Limbo Skating
-
20 కార్లు.. 13 సెకన్లు.. ఏడేళ్ల చిన్నారి ‘గిన్నిస్’ రికార్డ్
ముంబై: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు ఈ చిన్నారి సరిగ్గా సరిపోతుంది. చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆమెనే మహారాష్ట్ర, పుణెకు చెందిన ఏడేళ్ల చిన్నారి దేశ్నా ఆదిత్య నాహర్. లింబో స్కేటింగ్‌లో 20 కార్ల కింద నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 193 అడుగుల దూరాన్ని చేరుకునేందుకు 13.74 సెకన్ల సమయం మాత్రమే తీసుకుని అబ్బుర పరిచింది ఈ పాప. గతంలో చైనాకు చెందిన 14 ఏళ్ల బాలిక పేరున ఉన్న 14.15 సెకన్ల రికార్డును తిరగరాసింది. లింబో స్కేటింగ్‌ను రోలర్ లింబోగా కూడా పిలుస్తారు. అడ్డంగా పెట్టిన పోల్ వంటి ఏదైనా వస్తువు కింద నుంచి రోలర్ స్కేటింగ్ చేసే ఈ ఆటకు చాలా గుర్తింపు ఉంది. 20 కార్ల కింద నుంచి వేగంగా వెళ్తున్న చిన్నారి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఏప్రిల్ 16న మహారాష్ట్ర, పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య నాహర్ కేవలం 13.74 సెకన్లలోనే 20 కార్ల కింద నుంచి లింబో స్కేట్ నిర్వహించింది. ఈ రికార్డ్ సాధించేందుకు దిశ్నా సుమారు ఏడాదిన్నరపాటు సాధన చేసింది.’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఖాతాలో రాసుకొచ్చింది. That's seven-year-old Deshna Nahar from #Pune #India. She has registered her name in the Guinness Book of records in 'Limbo Skating' Proud of you #DeshnaNahar pic.twitter.com/8gXoeWyQN7 — Amai K (@ItsAmaiKroos) July 29, 2022 మరోవైపు.. దుబాయ్‌లోని భారత యోగా టీచర్ సుమారు 30 నిమిషాల పాటు ఒకే యోగా పోజ్‌లో ఉండి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆ వీడియోను యాష్ మాన్సుఖ్భాయ్ మొరాదియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తేలు ఆకారంలో యోగాసనం వేశారు మొరాదియా. 21 ఏళ్ల యోగా టీచర్ 29 నిమిషాల 4 సెకన్ల పాటు ఆ యోగాసనంలో ఉండి.. గతంలోని 4 నిమిషాల 47 సెకన్ల రికార్డును తిరగరాశారు. ఇదీ చదవండి: ఎవరెస్ట్ ఎక్కిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... గిన్నిస్ రికార్డు తండ్రికి అంకితం -
లింబో స్కేటింగ్‌లో 4 గిన్నిస్ రికార్డులు నమోదు
పిన్న వయసులోనే నమోదు చేసిన దేవీశ్రీ ప్రసాద్ ఏఎన్‌యూ: లింబో స్కేటింగ్‌లో ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రాంగణంలో గురువారం ఉదయం జరిగిన గిన్నీస్ రికార్డు ప్రదర్శనలో తిరుపతికి చెందిన పదేళ్ల బాలుడు జి.దేవీశ్రీ ప్రసాద్ ఈ రికార్డులను నమోదు చేశాడు. లింబో స్కేటింగ్‌లో దేవీశ్రీ ప్రసాద్ 115.6 మీటర్ల పొడవులో అమర్చిన 60 రేనాల్ట్ డస్టర్ కార్ల కిందుగా ముందుకు విజయవంతంగా స్కేటింగ్ చేసి ఒక రికార్డును నెలకొల్పాడు. అలాగే 115.6 మీటర్ల పొడవులో 60 రేనాల్ట్ డస్టర్ వాహనాల కిందుగా వెనుకకు స్కేటింగ్ చేసి మరో రికార్డును నమోదు చేశాడు. దీంతో పాటు 10 అంగుళాల ఎత్తు ఉన్న అండర్ బార్ల కింద నుంచి 184 మీటర్ల పొడవు ముందుకు విజయవంతంగా స్కేటింగ్ చేసి రికార్డును నమోదు చేశాడు. 10 అంగుళాల ఎత్తు ఉన్న అండర్ బార్ల కింద నుంచి వెనుకకు 167 మీటర్లు పొడవు స్కేటింగ్ చేసి మరో రికార్డును నెలకొల్పాడు. -
లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు
తిరుపతి స్పోర్ట్స్: తిరుపతికి చెందిన దేవిశ్రీప్రసాద్(8) లింబో స్కేటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ప్రతినిధులకు పంపారు. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న దేవిశ్రీప్రసాద్ బుధవారం ఫార్వార్డ్ లింబోస్కేటింగ్‌లో 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 17.84 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్యాక్వార్డ్ (వెనక్కు) లింబోస్కేటింగ్లోనూ 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 22.03 సెకన్లలో చేరుకుని గత రికార్డులను తిరగరాశాడు. మరోవైపు అండర్ బార్స్ ఫార్వార్డ్ (ముందుకు) లోయస్ట్, లాంగెస్ట్ లింబో స్కేటింగ్‌లోనూ రికార్డు సృష్టించాడు. 113 కమ్మీల కింద 8.75 అంగుళాల ఎత్తులో 100.4 మీ. దూరాన్ని 15.4 సెకన్లలో చేరుకుని గిన్నిస్ రికార్డును తిరగరాశాడు.