారా అన్న కోణంలో సహారన్పూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువతికి సంబంధించిన 15 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసు విషయమై స్థానిక కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతోందని, సదరు యువతికి సంబంధించిన మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కాపీని అక్కడి పీఎస్‌కు మెయిల్ పెట్టినట్లు తెలిపారు. ఏదేమైనా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
‘పండ్ల మార్కెట్ తరలింపునకు సహకరించాలి’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23 వరకు కొత్తపేట పండ్ల మార్కెట్ తెరిచే ఉంటుందని.. 27న కోహెడలో నూతన పండ్ల మార్కెట్ ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తపేట పండ్ల మార్కెట్ తరలింపుపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచి రెడ్డి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కోహెడ మార్కెట్ కు ఈ మామిడి సీజన్లో తరలించడం వల్ల వ్యాపారులు, ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు కొత్తపేట మార్కెట్‌కు రావడం వల్లన తీవ్ర సమస్య ఏర్పడుతుందని.. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించకుండా..వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కరోనా వ్యాప్తి నియంత్రణకు విఘాతం కలుగుతుందని మంత్రి తెలిపారు. కోహెడలో 170 ఎకరాల స్థలం కేటాయించడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా 5 ఎకరాల స్థలంలో యుద్ధప్రాతిపదికన 132 కేవీ సబ్‌స్టేషన్ కూడా మంజూరవుతుందన్నారు. రోడ్లు, మంచినీటి పనులను కూడా వెంటనే ప్రారంభించాలని మంత్రి కోరారు. మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో మార్కెట్ తరలింపునకు ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల వీడియో
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఎదుర్కోటానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం కొత్తపేట సర్కిల్లో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనికోసం వాహనదారులను రోడ్డుపైనే కొన్ని నిమిషాలపాటు నిలిపివేశారు. అనంతరం ఐదుగురు పోలీసులు వారికెదురుగా నిలబడి కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ఇందుకోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలన్నారు. చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలని పేర్కొన్నారు. (బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్లు) అంతేకాక చేతులను ఏవిధంగా కడుక్కోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పత్రి వ్యక్తికి ఒక మీటర్ దూరంగా ఉండి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరమని నొక్కి చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అందరికీ నమస్కారం మాత్రమే పెట్టాలని కోరారు. అనంతరం దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ‘భయపడవద్దు.. భద్రత పాటిద్దాం - కలిసికట్టుగా కరోనా అరికడుదాం’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (పదో తరగతి విద్యార్థులకు మాస్కులు) చదవండి: కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా -
పండంటి ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత ఏప్రిల్ నెల ఆదాయం రూ.1.20 కోట్ల దాటింది. గ్రేటర్ పరిధిలోని అన్ని మార్కెట్లతో పోలిస్తే ఈ మార్కెట్ సొసైటీ ఆదాయంలో దూసుకుపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.8.62 కోట్ల ఆదాయం రాగా.. గత ఆర్థిక సంవత్సరం 2018–19లో రూ. 9.83 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం 2019– 2020 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్కెట్ ఆదాయం వృద్ధి చెందినా అనుకున్న స్థాయిలో, కేంద్ర కార్యాలయం నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేయలేదు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 2,92,319 క్వింటాళ్ల మామిడి దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ నెలరోజుల ముందుగానే ప్రారంభమైంది. జనవరి 9 నుంచే మార్కెట్‌కు మామిడి రాక ప్రారంభమైంది. గత ఏడాది 1,59,549 క్వింటాళ్ల మామిడి దిగుమతులు జరిగాయి. ఈ ఏడాది శనివారం నాటికి 2,92,319 క్వింటాళ్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. శనివారం ఒక్కరోజే 14,314 క్వింటాళ్ల మామిడి పండ్లు మార్కెట్‌కు వచ్చాయి. ఆదాయం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు మార్కెట్ ఆదాయాన్ని పెంచడానకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. రాత్రింభవళ్లూ మార్కెట్ ఇన్‌గేట్, ఔట్ గేట్ వద్ద నిఘా పెంచాం.. మార్కెట్లో క్రయ విక్రయాలపై ఎప్పటికప్పుడు కార్యదర్శులు, సూపరవైజర్లు తనిఖీలు నిర్వహించి లావాదేవీల్లో పారదర్శకతతో మార్కెట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎగుమతి చేసే వాహనాల లోడ్ తూకాల క్రాస్ చెక్ చేస్తున్నాం. తూకాల్లో తేడా వస్తే మళ్లీ తూకాలు వేస్తున్నాం. ఆ తూకాల ఆధారంగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నాం. – వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి -
కొత్తపేట క్రికెట్‌కు 50 వసంతాలు
తూర్పుగోదావరి, కొత్తపేట: కొత్తపేటలో క్రికెట్ జట్టు ఏర్పడి, తొలిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. రిటైర్డ్ వీఆర్ఓ సలాది బ్రహ్మానందరావు (మునసబు బాబ్జి), రిటైర్డ్ పీఈటీ ముగ్గళ్ల గోపీనాథ్, సీడీ ప్రేమ్‌నాథ్ తదితరుల ఆధ్వర్యంలో మొదటి తరం క్రికెట్ జట్టు ఏర్పడింది. తద్వారా క్రికెట్ పోటీలు ప్రారంభమై, అంచెలంచెలుగా ఇక్కడ రూపుదిద్దుకున్న క్రీడా మైదానం క్రీడా పోటీలకు జిల్లా స్థాయిలోనే ప్రసిద్ధి గాంచింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం విశాలంగా ఉండేది. ఎత్తు పల్లాలు లేకుండా ఈ మైదానం పచ్చని తివాచీ పరిచినట్టుగా ఉండేది. అప్పట్లో ఈ గ్రౌండ్‌ను లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంతో పోల్చేవారు. ఆ బ్యాచ్ తరువాతి తరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ గౌస్, దేశవ్యాప్తంగా స్థిరపడిన విశ్రాంత ఉద్యోగులు, వివిధ హోదాల్లో ఉన్న చిర్రావూరి సత్యనారాయణ (ఐటీడీఏ అధికారి), ఉప్పులూరి కృష్ణమూర్తి (ఐఆర్ఎస్ అధికారి), విస్సాప్రగడ సూర్యనారాయణమూర్తి (సీఏ), దెందులూరి ప్రసాద్ (ఎస్బీఐ ఏజీఎం), కోటిపల్లి నటరాజ్ (రిటైర్డ్ హెచ్ఎంసీ అధికారి), భమిడిపాటి నరీన్ (రిటైర్డ్ హెచ్ఎం), భమిడిపాటి పాపయ్యశాస్త్రి (ఏబీఎం), భమిడిపాటి కొప్పయ్య (సైంటిస్ట్), కముజు సత్యనారాయణమూర్తి (వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి), విస్సాప్రగడ పేర్రాజు (ఏబీ బీఎం), బలుసు సాంబమూర్తి (ఖమ్మం భద్రాద్రి బ్యాంక్ ఎండీ), మిద్దే ఆదినారాయణ (టీడీపీ నాయకుడు) తదితరులు ఉండేవారు. మూడో తరం క్రీడాకారులు కూడా కొత్తపేటలో క్రికెట్ ఆటను కొనసాగించారు. దాంతో ఇక్కడ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. కాలక్రమేణా ఇక్కడి క్రికెట్ క్రీడాకారులు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట వలసలు పోయారు. మరికొందరు స్థానికంగా ఉన్నా యాంత్రిక జీవనంలో సమయం లేక ఈ ఆటకు దూరమయ్యారు. దాంతో ఇక్కడ క్రికెట్ క్రీడాకారుల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న వారు కూడా టీవీలు, సెల్ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు అతుక్కుపోతున్నారు. కొందరు యువకులు అప్పుడప్పుడూ ఆడుతూ, స్థానిక స్థాయిలోనే పోటీలు నిర్వహిస్తున్నారు. నేడు మూడు తరాల క్రీడాకారులు ఆత్మీయ కలయిక కొత్తపేటలో క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో నాటి మూడు తరాల క్రికెట్ క్రీడాకారులందరూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14న కొత్తపేటలో కలుసుకుంటున్నారు. ‘కొత్తపేట క్రికెట్ స్వర్ణోత్సవ వేడుకలు’ నాటి క్రీడాకారుల ‘ఆత్మీయ కలయిక’ పేరుతో సుమారు 100 మందిని సమీకరించనున్నట్టు పూర్వ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ గౌస్ ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చామని, కొత్తపేట క్రీడా మైదానాన్ని వేదికగా చేసుకుని కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించనున్నామని చెప్పారు.1983లో అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన కొత్తపేట టీమ్ ఫొటోను ప్రదర్శించనున్నామని గౌస్ తెలిపారు. -
చిన్న జీయర్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఆయన బుధవారం దిల్‌సుక్‌నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కట్టెల పందిరిపైకెక్కి ఆలయ శిఖరానికి ఆయన పూజలు నిర్వహిస్తుండగా.. బరువు తట్టుకోలేక ఆ పందిరి కొంతభాగం ఒక్కసారిగా కూలింది. దీంతో ఆయనతోపాటు ఉన్న ఇతర పూజారులు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యారు. పూజా సామాగ్రి, పళ్లాలు పైనుంచి పడిపోయాయి. అతికష్టం మీద ఈ ప్రమాదం నుంచి చిన్న జీయర్, ఇతర పూజారులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
శ్రీచైతన్యలో మరో విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేట శ్రీ చైతన్య మహిళా జూనియర్ కాలేజీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటీనా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చనిపోయింది. అర్చన స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. కాలేజీ డీన్ మమతా తిట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విద్యార్థి కుటుంబసభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
కొత్తపేటలో ఘనంగా ప్రభల తీర్థం
-
కానిస్టేబుల్స్ వర్సెస్ ఎస్‌హెచ్‌వో
24 గంటలు డ్యూటీలు వేస్తున్నారని కానిస్టేబుళ్ల మండిపాటు పనిచేయమంటే ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎస్‌హెచ్‌వో తెరవెనక మామూళ్ల వ్యవహారమే కీలకమని సమాచారం మెడికల్ లీవ్‌లో 9 మంది కానిస్టేబుళ్లు కొత్తపేట స్టేషన్లో తారస్థాయిలో వివాదం వివాదం నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం సాక్షి, గుంటూరు : గుంటూరు అర్బన్ జిల్లాలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో పని రగడ తారస్థాయికి చేరింది. కానిస్టేబుళ్ళు, సీఐల మధ్య గత 20 రోజులుగా అంతర్గతంగా సాగుతున్న రగడ నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పని పేరుతో సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు కానిస్టేబుల్ సీఐతో వాదనకు దిగి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అర్బన్ పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. వీరి మధ్య మామూళ్లకు సంబంధించి భేదాభిప్రాయాలు ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. తొలుత వాగ్వివాదం.. ఆపై ఆత్మహత్యాయత్నం... గురువారం ఉదయం కొత్తపేటలో పనిచేసే కానిస్టేబుల్ వెంకటేష్ సీఐతో తొలుత వాగ్వివాదానికి దిగాడు. డ్యూటీల పేరుతో తనను అసభ్య పదజాలంతో తిట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఐని తీవ్రస్థాయిలో అరిచి వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ త్రిపాఠీ.. అదనపు ఎస్పీ భాస్కరరావును విచారణ అధికారిగా నియమించారు. కమర్షియల్ స్టేషన్... ఈ పోలీస్‌స్టేషన్ అత్యధిక ఆదాయ వనరులున్నదిగా పేరుంది. సినిమా హాల్ మొదలుకుని బార్ల వరకు అన్నీ ఈ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా ఉండటంతో దీనిని కమర్షియల్ స్టేషన్‌గా పోలీసులు పిలుస్తుంటారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం వరకు వీఆర్‌లో ఉన్న శ్రీకాంత్‌బాబు స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఎస్‌హెచ్‌వో, కానిస్టేబుల్ మధ్య చిన్న చిన్న విషయాల్లో మొదలైన రగడ రోజురోజుకూ పెరిగి మామూళ్ల వ్యవహారం వరకు వచ్చినట్లు తెలిసింది. సీఐ మామూళ్లన్నీ తానే తీసుకుంటున్నాడనేది కానిస్టేబుళ్ల ఆరోపణ. పైగా పనిపేరుతో నిత్యం వేధిస్తున్నాడని చెబుతున్నారు. ఉదయం 8.30 గంటలకు డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్‌ను డ్యూటీ ముగిశాక కూడా పంపించకుండా మరుసటి రోజు 8.30 వరకు చేయాలని తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తున్నాడనేది కానిస్టేబుళ్ల అభియోగం. ఆయన పనిపేరుతో దూషించడం వల్ల 9 మంది కానిస్టేబుళ్ళు సెలవులో వెళ్ళిపోయారని, ఓ ఎస్ఐ కూడా వెళ్ళిపోయారని చెబుతున్నారు. పని సక్రమంగా చేయమంటే.. ఆరోపణలు చేస్తున్నారు : సీఐ ఈ ఆరోపణలపై సీఐ శ్రీకాంత్‌బాబు మాట్లాడుతూ పని సక్రమంగా చేయమని చెప్పిన దానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేష్‌కి ఖైదీ నంబర్ 150 సినిమా విడుదల రోజు హాల్ వద్ద డ్యూటీ వేస్తే చేయకుండా మఫ్టీలో తిరుగుతున్నాడని, తాను గుర్తించి ప్రశ్నిస్తే ఇలా చేశాడని తెలిపారు. మామూళ్ల వ్యవహారం తనకేమీ తెలియదని, వచ్చి 20 రోజులే అయిందని చెప్పారు. -
కొత్తపేట జన్మభూమి కార్యక్రమం రసాభాస
-
ఫ్రెషర్స్ పార్టీ: రోడ్డెక్కి తన్నుకున్న విద్యార్థులు
-
ఫ్రెషర్స్ పార్టీ: రోడ్డెక్కి తన్నుకున్న విద్యార్థులు
హైదరాబాద్: సరదాగా జరుపుకోవాల్సిన వేడుకలో వాగ్వాదం మొదలైంది. అదికాస్తా కొట్లగామారి కొట్టుకునేస్థాయికి వెళ్లింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు రోడ్డుపైకెక్కి తన్నుకున్నారు. హైదరాబాద్ లో విస్మయం కలిగించిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కొత్తపేటలోని అవంతి పీజీ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు అదే ప్రాంతంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాలులో బుధవారం ఫ్రెషర్స్ డే వేడుక జరుపుకొన్నారు. పార్టీకి హాజరైన విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఏకంగా కొత్తపేట రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించారు. విద్యార్థుల కొట్లాట చూసి అక్కడున్నవారు విస్తుపోయారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను సైతం ఖాతరుచేయకుండా విద్యార్థులు గొడవను కొనసాగించారు. విద్యార్థులు మద్యం సేవించి గొడవపడినట్లు సమాచారం. పోలీసులు రంగప్రవేశం చేసిన చాలాసేపటికిగానీ వివాదం సర్దుమణగలేదు. అయితే గొడవ ఎందుకు, ఎలా జరిగిందనే విషయం తెలియాల్సిఉంది. అవంతి కాలేజీ యాజమాన్యం స్పందన కూడా తెలియాల్సి ఉంది. -
వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం
వన్‌టౌన్ : కొత్తపేట ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఆyì lకృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆషాడ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున స్వామికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలుత భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి.. అనంతరం పాలు, పన్నీరు, విబూది వంటి వివిధ రకాల కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మేళతాళాలు, భక్తుల నామస్మరణ మధ్య ఈ ప్రదర్శన వన్‌టౌన్ వీధుల మీదుగా సాగింది. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. -
వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం
వన్‌టౌన్ : కొత్తపేట ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఆyì lకృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆషాడ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున స్వామికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలుత భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి.. అనంతరం పాలు, పన్నీరు, విబూది వంటి వివిధ రకాల కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మేళతాళాలు, భక్తుల నామస్మరణ మధ్య ఈ ప్రదర్శన వన్‌టౌన్ వీధుల మీదుగా సాగింది. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. -
కొత్తపేటలో మొక్కలు నాటిన మంచు లక్ష్మి
-
కొత్తపేటలో బీటీ రోడ్ల నిర్మాణం
వన్‌టౌన్ : కొత్తపేటలోని పలు రోడ్లలో గురువారం నగర పాలక సంస్థ అధికారులు బీటీ రోడ్ల నిర్మాణం చేశారు. అందులో భాగంగా గణపతిరావురోడ్డులో గురువారం రాత్రి నుంచి పనులు నిర్వహించారు. బాబురాజేంద్రప్రసాద్రోడ్డులో ఇటీవల బీటీ రోడ్డు వేసిన అధికారులు దానిని అనుకొని ఉన్న గణపతిరావురోడ్డులో కూడా కింగ్హోటల్ సెంటర్ నుంచి నెహ్రూబొమ్మ సెంటర్ వరకూ గురువారం రాత్రి నుంచి పనులు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పది గంటల వరకూ పనులను నిర్వహించారు. గణపతిరావురోడ్డులో వాహనాలు రాకుండా బాబురాజేంద్రప్రసాద్ రోడ్డులోని రాయల్‌హోటల్ సెంటర్ నుంచి గులాంమొహిద్దీన్ వీధి, కోమల విలాస్ సెంటర్ కేటీరోడ్డు మీదుగా నెహ్రూబొమ్మ సెంటర్‌కు వాహనాలను మళ్లించారు. వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కోమలవిలాస్ సెంటర్లో వాహనాలు మలుపు తిప్పటానికి డ్రైవర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. -
గాలివాన బీభత్సానికి వాహనాలు ధ్వంసం
హైదరాబాద్: తీవ్రమైన ఎండ వేడిమి నుంచి ఆదివారం కురిసిన వర్షంతో రాజధాని నగరం కాస్త కుదుటపడినట్లయింది. అయితే గాలివాన బీభత్సానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. కొత్తపేట టెలిఫోన్ కాలనీలో ఈదురుగాలుల ధాటికి కారు బానెట్ ధ్వంసంకాగా, నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం సెంట్రింగ్ కూలి మరో ఐదు కార్లు, రెండు బైకులు, ఒక ఆటో చిత్తయ్యాయి. అదృష్టవశాత్తు నిర్మాణం కాకుండా కేవలం కర్రలు మాత్రమే పడిపోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. టెలిఫోన్ కాలనీ ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. -
ఈ పోలీసుస్టేషన్‌కు సొంత భవనమేదీ?
అద్దె భవనంలోనే కొత్తపేట పీఎస్ స్థల పరిశీలన అయినా కార్యరూపం దాల్చని వైనం చిట్టినగర్ : కొత్తపేట పోలీస్ స్టేషన్ సొంత భవనం కల ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టేషన్‌కు సొంత భవనం నిమిత్తం పలు దఫాలుగా స్థల పరిశీలన జరిగినా ఇంత వరకు స్టేషన్ నిర్మాణం కార్యాచరణలోకి రాకపోవడంతో అద్దె భవనంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నగరంలోని అత్యధిక కేసులు నమోదయ్యే స్టేషన్ల క్రమంలో కొత్తపేట పీఎస్‌కు ఏళ్ల తరబడి రికార్డు ఉంది. అయితే గతంలో కేసుల సంఖ్య, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వం అద్దె భవనాలలో ఉన్న పీఎస్‌లకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తపేట స్టేషన్ పరిధి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండటంతోపాటు జక్కంపూడి వైఎస్సార్ కాలనీ నిర్మాణం, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పేదలను కాలనీకి తరలించడంతో కాలనీలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం తథ్యమని పోలీసులు భావించారు. పలు దఫాలుగా స్థల పరిశీలన వైఎస్సార్ కాలనీతోపాటు పాలప్రాజెక్టు క్వార్టర్స్ స్థలాన్ని స్టేషన్ నిర్మాణం కోసం పోలీసు ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేసినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్ల కిందట అప్పటి పోలీసు శాఖ కార్యదర్శి డీపీ దాస్, అప్పటి నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో కాలనీలో పీఎస్ భవన నిర్మాణానికి అవసర మైన స్థలాన్ని ఇచ్చేందకు కార్పొరేషన్ ముందుకు రాగా ప్రస్తుతం భవన నిర్మాణానికి 750 గజాల స్థలం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు భవన నిర్మాణ తధ్యమని భావించారు. అయితే గతంలో నిధులు విడుదల కాగా స్థలాన్ని గుర్తించడంలో ఆలస్యం కావడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. ఈ దఫా స్థల పరిశీలన అయినా భవన నిర్మాణం మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. దశాబ్దాలుగా.. ప్రస్తుతం కొత్తపేట వాగు సెంటర్లోని ఓ అద్దె భవనంలో పోలీస్ స్టేషన్‌ను నిర్వహిస్తుండగా నిర్వహణ కింద భారీగానే ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి క్రైం విభాగం ఎత్తి వేసినప్పటికీ ఎస్.ఐలు అందరూ ఒకే గదిలో కేసులను విచారిస్తుండటంతో వాటి పురోగతిపై ఏ మేరకు ముందుకు సాగుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కాఫీ హోటల్ యజమాని హత్య?
కొత్తపేట : కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలోని ఓ కాఫీ హోటల్ యజమాని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. హతుడు సూరవరపు పట్టాభిరామారావు అలియాస్ రాంబాబు (55) తల ఎడమ వైపు, చెవి, చేతిపై కత్తిగాట్లు ఉండడంతో గుర్తుతెలియన వ్యక్తులు హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. మండల పరిధిలోని బిళ్లకుర్రు శివారు యెలిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన రాంబాబు అన్నదమ్ములు ఆరుగురు. వీరంతా ఉమ్మడిగా కండ్రిగ రేవులో కాఫీ హోటల్ నిర్వహించేవారు. పెద్ద సోదరుడు అప్పారావు హోటల్ వదిలి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నాలుగో సోదరుడైన రాంబాబు ఏడాదిన్నర క్రితం ఉమ్మడి హోటల్‌కు సమీపంలోనే తన వాటాగా వచ్చిన స్థలంలో భవనం నిర్మించుకుని హోటల్ నిర్వహిస్తున్నాడు. మిగిలిన నలుగురు సోదరులు ఉమ్మడిగా హోటల్, పాలకోవా తయారీ వ్యాపారం చేసుకుంటున్నారు. హతుడు రాంబాబుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆరు నెలల క్రితం కుమారుడు సుబ్బారావు (సురేష్)కు వివాహమైంది. నెలరోజుల తరువాత తండ్రితో విభేదించి, తన పెదనాన్న వద్ద పనిచేస్తున్నాడు. రాంబాబు మరో మహిళను కూలికి పెట్టుకుని హోటల్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి హోటల్ మూసేసి అక్కడే అరుగుపై పడుకున్నాడు. శుక్రవారం ఉదయం పేపర్‌బోయ్, పాల బోయ్ వచ్చి లేపగా లేవకపోవడంతో వారు అతడి సోదరులకు సమాచారమిచ్చారు. అతడి సోదరుడు ధర్మారావు, కుమారుడు వచ్చి చూడగా.. తలకు గాయమై రక్తం కారడాన్ని గమనించారు. వెంటనే ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకువచ్చి పరీక్షించగా చనిపోయినట్టు నిర్ధారించారు. పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్య, రావులపాలెం సీఐ పీవీ రమణ, ఎస్సై డి.విజయకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, హోటల్ పరిసరాలను పరిశీలించారు. మృతదేహం ముఖంపై నీళ్లు కొట్టినట్టు, రెండు గదుల తలుపులకు వేసిన తాళాలు పగలకొట్టినట్టు గుర్తించారు. సోదరులను, స్థానికులను విచారించారు. హతుడికి ఎవరితోనూ విభేదాలు లేవని స్థానికులు తెలిపారు. హతుడు సోదరుడు ధర్మారావు ఫిర్యాదు మేరకు 302,457 సెక్షన్ల కింద పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి విజయకుమార్ తెలిపారు. డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ రమణ దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.
-
చంటి బిడ్డతో కాలువలో దూకిన తల్లి
కొత్తపేట (తూర్పుగోదావరి జిల్లా) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన 11 నెలల చంటిబిడ్డతో కాలువలోకి దూకింది. కొత్తపేట మండలానికి చెందిన నక్క వెంకటరమణ (20) అనే మహిళ శనివారం రాత్రి తన 11 నెలల బిడ్డతో సహా బొబ్బర్లంక-అమలాపురం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం పలివెల వంతెన వద్ద వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తింటి వారి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వెంకట రమణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎస్ లో యువకుని ఆత్మహత్యాయత్నం
కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా) : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తప్పుడు కేసులు నమోదు చేసి పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మొడిపర్రు గ్రామానికి చెందిన రామకృష్ణ(25) శనివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతణ్ణి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి వెళ్లి రామకృష్ణను పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వినాయక మండపాన్ని కూల్చేసిన పోలీసులు
-
గులాబి@400, చామంతి@500
హైదరాబాద్ : రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూలు, పూజ సామాగ్రి కొనుగోళ్లలో మహిళలు మునిగిపోయారు. దీంతో పూల మార్కెట్ల వద్ద రద్దీ ఎక్కువైంది. ఇదే అదనుగా భావించిన పూల విక్రయదారులు పూల రేట్లను అమాంతం పెంచేశారు. గురువారం సాయంత్రం దిల్సుఖ్నగర్ కొత్తపేటలోని పూల మార్కెట్లో బంతిపూలు కిలో రూ.100కు , గులాబి కిలో రూ.400లు, చామంతి పూలు కిలో రూ.500లు పలుకుతుండటంతో మహిళలు అవాక్కవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 50-60 రూపాయలు ఉన్న బంతిపూలు రూ.100కు కూడా లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం..
-
ఈ గడ్డ కరెంటు ఈ గడ్డకే
కొత్తపేట: సీమాంధ్రలో ఉత్పత్తి అయిన విద్యుత్ అంతా ఈ ప్రాంతానికే దక్కాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఈపీడీసీఎల్ యూనిట్ చైర్మన్ వీఎస్ఆర్కే గణపతి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపేటలో ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎల్ఐ, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిద్దే సత్యనారాయణమూర్తి ఇంట ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లో విద్యుత్ రంగానికి సంబంధించి కీలక అంశం చోటుచేసుకుందన్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను భౌగోళికంగా విభజించినా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాల పంపిణీ సంస్థలకు ఇప్పటి మాదిరిగానే వర్తిస్తాయని ప్రభుత్వం గత నెల 8న జీఓ-20 జారీ చేయడం శోచనీయమన్నారు. ఈ విధానాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 60.5 శాతం కాగా.. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 46.11 శాతం మాత్రమే కేటాయించడం, తెలంగాణ లో ఉత్పాదక సామర్థ్యం 39.5 శాతం కాగా ఆ రాష్ట్రానికి 53.89 శాతం కేటాయించడం దుర్మార్గమన్నారు. సీమాంధ్ర ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తక్షణమే స్పందించి ఈ జీవోను రద్దు చేయించి, సీమాంధ్రలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఈ ప్రాంతానికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సీమాంధ్రులకు జరగబోతున్న అన్యాయాన్ని వినియోగదారుల సంఘాలు, పారిశ్రామిక, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ అవసరాలు తీరాకే మిగిలిన విద్యుత్‌ను మాత్రమే తెలంగాణ కు ఇవ్వాలన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
నగరంలో కొత్తపేటలో గురువారం ఉదయం ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దాంతో ఆ జంట పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ జంటను వైద్య సహాయం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరువురి కుటుంబాలలోని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా వారు ఆ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.