గిరిరాజ్‌కు రేపిస్ట్‌కు తేడా ఏం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌కు లైంగికదాడులు చేసేవారికి(రేపిస్టు) పెద్ద తేడా ఏమి లేదని నిర్భయ డాక్యూమెంటరీ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ అన్నారు. 'నాకు నిజంగా అసహ్యం వేస్తుంది. ఢిల్లీలో పాశవిక లైంగికదాడికి గురై ప్రాణాలుకోల్పోయిన పారామెడికల్ విద్యార్థినిపై నేను తీసిన డాక్యుమెంటరీ చిత్రం.. లైంగికదాడులు చేసేవారికి మరింత ఊతమిచ్చేలా ఉందని కపటమాటలు చెప్పారు.
ఇప్పుడేమో స్వయంగా ప్రజా ప్రతినిధులై ఉండి స్త్రీలను అగౌర పరిచేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ రేపిస్టుకన్నా పెద్ద మంచివారేం కారు. అయినా ఎలాంటి ఆలోచనలేకుండా వ్యాఖ్యలు చేసే ఇలాంటివారిని భారత పార్లమెంటు కొన్నేళ్లుగా ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదు. వీరి మాటలకు జైలులో ఉన్న రేపిస్టు ముఖేశ్ సింగ్ మాటలకు తేడా ఏమైనా ఉందా' అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ అలాంటి మంత్రిని సహించరాదని అన్నారు. గిరిరాజ్ సింగ్‌ను వెంటనే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని సూచించారు.