Large
-
XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది?
ఎవరైనా షర్ట్ లేదా టీ-షర్ట్‌ను కొనుగోలు చేయడానికి వస్త్ర దుకాణానికి వెళ్లినప్పుడు షర్టు నాణ్యత, రంగుతో పాటు కావాల్సిన సైజును ఎన్నుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మన సైజుకు సరిపడే షర్ట్ అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు ఆ సైజు షర్ట్ కోసం మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే షర్ట్‌పై సైజులకు సంబంధించి XL లేదా XXL అని రాసివుండటాన్ని మీరు గమనించే ఉంటారు. దీనిలో X అనేది ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా XL(ఎక్స్ట్రా లార్జ్) సైజు షర్టు ఛాతీ కొలత 42 నుంచి 44 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 36 నుంచి 38 అంగుళాలు ఉంటుంది. ఇకముందు మీరు షర్ట్ కొనడానికి వెళ్లినపుడు మీ కావలసిన సైజు ఎంతనేది తెలియనప్పుడు మీ ఛాతీ, నడుము సైజును కొలవండి. అప్పుడు మీకు కావాలసిన షర్టు సైజు ఎంతో తెలుస్తుంది. ఇక XXL విషయానికొస్తే ఇది ఎక్స్ట్రా లార్జ్ కన్నా పెద్ద సైజు కలిగినది. ఈ సైజు షర్ట్ లేదా టీ- షర్ట్ ఛాతీ కొలత 44 నుంచి 46 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 38 నుంచి 40 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ పరిమాణం కొద్దిగా లావుగా ఉన్నవారికి సరిపోతుంది. ఎవరైనా తమ శరీర బరువు పెరిగినప్పుడు XXL సైజు దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు? -
తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది. ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు. ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది? -
దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఈ పేరుతో రాష్ట్రం ఉండేదని తెలుసా?
భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి సారధ్యంలో పరిపాలన కొనసాగుతుంది. రాజ్యాంగంలో జిల్లాలను నిర్ణయించే వ్యవస్థ కూడా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో అవసరాన్ని అనుసరించి జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జిల్లాల సంఖ్యను పెంచుతుంది. అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద జిల్లా గురించి మీకు తెలుసా? నాటి రోజుల్లో ఆ జిల్లా పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిల్లాలో సగభాగం ఎడారి భారతదేశంలోని అతిపెద్ద జిల్లా పేరు కచ్. ఇది గుజరాత్లో ఉంది. విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద జిల్లాగా పేరొందింది. గుజరాత్‌లోని ఈ జిల్లా మొత్తం వైశాల్యం 45,674 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని 23.7 శాతం భూభాగంలో విస్తరించివుంది. ఈ జిల్లాలోని సగానికి పైగా ప్రాంతం ఎడారితో నిండి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ జిల్లా పేరుతో రాష్ట్రం ఒకప్పుడు భారతదేశంలో కచ్ పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఇది 1950లో ఏర్పాటయ్యింది. 1956 నవంబర్ ఒకటిన ముంబై రాష్ట్రంలో విలీనమయ్యింది. మరాఠీ, గుజరాతీ ప్రజలు అప్పట్లో కచ్‌లో నివసించేవారు. మార్వాడీలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. 1960లో ముంబై రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు. దీంతో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్. ఈ నేపథ్యంలో కచ్ జిల్లా గుజరాత్లో చేరింది. 2001 జనవరి 26న కచ్‌లో సంభవించిన భూకంపం ఆ జిల్లాను అతలాకుతలం చేసింది. ఇది కూడా చదవండి: ‘హిప్పీలు’ ఇస్కాన్ అనుచరులుగా ఎలా మారారు? -
బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు
ముంబై: భారత్‌లో బడా కార్పొరేట్లను ఎప్పటికీ బ్యాంకింగ్ వ్యాపారంలోకి అనుమతించొద్దని వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘుల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల జాతీయీకరణకు ముందు అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకుందంటూ.. బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లను అనుమతించి అవే తప్పులను పునరావృతం కానీయవద్దన్నారు. రెండేళ్ల క్రితం ఆర్బీఐ చర్చా పత్రం కార్పొరేట్లను బ్యాంకుల్లోకి అనుమతించడాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు కార్పొరేట్ సంస్థలు అయితే నిధులు సమీకరించే సత్తా ఉంటుందని, అది దేశ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వాఘుల్ ఈ విధంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి రావాలని వాఘుల్ అన్నారు. ప్రొఫెషనల్‌గా నడిచే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే కావాలన్నారు. వచ్చే దశాబ్దంలో అంతా డిజిటల్ బ్యాంకింగ్ హవాయేనంటూ, అంతా ఫిన్‌టెక్ ఆధారితంగా ఉండొచ్చన్నారు. ప్రాంతీయ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదన్న ప్రధాని మాటలను గుర్తు చేశారు. కనుక ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం ముందుకే వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో నిపుణులైన బోర్డుల ఆధ్వర్యంలో బ్యాంకులు నడిచే అవకాశం ఉంటుందన్నారు. వాఘుల్ గతంలో ఐసీఐసీఐ బ్యాంకింగ్‌కు సారథ్యం వహించడం గమనార్హం. ఇదీ చదవండి: లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్ -
కార్యాలయాలకు కేరాఫ్ హైదరాబాద్! ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్
పెద్ద కార్యాలయాలకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ల లావాదేవీల జాబితాలో హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాలు టాప్‌లో ఉన్నాయి. ఇదీ చదవండి: కరూర్ వైశ్యా బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా.. మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 1 లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో లావాదేవీలు హైదరాబాద్, పుణేలలో 53 శాతం జరిగాయి. బెంగళూరులో ఈ లావాదేవీలు 51 శాతంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇక 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ల లావాదేవీలు కోల్‌కతాలో 70 శాతం, చెన్నైలో 57 శాతం జరిగాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలలో 50వేల నుంచి 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలకు ఈ విభాగంలో 30 శాతానికి పైగా లావాదేవీలు జరిగాయి. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! 2022లో ఆఫీస్ లీజింగ్ పరిమాణం 51 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు 2023లో మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి బెంగళూరులో 36 ఒప్పందాలు, హైదరాబాద్‌లో 15 డీల్స్, పుణెలో 13 ఒప్పందాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ నగరాల్లోని ఐటీ, తయారీ కంపెనీలు పెద్ద పరిమాణ కార్యాలయాలకు డిమాండ్‌ను పెంచాయని వివరించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
పెద్ద ఇళ్లు కావాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీ ర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు కొనసాగుతుండటంతో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా పెద్ద సైజు గృహ ప్రాజెక్ట్‌లనే నిర్మిస్తున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిం దని 99ఎకర్స్.కామ్ వెబ్‌పోర్టల్ సర్వేలో తేలింది. నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొం డాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. మణికొండ, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతా ల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శా తంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి. రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలకు పెరిగాయి. -
భారీ కొండచిలువను ఎత్తిన క్రేన్! వైరల్ వీడియో వెనుక కథేంటంటే..
FactCheck On Giant Phython Crane Video: ‘‘7కొండల్లో 32అడుగుల కొండచిలువ. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది’’.. అంటూ ఫేస్బుక్లో కొందరి అకౌంట్ల నుంచి ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అఫ్కోర్స్.. ఈ ప్రచారం ఫేక్ అని తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ ఎప్పుడు.. ఎందుకు అవుతుందో? అందులో ఎంత వాస్తవం ఉందనేది కనిపెట్టడమూ ఈమధ్య కాలంలో కొంచెం కష్టంగా మారిందనుకోండి. అసలు విషయంలోకి వెళ్తే.. భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజా వీడియో మాత్రం మన దేశంలోదే కాదన్న విషయం వెలుగు చూసింది. వీడియో ఇమేజ్ ద్వారా రివర్స్ చెక్ ఆప్షన్‌తో ఈ వీడియోకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించాం. అక్టోబర్ 12న ‘టమన్ పెండిడికన్’(tamanpendidikan) అనే వెబ్సైట్ ద్వారా ఈ వీడియో గురించి మొదటి పోస్ట్ పడింది. అయితే పోస్ట్‌లోని భాష ఆధారంగా ఆ వెబ్సైట్ ఇండోనేషియన్ వెబ్‌సైట్‌గా నిర్ధారణ అయ్యింది. అదేరోజు ఓ ఇండోనేషియన్ యూట్యూబ్ ఛానెల్లో కూడా అప్లోడ్ అయ్యింది. Whopper 100kg python caught in Dhanbad, Jharkhand ▪️The reptile, measuring 6.1m & weighing about 100kg, is one the largest & longest ever caught #Dhanbad #Jharkhand #India #Forest #Snakes pic.twitter.com/8TmNm9DREy — 🌎 Sarwar 🌐 (@ferozwala) October 16, 2021 ఆ తర్వాత ఇది ఇండోనేషియాకు చెందినది కాదని.. మలేషియాకు సంబంధించిన వీడియో అని ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ఈ భారీ కొండచిలువ చైనా-మయన్మార్ బార్డర్లో దొరికిందని, కాదు.. మేఘాలయాకు చెందినది అని, కాదు కాదు.. ఈ వీడియో జార్ఖండ్ ధన్‌బాద్(మనదేశం)లోనిదేనంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే కొన్ని హిందీ వెబ్సైట్లు ఇది అసలు మన దేశంలో కాదనే విషయాన్ని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిర్ధారణ చేశాయి. అసలు ఇంతకీ ఈ వీడియో కొత్తదేనా? లేదంటే పాతదా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఇలా భారీ పాములు కనిపించిన సందర్భాల్లో చంపిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ భారీ పామును ప్రాణాలతో ఉంచారా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు పరిరక్షణ సంఘాలవాళ్లు. ప్రస్తుతానికి ఈ వీడియో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్‌లతో ఇంటర్నెట్ను విపరీతంగా షేక్ చేస్తోంది. చదవండి: ఒకటి కాదు.. రెండు ప్రాణాలు కాపాడిన పోలీసాయన(VIRAL) -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్‌కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన కృష్ణానది నీటిమట్టం ...
– మట్టపల్లి ప్రమాదకరంగా కృష్ణానది నీటిమట్టం మట్టపల్లి (మఠంపల్లి) : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ భారీగా పెరగడంతో కృష్ణానది నీటి మట్టం గురువారం గణనీయంగా పెరిగి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో దేవస్థానం వద్ద గల ప్రహ్లాద ఘాట్ నీట మునిగిపోవడంతో భక్తుల పుణ్య స్నానాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలు, కృష్ణానది వరద నీటి ప్రవాహంతో దేవాలయానికివచ్చే భక్తుల తాకిడి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మూసీనది, గుంటూరు జిల్లాలోని నాగులేరు భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది దీంతో పులిచింతల ప్రాజెక్ట్ వద్ద రిజర్వాయర్ నీటి సామర్ధ్యాన్ని భారీగావస్తున్న వరద నీటితో 28 టీఎంసీలకుపైగా నీటి నిల్వచేశారు. దీంతో దేవస్థానంవద్ద భారీగా వరద నీరు పెరిగింది. అయితే గడిచిన 5 రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ మట్టపల్లిని సందర్శించి పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 30 టీఎంసీల నీటిని నిల్వచేసే అవకాశం ఉన్నందున బ్యాక్ వాటర్ పెరుగుతుందని మట్టపల్లి దేవస్థానంవద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేగాక మట్టపల్లి రేవు వద్ద ఉన్న బాలాజీ ఘాట్, హై లెవల్‌వంతెన ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామస్థులెవరు నదిలోకి వెళ్లరాదని తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేష్‌లు ఇప్పటికే గ్రామస్థులను అప్రమత్తం చేయగా ఆలయ ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈవో ఎంపి.లక్ష్మణరావులు దేవస్థానం వద్ద యాత్రీకులను నదిలోకివెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
నేడు కోదాడలో మెగా రక్తదాన శిబిరం
కోదాడ: రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం కోదాడలోని తిరుమల వైద్యశాలలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కె. శశీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. -
వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది. 146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు... కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు.