లైసెన్స్ రాజ్ లేదు...ఇన్స్పెక్టర్ రాజ్ ఉంది
భువనేశ్వర్ : స్టార్టప్ లకు మెరుగైన వ్యాపార అవకాశాలు పెంపొందించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో లైసెన్స్ రాజ్ అవతరించినప్పటికీ, ఇన్స్పెక్టర్ రాజ్ మరికొంతకాలం కొనసాగుతోందని తెలిపారు. రెగ్యులేషన్లు పరిశ్రమలకు అవకాశాలను పెంపొందించే విధంగా ఉండాలని, నిరుత్సాహపరిచే లాగా కాదని పేర్కొన్నారు. పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ లో దుర్వినియోగాలను నియంత్రించడానికి అథారిటీలు కొన్ని తనిఖీలను మాత్రమే కలిగి ఉండాలని ఆయన సూచించారు. చిన్న,మధ్యతరగతి పరిశ్రమలకు నిబంధనలను ఎలా సులభతరం చేయాలో తెలుపుతూ యూకే, ఇటలీ దేశాలను ఉదాహరణగా తీసుకుని వివరించారు. యునిటైడ్ కింగ్ డమ్ లో నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. ఇటలీలో అవే నిబంధనలు చాలా కఠినతరం. ఇటలీతో పోల్చుకుంటే యూకేలో స్టార్టప్ లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
4వ ఒడిశా నాలెడ్జ్ హబ్ లో బ్యాంకర్లు, మంత్రులు, అధికార ప్రతినిధులను, పెట్టుబడిదారులను ఉద్దేశించి రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థికవ్యవస్థ రికవరీ అవుతుందని, కానీ కొన్ని పరిశ్రమలు ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిశ్రమలను అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రభుత్వాలు, ఏజెన్సీలు దృష్టిసారించాలని తెలిపారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, స్టార్టప్ లపై ఎక్కువగా దృష్టిసారించి, వారికి సులభతరంగా నిధుల చేకూర్చడంలో ఫైనాన్సియల్ ఇన్ స్టిట్యూషన్లు తోడ్పడ్డాలని చెప్పారు. అలాగే ఈ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల, ఆ పరిశ్రమల్లో పోటీతత్వానికి ప్రోత్సాహం పెరిగి, వృద్ధిని నమోదుచేస్తాయన్నారు. మంచి రుతుపవనాలు ఆర్థికవ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి సహకరిస్తాయని పేర్కొన్నారు.