Love jihad case
-
కాసరగోడులో లవ్ జిహాద్?
యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్ స్కూలులో టీచర్ అయిన నేహా, యువకుడు తన్వీర్ మిర్థాద్లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది. తాము 25న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్ జిహాద్ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది. -
ప్రీతిది లవ్ జిహాదీ కేసే
కరీంనగర్‌టౌన్: వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ ‘లవ్ జిహాదీ’కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకోసం విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో మెడికల్ విద్యార్థిని ప్రీతిని ర్యాగింగ్ చేయడంవల్లే ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు అమ్మాయిని వేధింపులకు గురిచేశారని ప్రీతి తండ్రే చెప్పారని తెలిపారు. దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు. వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు.. అమ్మాయి కుటుంబ సభ్యులపై చూపకపోవడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసిపారేస్తోందని, హైదరాబాద్‌లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చనిపోతే కుక్కలకు మటన్ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం, ఈ రెండు విషయాల్లో ఇప్పటివరకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటని అన్నారు. కేసీఆర్‌ది ఐరన్ లెగ్.. ‘కొండగట్టు ఆలయంలో గర్భగుడి దగ్గర దొంగతనం జరగడం సిగ్గు చేటు. కేసీఆర్‌ది ఐరన్ లెగ్. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్ అవుతోంది’అని సంజయ్ అన్నారు. ‘యాగాలు చేస్తే యాగశాల ఆహుతైంది. యాదాద్రికి పోతే వరదలొచ్చే. కొండగట్టుకు వస్తే దొంగతనం జరిగే. కొండగట్టుకు వెయ్యి కోట్లు రాకపోగా దొంగలొచ్చి దొంగతనం జరిగింది’అని ఎద్దేవా చేశారు. రేపో మాపో ఈ కేసును కూడా నీరుగారుస్తారని, మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని అమాయకులను ఇరికించే కుట్ర చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ది దొంగ పూజని, ఆయన కొడుకు దేవుడినే నమ్మని నాస్తికుడు, మూర్ఖుడని అన్నారు. దందాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం లంగ దందా, దొంగ దందాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబమని బండి సంజయ్ విమర్శించారు. ‘ఒకరిది ఇసుక దందా, ఇంకొకరిది డ్రగ్స్ దందా, మరొకరిది దొంగ సారా, పత్తాల దందా..’ఈ దందాలను ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం తెలంగాణకు ఏమీ చేయడం లేదని అబద్దాలాడుతూ సెంటిమెంట్‌ను రగిల్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై చర్చకు సిద్ధం కావాలి’అని అన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సమావేశంలో పాల్గొన్నారు. -
‘సీరియల్ నటి ఆత్మహత్య వెనక లవ్ జిహాద్ కోణం ఉందా?’
ముంబై: బాలీవుడ్ యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్. తునీషా ఆత్మహత్య వెనుక ‘లవ్ జిహాద్’ కోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని, నేరస్థులు తప్పించుకోలేరని తెలిపారు. తునీషా కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందా?లేదా మరో అంశం దాగుందా? దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి. కానీ, తునీషా శర్మ కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇందులో లవ్ జిహాద్ కోణం దాగిఉంటే.. దాని వెనక ఏ సంస్థ ఉంది, నేరస్థులేవరు అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తారు.’ - రామ్ కదమ్, బీజేపీ ఎమ్మెల్యే. బాలీవుడ్ యువనటి తునీషా శర్మ శనివారం రోజున మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లోని వాసాయ్లో ఓ టీవీ షో సెట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలతో ఆమె సహ నటుడు షీజన్ మొహమ్మెద్ ఖాన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తునిషా తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు ఇరువురు రిలేషన్లో ఉన్నారని, 15 రోజుల క్రితమే విడిపోయినట్లు తెలిసిందన్నారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ వాసాయ్ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: Tunisha Sharma Suicde Case: సీరియల్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్ -
శ్రద్ధా హత్యోదంతం.. లవ్ జిహాద్ కాదు!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం స్పందించారు. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్ జిహాద్ ఘటన కాదంటూ ఉద్ఘాటించారు. ‘‘ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలి.. అంతా ఖండించాలి కూడా’’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాకతంగా చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటనపైనా స్పందించారు ఒవైసీ. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ-ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసును ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆదివారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో అసోంముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) ఘోర హత్య తనను కలిచివేసిందని అన్నారు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ దేశానికి అఫ్తాబ్(శ్రద్ధా హత్యకేసు నిందితుడు) లాంటి వాళ్ల అవసరం లేదని, శ్రీరాముడులాంటి వ్యక్తి.. నరేంద్ర మోదీ నేతల అవసరం ఉందని అసోం సీఎం వ్యాఖ్యానించారు. -
ఆమె లేకుంటే బతకలేనన్నాడు.. లవరే కదా అని ఆమె దగ్గరైంది.. తర్వాత..
నువ్వుంటే ఇష్టమంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమ పేరుతో ఆమెను వంచించాడు. శారీరకంగా ఆమెకు దగ్గరై.. గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి విషయం ఎత్తడంతో అతడి గురించి అసలు విషయం తెలిసి.. ఆమె షాకైంది. పేరు మార్చుకుని తనను మోసం చేశాడని గుర్తించి ఆవేదనకు లోనైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో ఉన్నావ్ చెందిన బాధితురాలికి.. మోనూ పేరుతో ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమె అంటే ఇష్టమన్నాడు. ఆమె లేకుంటే బ్రతకలేనంటూ నమ్మించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇవన్నీ నమ్మిన బాధితురాలు ఓ తప్పు చేసింది. కాబోయే భర్తే కదా అని.. పలుమార్లు శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. దీంతో కంగారుపడిన మోనూ.. ఆమెను మళ్లీ మోసం చేసి.. గర్భాన్ని తొలగించేశాడు. అనంతరం, పెళ్లి చేసుకోవాలని మోనూను కోరింది. కాగా, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి బాధితురాలి వద్ద నుంచి రూ.2 లక్షలు నొక్కేశాడు. ఇక లాభం లేదని బాధితురాలు.. పెళ్లి విషయమై నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అతడి పేరు మోనూ కాదని.. అసలు పేరు షెహ్నవాజ్ కబాడీ అని తెలియడంతో ఖంగుతింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Unnao, Uttar Pradesh: Arti met Monu, they fell in love, had a physical relationship, she got pregnant then he terminated her pregnancy. He even took 2 lakh rupees from her promising marriage, now goes missing ever since his true name 'Shehnawaz Kabadi' came to light. See: pic.twitter.com/q1XemSyoTK — Subhi Vishwakarma (@subhi_karma) September 9, 2022 -
రిసెప్షనిస్టుపై సోదరుల అత్యాచారపర్వం
బనశంకరి: కర్ణాటకలో లవ్ జిహాద్ ఉదంతం కలకలం రేపుతోంది. యువతిపై అత్యాచారానికి పాల్పడి మతం మారాలి బలవంతం చేసిన కేసులో ఒకరిని సోమవారం బెంగళూరు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన షబీర్ అహ్మద్, రిల్హాన్ సోదరులు బెంగళూరులో హోటల్ నడుపుతున్నారు. 2018లో వారి హోటల్లో రిసెప్షనిస్టుగా చేరిన 19 ఏళ్ల యువతిని షబ్బీర్ అహ్మద్ ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 2019లో నాలుగుసార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఎవరికైనా ఈ విషయం చెబితే ఉద్యోగం తీసేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరించాడు. తరువాత రిల్హాన్ ఆమెను కలిసి నా సోదరుడు నీకు అన్యాయం చేశాడని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత యువతి తల్లిదండ్రులతో నిశ్చితార్థం పేరు చెప్పి 2 నెలల క్రితం రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. చదవంండి: నిమ్స్‌లో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య తెల్లకాగితంపై సంతకాలు.. గతేడాది నవంబరు 20న పెళ్లికి ఫంక్షన్ హాల్‌ను మాట్లాడి, పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ సమయంలో దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఉంది, పాస్‌పోర్ట్ కోసమంటూ ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకుని మతం మారాలని బలవంతం చేసి మాయమయ్యాడు. అయితే.. అతను అప్పటికే వేరేవారిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం బాధితురాలు షబీర్, రిల్హాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి షబీర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. చదవండి: మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు మధ్యప్రదేశ్‌లో దారుణం సిద్ధి: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నలుగురు దుండగులు ఆమె మర్మావయవాల్లోకి ఐరన్ రాడ్‌ను గుచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సిద్ధి జిల్లా అమిలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండప్రాంత గ్రామం హర్దికి చెందిన మహిళ(45) నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి కోసం తన గుడిసెలోనే కిరాణ దుకాణం నడుపుకుంటోంది. ఆమె ఇద్దరు కుమారులు(16, 18), సోదరి(40) ఆ ఇంట్లోనే ఉంటారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికే చెందిన నలుగురు ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేశారు. అనంతరం ఇనుప రాడ్‌ను ఆమె మర్మావయవాల్లోకి గుచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయంలో ఆమె సోదరి మాత్రమే ఇంట్లో ఉంది. ఆమె అతికష్టమ్మీద ఆటోలో సమీప పోలీస్ ఠాణాకు బాధితురాలిని తీసుకెళ్లింది. పోలీసులు బాధితురాలిని సిద్ధి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రేవా జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురినీ అరెస్టు చేశారు. -
లవ్ జిహాద్ : పేరు మార్చుకుని వలపు వల
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో కలకలం రేపిన లవ్ జిహాద్ కేసులో నిందితుడు షంషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ పోలీసులు గురువారం మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. షంషద్ నుంచి పోలీసులు ఓ పిస్టల్, లైవ్ బుల్లెట్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లీ కూతుళ్లను దారుణంగా హతమార్చి మీరట్‌లోని వారి ఇంట్లో పాతిపెట్టిన కేసులో షంషద్ నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షంషద్ తన పేరు మార్చుకుని హిందూ యువకుడిగా నమ్మబలుకుతూ ప్రియ అనే యువతితో సహజీనవం చేయడంతో పాటు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో షంషద్ తన పేరు అమిత్ అంటూ ప్రియను నమ్మించాడు. ఐదేళ్లుగా ప్రియతో కాపురం చేస్తున్నాడు. అయితే షంషద్ ముస్లిం అని తెలిసిన తర్వాత ప్రియ అతనితో పలుమార్లు ఘర్షణకు దిగింది. షంషద్, ప్రియలు ఇదే విషయమై తరచూ గొడవపడే క్రమంలో మార్చి 28న ప్రియ ఆమె కుమార్తె కశిష్‌లను అతడు దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలను వారి ఇంట్లోనే పాతిపెట్టాడు.ఇక మూడు నెలలుగా ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె స్నేహితురాలు చంచల్ స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగుచూసింది. జంట హత్యల కేసులో షంషద్‌ను ప్రశ్నించిన పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళుతుండగా నిందితుడు పారిపోయాడు. మీరట్‌లో గురువారం పట్టుబడిన షంషద్‌పై పోలీసులు 25,000 రివార్డు ప్రకటించారు. కాగా ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న షంషద్ మొదటి భార్యను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.చదవండి : లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు -
మరో 'లవ్ జిహాదీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో లవ్ జిహాదీ వ్యవహారం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో రఫిక్ అనే యువకుడు ఓ దళిత యువతిని మోసం చేసిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. రఫిక్.. తనను బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గర్భం దాల్చిన తర్వాత తనను మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. వరంగల్‌కి చెందిన రఫిక్ .. 6 ఏళ్ల క్రితం క్రిష్ణవేణితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో ఉద్యోగం చేస్తూ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణవేణి బలవంతంగా మతం మార్చుకుని షబానా గా మారింది. పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్ అప్పటినుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటినుంచి డబ్బులు తేవాలని హింసించడం ప్రారంభించాడు. దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతోఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు. -
‘లవ్ జిహాద్’ హంతకుడితో రథయాత్ర
జోధ్‌పూర్ : దేశమంతా శ్రీరామ నవమి రోజు రామున్ని పూజిస్తుంటే, కొంతమంది మాత్రం ఓ నేరస్థుడ్ని రామునిలా కొలుస్తూ వేడుకను జరుపుకున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన లవ్ జిహాద్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్రజుల్ అనే వ్యక్తిని దారుణంగా హత మార్చిన శంభు లాల్ ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్నాడు. (మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!) అయితే ఓ వ్యక్తిని శంభు లాల్ వేషధారణతో రథంపై కూర్చోబెట్టి జోధ్‌పూర్‌లో శివసేన ర్యాలీ నిర్వహించింది. సదరు వ్యక్తి చేతిలో అఫ్రజుల్‌ని చంపడానికి వినియోగించిన గోడ్డలిని కూడా ఉంచడంతో పాటు, దారి పొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై ‘హిందు మిత్రులారా మేల్కొండి. మీ ఆడబిడ్డలను కాపాడుకోండి. దేశానికి లవ్ జిహాద్ నుంచి విముక్తి కల్పించండి’ అని రాసి ఉంది. శంభు లాల్‌కు మద్ధతు తెలిపేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత హరి సింగ్ పన్వార్ తెలిపారు. ‘హిందుత్వంపై అతని నిబద్ధత నాలో స్ఫూర్తిని రగిల్చింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయటం ఈ యాత్ర ఉద్దేశం కాదు’ అని పన్వార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంతో జోధ్‌పూర్ డీసీపీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నామని.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
హదియా భర్తతో కలసిఉండొచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘లవ్ జిహాద్’ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కేరళకు చెందిన షఫీన్ జహాన్, హదియా అలియాస్ అఖిలా అశోకన్ల వివాహం చెల్లదంటూ గతేడాది కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకా రం కేరళ హైకోర్టు ఈ వివాహాన్ని రద్దుచేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహంలో కోర్టులు ఆర్టికల్ 226 ప్రకారం జోక్యం చేసుకోలేవనీ, ఆ పెళ్లిని రద్దు చేయలేవని కోర్టు అభిప్రాయపడింది. భర్త షఫీన్ జహాన్‌తో కలసి జీవించే పూర్తిస్వేచ్ఛ హదియాకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
లవ్ జిహాద్ కేసు.. కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హదియా వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ గురువారం తీర్పు వెలువరించింది. తన భర్తతో జీవించే హక్కు హదియాకు ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో తిరువనంతపురం హైకోర్టు హదియా విహాహం చెల్లదంటూ తీర్పునివ్వగా.. దానిని సవాల్ చేస్తూ ఆమె భర్త షఫీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నేడు కీలక ఆదేశాలు వెలువరిస్తూ ‘ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం దిగువ న్యాయస్థానానికి లేదు’ అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం కాదని.. వారి వివాహం వారి ఇష్టప్రకారం జరిగిందేనని బెంచ్ పేర్కొంది. అంతేకాదు భర్త షఫీన్ తో జీవించేందుకు ఆమెకు స్వేచ్ఛ ఉందంటూ కోర్టు తెలిపింది. అదే సమయంలోజాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను కేవలం ఉగ్ర కోణంలో మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని, వైవాహిక జీవితంలో జోక్యం చేసుకూడదని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి 2016 డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్‌ను వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేయటం.. కేసు ఎన్ఐఏ కు దర్యాప్తునకు అప్పగించటం తెలిసిందే. -
ఆమె పెళ్లిపై మేం ఏం చెప్పాలి : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని లవ్ జిహాద్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయి తాను చేసుకున్న వ్యక్తి సరైనవాడా కాదా అని కోర్టులు చెప్పలేవని స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరి ఇష్టాఇష్టాలపై ఆధారపడి జరుగుతుందని, తాము ఇష్టపడే వివాహం చేసుకున్న తర్వాత అది సరైన నిర్ణయమా కాదా అని కోర్టు ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించింది. తమ కూతురు చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని, ఆమెను మోసగించి ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్నాడని అమ్మాయి తండ్రి తరుపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం 'ఆమె ఇష్టపూర్తిగా చేసుకున్న వివాహంపై మేం ఎలాంటి వ్యాఖ్య చేయలేము. అది సరైన నిర్ణయమా కాదా అని మేం నిర్ణయించలేం. కేవలం మీరు చెబుతున్న ఆరోపణల ద్వారా ఆమె చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని అనలేము. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పిలిచి అడిగినప్పుడు తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఆమె చెబుతున్న మాటలు నిజమైనవా కాదా అని మనం ఎలా చెప్పగలం. అలాగని ఆమె నిర్ణయాన్ని కూడా తప్పుబట్టడం కోర్టుకు సాధ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. -
లవ్ జిహాదీ కేసు:‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ లవ్ జిహాద్ కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హదియా ఎవరితో జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఈ కేసు విచారణను కొనసాగించిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ‘‘మీరు(ఎన్ఐఏను ఉద్దేశించి) ఏమైనా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ, హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే న్యాయ బద్ధత మాత్రం లేదు. మేజర్ అయిన ఓ అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండాలని చెప్పటానికి ఎవరికీ హక్కులు లేవు. ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదు’’ అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు కోర్టు వాయిదా వేసింది. కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్‌ను వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇక హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయటంతో ఆమె భర్త షఫీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది. -
మత మార్పిడికి విముఖత: కోడలిపై ఘాతుకం
సాక్షి, రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన హిందూ యువతిపై స్వయాన మామ, బంధువులు లైంగికదాడి చేసి హతమార్చారు.రామ్‌గర్ జిల్లాలో దాదాపు నెలరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవంబర్ 6 నుంచి అదృశ్యమైన బాధితురాలి మృతదేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో బాధితురాలిని హత్య చేసే ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వెల్లడైంది. యువతి ప్రేమికుడు అదిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి పలు వివరాలు రాబట్టారు. గత నెలలో తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బాధిత యువతి అదిల్‌ను వివాహం చేసుకుంది. అనంతరం బొకారోలోని అదిల్ అంకుల్ ఇంటికి కొత్త దంపతులు చేరుకున్నారు. దీంతో ఆయన అదిల్ తండ్రికి సమాచారం అందించి అక్కడికి రప్పించారు. యువతి వేరే మతస్థురాలు కావడంతో తొలుత ఇస్లాం మతం స్వీకరించాలని వారు ఆమెకు నచ్చచెప్పారు. అయితే వారి డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చింది. దీంతో వారిద్దరినీ రాంచీలో కలిసిఉండేలా చూస్తామని దగ్గరలోని రైల్వే స్టేషనకు తీసుకువెళతామంటూ అదిల్ తండ్రి, అంకుల్ నమ్మబలికి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి పొదల్లో పడవేశారు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనను చెట్టుకు కట్టేశారని అదిల్ చెప్పాడు. ఈ ఘటనపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది లవ్‌జిహాద్ కేసుగా పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. -
తమిళనాడుకు హదియా
న్యూఢిల్లీ: ఇస్లాం మతం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన కేరళ యువతి హదియాను సుప్రీంకోర్టు తమిళనాడులోని సేలం జిల్లాకు పంపింది. ఆమె తన హోమియోపతి చదువును పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘లవ్‌జిహాద్’ కేసుకు సంబంధించి సోమవారం హదియా కోర్టుకు హాజరైంది. తన భర్త షఫీన్ జహాన్‌తోనే ఉంటానని కోర్టుకు హదియా స్పష్టం చేసింది. హదియా, జహాన్‌ల పెళ్లిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించిన కేరళ హైకోర్టు.. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులను సవాలు చేస్తూ జహాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. హదియా చదువుతున్న కాలేజీ డీన్‌ను ఆమెకు సంరక్షకుడిగా నియమించిన అత్యున్నత ధర్మాసనం.. ఏదైనా సమస్య ఎదురైతే తమను సంప్రదించే స్వేచ్ఛను డీన్‌కు ఇచ్చింది. హదియాకు మళ్లీ అడ్మిషన్ ఇవ్వాలని, హాస్టల్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత కాలేజీ, వర్సిటీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. భార్య చరాస్తి కాదు.. హదియా చదువు, అలవాట్లు, ఆమె జీవితాశయం గురించి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సేలంలో తన సంరక్షకుడిగా ఉండేందుకు ఎవరైనా బంధువులు లేదా పరిచయస్తుల పేర్లు తెలపాల్సిందిగా ధర్మాసనం కోరగా.. తన భర్త షఫీన్ సంరక్షకుడిగా ఉంటారని ఆమె జవాబిచ్చింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఓ భర్త తన భార్యకు సంరక్షకుడిగా ఉండలేడు. భార్య చరాస్తి కాదు. ఆమెకు వ్యక్తిగత గుర్తింపు, జీవితం ఉంటాయి. నేను కూడా నా భార్యకు సంరక్షకుడిని కాదు’ అని వ్యాఖ్యానించారు. -
కొత్త మలుపు తిరిగిన లవ్ జిహాద్ కేసు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లవ్ జిహాద్ కేసు సుప్రీంకోర్టులో కొత్తమలుపు తిరిగింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా కేసు విచారణ ఇవాళ ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అసలు హదియ వాంగ్మూలం సేకరించవద్దని ఎన్ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హదియను హిప్నటైజ్ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్ఐఏ వాదించగా, ఆ వాదనలను హదియ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియ కేసు ఓ అసాధారణమైనదని, హదియా వాంగ్మూలంపై ఇప్పుడికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొంది. విచారణకు హాజరైన హదియను ...ఉన్నత న్యాయస్థానం మీకేం కావాలని ప్రశ్నించగా... తనకు స్వేచ్ఛ కావాలని సమాధానం చెప్పింది. అంతేకాకుండా మెడిసన్ పూర్తి చేసి, డాక్టర్‌ను కావాలంటూ ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ను గార్డియన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా హదియ గతేడాది డిసెంబర్లో మతమార్పిడి చేసుకుని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. గతంలో హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేస్తే... ఆమె భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
నేను నా భర్తతోనే ఉంటా: హదియా
కొట్టాయం: కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా(25) తాను తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ కేసుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో నవంబర్ 27న ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరుకానుంది. ‘నేను ముస్లింను. నన్ను ఇస్లాంలోకి మారాలని ఎవ్వరూ బలవంతపెట్టలేదు. నా భర్త జహాన్‌తోనే ఉండాలనుకుంటున్నాను’ అని కోచి విమానాశ్రయంలో అరుస్తూ విలేకరులతో చెప్పింది. వెంటనే హదియాను ఆమె తల్లిదండ్రులు, పోలీసులు బలవంతంగా విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లిపోయారు. -
మతం మారాలంటూ మోడల్‌కు టార్చర్
ముంబై : లవ్ జిహాద్‌కు చెందిన మరో షాకింగ్ కేసు ముంబైలో వెలుగులోకి వచ్చింది. మతం పేరుతో తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ మాజీ మోడల్ ఫిర్యాదు చేసింది. హిందూ మత ఆచారాలను పాటించే కుటుంబ నేపథ్యానికి చెందిన రష్మి షాబెస్కర్, 13 ఏళ్ల క్రితం ముస్లిం మతానికి చెందిన అబ్బాయిని పెళ్లాడింది. పెళ్లి సమయంలో ఆమెతో పాటు తన మత ఆచారాలకు ఆయన అంగీకారం తెలిపాడు. కానీ గత కొన్నేళ్లుగా రష్మిని ఇస్లాంలోకి మారాలంటూ వేధించడం ప్రాంరభించాడు. మతం మారడం ఇష్టలేని రష్మి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఆమె భర్త మరో 28 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ తన సోదరుడి గర్ల్‌ఫ్రెండే కావడం గమనార్హం. గెస్ట్‌గా వారి ఇంట్లో ఉంటుండటంతో పాటు, ఆమె ఇస్లాంలోకి మారడానికి ఇష్టపడటంతో, తన భర్త ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టు రష్మి చెప్పింది. తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నట్టు తెలిపింది. అంతేకాక తాను ఇస్లాంలోకి మారడం లేదని తన కొడుకును కూడా దూరం చేశారని, ఇప్పుడు 7ఏళ్ల వయసున్న తన కొడుకు తనను తల్లిగా స్వీకరించడం లేదని కన్నీరుమున్నీరైంది. దేవాలయానికి వెళ్తుండటం వల్ల తనని ఓ రాక్షసురాలిగా తన కొడుకు భావిస్తున్నాడని, అంతలా తన బిడ్డను దూరం చేసేశారని ఆవేదన వ్యక్తంచేసింది. రష్మి ఫిర్యాదు మేరకు, ఆమె భర్త, ఆయన కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ ప్రారంభించారు. -
మతం మారాలంటూ మోడల్‌కు అత్తింటి టార్చర్
-
హదియా నవ్వుతోందిగా...
సాక్షి, తిరువనంతపురం : కేరళ లవ్ జిహాద్ కేసులో బాధితురాలిని తండ్రి హింసిస్తున్నాడన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మహిళా సంఘం స్పష్టత ఇచ్చింది. సోమవారం జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కొట్టాయంలోని వైకోమ్ గ్రామంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం బృందం ప్రతినిధి రేఖా శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. తండ్రి ఆమెను హింసిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. యువతి తల్లితో కూడా మేం మాట్లాడాం. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు రక్షణగా ఉన్నారు. ఆమె భద్రతకు వచ్చిన ముప్పేం లేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ముందు తాను జరిగిందంతా వివరిస్తానని యువతి మాతో చెప్పింది‘‘ అని రేఖా వివరించారు. చివర్లో ఆమె తన సెల్లో హదియా నవ్వుతున్న ఫోటోలను మీడియాకు చూపించటం విశేషం. కాగా, ఇన్నాళ్ల ఈ కేసులో ఉన్నతాధికారులు ఆమెను కలవటం ఇదే తొలిసారి. హదియాను తండ్రి దగ్గరే ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ రెండు వీడియోలను విడుదల చేయగా.. అందులో తనను తండ్రి హింసిస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ వీడియో ఆధారంగా హదియా భర్త షఫిన్ జెహాన్ సుప్రీంలో తాజాగా ఓ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అఖిల అశోకన్ అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడి చేసుకుని మరీ షెఫీన్‌ను వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘‘లవ్ జిహాద్ కేసు’’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా.. తండ్రి చెంత ఉన్న యువతిని వచ్చే నెల 27న సుప్రీంకోర్టులో హాజరుపరచాలంటూ కేరళ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. -
మరో ‘లవ్ జిహాద్’ కేసు కలకలం
సాక్షి, ముంబై : కేరళ లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సమయంలో.. అలాంటి ఉదంతాలు బోలెడు నమోదు అవుతున్నాయంటూ దర్యాప్తు సంస్థలు నివేదికలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. పాయల్ సింఘ్వీ అనే 22 ఏళ్ల హిందూ యువతి రాజస్థాన్ హైకోర్టులో శనివారం బుర్ఖాతో ప్రత్యక్షమైంది. ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె కోర్టు ప్రాంగణంలో తానోక ముస్లింనని ప్రకటించటం కలకలమే రేపింది. యువతి తల్లిదండ్రులు ఆమెను బెదిరించి బలవంతంగా మతం మార్పించి మరీ యువకుడు వివాహం చేసుకున్నాడని వారు ఆరోపిస్తుండగా.. తన ఇష్టప్రకారమే అంతా జరిగిందని యువతి చెబుతోంది. ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. తమకు తెలీకుండా తమ కూతురు మతం మారటం ఆ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారని అబ సింగ్ అనే ఉద్యమకారిణి చెబుతున్నారు. ‘‘ఉగ్ర సంస్థలు ఆ యువతిని బలవంతం చేసి ఈ పని చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కూతురు వెనక్కి రావొచ్చనే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం బలవంతపు మత మార్పిడులపై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన కఠిన చట్టాలే. అందుకుగానూ ఐదేళ్ల వరకు అక్కడ కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. ఈ దశలో విచారణలోనే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అబ సింగ్ చెప్పారు. బలవంతపు మత మార్పిడులు చెల్లవని మరో ఉద్యమకారిణి షాలిని చౌచాన్ అంటున్నారు. ప్రతీరోజు తన తండ్రి పక్కన కూర్చుని సాయి బాబాని కొలిచే యువతి.. ఇలా చేసిందంటే నమ్ముతామా? తల్లిదండ్రులు అంతగా ఏడుస్తున్నా ఆమె పట్టించుకోలేదంటేనే పరిస్థితి అర్థమౌతోంది. ఆమె ఆలోచనలను ఎవరో బాగా ప్రభావితం చేశారు అని షాలిని చెబుతున్నారు. గత నెల 25న ఇంటి నుంచి వెళ్లిన పాయల్ తిరిగి రాలేదని ఆమె సోదరుడు చిరాగ్ సింఘ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో నేరుగా కోర్టునే అతను ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే తాను ఏప్రిల్‌లో ఫయాజ్ మహ్మద్‌ను వివాహం చేసుకున్నట్లు యువతి రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది. కానీ, పాయల్ కుటుంబ సభ్యులు మాత్రం అపహరణ, బెదిరింపులతో ఆమెను లొంగదీసుకున్నారని.. వివాహ ధృవీకరణ నకిలీ పత్రాలు సృష్టించారని వాదిస్తున్నారు. చివరకు ఇరు పక్షాల వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు యువతిని ప్రభుత్వ వసతి గృహానికి తరలించాలని పోలీసులను ఆదేశిస్తూ నవంబర్ 7కి తదుపరి విచారణ వాయిదా వేసింది. -
‘ఆమెతో నో ప్రాబ్లమ్.. కానీ అల్లుడే’
తిరువనంతపురం: తన కూతురు ఏ మతంలోకి మారిపోయినా తనకు ఇబ్బంది లేదని లవ్ జిహాద్ కేసుతో సంచలనం సృష్టించిన హదియా/అఖిల తండ్రి అశోకన్ కేఎం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన కుమార్తెను న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తానని చెప్పారు. హదియాను గృహనిర్బంధం చేసినట్టు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ‘నవంబర్ 27న ఆమెను కోర్టులో హాజరుపరుస్తా. ఆమె ఏ మతంలోకి మారినా నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ షఫిన్ జహాన్‌ను మాత్రం అంగీకరించం(హదియా భర్త). ఆమె పోరాటాన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. ఆమె గృహనిర్బంధంలో లేదు. పోలీసు అధికారులు చుట్టూ ఉండటంతో ఆమె తనకు తానుగా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. మొదటి నుంచి నామీద, మా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నార’ని అశోకన్ వాపోయారు. హదియాను తమ ఎదుట ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల షఫిన్ జహాన్ అమిత సంతోషం వ్యక్తం చేశాడు. ఆమె చెప్పేది విన్నతర్వాత అంతా తమకు అనుకూలంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలను కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏంసీ జొసెప్పైన్ స్వాగతించారు. తాము కోరుకున్నట్టుగా హాదియా అభిప్రాయాన్ని న్యాయస్థానం వినబోతోందని, ఆమెకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ల అఖిల అశోకన్‌ను ఇస్లాం మతంలోకి మారి షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ‘లవ్ జిహాద్’గా భావించిన హైకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షఫిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హదియాను స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకుందా, లేదా తెలుసుకునేందుకు నవంబర్ 27న ఆమెను తమ ఎదుట హాజరుపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. -
సుప్రీం కోర్టు.. పలు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు సోమవారం పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. వాటికి సంబంధించి వాదనల అనంతరం బెంచ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్-సిమ్‌కార్డు లింక్‌తోపాటు గాంధీ హత్య కేసు పునర్విచారణ, కేరళ లవ్ జిహాదీ కేసు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ ప్రివిలేజ్ లను కల్పించే రాజ్యాంగంలోని 35 (ఏ) ఆర్టికల్.. తదితర కీలక అంశాలు అందులో ఉన్నాయి. గాంధీ హత్య కేసు పునర్విచారణ... నాలుగో బుల్లెట్ అంశం తెర మీదకు రావటంతో కేసు పునర్విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం స్పందించింది. దీనిపై అమికస్ క్యూరీగా నియమించబడిన అమరిందర్ శరన్ మరింత సమయం కావాలని కోరటంతో నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఇరు వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం సేకరించి.. అసలు ఈ పిటిషన్ న్యాయపరమైనదేనా అని తేల్చాల్సిందిగా అమరిందర్‌ను కోర్టు కోరింది. గాడ్సే తుపాకీ నుంచి బుల్లెట్ల నుంచి కాకుండా మరో బుల్లెట్‌తోనే ఆయన వదిలారంటూ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా.. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మాత్రం అదంతా ఉత్తదేనని వాదిస్తున్నారు. ఆ అభ్యర్థన అర్థరహితమని తోసిపుచ్చుతున్నారు. ఆధార్-మొబైల్ నంబర్ అనుసంధానం... మొబైల్ నెంబర్‌కు ఆధార్ అనుసంధామనే తప్పనిసరి నిర్ణయాన్ని తప్పుబడుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రంతోపాటు టెలికాం సంస్థలకు కూడా ఈ నోటీసులు అయ్యాయి. అంతకు ముందు విచారణ ప్రారంభ సమయంలో వ్యక్తిగతంగా పిటిషన్ దాఖలు చేయాలని మమతను న్యాయమూర్తి కోరారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ప్రశ్నించే హక్కు రాష్ట్రానికి ఉంటుందా? అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేపు రాష్ట్రాల ఉత్తర్వులపై కేంద్ర ప్రశ్నించే వీలుండా అంటూ చురకలు అంటించింది. దీంతో ప్రభుత్వం మరో పిటిషన్ ఫైల్ చేయగా.. విచారణను కొనసాగించింది. చివరకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా, కనెక్షన్ తొలగించకుండా ఉండాలంటే అన్ని మొబైల్ ఫోన్లకు ఆధార్ కార్డు నెంబర్‌ను జత చేయాలంటూ గత మార్చిలో కేంద్రం ఓ నోటీసులో పేర్కొంది. కొత్త సిమ్స్ తీసుకోవాలన్నా ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధనను మమతా బెనర్జీ ఇటీవలే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అంతకంటే తన ఫోన్ డిస్కనెక్ట్ చేసిినా తాను సిద్ధమేనని ఆమె ప్రకటించారు కూడా. లవ్ జిహాద్ కేసు... వాదనలు విన్న బెంచ్ కోర్టు యువతి మేజర్ అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తండ్రి అశోకన్ కేఎం దగ్గర ఉన్న హదియా(అఖిల)ను వచ్చే నెల(నవంబర్) 27న కోర్టులో హాజరుపరచాలని కేరళ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. వీడియో ద్వారా విచారణ చేపట్టాలన్న అఖిల తండ్రి వాదనను ఈ సందర్భంగా కోర్టు తిరస్కరించింది. - ఆధార్ అనుసంధానం వ్యవహారంపై విచారణకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు. రాజ్యాంగ బద్ధత అంశంపై నవంబర్ చివరి వారంలో ధర్మాసనం విచారణ చేపట్టనుంది - ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను గుజరాత్ ఎన్నికల పర్యవేక్ష కోసం నియమించ వద్దని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
నా తండ్రే హింసిస్తున్నాడు.. లవ్ జిహాద్ కేసులో యువతి
-
లవ్ జిహాద్ కేసు.. తొలిసారి కెమెరా ముందు హదియా
సాక్షి, తిరువనంతపురం : లవ్ జిహాదీ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ యువ జంట వ్యవహారం మరో మలుపు తిరిగింది. కెమెరా ముందుకు వచ్చిన అఖిల అలియా హదియా తన గోడును వెల్లబోసుకుంది. తండ్రి నుంచి తనుకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ నా తండ్రే నన్ను క్రూరంగా హింసిస్తున్నాడు. నన్ను చంపేసేలా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి నన్ను విడిపించండి’’ అని అఖిల వీడియోలో ప్రాధేయపడింది. దీంతో ఆమెను బలవంతంగా ఇంట్లో దిగ్భందించారా? అన్న చర్చ మొదలైంది. హిందుత్వవాది, ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ ఆగష్టులో అఖిల కుటుంబ సభ్యులను కలిసిన సమయంలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గతంలో అఖిల తల్లి పొన్నమ్మ వీడియోను విడుదల చేసిన ఆయన.. ఈసారి ఏకంగా బాధిత యువతి వీడియోనే విడుదల చేయటం విశేషం. ఇక ఈ ఆరోపణలను ఆమె తండ్రి అశోకన్ కేఎం ఖండించారు. షఫిన్ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అందుకే తన కూతురిని లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేయించాడని ఆయన అన్నారు. రాహుల్ ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అశోకన్ స్పష్టం చేశారు. అయితే.. మత ఘర్షణలు తలెత్తె అవకాశం ఉన్నందున పూర్తి వీడియోను విడుదల చేయట్లేదని రాహుల్ చెబుతున్నారు. జస్టిస్ రవీంద్రన్‌కు వీడియోను మెయిల్ చేశానన్న ఆయన మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ ఇంతవరకు ఎవరూ యువతి కలిసే యత్నంగానీ, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయటం లాంటివి చేయకపోవటం గమనార్హం. కేరళకు చెందిన 24 ఏళ్ల అఖిల అశోకన్ అనే యువతిని ఇస్లాం మతంలోకి మార్చి.. షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని ‘లవ్ జిహాద్’గా భావించిన హైకోర్టు.. వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహిళ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలు ఉన్నాయన్న ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సమయంలో ఇద్దరు మేజర్ల వివాహాన్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానికి ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే ఆమెను తండ్రి నియంత్రించే హక్కు లేదంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.