limca book
-
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దంపతులకు చోటు
–వేర్వేరు సంవత్సరాల్లో ఒకే సమయంలో పిల్లలకు జననం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరానికి చెందిన దంపతులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. స్థానిక నరసింహారెడ్డి నగర్లో నివసించే మహబూబ్నసీర్ మెడికల్ విభాగంలో పనిచేస్తారు. ఆయన భార్య రుబీనా సుల్తానా(34) 2015 ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 6.45 నిమిషాలకు అమ్మాయి(ఆయేషా నౌసీన్)కు జన్మనిచ్చింది. రెండో కాన్పులోనూ ఆమె 2016 ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 6.33 నిమిషాలకు మగబిడ్డ(మహబూబ్ సాబీద్)కు జన్మనిచ్చింది. వీరిద్దరూ స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని అశ్విని హాస్పిటల్లో జన్మించారు. వేర్వేరు సంవత్సరాల్లో సరిగ్గా ఏడాది సమయంలో ఒకే తేదీన, దాదాపుగా ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వడంతో రుబీనా సుల్తానా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. ఈ మేరకు ఆ సంస్థ ఎడిటర్ విజయ ఘోష్ అవార్డు పత్రం పంపించారు. ఏప్రిల్ 9 వ తేదీన ఆ దంపతులకు పత్రం అందించి సన్మానం చేయనున్నారు. కాగా రుబీనాసుల్తానా.. తన తల్లిదండ్రులు మోయినుద్దీన్, రపీయాబీ స్థాపించిన రుబీనా ఉమెన్ వెల్ఫెర్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. -
3,532 మంది ముక్తకంఠానికి లిమ్కా..
రసూల్‌పురా: సారే జహాసె అచ్చా..హిందూ సితా హమారా.. అంటూ దేశభక్తి గీతం ఆలపిస్తూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ 3,532 మంది విద్యార్థులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. కంటోన్మెంట్ బాలంరాయిలోని గీతాంజలి దేవశాల పాఠశాల అధ్వర్యంలో బుధవారం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పాఠశాల వార్షికోత్సవంతో పాటు పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గీతాంజలి పాఠశాలల ఐదు బ్రాంచీల విద్యార్థులతో పాటు నగరంలోని మానసిక, శారీరక వికలాంగుల ఆరు పాఠశాలల విద్యార్థులు భాగమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేస్తున్న పాయల్ కపూర్, జ్యోతి, స్రవంతిను ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. పాఠశాలల చైర్మన్ ఉమాకరణ్, డైరక్టర్ గీతాకరణ్, ప్రిన్సిపల్ మాధవి చంద్ర, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో శివ
పెనమలూరు : చిత్రకారుడు పామర్తి శివ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆయన గతంలో 11 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుతో పురికొసతో 3 గంటల్లో ఏకధాటిగా బుద్ధుడి బొమ్మను వేశాడు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. ఈ మేరకు మంగళవారం లిమ్కా బుక్ ప్రతినిధి విజయ్ఘోష్ రికార్డు పత్రాన్ని పంపారని శివ తెలిపారు. తనకు ఇప్పటివరకు 36 రికార్డులు వివిధ అంశాల్లో వచ్చాయన్నారు. తనను ప్రభుత్వం కానీ, దాతలుగానీ ప్రోత్సహిస్తే మరిన్ని రికార్డులు సాధిస్తానని తెలిపారు. తాను శివ ఆర్ట్సు పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి పలువురు విద్యార్థులకు చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘మూషిక్’వాహనం
భలే బుర్ర మూషిక వాహనాన్ని అధిరోహించి వినాయకుడు ముల్లోకాలూ తిరిగినట్లు పురాణాల్లో చదువుకున్నాం. వినాయకుడు అధిరోహించిన మూషికం సజీవ వాహనం. దానికి కడుపు నిండా ఆహారం తప్ప ఇంధనం అక్కర్లేదు. కానీ మన వాహనాలు అలా కాదు కదా! ఇంధనానికి కొరత తీవ్రమవుతున్న ఈ రోజుల్లో తక్కువ ఇంధనంతో అత్యధిక దూరం ప్రయాణించే వాహనాలను చాలా కంపెనీలు రూపొందిస్తున్నాయి. వాటి రూప కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండానే ఈ ‘మూషిక్’ వాహనాన్ని సృష్టించాడు మైసూరుకు చెందిన సంతోష్. ఫొటోలోని ‘మూషిక్’ వాహనంపై కనిపిస్తున్న యువకుడు ఇతగాడే. తొలుత సంతోష్ ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేసేవాడు. ఇతగాడు సృష్టించిన ‘మూషిక్’... ఒక అధునాతన బైక్. దీని తయారీకి సంతోష్ పెద్దగా కష్టపడిందేమీ లేదు. పాతబడ్డ మోటార్ సైకిళ్ల విడి భాగాలను తనకు కావలసిన రీతిలో అమర్చాడు. పెట్రోల్ ట్యాంకు లాంటివేమీ లేకుండా, బ్యాటరీతో నడిచేలా తీర్చిదిద్దాడు. అయితే, దీనిని నడపడానికి మాత్రం ఎవరైనా సరే, ఈ ఫొటోలో ఉన్న భంగిమలో మార్చుకోవాల్సిందే! ఎందుకంటే, దీని హ్యాండిల్ ముందుచక్రం ఇరుసును అతుక్కుని ఉంటుంది మరి. ఈ అధునాతన ‘మూషిక్’ వాహనాన్ని రూపొందించిన సంతోష్‌కు ఇంజినీరింగ్‌లో ఎలాంటి డిగ్రీ లేదు. అయినా, ఈ వాహనం ఇతగాడి పేరును లిమ్కాబుక్‌లోకి ఎక్కించింది. సంతోష్ ఇలాంటివే మరికొన్ని విలక్షణమైన బైక్‌లను రూపొందించాడు. తన తండ్రికి మోటార్ సైకిళ్లంటే తగని ఇష్ట మని, తనకు కూడా చిన్న వయసు నుంచే బైక్‌లపై ఇష్టం పెరిగిందని, తన తండ్రి స్ఫూర్తితోనే కొత్త కొత్త బైక్‌లను రూపొం దిస్తున్నానని చెబుతున్నాడు సంతోష్. -
లిమ్కా బుక్‌లో సంజన!
వంద గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కగలుగుతారా? అనడిగితే చేతులెత్తేసేవాళ్ల జాబితానే ఎక్కువగా ఉంటుంది. మరి.. అన్నేసి గంటలంటే మాటలా? కంటిన్యూస్‌గా గంటసేపు తొక్కితేనే నీరసపడిపోతాం. బాగా సత్తా ఉన్నవాళ్లనుకోండి... ఇంకొన్ని గంటలు తొక్కగలుగుతారు. కానీ, 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కడం అంటే సాహసమే. కన్నడ భామ సంజన ఆ సాహసం చేశారు. అయ్యో.. గులాబీ బాలకు ఎందుకీ కష్టం అని ఆమె అభిమానులు అనుకోవచ్చు. కానీ, సంజన సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగారు. ఓ సైక్లింగ్ గ్రూప్‌తో కలిసి ఆమె ఈ సవాల్‌ని స్వీకరించారు. 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించడం కోసమే సంజన ఈ సైకిల్ ప్రయాణం చేశారు... అనుకున్నది సాధించారు. -
సైక్లింగ్
ఒంటి కాలితోనే పతకాలెన్నో సాధించాడు. ఏకంగా ‘లివ్కూ బుక్’కెక్కాడు. ఈ రికార్డుల హీరో.. వున హైదరాబాదీ ఆదిత్య మెహతా. ప్రపంచంలో ఎత్తరుున వునాలీ నుంచి ఖర్డంగ్లా రోడ్డుపై ఆదిత్య సైకిల్ యూత్ర చేపట్టనున్నాడు. ఈ యూత్ర విజయువంతం కావాలని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ‘సైక్లింగ్ రైడ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్యతో ‘సిటీ ప్లస్’ వుుచ్చటించింది. ఆ విశేషాలు అతని మాటల్లోనే... పుట్టి పెరిగింది భాగ్యనగరిలోనే. ఓ పక్క చదువు, వురోవైపు స్నేహితులు, పబ్‌లు, క్లబ్‌లతో జీవితం సరదాగా గడిచిపోయేది. ఇగ్నోలో బీకామ్ చేసి నాన్న వ్యాపారంలోకి అడుగుపెట్టా. ఆ తర్వాత మనీషాను పెళ్లాడా. అంతా బాగున్న సమయంలో... 2006, ఆగస్టు 18న బుల్లెట్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రవూదంలో కుడి కాలు పూర్తిగా చచ్చుబడింది. ఆ సవుయుంలో బతుకంటే భయుం కలిగింది. అయితే నాన్న మాత్రం ‘దేవుడు నీకు రెండో జీవితం ఇచ్చాడు. కాలు పోయినా ఫర్వాలేదు.. జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా సాధించు’ అని స్ఫూర్తిని రగిలించారు. దక్షిణాఫ్రికా నుంచి బయోనిక్ లెగ్ తెప్పించుకుని కొత్త జీవితం ప్రారంభించా. ఒకసారి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ హోర్డింగ్ చూశా. ఆసక్తిగా అనిపించింది. సైక్లింగ్ చేయగలనా అని ఆలోచించా. సైకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ, పడుతూ లేస్తూ పర్ఫెక్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్ టు బెంగళూరు 540 కిలోమీటర్లను సైకిల్‌పై మూడురోజుల్లో చుట్టి వచ్చా. 2013లో పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్ కోసం చేస్తున్న ప్రాక్టీస్‌లో గాయాలైనా, అందులో భారత్ తరఫున పాల్గొని రెండు రజతాలు సాధించా. అదే ఏడాది లండన్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. కిందటేడాది డిసెంబర్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 రోజుల పాటు సైక్లింగ్ చేశా. నా లక్ష్యం 2016 పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించడం. - సాక్షి, సిటీప్లస్