The Krishna River
-
శ్రీశైలంలో 102.8 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
-1.59లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో -11,320 క్యూసెక్కులు ఔట్ ఫ్లో -హంద్రీనీవా, పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసిన ఏపీ సాక్షి, హైదరాబాద్ రెండేళ్ల తర్వాత కృష్ణా నది వరదల కారణంగా శ్రీశైలం నిటి నిల్వ తొలిసారి వంద మార్కును దాటింది. ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాల కారణంగా శ్రీశైలంలోకి ఈ ఏడాది ప్రస్తుతం వరకు 91 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం 102.8 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 1.59క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతుండటంతో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం వాస్తవ నిల్వ సామర్ధ్యం 215.8టీఎంసీలు కాగా గత ఏడాది ఇదే సమయానికి కేవలం 30.40 అడుగుల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 72 టీఎంసీల మేర అదనపు నీరుండటం తెలుగు రాష్ట్రాలకు ఊరటనిచ్చేదే. ఎగువ కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రవాహాలు మాత్రం స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఆల్మట్టిలోకి 1.76లక్షల కక్యూసెక్కుల వరద వస్తుండగా 1.28లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులున్నారు. నిరాయణపూర్కు సైతం 1.69లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం సైతం జూరాలకు 1,50,537 క్యూసెక్కుల ప్రవాహాం కొనసాగడంతో 1.32లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలంలోకి మొత్తంగా 1.59లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నీటి మట్టం 859 అడుగులకు చేరింది. భారీగా నీరు రావడంతో పవర్‌హౌస్ ద్వారా 11,320 టీఎంసీల నీటిని, హంద్రీనీవా అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ 1352 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు కాల్వల ద్వారా 2,570 క్యూసెక్కుల నీటిని తరలించుకుంటోంది. పవర్ హౌస్ ద్వారా వదిలిన నీటిలో 10,983 క్యూసెక్కుల మేర నీరు నాగార్జునసాగర్‌లోకి వస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు జూరాలకు 97.61టీఎంసీలు, శ్రీశైలానికి 87.76టీఎంసీలు, సాగర్‌కు 10.02 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ లెక్కన మొత్తంగా 195.39 టీఎంసీల మేర నీరు కృష్ణాలో ఈ ఏడాది లభించినట్లయింది. ఎగువ కర్ణాటకలో మాత్రం ఏకంగా 400 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. -
కృష్ణమ్మ వెలవెల..గోదారి కళకళ
రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన గోదావరినది కళకళాడుతుండగా కృష్ణా నది వెలవెలబోతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడు కావటంతో గోదావరి, ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నిజామాబాద్ మొదలుకొని భద్రాచలం వరకు ఇదే ఒరవడి. కాగా, ఎగువ నుంచి వచ్చే వరదే ప్రధాన వనరుగా ఉన్న కృష్ణా నది నీరు లేక కళ తప్పింది. కర్ణాటక లోని ప్రాజెక్టులు నిండితేనే రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుంది. ఇప్పటి వరకు ఆ జాడలే లేకపోవటంతో నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం డెడ్‌స్టోరేజి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోడెడ్డ్ స్టోరేజీ 510 కంటే కూడా తక్కువగా.. 504 అడుగుల నీరు మాత్రమే ఉంది. -
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఉండవల్లి కరకట్టకు సమీపంలో నదిలో ఈత కొడుతుండగా.... అదే సమయంలో నదిలో అక్రమంగా నిలిపి ఉంచిన 50 టన్నుల బరువైన బోటు భారీ గాలివానకు తాడు తెగి అతడిపైకి వెళ్లింది. దీంతో ఆ యువకుడు నదిలో గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాఖకు పోల‘వరమే’
ఎడమ కాలువతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు సత్యనారాయణ దేవరాపల్లి: పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయి నీరు వస్తే విశాఖపట్నం తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు ఎస్. సత్యనారాయణ తెలిపారు. రైవాడ జలాశయం అతిథి గృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ పనులు త్వరగతిన పూర్తి చేసేందుకు రైతులు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రైవాడ సమస్యకు పరిష్కారం: పోలవరం నీరు విశాఖకు వస్తే అప్పుడు రైవాడ నీరు రైతులకు అంకితం చేసే అవకాశం ఉంటుందన్నారు. రైవాడ నీటిని రైతులకు అంకితమిస్తే అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉందన్నారు. పోలవరం జిల్లాకు వచ్చేలోగా అదనపు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేసేందుకు కాలువుల నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలన్నారు. ఎత్తిపోతల పథకం మేలు కృష్ణా నదిపై నిర్మించిన పట్టిసీమ మాదిరిగా పురుషోత్తమపురం వద్ద ఎడమ వైపు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేస్తే విశాఖపట్నానికి త్వరితగతిన నీరు వస్తుందని, దీని సాధనకు రైతులు, ప్రజా ప్రతినిధులు పోరాటం చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఎడమ కాలువ 2017 జూన్ నాటికి పూర్తవుతుందన్నారు. పోలవరం కాలువను పొడిగించి విశాఖపట్నం దాటిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చన్నారు. విశాఖపట్నలో 3 లక్షల ఎకరాలకు సాగు నీటి కష్టాలకు మోక్షం లభిస్తుందన్నారు. -
దేవుడా...!
అందివస్తారనుకుంటే అందకుండానే పోయారా...పదహారు సంవత్సరాలు కళ్లల్లో పెట్టుకుని పెంచుకుంటే గేదెల కోసం వెళ్లి గల్లంతయ్యారా..దేవుడా ఎందుకింత కష్టం తెచ్చిపెట్టావు...ఇప్పుడు ఎవరిని చూసుకుని బతకాలి... ఏం పాపం చేశామని ఇంత శిక్ష వేశావు... అంటూ ఆ రెండు కుంటుంబాలు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడి పెట్టించింది. స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు కావడం ఆ రెండు ఇళ్లల్లో విషాదాన్ని నింపింది. - కృష్ణా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు - రెండు కుటుంబాల్లో విషాదం అమరావతి: మండల కేంద్రం అమరావతి బండచేను కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు అదివారం సాయంత్రం కృష్ణానదిలో మునిగి గల్లంతయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఓపెన్ టెన్త్ చదువుతున్న నాగుల్‌మీరా, అతని స్నేహితుడు వి. సూర్యవంశీతో పాటు అదేకాలనీకి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్ననాగుల్మీరా, ఇంటర్మీడియెట్ చదువుతున్న మరో స్నేహితుడు వీరేంద్రతో కలసి తప్పిపోయిన గేదెలను వెతికే క్రమంలో వైకుంఠపురం డొంకలోని పాత ఇసుకరేవుకు చేరుకున్నారు. ఈ సమయంలో వీరేంద్ర, తొమ్మిదవ తరగతి చదువుతున్న నాగుల్‌మీరా నది ఒడ్డున గేదెలను వెతుకుతుండగా సూర్యవంశి, నాగుల్‌మీరా స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నదిలో మునిగి గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వచ్చి తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించటంతో గ్రామస్తులు, పోలీసుల సహాయంతో సుమారు రెండు మూడు గంటల పాటు గజ ఈతగాళ్లు నదిలో గాలించినా జాడ కానరాలేదు. పదహారు సంవత్సరాలు పెంచిన కుమారులు గల్లంతయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నది ఒడ్డుకు చేరుకుని బోరున విలపించటం గ్రామస్తులను కలచివేసింది. వచ్చేనెలలో జరిగే ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు నదిలో గల్లంతుకావటంతో బంధువులు కంటతడి పెట్టారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకపోవటంతో సోమవారం మరో మారుగాలింపు చర్యలు చేపడతామని ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు.