Legislative Assembly winter session
-
ప్రతిపక్షం.. పలాయనం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి పలాయన మంత్రం జపించారు. శాసన సభ సమావేశాలు ఒక్క రోజు కాదు.. 15 రోజులు నిర్వహించాలని మంగళవారం జరిగిన టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో చంద్రబాబు డిమాండ్ చేశారు. సభను ఒక్క రోజు నిర్వహించడం ప్రభుత్వ పలాయన వాదానికి నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని కబుర్లు చెప్పిన అదే టీడీపీ.. తొలిరోజే సభలో పలాయనవాదమంటే ఏమిటో చూపించింది. 15 రోజులు సభ నడపాలని అడిగిన చంద్రబాబే తొలిరోజు సభకు రాలేదు. మిగతా సభ్యులూ మధ్యలోనే వెళ్లిపోయారు. వాస్తవానికి శాసనసభను గురువారం ఒక్క రోజు నిర్వహించి.. డిసెంబర్లో పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తూ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించింది. గురువారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమవగానే ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేసి, బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశం తర్వాత సభ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ సమావేశానికి, ఆ తర్వాత సభకు కూడా హాజరుకాలేదు. మిగతా టీడీపీ సభ్యులు కూడా కొందరే వచ్చారు. ముందుగా ‘మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’ అనే అంశంపై స్పీకర్ చర్చ చేపట్టారు. చర్చ ప్రారంభమైన సమయంలో టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత కె.అచ్చెన్నాయుడు సహా ఐదారుగురు ప్రతిపక్ష సభ్యులే సభలో ఉన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్న సమయంలోనే అచ్చెన్నాయుడు వెళ్లిపోయారు. చర్చలో ప్రతిపక్షం తరఫున కె.భవాని మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు ఒకరి వెంట మరొకరు సభ నుంచి వెళ్లిపోయారు. సీఎం జగన్ మాట్లాడే సమయంలో టీడీపీ సీట్లన్నీ ఖాళీగా కన్పించాయి. సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్ చేసి.. తొలి రోజే పలాయనం చిత్తగించారని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. -
ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాన్ని వ్యూహత్మకంగా ఎదుర్కోవాలని, వాస్తవాల ఆధారంగానే సమాధానం చెప్పేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని నేతలు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలోని వైఎస్సార్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలి ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికీ వాస్తవాలతోనే అధికార పక్షం సమాధానమివ్వాలని, అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. వ్యవసాయం, వాహన మిత్ర, వైఎస్సార్ నవశకం, రాజధాని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% రిజర్వేషన్లు, మద్యం విధానం–ధరలు, స్పందన, ఇసుక సరఫరా, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, నాడు–నేడు, రైతు భరోసా, అవినీతి నిర్మూలన వంటి అంశాలు ఉభయ సభల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏయే అంశాలపై ఎవరు మాట్లాడాలనే దానిపైనా చర్చించారు. వాగ్ధాటి గల ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలించారు. అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 19వ తేదీ వరకూ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి? కార్యకలాపాలు ఏయే అంశాలపై ఉంటాయి? అనేది సమావేశాల ప్రారంభం రోజున జరిగే ఉభయ సభల బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశంలో నిర్ణయిస్తారు. 9న శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల ప్రారంభం రోజునే వైఎస్సార్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిసారి మాదిరిగానే సంప్రదాయికంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. బుధవారం వైఎస్సార్ఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి విప్‌లు సామినేని ఉదయభాను, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎం.జగన్మోహన్రావు, జోగి రమేష్, మల్లాది విష్ణు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. -
ఆరోపణలపై ఆగ్రహం
= హిరేమఠ్‌పై ‘హక్కుల’ తీర్మానం = రమేశ్‌పై ఆరోపణలకు ప్రతిఫలం = దర్వాప్తు నివేదిక త్వరగా ఇవ్వాలని కమిటీకి సూచిస్తానన్న స్పీకర్ = అసెంబ్లీలో రమేశ్ భావోద్వేగ ప్రసంగం = విమర్శించడానికి హిరేమఠ్ ఎవరంటూ ధ్వజం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : హుబ్లీకి చెందిన సమాజ పరివర్తన సముదాయం అధ్యక్షుడు, సామాజికవేత్త ఎస్ఆర్. హిరేమఠ్, మాజీ స్పీకర్, కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై చేసిన ఆరోపణల పట్ల శాసన సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో సోమవారం రమేశ్ కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తనను కళంకిత ఎమ్మెల్యే అని ఆయన ఆరోపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సత్యసత్యాలను కనుగొని నివేదిక సమర్పించడానికి సభా హక్కుల కమిటీకి నివేదించాలని తీర్మానించారు. త్వరగా దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీకి సూచిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం రమేశ్ కుమార్ తనపై హిరేమఠ్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. తనను రాజకీయంగా అంతమొందించాలనే కుట్రతో ఇలాంటి ఆరోపణలు చేయడం తనకు బాధను కలిగించిందని వాపోయారు. స్పీకర్ తమ రక్షణకు రావాలని, ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర జోక్యం చేసుకుని ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించడమే ఉత్తమమని పేర్కొనడంతో స్పీకర్ కూడా సమ్మతించారు. అంతకు ముందు రమేశ్ కుమార్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఎమ్మెల్యే కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. తనను కళంకితుడు అనడానికి హిరేమఠ్ గవర్నర్ లేదా ముఖ్యమంత్రి లేదా రాష్ట్రపతి కారని దెప్పి పొడిచారు. ఎన్నికల కమిషన్ కూడా కాదన్నారు. ఒక వేళ తాను కళంకితుడినై ఉంటే ప్రజలు ఈ సభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. రాష్ర్టంలోని ఏ కోర్టులోనూ తనపై కేసులు లేవని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే, తనపై ఆరోపణలు చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తనను సమాజం నుంచి బహిష్కరించాలని కూడా అన్నారని వాపోయారు.