LNJP
-
ఆక్సిజన్ సపోర్టుపై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజౌన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్టుతో వైద్యం అందిస్తున్నారు. కాగా తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న సత్యేంద్ర జైన్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత సోమవారమే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జైన్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను సిబ్బంది వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. కాగా జైన్ అసుపత్రి పాలవ్వడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. మే 22న వెన్నెముక సమస్యతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం.. జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్ జైలు గురువారం ఉదయం దాదాపు 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయాడని పేర్కొన్నారు.అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైన్.. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన 35కిలోల బరువు తగ్గిన్నట్లు ఆప్ వర్గాలు ఆరోపిన్నాయి. చదవండి: కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి! -
దేశంలో విజృంభిస్తున్న మంకీపాక్స్.. మరో వ్యక్తిలో లక్షణాలు!
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ వైరస్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయి. మంకీపాక్స్ లక్షణాలతో బాధితుడు మంగళవారం సాయంత్రం.. ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ మాదిరిగానే చర్మంపై బొబ్బలు, తీవ్ర జ్వరం వంటివి కనిపించాయన్నారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని చెప్పారు. 34 ఏళ్ల బాధితుడు ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత జ్వరం, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. దేశంలో మొత్తం నాలుగు కేసులు రాగా.. కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. మూడు రోజుల క్రింత జులై 24న ఢిల్లో తొలి కేసు నమోదైంది. ఆ వ్యక్తి సైతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. వైద్యులకు శిక్షణ ప్రారంభించింది. రాష్ట్రాలు అప్రమత్తం.. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాయి. మంకీపాక్స్ కేసులు బయటపడిన దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ ను జులై 23న అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్‌కు పాక్ మహిళల ‘హనీట్రాప్’.. సైనిక రహస్యాలు లీక్! -
తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే!
‘‘ఇక్కడే ఉంటే నేను భయంతోనే చచ్చిపోయేలా ఉన్నాను. నా చుట్టూ అన్నీ శవాలే. దయచేసి నన్ను ఇంటికి తీసుకువెళ్లండి’’ అంటూ సురేందర్ కుమార్ అనే కరోనా పేషెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎమ్సీ) రిటైర్టు అధికారి అయిన సురేందర్‌కు జూన్ 8న నిర్వహించిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్(ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్లగా.. అక్కడ అన్నీ మృతదేహాలే ఉండటంతో సురేందర్ కుమార్ బెంబేలెత్తిపోయారు. తనకు భయంగా ఉందని, వెంటనే ఇంటికి తీసుకువెళ్లి అక్కడే చికిత్స అందించాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆస్పత్రిలోని పరిస్థితిని వివరించారు. అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు ఇంటికి చేరుకుని.. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చేరే ఏర్పాట్లలో ఉన్నారు. (ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి) బయటకు తోసేశారు.. ఈ విషయం గురించి సురేందర్ కుమారుడు సందీప్ లాలా కుమార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాన్నను ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో ఆక్సిజన్ పెట్టడానికి ఓ వార్డు బాయ్ వచ్చాడు. అతడు ముక్కుకు కాకుండా, తలకు మాస్కు పెట్టుకున్నాడు. ఇదంతా ఏంటని నిలదీశాం. దీంతో బౌన్సర్లు వచ్చి మమ్మల్ని బయటకు తోసేశారు. మా నాన్న కోసం తీసుకువెళ్లిన భోజనం, ఫోన్లు ఉన్న బ్యాగ్‌ను ఇచ్చేందుకు కూడా వారు అనుమతించలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తన తండ్రికి సంబంధించి ఆస్పత్రి నుంచి ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. హెల్్పలైన్ నంబరుకు ఫోన్ చేస్తే బిజీ వచ్చిందని.. చేసేదేం లేక ఓ స్వీపర్‌కు కొన్ని డబ్బులు ఇస్తే అతడు సురేందర్ కుమార్‌కు తాము పంపిన ఫోన్ అందించాడని తెలిపారు. తాను ఎన్నోసార్లు తండ్రికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ లేదని.. అసలేం జరిగిందో చెప్పలేదని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.(కరోనా: పది రోజుల్లో 5 లక్షల కేసులు!) ఆస్పత్రి నుంచి పారిపోయారని చెప్పారు ఈ క్రమంలో జూన్ 11న సురేందర్ కుమార్ ఆస్పత్రి నుంచి పారిపోయారని తనకు ఫోన్ వచ్చిందని.. దీంతో తాను మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చానని పేర్కొన్నారు. సోదరుడితో కలిసి తాను ఆస్పత్రికి పరిగెత్తుకు వెళ్లానని పీపీఈ కిట్ ధరించి ఆస్పత్రి అంతా వెదకగా.. తండ్రి ఓ మూలన కనిపించాడని, వెంటనే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి.. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచేలా అనుమతి తీసుకున్నామన్నారు. దీంతో ఎట్టకేలకు సురేందర్ ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఇక తనకు ఎదురైన అనుభవం గురించి సురేందర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ ఏర్పాట్లేవీ సరిగా లేవు. నాకు బ్రెడ్డు ముక్కలు పెట్టారు. నీళ్లు లేవు. ఇంకో రెండు రోజులు అక్కడే ఉంటే చనిపోయేవాడిని. ఎక్కడ చూసినా మృతదేహాలే’’ అని చెప్పుకొచ్చారు.(కరోనా: ఆ 6 రాష్ట్రాలకు రాజస్తాన్ ఆఫర్!) కాగా సురేందర్ కుమార్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధానిలో ఢిల్లీలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎల్ఎన్జేపీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కోవిడ్ పేషెంట్ల చికిత్స కోసం చేసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఎందుకు పాడుకుంటారో ఢిల్లీ వాసులకు ఇప్పుడు తెలుస్తోంది. ఢిల్లీలోని సర్కారు దవాఖానాల్లో ప్రసిద్ధ లోక్‌నాయక్ జయప్రకాష్, జీబీ పంత్ ఆస్పత్రులు తీసుకున్న ఓ నిర్ణయం రోగులనే కాదు.. దేశ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు... ఊబకాయులకు సారీ చెప్పేస్తున్నారు. 80 కేజీల కంటే ఎక్కువ బరువున్న పేషెంట్లకు సర్జరీలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ బరువుకు... ఆస్పత్రిలో చేర్చుకోపోవడానికి లింకేంటో అనుకుంటున్నారా? ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ టేబుల్స్ మరీ పాతవైపోవడమే అందుకు కారణమట.. ఇటీవల ఆస్పత్రిలో ఓ రోగికి ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి టేబుల్ ఊగిందట. వైద్యులు అప్రమత్తమయ్యేలోపే టేబుల్ విరిగిపోయి... మత్తులో ఉన్న రోగి నేలపై పడిపోయాడట. ఎలాగో శస్త్రచికిత్స పూర్తయి రోగి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఎపిసోడ్‌తో మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ జిబి పంత్ ఆస్పత్రి వైద్యులు షాకయ్యారు. ఇక ఊబకాయులకు చికిత్స చేయడం ప్రమాదమేనని నిర్ణయించుకొన్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని సర్జరీ డిపార్ట్ మెంట్లు అన్నీ కలసి ఓ ఉత్తర్వును జారీ చేశాయి. 80 కేజీలకు పైబడి బరువున్న వారిని ఆస్పత్రిలో చేర్చుకొనేందుకు తిరస్కరించాలని నిర్ణయించారు. 2012 లో ఎల్ఎన్జెపి ఆస్పత్రి బేరియాట్రిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రారరంభించింది. అప్పటినుంచి వైవిధ్య సేవలు అందించడంలో దేశంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ విభాగం.. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను అందించడంలో ఎంతో పేరు గడించింది. ఒక్క రోజులోనే 100కు పైగా ఆపరేషన్లు ఇక్కడ నిర్వహిస్తుంటారు. అయితే ఆపరేషన్ టేబుల్స్ కొనుగోలుకు ఆమోదం లేకపోవడం, నిర్వహణా లోపం కూడా ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇప్పుడు రోగి భద్రతే ధ్యేయంగా మేం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అంటున్నారు సర్జరీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ కుమార్ తుడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని, ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అలాంటివి అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ తుడు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని దాదాపు 13 శాతం మంది ప్రజలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు.