lesainsu
-
కొత్త బార్ పాలసీ రెడీ
నిబంధనలు సిద్ధం చేసిన ఎకై ్సజ్ శాఖ పాతవారికే బార్లు మున్సిపాలిటీలో కొత్తబార్లు వచ్చే అవకాశం తిరుపతి క్రైం: ఎకై ్సజ్ శాఖ ఎట్టకేలకు నూతన బార్ పాలసీ సిద్ధం చేసింది. పాత బార్ యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ దృష్ట్యా బార్లను పాతవారికే ఇవ్వాలని నిర్ణరుుంచి, కొత్త నిబంధనలు తయారు చేశారు. మున్సిపాలిటీల్లో కొత్తబార్లు జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నారుు. నూతన బార్ పాలసీ వల్ల వీటిలో 7 నుంచి 10 వరకు బార్లు పెరగనున్నారుు. కొత్త వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం జిల్లాలో చిత్తూరు, తిరుపతి పరిధిలో 27 బార్లు ఉన్నారుు. కొత్త నిబంధనలకు అనుగుణంగా బార్ లెసైన్‌సలను జారీ చేయాలని నిర్ణరుుంచారు. లెసైన్‌సలు తీసుకోవడానికి ఇష్టపడిన వ్యాపారుల స్థానంలో కొత్తవారికి లాటరీ పద్ధతిలో బార్లు కేటారుుస్తారు. బార్ విస్తీర్ణం 150 నుంచి 200 చదరపు మీటర్లకు పెంచారు. ఆపై పెరిగే ప్రతి 100 చ.మీటర్ల విస్తీర్ణానికి లెసైన్‌స ఫీజులో 10శాతం అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం బార్ యజమానులు కాలపరిమితి వరకు రూ.35 లక్షలు చెల్లిస్తున్నారు. వినియోగదారులు అడిగితే సీసాలు ఓపెన్ చేయకుండా ఇవ్వాలి. పార్కింగ్ స్థలం, కిచెన్ ఉండాలి. లెసైన్‌స ఫీజు లక్ష నుంచి 4 లక్షలకు పెంచనున్నారు. -
కాసుల వేట
జీహెచ్ఎంసీ పంచ ‘తంత్రం’ {sేడ్ లెసైన్సు ఫీజుల వసూళ్ల లక్ష్యం రూ. 100 కోట్లు పూర్తి యంత్రాంగంతో త్వరలో స్పెషల్ డ్రైవ్ {sేడ్ లెసైన్సు లేని దుకాణాలకు లెసైన్సులు లెసైన్సులున్న వారి నుంచి ఫీజు వసూలు లెసైన్సు పరిధిలోకి కొత్త సంస్థలు అవసరాన్ని బట్టి చట్ట సవరణ {పత్యేక కార్యాచరణకు జీహెచ్ఎంసీ సన్నద్ధం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిస్థితి ‘పనులు బోలెడు.. నిధులు జానెడు’.. అన్నట్లుగా మారింది. ఓవైపు ఎస్సార్డీపీ, 2బీహెచ్‌కే, రహదారుల నిర్మాణం కార్యక్రమాలకు వేల కోట్లు అవసరముతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ ఖజానా పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ. 500 డ్రా చేసుకోగా, మరో రెండునెలలు ఇలాగే కొనసాగితే సిబ్బంది వేతనాలకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో ఐదు రకాల పన్నుల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు పంచ‘తంత్రాన్ని’ అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొదట ట్రేడ్ లెసైన్సుల ఫీజులపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీలో ట్రేడ్ లెసైన్సుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలు 1,48,000 ఉండగా, వాటిలో 48వేల సంస్థలు కూడా ట్రేడ్ లెసైన్సు ఫీజులు చెల్లించడం లేదు. వీటి నుంచి ట్రేడ్ లెసైన్సు ఫీజు వసూలైతే జీహెచ్ఎంసీకి దాదాపు వంద కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరం రూ. 30 కోట్లు కూడా వసూలు కాకపోవడంతో సదరు వ్యాపార సంస్థలను జల్లెడ పట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు గాను సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దింపనున్నారు. ట్రేడ్ లెసైన్సు ఫీజులు చెల్లించని సంస్థలు.? లెసైన్సులు లేని వివరాలతో పాటు ఆయా సంస్థల ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. ట్రేడ్ లెసైన్సులు లేనివారిని లెసైన్సులు తీసుకునేలా, లై సెన్సుదారుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఆన్లైన్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించే విధానంపై వారికి అవగాన కల్పిస్తారు. ఇందుకుగాను త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అవసరమైతే చట్ట సవరణ ప్రతి వ్యాపార సంస్థ ఏటా ట్రేడ్ లెసైన్సు ఫీజు చెల్లించాల్సి ఉన్నా, జీహెచ్ఎంసీ నిబంధనలు, చట్టాల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించడం లేదు. వాటికి డిమాండ్ నోటీసులు జారీ చేసినా కోర్టుల కెక్కుతున్న నేపథ్యంలో అవసరాన్ని బట్టి చట్ట సవరణలు చేయాలని యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ అందుకు అనుమతించడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొబైల్ కంపెనీలు, వైన్స్ దుకాణాలు, హాస్టళ్లకు సంబందించి ట్రేడ్‌లెసైన్సు ఫీజుల వసూలు పై స్పష్టత లేక పోవడంతో వీటిపై స్పష్టత నిస్తూ జీవోలను సవరించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ సమావేశాల్లో ఆమోదించి, ప్రభుత్వానికి నివేదించి చట్ట సవరణ చేయనున్నారు. ప్రతిదీ తనిఖీ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని వ్యాపార సంస్థలను క్షుణ్నంగా తనిఖీ చేయడంతో పాటు ఇప్పటికే ట్రేడ్ లెసైన్సుల జాబితాలో నమోదై ఉన్నా సదరు సంస్థ మూతపడినా, ఆ వివరాల్నీ నమోదు చేయనున్నారు. కొత్తగా వచ్చిన వాటిని ట్రేడ్ పరిధిలోకి తెచ్చి లై సెన్సు ఫీజు వసూలు చేయనున్నారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఫీజుల పెంపు మాత్రం చేయరాదని భావిస్తున్నారు. -
ఫుల్లు కిక్కు!
గ్రేటర్ పరిధిలో 547కు చేరుకోనున్న బార్లు మినీ బ్రూవరీలకు అనుమతులు అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం గుడుంబా విక్రయాలకు చెక్ సిటీబ్యూరో:విశ్వ నగరంలో స్వచ్ఛమైన మంచినీరు, ట్రాఫిక్ ఇక్కట్లు లేని రహదారుల వంటి మౌలిక వసతుల సంగతేమోగానీ మందుబాబులకు మాత్రం ఫుల్లుగా కిక్కెక్కించేందుకు సర్కారు యథాశక్తి ప్రయత్నిస్తోంది. మహా నగర పరిధిలో ప్రధాన రహదారుల పక్కన వైన్ పార్లర్లు, మినీ బీర్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు... మాల్స్‌లో బార్లు... స్టార్, టూరిజం హోటళ్లలో ఎప్పుడంటే అప్పుడు మద్యం విక్రయాలకు గేట్లు బార్లా తెరిచింది. ఇటీవల నూతన బార్ లెసైన్సుల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కొత్తగా 38 బార్లు తెరచుకోనున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 509. కొత్తవాటితో కలిపి 547కు చేరుకోనుంది.అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన ఎక్సైజ్ పాలసీలో చౌక మద్యం అమ్మకాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుండడం గమనార్హం. 24 గంటలపై త్వరలో స్పష్టత నగరంలో 24 గంటల పాటు బార్లను తెరిచే అంశంపై మార్గదర్శకాలు విడుదలైన తరవాతే స్పష్టత రానున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటికే స్పెన్సర్స్, ఇనార్బిట్ మాల్, మెట్రో వంటి మాల్స్‌లోనూ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నూతన విధానంలో ప్రత్యేకంగా మాల్స్‌లో మద్యం విక్రయించేందుకు రంగం సిద్ధమైనట్లు వెల్లడించాయి. విదేశీ టూరిస్టులను విశేషంగా ఆకర్షించేందుకు బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం హోటళ్లలో 24 గంటలూ వైన్, మద్యం విక్రయానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాయి. అవసరం.. అవకాశాన్ని బట్టి తెల్లవారు ఝాము 3 నుంచి 6 గంటల వరకు స్వల్ప విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఐటీ, బల్క్‌డ్రగ్, ఫార్మా, బీపీఓ, కేపీఓ వంటి రంగాలతో పాటు పెట్టుబడులకు అనుకూలంగా నగరాన్ని తీర్చిదిద్దాలనేది సర్కారు యోచన. ఈ తరుణంలో విదేశీ టూరిస్టుల సంఖ్య బాగా పెరుగుతుందని.. వారిని ఆకర్షించేందుకే ఈ కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఎక్సైజ్ వర్గాలు చెబుతుండడం గమనార్హం. విక్రయ వే ళల పెంపు? ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకేతెరిచేందుకు అనుమతిస్తున్నారు. బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతిస్తున్నారు. నూతన విధానంలో ఈ వేళలను మరింత పెంచేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే లెసైన్సుడు మద్యం దుకాణాలకు ఆనుకొని సిట్టింగ్ రూమ్‌లకు అనుమతించిన విషయం విదితమే. మరోవైపు పేదల ఉసురు తీస్తున్న గుడుంబా స్థానంలో రూ.30కే చౌకమద్యం (చీప్‌లిక్కర్) సైతం ప్రభుత్వ లెసైన్సు పొందిన మద్యం దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయించింది. గుడుంబాకు చెక్ నగరంలోని గుడుంబా అడ్డాలపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. గుడుంబా విక్రయాలు జరిగితే ఎక్సైజ్ అధికారులతో పాటు, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్లను బాధ్యులుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సర్కారు తాజా నిర్ణయంతో ధూల్‌పేట్, పాతనగరంలోని గుడుంబా అడ్డాలపై ఎక్సైజ్, పోలీసుల దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దారి పొడవునా... బీర్ ప్లాంట్లు విరివిగా నెలకొల్పేందుకు వీలుగా మైక్రోబ్రూవరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 లక్షల రుసుముతో లెసైన్స్‌లు మంజూరు చేయాలని యోచిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు దానికి ఆనుకొని ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో వీటికి అనుమతించనున్నారు. దీంతో బీర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే
-
ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే..
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లోని 9,640 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల అధికారులు అద్దె బస్సుల్ని నడిపించినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎక్కువమంది ప్రయాణికులు ట్యాక్సీలు, ఆటోల్లోనే ప్రయాణించారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి సమ్మె ఆరంభమైన మొదటిరోజైన బుధవారం రూ.18 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడప జోన్లలో హెవీ లెసైన్సులున్న వారిని డ్రైవర్లుగానూ, పదోతరగతి పాసైనవారిని కండక్టర్లుగా తీసుకుని కొన్ని రూట్లలో అద్దె బస్సుల్ని నడిపారు. విశాఖ నగరంలో 270 హైర్ బస్సులను అధికారులు ఆపరేట్ చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. వందలాది బస్సులు నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఆర్టీసీ ఒక్కరోజులోనే రూ.70 లక్షల ఆదాయం కోల్పోయింది. విజయవాడ జోన్ పరిధిలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి రీజియన్లలో 3,050 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనూ 576 అద్దె బస్సులుండగా బుధవారం అతికష్టం మీద 170 బస్సులను నడిపారు. ఉదయం 10 గంటల నుంచి గుంటూరు డిపోలో నిరసన ప్రారంభించిన కార్మికసంఘ నాయకులను మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. నేటి నుంచి తిరుమలకు బస్సులు: ఆర్టీసీ సమ్మెతో వెంకన్న భక్తులు బుధవారం తీవ్ర అవస్థలు పడ్డారు. దూరప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకోగలిగినా తిరుమల బస్సులకోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. తిరుమల డిపోలో మొత్తం 110 బస్సులు ఉండగా సమ్మె కారణంగా బుధవారం 43 బస్సులే తిరిగాయి. సమ్మెతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఆయన వినతి మేరకు తిరుమల, తిరుపతి మధ్య నిరంతరాయంగా తిరుమల డిపోకు చెందిన బస్సులను గురువారం నుంచి నడిపేందుకు యూనియన్ నాయకులు హామీఇచ్చారు. ఎస్మా బెదిరింపులకు భయపడం సమ్మెను ఉధృతం చేస్తాం: టీ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న యాజమాన్యం బెదిరింపులకు భయపడబోమని తెలంగాణ ఆర్టీసీ కార్మిక యూనియన్ల జేఏసీ పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కె.పద్మాకర్, టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ సూపర్వైజర్స్ యూనియన్ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడారు. సమ్మెకు తెలంగాణ రైల్వే ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్ర సీ నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు కె.శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ మనుగడకే ప్రమాదం కార్మికులు విధుల్లో చేరాలి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికులను వేధించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆర్టీసీ చరిత్రలో కార్మికులకు 24 శాతానికి మించి ఫిట్మెంట్ ఇచ్చిన దాఖలా లేదని.. తాను సాహసించి ఈసారి 27 శాతానికి స్థిరీకరించేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపే ప్రయత్నాలను కొన్నిచోట్ల కార్మికులు అడ్డుకుంటున్నారని.. దానిని సహించబోమని, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గురువారం నుంచి అద్దె బస్సులు తిరుగుతాయని భరోసా ఇచ్చారు. ఏపీలో ఎంసెట్ పరీక్ష జరిగే ఎనిమిదో తేదీన అద్దె బస్సులన్నీ వారికి కేటాయిస్తామని తెలిపారు. అవసరమైతే ఎస్మా : ఏపీ మంత్రి శిద్ధా ఒంగోలు: ‘‘ఆర్టీసీ కార్మికులకు 27 శాతం ఫిట్‌మెంట్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 43 శాతం కావాలంటూ యూనియన్లు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్‌కమిటీని వేసింది. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు సబ్ కమిటీని సంప్రదించకుండానే సమ్మెకు దిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతోపాటు అవసరమైతే సమ్మెకు దిగిన వారిపై ఎస్మాను ప్రయోగించేందుకు వెనుకాడం’’ అని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయాలు సిద్ధం ఏపీ మంత్రి రావెల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరువేల సర్వీసులకుగాను 600 సర్వీసులే నడపగలిగామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రైల్వేశాఖ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. ప్రత్యేక రైళ్లు నడపడానికి, బోగీలు పెంచడానికి.. రైల్వేశాఖ అంగీకరించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి : పొంగులేటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌చేశారు. ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూడడం తగదని, బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు బాబు బృందం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ టీయూసీ ఏపీ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి సరికాదు: తమ్మినేని కార్మికులను కాపాడుకుంటామని, ఉద్యోగులను కళ్లలో పెట్టి చూసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల నిర్భంద వైఖరితో వ్యవహరించడం దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగితే చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం నిర్భందాన్ని ప్రయోగించడం సరికాదని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలి: చాడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెను విరమింపచేయాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. బుధవారం ఈ మేరకు సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ సమ్మె విచ్ఛిన్నానికి, తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నించడం కార్మిక వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. బస్సులపై ఆధారపడి న ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సీఎం స్వయంగా జోక్యం చేసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫుల్‌గా మద్యం ఆదాయం...
వైన్‌షాపుల లెసైన్సుల ద్వారా రూ.22 కోట్లు పెరిగిన ఆదాయం షాపుల కేటాయింపుల ద్వారా రూ.224 కోట్లు.. సాక్షి, విజయవాడ : జిల్లాలో ఎక్సైజ్ శాఖకు మద్యం షాపుల కేటాయింపుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. గత వార్షిక లెసైన్సు ఫీజుతో పోలిస్తే ఈ ఎడాది అదనంగా రూ.22 కోట్లు ఆదాయం పెరిగింది. షాపుల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం పెరిగితే, దరఖాస్తుల విక్రయాల ద్వారా సుమారు రూ.10 కోట్లు ఆదాయం పెరిగింది. ఈ ఎడాది మద్యం పాలసీలో లెసైన్సు ఫీజు పట్టణాల్లోని షాపులకు పెంచడం వల్ల అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం మరికొంత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల ఎక్సైజ్ శాఖలో కాసులు కురిశాయి. జిల్లాలో 335 వైన్‌షాపులు, 167 బార్లు ఉన్నాయి. వీటిలో మొదటి ఎక్సైజ్ గెజిట్ ద్వారా డ్రా నిర్వహించి 282 షాపులు కేటాయించారు. ఈ షాపు లెసైన్స్ ఫీజుల ద్వారా రెండేళ్లకు కలిపి రూ.224 కోట్లు లభించాయి. మిగిలిన 53 షాపుల ద్వారా సుమారు రూ.20 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరో 165 బార్ల లెసైన్సులను రెన్యూవల్ చేశారు. రెండో గెజిట్ ద్వారా రూ.4కోట్లు రెండో గెజిట్ ద్వారా విజయవాడ డివిజన్లో ఖాళీగా ఉన్న 20 షాపులకు గానూ 10 షాపులను ఖరారు చేశారు. ఈ షాపుల ద్వారా సుమారు రూ.4కోట్లు సమకూరాయి. మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఖాళీగా మిగిలిన 33 షాపుల్లో 8 షాపులు కేటాయించారు. మూడో నోటిఫికేషన్ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. షాపుల శ్లాబ్ ఇలా.. = జిల్లాలో అత్యధికంగా నగర ప్రాంతాల్లో ఉన్న షాపులకు రూ.64 లక్షలు శ్లాబ్ ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. = మున్సిపాలిటీల్లో ఉన్న షాపులకు రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులు రూ.36 లక్షలు, రూ.32లక్షలు శ్లాబ్‌గా నిర్ణయించారు. = ఈ క్రమంలో రూ.64 లక్షల శ్లాబ్‌లో 55 షాపులు ఉన్నాయి. వాటిలో 46 షాపులు డ్రాలో వ్యాపారులు దక్కించుకున్నారు. = రూ.45 లక్షల శ్లాబ్‌లో 28 షాపులు ఉండగా వాటిలో 27 షాపులు, రూ.36లక్షల శ్లాబ్‌లో 122 షాపులు ఉండగా, 118 కేటాయించారు. రూ.32.5 లక్షల శ్లాబ్‌లో 130 షాపులు ఉండగా 108 షాపుల కేటాయింపు పూర్తయింది. = రూ.41 లక్షల శ్లాబ్‌లో 128 బార్లు ఉండగా వాటిలో 126 రెన్యూవల్స్ పూర్తయ్యాయి. రూ.64 లక్షల శ్లాబ్‌లో ఉన్న 39 బారుల రెన్యూవల్స్పూర్తి చేశారు. = 2012-14 వార్షిక లెసైన్స్ సంవత్సరంలో 335 షాపులకు గానూ 300 షాపులు మాత్రమే కేటాయించారు. మిగిలిన 35 షాపులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో రెండేళ్ల కాలపరిమితిలో ఉన్న లెసైన్సు ఫీజు ద్వారా రూ.212 కోట్లు ఆదాయం వచ్చింది. = ఈ ఎడాది ఆ మొత్తాన్ని మొదటి నోటిఫికేషన్ ద్వారానే అధిగమించారు. మొత్తం 335 షాపుల ద్వారా రెండేళ్లకు రూ.244 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అచనా వేశారు. దరఖాస్తుల ద్వారా రూ.9.90 కోట్లు... వైన్‌షాపుల కేటాయింపులకు సంబం ధించిన దరఖాస్తులను విక్రయించటం ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ప్రధానంగా ప్రతి దరఖాస్తుకు రూ.25 వేలు నాన్ రిఫండబుల్ మొత్తాన్ని రుసుముగా నిర్ణయించారు. దీంతో జిల్లాలో దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.9.90 కోట్లు ఆదాయం లభించింది. మొదటి నోటిఫికేషన్ ద్వారా సుమారు 4,800 దరఖాస్తులు విక్రయించారు. రెండో గెజిట్‌లో మొత్తం సింగిల్ దరఖాస్తులో కావడంతో ఎక్కువ విక్రయించలేదు. విజయవాడ డివిజన్లో రెండో గెజిట్ ద్వారా 20 షాపుల్లో 10 షాపులను సింగల్ దరఖాస్తులే వచ్చాయి. -
‘కిక్కు’ లక్కు కొందరికే...!
