legislative session
-
నేడు అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ బులెటిన్ విడుదల చేశారు. కాగా.. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి 3వ తేదీ (ఆదివారం) నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. హరితహారంపై సీఎం సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక అధికారులు భూపాల్‌రెడ్డి, శాంతికుమారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు. -
దిగ్విజయ్ సింగ్ కీలక భేటీ
-
దిగ్విజయ్ సింగ్ కీలక భేటీ
హైదరాబాద్: రానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ గురువారం సమావేశమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కుంతియా అసెంబ్లీ కమిటీ హాల్లో పార్టీనేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమస్యలపై చర్చిస్తున్నారు. దీంతోపాటు నేతల మధ్య లోపించిన సమన్వయం, జానా మెతక వైఖరి వంటి అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. సాయంత్రం వరకు సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, తదతదిరులు హాజరయ్యారు. -
ఉచితంగా ఇళ్లు ఇవ్వకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని, త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం నగరంలో మిల్లు కార్మికులు, వారి వారసులు ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. గిర్నీ కామ్‌గార్ కర్మచారి కల్యాణ్‌కారి సంఘ్, గిర్నీ కామ్‌గార్ సేనా, గిర్నీ కామ్‌గార్ ఏక్జూట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం దాదర్‌లోని వీర్ కోత్వాల్ ఉద్యాన్ నుంచి మొదలైన ఈ ర్యాలీ కాంగ్రెస్ కార్యాలయమైన తిలక్భవన్ వరకు సాగింది. ఇందులో సుమారు వేయిమందికిపైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సాయంత్రం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో ఉచితంగా ఇళ్లు ఇచ్చేలా తీర్మానాన్ని చేయాలని, లేని పక్షంలో మిల్లు కార్మికులు అత్యధికంగా ఉంటున్న 11జిల్లాల్లోని ప్రజలు, వారి బంధువులు సెప్టెంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు. గత అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల సమస్యపై పోరాడుతున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడైన తమ సమస్యను పరిగణనలోకి తీసుకొని మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో 11 జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లో ఉంటున్న కార్మికులు, వారి వారసులు, బంధువులు ఓటు హక్కును వినియోగించుకోరని హెచ్చరించారు.