లాటరీ తీసిన ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి 349 మందికి లెసైన్సుల కేటాయింపు ముగిసిన దుకాణాల కేటాయింపు జూలై 1 నుంచి కొత్త పాలసీ అమలు తమ్ముళ్ల కనుసైగలో సిండికేట్ల ఏర్పాటు చిత్తూరు (అర్బన్): మద్యం అదృష్టం కొందరినే వరించింది. మద్యం దుకాణాల నిర్వహణ కోసం శనివారం నిర్వహించిన లాటరీలో 349 మందికి లెసైన్సులు వచ్చాయి. అన్ని సజావుగా సాగడంతో జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల కోసం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన లాటరీ డిప్‌ను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డీవీఎన్.ప్రసాద్, తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, శేషారావు టెండర్ల ఖరారు విధానాన్ని పర్యవేక్షించారు. 2014-15 సంవత్సరానికి చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 2112 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.25 వేలను ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలనే నిబంధన ఉండడంతో ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే రూ.5.20 కోట్ల ఆదాయం లభించింది. ఇక 2112 మంది దరఖాస్తులు వేసినప్పటికీ 349 మందినే అదృష్టం వరించింది. దీంతో మిగిలిన 1763 మందికి నిరాశ తప్పలేదు. ఎలాంటి కష్టం లేకుండా వీరి నుంచి ప్రభుత్వానికి రూ.4.40 కోట్ల ఆదాయం లభించడం విశేషం. సిండికేట్లలో టీడీపీ నేతలు మద్యం దుకాణాల టెండర్ల నిర్వహణ ప్రక్రియ పూర్తవడం తో జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. ఈ విధానంలో బాటిళ్లపై స్కాన్ అండ్ ట్రేస్ విధానం ఉండడంతో బెల్టు షాపుల్లో దొరికిన బాటిళ్ల ఆధారంగా దుకాణాల లెసైన్సులు రద్దు చేస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం వరకు లెసైన్సు ఫీజులు కూడా పెరిగాయి. ప్రభుత్వ విధివిధానాలు కచ్చితంగా అమలు చేస్తే దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు ఒక్క రూపాయి లాభం రాకపోగా చేతిలో ఉన్న డబ్బును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో దుకాణాలు కైవశం చేసుకున్న వ్యక్తులు సిండికేట్‌గా మారి ఎంఆర్పీకన్నా ఎక్కువకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు మద్యం సిండికేట్ నాయకులుగా ఏర్పాటై దుకాణాల నిర్వాహకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. వచ్చింది మా ప్రభుత్వమే మీకొచ్చిన ఢోకా ఏమీలేదంటూ టెండరుదార్లకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం ఏ రీతిన సాగుతుందో వేచి చూడాల్సి ఉంది. త్వరలో మరో నోటిఫికేషన్ మరోవైపు జిల్లాలోని 109 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడకపోవడంతో త్వరలోనే వీటికి నోటిఫికేషన్ జారీ కానుంది. పెరిగిన లెసైన్సు ఫీజుల వల్లే ఈ దుకాణాల కు దరఖాస్తులు పడలేదు. రెండోసారి ఇచ్చే నోటిఫికేషన్లో ఎవరూ ముందుకు రాకపోతే దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని బార్ల నిర్వాహకులు సైతం ఈ నెల 30లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. -
టపాకాయల తయారీ కేంద్రంలో పేలుడు
ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు భయంతో పరుగులు తీసిన ప్రజలు అగ్నిమాపక అధికారుల సాహసంతో అదుపులోకి వచ్చిన మంటలు చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: చిత్తూరు నడిబొడ్డున ఉన్న ఒక టపాకాయల తయారీ కేంద్రంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో కాపురముంటున్న కిశోర్ గాంధీరోడ్డులో లెసైన్సు కలిగిన టపాకాయల కేంద్రం నడుపుతున్నాడు. ఏడాదిగా అనధికారికంగా పలమనేరు రోడ్డులోని సొంత భవనంలో ఐదుగురు కూలీలను పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా టపాకాయలు తయారు చేసి, అమ్ముతున్నాడు. గురువారం ఖాజా(36), షబానా(28), సైదాని(40)తో నలుగురు కూలీలు టపాకాయల తయారీలో నిమగ్నమయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంట్లో నిల్వ ఉంచిన నల్లమందు వేడెక్కింది. కార్మికుని చేయి తగిలి చిన్నపాటి వస్తువు నల్లమందుపై పడడంతో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతోపాటు భవనం నుంచి పొగలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనంలో నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో అక్కడికి చేరుకుని గాయాలపాలైన ఖాజా, షబా నా, సైదానిని బయటకు తీసి అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు అగ్నిమాపక అధికారి ప్రవీణ్‌కుమార్, జిల్లా అగ్నిమాపక ఉప అధికారి శ్రీనివాసరావు సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని నీటిని స్ప్రే చేశారు. కొంతవరకు మంటలు అదుపులోకి రావడంతో లోనికెళ్లే ప్రయత్నం చేశారు. అయితే డ్రమ్ముల్లో నుంచి పేలుళ్లు ఆగకపోవడంతో గంటకు పైగా శ్రమించి కెమికల్ పౌడర్ స్ప్రే చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ పేలుడు సంభవించిన విషయం తెలియగానే చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, ఎప్పటి నుంచి ఇక్కడ టపాకాయలు త యారు చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భవనంలోని డ్రమ్ములు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో నల్లమందు నిల్వ ఉంచి టపాకాయలు, బాణసంచా తయారు చేస్తున్న కిశోర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లెసైన్సు లేకుండా తయారు చేస్తున్నా పోలీసులు ఇంతకాలం గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.