love marriages
-
ప్రేమ పెళ్లిళ్లపై రాజకీయ పెత్తనం
ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించడంపై తాజాగా చర్చ మొదలైంది. ఇంకా విచిత్రం ఏంటంటే, పలువురు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని సమర్థించడం! ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం! నిజమైన ప్రజాస్వామ్యం... తల్లితండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మన రాజకీయ నాయకుల నుండి, అంత కంటే ఎక్కువగా మన ప్రభుత్వాధినేతల నుండి నేను ఆశించే ఒక విషయం... కొద్ది మోతాదులోనైనా వారు జ్ఞానం కలిగి ఉండటం, మన రాజ్యాంగం ప్రకారం మనకు సిద్ధించిన హక్కుల గురించి వారు తెలుసుకోవడం, ఆ హక్కులను అతిక్రమించినప్పుడు అతిక్రమించామని తెలుసుకోగలిగిన తెలివిడి వారికి ఉండటం! ఇప్పుడీ దుర్భరమైన నైతిక ఉపన్యాసపు వెలుగులో నేను చెప్పబోతున్న కథను మీరు వినాలి. ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజ రాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ఈ పరిశీలన రాజ్యాంగ పరిమితులకు లోబడే జరుగుతుందని ఆయన అన్నప్పటికీ అదే రాజ్యాంగంలోని నిబంధన ఆయన సంకల్పించిన ఆ పనిని కచ్చితంగా అసాధ్యం చేస్తుంది. ఎందుకంటే అలా చేయడం అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం అవదా? రాజ్యాంగం అనే ఆ అమూల్య పత్రంలో రాసివున్న దానిని బట్టి 18 ఏళ్లకు మనం పెద్దవాళ్లం అయినట్లు! అక్కణ్ణుంచి ఒక స్త్రీకి తను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే, చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటే కనుక, ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చన్న స్వేచ్ఛ కూడా! విచిత్రంగా పురుషులకు మాత్రం 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ హక్కును రాజ్యాంగం అందించదు. వారు 18 సంవత్సరాల వయసులో ఓటు వేయవచ్చు కానీ, పెళ్లి మాత్రం చేసుకోవడానికి లేదు. ఈ సమ రాహిత్యం గురించి ఇంకో రోజు చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చితే తప్ప ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయలేమని ముఖ్యమంత్రికి తెలియదా? చూస్తుంటే ఆయనకు మన రాజ్యాంగం గురించి తెలియదని అనిపి స్తోంది. లేదా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చే అధికారం తనకు ఉందని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. లేదంటే, బహుశా...చెప్పింది చేయాలనేం ఉంది అనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుంది. ఉన్నవి ఉన్నట్లుగా ఆయన మాటలు ఇవీ: ‘‘రుషికేశ్భాయ్ పటేల్ (ఆరోగ్య మంత్రి) నాతో ఏం అన్నారంటే – నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి పారిపోతున్న అమ్మాయిల కేసులపై ఒక అధ్యయనం జరగాలనీ, పునరాలోచన జరపాలనీ... అందువల్ల ప్రేమ వివాహాలకు తల్లితండ్రుల సమ్మ తిని తప్పనిసరి చేసేందుకు ఏదో ఒకటి చేయ వచ్చనీ... ఇందుకు రాజ్యాంగం అడ్డుపడకపోతే కనుక మనం ఈ అధ్యయనాన్ని చేపట్టవచ్చు. ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఫలి తాలు రావచ్చు కదా!’’ ఇంకా విచిత్రం ఏంటంటే... పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్‌ను ఈ విషయంలో సమర్థించడం. ముఖ్యమంత్రికి తన మద్ధతునిస్తూ ఇమ్రాన్ ఖేడావాలా ఒక లేఖను కూడా రాశారు. ‘‘తల్లితండ్రులు తమ పిల్లల్ని పెంచి పోషిస్తారు. కనుక పిల్లల వివాహానికి వారి సమ్మతి తప్పనిసరి’’ అని ఖేడావాలా పేర్కొన్నారు. అంతేకాదు, గుజరాత్ శాసనసభ వర్షాకాల సమావేశాలలో దీనిపై ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ బిల్లును తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లితండ్రుల అదుపులో ఉండటం లేదు. మొద్దుబారి ఉంటున్నారు’’ అని ఖేడావాలా వ్యాఖ్యానించారు. ఈ రకమైన మనస్తత్వంతో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఒక్కరే కాదు. జెనిబెన్ ఠాకూర్ కూడా! ఆమె మహిళా ఎమ్మెల్యే. జెనిబెన్, బీజేపీ ఎమ్మెల్యే ఫతేసిన్హ్ చౌహాన్ కలిసి, ‘‘అమ్మాయి నివసిస్తున్న తాలూకాలోనే, స్థానికుల సమక్షంలో, తల్లితండ్రుల సమ్మతితో వివాహం జరిగేలా గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2009ను మార్చాలి’’ అని డిమాండ్ చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఓటు కోసం 18 ఏళ్లు నిండిన బాలికలకు క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తుండే ఈ పద్ధతైన పురుషులు, పద్ధతైన స్త్రీలలో ఎవరైనా తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునేంత పరిణతి ఆ వయసు వారిలో ఉండదన్న వాదనను తీవ్రంగా తోసిపుచ్చకుండా ఉండి ఉంటారా? అయినప్పటికీ వారు 18 ఏళ్ల బాలిక తన తండ్రి సమ్మతి లేకుండా తన ఇష్టానుసారం వివాహం చేసుకోరాదని విశ్వసి స్తున్నారు. ఇలాంటి విషయాల్లో తల్లుల సమ్మతి రెండవ ప్రాధాన్యంగా ఉంటుంది, వాళ్లనొకవేళ లెక్కలోకి తీసుకుంటే కనుక. ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం. నిజమైన ప్రజాస్వామ్యం... తల్లిదండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తుంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. మనం హక్కుల్ని పరిమితం చేస్తున్నాం. స్వేచ్ఛా పరిధులను తగ్గించేస్తున్నాం. వ్యక్తుల నిర్ణయాలపై అధికారంతో పెత్తనం చలాయిస్తున్నాం. తిరోగమనంలోకి వెళ్తున్నాం. భారతదేశానికి ప్రజాస్వామ్యంతో ఉన్నది మాతృమూర్తి సంబంధం అని మన ప్రధాన మంత్రి అనడంలోని ఉద్దేశాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మన దేశాన్ని మారుతల్లిగా ఉంచేందుకు ఆయన సంకల్పించినట్లున్నారు. మార్మికంగా ఒక అద్భుతమైన మాతృమూర్తి అవతరించకుంటే మన యువరాణులు పర దృష్టికి చాటునే ఉండిపోతారు. బుగ్గపై చిన్న ముద్దుతో ఆ సౌందర్య రాశులను నిద్ర లేపే మహదావకాశాన్ని మన అందాల రాకుమారులు కోల్పోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు!
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు! -
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తే?
గాంధీనగర్: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారాయన. ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుంది?. ఈ విషయంపై మా ప్రభుత్వం అధ్యయనం జరపాలనుకుంటోంది. అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? అనే కోణంలో పరిశీలించాకే ముందుకెళ్లాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించారాయన. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయని ఆదివారం మెహసనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారాయన. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయంలో సలహా ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని కోరారు. వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాలు రూపకల్పన చేయాలని సూచించారు అని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. రాజ్యాంగం గనుక అందుకు అనుమతిస్తే.. అధ్యయనం కొనసాగించి మంచి ఫలితం సాధిస్తాం అని తెలిపారాయన. ఈ విషయంలో ఓ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అలాంటి చట్టమేదైనా తెస్తే.. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటూ తనతో అన్నారాని సీఎం భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖేదావాలా. ‘‘ప్రమే వివాహాల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అసెంబ్లీలో చట్టం లాంటిది తెస్తే.. దానికి నా మద్దతు ఉంటుంది’’ అని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ 2021(సవరణ) ప్రకారం వివాహం వంకతో బలవంతంగా మతం మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. దోషిగా తేలితే పదేళ్ల దాకా శిక్ష పడుతుంది. అయితే గుజరాత్ హైకోర్టు ఈ చట్టంపై స్టే విధించగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. -
ప్రేమలు పెళ్లిళ్లు
-
ఈ ఏడాది దంపతులుగా, తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన స్టార్స్
ఈ ఏడాది ఇటు సౌత్.. అటు నార్త్‌లో పెళ్లి కళ కనిపించింది. అన్నీ కూడా దాదాపు ప్రేమ వివాహాలే. పెద్దల అనుమతితో వైభవంగా స్టార్స్ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో పెళ్లి చేసుకున్న కొందరు స్టార్స్ ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని, పేరెంట్స్ అయినవారూ ఉన్నారు. పెద్దల అక్షింతలతో పెళ్లి చేసుకున్న, పిల్లల కేరింతలతో మురిసిపోతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో జూన్ 9న ఏడడుగులు వేశారామె. విజయ్ సేతుపతి, నయన జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ (‘నేను రౌడీ’) చిత్రం వీరి ప్రేమకు పునాది అయింది. ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం అయిన విఘ్నేష్–నయన నిజ జీవితంలోనూ భాగస్వాములు కావడం విశేషం. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు వీరు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే విఘ్నేష్–నయన తల్లిదండ్రులు కావడం హాట్ టాపిక్ అయింది. కారణం సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. ఇక యువ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నవంబర్ 20న మూడు ముళ్లు వేశారాయన. అనూషతో కొంత కాలంగా ఉన్న స్నేహం ప్రేమగా మారడం.. ఆ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం జరిగింది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కారు. తన ప్రేయసి, హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ఏడడుగులు వేశారు. మే 18న వీరి వివాహం జరిగింది. అదే విధంగా ‘దేశముదురు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, ప్రియుడు అయిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ఆమె వివాహమాడారు. జైపూర్‌లో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరిగింది. అలాగే హీరోయిన్ పూర్ణ దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 25న వీరి వివాహం దుబాయ్‌లో జరిగింది. కాగా సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తీక్, నటి మంజిమా మోహన్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘దేవరాట్టం’ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ గౌతమ్, మంజిమా నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా దక్షిణాదిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన జంటలు కొన్ని ఉన్నాయి. వచ్చే ఏడాది పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు రామ్‌చరణ్–ఉపాసన. కోడలు గర్భవతి అనే విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 2012 జూన్ 14న రామ్‌చరణ్, ఉపాసనల వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియా మోహన్ గర్భవతి అని ఇటీవల ప్రకటించారు. అగ్రనిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం 2020లో డిసెంబరు 10న తేజస్వినీతో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న తేజస్విని ఓ బాబుకు జన్మనిచ్చారు. తనయుడికి అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు. ఈ ఏడాది నుంచి కాజల్ అగర్వాల్ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే.. 2020 అక్టోబరు 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి నీల్ కిచ్లు అని నామాకరణం చేశారు. మరోవైపు గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. తమకు కుమార్తె పుట్టిన విషయాన్ని జూన్ 10న ప్రకటించారు. పాపకు అర్నా అని పేరు పెట్టుకున్నారు. మరోవైపు నమిత కూడా ఈ ఏడాదే పేరెంట్స్ క్లబ్లో చేరారు. వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో కలిసి 2017 నవంబరు 24న తిరుపతిలో ఏడడుగులు వేశారు నమిత. ఈ ఏడాది ఆగస్టులో మే 10న తాను గర్భవతిననే విషయాన్ని నమిత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కవలలకు (ఇద్దరు మగశిశువులు) జన్మనిచ్చినట్లు ఆగస్టులో ప్రకటించారు. కృష్ణ ఆదిత్య, కిరణ్ రాజ్ అనేవి వీరేంద్ర చౌదరి, నమిత దంపతుల కుమారుల పేర్లు. ఇక దర్శక–నటుడు రాహుల్ రావీంద్రన్, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో కవలలకు (మగశిశువు, ఆడశిశువు) జన్మనిచ్చారు చిన్మయి. శర్వస్, ద్రిప్త అనేవి వీరి పేర్లు. కాగా రాహుల్ రవీంద్రన్, చిన్మయిల వివాహం 2014 మేలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ౖ వెపు వెళితే ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ సరోగసీ ద్వారా మాల్టీ మారీ చోప్రా జోనస్ అనే పాపకు తల్లిదండ్రులైనట్లు జనవరిలో ప్రకటించారు. కాగా నిక్ జోనాస్, ప్రియాంకా చోప్రాల వివాహం 2018 డిసెంబరులో జరిగింది. మరోవైపు 2016 ఏప్రిల్ 30న నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడిన హీరోయిన్ బిపాసా ఈ ఏడాది నవంబరు 12న ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాప పేరు దేవి బసు సింగ్ గ్రోవర్. హిందీలో కూడా ఈ ఏడాది కొన్ని జంటలు షాదీ ముబారక్ (వివాహ శుభాకాంక్షలు) అందుకున్నాయి. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న ఏడడుగులు వేశారు. ఈ ఇద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, నిజజీవితంలోనూ జంట అయ్యారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదే తల్లిదండ్రులయ్యారు కూడా. నవంబర్ 6న ఆలియా ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రహా అని పేరు పెట్టారు. మరో జంట అలీ ఫజల్–రిచా చద్దా దాదాపు పదేళ్లు ప్రేమించుకున్నారు. ‘ఫక్రి’ చిత్రం షూటింగ్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అక్టోబర్ 4న వీరి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు సూరజ్ నంబియార్–మౌనీ రాయ్. జనవరి 27న వీరి వివాహం జరిగింది. మరోవైపు ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు ఫర్హాన్ అక్తర్–షిబానీ దండేకర్. ఫర్హాన్ హోస్ట్ చేసిన ‘ఐ కేన్ డూ దట్’ షోలో షిబానీ పాల్గొన్నారు. ఆ షోలోనే ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. 2015లో ఏర్పడిన వీరి పరిచయం ఈ ఏడాది పెళ్లి వరకూ వచ్చింది. ఇంకోవైపు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఏడడుగులు వేశారు విక్రాంత్ మస్సే–షీతల్ ఠాకూర్. ఈ ప్రేమికుల దినోత్సవానికి (ఫిబ్రవరి 14) మిస్టర్ అండ్ మిసెస్ అయ్యారు విక్రాంత్–షీతల్. ఇక దర్శకురాలు గునీత్–వ్యాపారవేత్త సన్నీల వివాహం ఈ నెల 12న జరిగింది. ఇలా ఈ ఏడాది హిందీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి బాగానే కనిపించింది. -
‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Parents Must Teach Good Values To Children, Know Why బీహార్: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇళ్లు వదిలి వెళ్లి వివాహాలు చేసుకుంటున్న యువతుల్లో చాలా మంది హత్యకు గురౌతున్నారు. మరి కొందరు బలవంతంగా అక్రమ రవాణాకు బలి అవుతున్నారని బీహార్ డీజీపీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మాటల్లో.. ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. ఐతే వారిలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. మరికొందరు బలవంతంగా అమ్మకానికి గురవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలకు మూల్యం చెల్లించేది తల్లిదండ్రులేనని’ బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ సమస్తిపూర్‌లో నిర్వహించిన సమాజ్ సుందర్ అభియాన్ కార్యక్రమంలో అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ సంభాషిస్తూ ఉండాలి, మంచి విలువలు నేర్పించాలని, వారి భావాలను గుర్తించి అర్థమయ్యేలా వివరించి, కుటుంబ బంధాల్లో వారిని బంధించాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో డీజీపీ సింఘాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ #WATCH We've seen cases where girls left their homes for marriage without parents' consent. Many of them get killed while others are forced into the flesh trade. It is parents who pay price for such decisions: Bihar DGP SK Singhal at 'Samaj Sudhar Abhiyan' event in Samastipur pic.twitter.com/wai9jNrnG1 — ANI (@ANI) December 30, 2021 -
Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం
సాక్షి, దౌల్తాబాద్ (హైదరాబాద్): యువతీ యువకులు ఒంటరిగా అదృశ్యమై ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తిరిగి కొద్ది రోజులకే జంటగా పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక వైపు ఇరువురి బంధువులు వారి కోసం వెతుకుతుంటే.. మరో వైపు ప్రేమ వివాహాలు చేసుకున్న వారంతా ఇళ్లకు వెళ్లకుండా కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మేము ప్రేమ వివాహం చేసుకున్నామని కుటుంబసభ్యులకు వాట్సాప్ ద్వారా పెళ్లి ఫోటోలు పంపుతున్నారు. ► కొడంగల్ సర్కిల్లోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 30 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వాటిలో 28 కేసులను పోలీసులు పరిష్కరించారు. ► నిత్యం వివిధ కేసుల్లో బిజీగా ఉండే పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా మారాయి. ► అదృశ్యమైన యువతీయువకులు వివాహం అనంతరం తమకు రక్షణ కావాలని వస్తుండగా వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ► మైనర్ల అదృశ్యం కేసుల విషయానికొస్తే బాలికను తీసుకెళ్లిన వారిపై కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి బాలిక అదృశ్యానికి కారణమైన వారిని రిమాండ్‌కు తరలిస్తున్నారు. ► ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ► సెల్ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి అదృశ్యాలకు దారితీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు.. ► కొడంగల్ సర్కిల్ పరిధిలో వచ్చే మిస్సింగ్ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ► తమ అమ్మాయిని వివాహం చేసుకున్న అబ్బాయితో ముందు జాగ్రత్తగా పత్రం రాయించాలని కొందరు కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు. ► సాధ్యమైనంత వరకు అమ్మాయిలు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకోవాలని తొందర పాటునిర్ణయాలు మంచివి కావని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై పర్యవేక్షణ అవసరం కొడంగల్ సర్కిల్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 30 కేసులు నమోదు కాగా 28 పరిష్కరించాం. మిగిలిన రెండు కేసులు దౌల్తాబాద్‌లో పెండింగ్ ఉన్నాయి. వాటినికూడా త్వరలో పరిష్కరిస్తాం. అదృశ్యమైన యువతీయువకులను వారిస్నేహితుల ఆ«ధారంగా గుర్తిస్తున్నాం. ఆన్లైన్ తరగతుల అనంతరం పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు తరుచూ గమనిస్తూ ఉండాలి. – అప్పయ్య, సీఐ, కొడంగల్ -
‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’
భోపాల్: వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుని పాస్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చట్టం ఆవశ్యకతను ప్రశ్నించగా, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సమాధానమిస్తూ 1968 చట్టం మాదిరిగా కాకుండా, ఈ చట్టం అలాంటి వివాహాన్ని రద్దు చేస్తుందని, ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ‘‘మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్ జిహాదీ కోసం ‘రఫీక్‌ని రవిగా’మారనివ్వమని అన్నారు. తాము ‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్ నేతలు విజయ్ సక్సేనా తదితరులు తీవ్రంగా తప్పు పట్టారు. చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్వుతున్న పోలీసు అధికారి -
మన హీరోల ప్రేమ బంధాలు
-
ప్రేమ పెళ్లిళ్ల పంచాయతీ
ప్రేమించి పెళ్లాడే జంటలకు ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు మొదలుకొని కులం, మతం, ఆర్థిక స్థోమత వంటి అడ్డంకులెన్నో వుండగా... ఇవి చాలవన్నట్టు రాజ్యం కూడా ఆ పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఎన్నదగిన తీర్పునిచ్చింది. యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వుంటుందని, అందుకు అడ్డుపడటం జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. చిత్రమేమంటే... ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ‘పెళ్లి కోసం మతం మారడాన్ని’ నిరోధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌లో ఎక్కడా ‘లవ్‌జిహాద్’ ప్రస్తావన లేకపోయినా, దీని ప్రధాన ఉద్దేశం మతాంతర వివాహాలను అడ్డుకోవడమే. ఉత్తరప్రదేశ్ మాదిరే తాము కూడా చట్టాలు తీసుకొస్తామని హరియాణా, మధ్యప్రదేశ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించాయి. పెళ్లికి ముందు మతం మార దల్చుకున్నవారు రెండు నెలలముందు జిల్లా మేజిస్ట్రేట్‌కు వర్తమానం ఇవ్వాలని, అనుమతివచ్చాకే మతం మారాలని ఆర్డినెన్స్ ముసాయిదా చెబుతోంది. పెళ్లయినవారికి ఇది వర్తించదు. పెళ్లి ముసుగులో హిందూ యువతులను ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని కొన్నేళ్లుగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానికి ‘లవ్ జిహాద్’ అన్న పేరు కూడా పెట్టాయి. మూడేళ్లక్రితం కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా కేసు సమయంలో ఈ లవ్ జిహాద్ బాగా ప్రచా రంలోకొచ్చింది. హదియా తల్లిదండ్రులు కేరళ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హదియా, ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం కలిగించింది. ఆ పెళ్లి చెల్లదని కేరళ హైకోర్టు ప్రకటించింది. దానిపై అప్పీల్కెళ్లినప్పుడు సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పు చెల్లదని ప్రకటించడమేకాక, అసలు ‘లవ్ జిహాద్’ ఉందో లేదో తేల్చాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఆదేశాలిచ్చింది. దాని ఆచూకీ ఏం దొరకలేదని ఆ సంస్థ మరికొన్నాళ్లకు తేల్చి చెప్పింది. మన దేశంలో పెద్దలు కుదిర్చి చేసే పెళ్లిళ్లే అధికం. సంఖ్యాపరంగా తక్కువే అయినా...వాటికి సమాంతరంగా ప్రేమ వివాహాలూ వుంటున్నాయి. ఈ వివాహాల్లో అత్యధికం కులాంతరమైనవి గనుక ఆ ప్రేమికులకు కష్టాలు తప్పడం లేదు. మతాంతర వివాహాలైతే చెప్పనవసరం లేదు. ఈ మాదిరి వివాహాలను గుర్తించేందుకు 1954లోనే ప్రత్యేక వివాహ చట్టం వచ్చినా వాటికి ఆటంకాలు తప్పడం లేదు. ‘లవ్ జిహాద్’ సృష్టికర్తలెవరోగానీ రెండు పొసగని విషయాలతో పదబంధం కూర్చారు. అరబిక్ పదమైన జిహాద్‌కు ఖురాన్లో ఉన్నతాశయం కోసం చేసే పోరాటమన్న అర్థం వుంది. అది తనపై తాను చేసుకునే పోరాటం కూడా కావొచ్చు. ఆ జిహాద్ పదానికి ప్రేమతో ముడిపెట్టి దాన్ని నేరపూరిత చర్యగా అందరూ భావించేలా చేయడం లవ్‌జిహాద్ సృష్టికర్త ఆంతర్యం. ఒక యువతికి మాయమాటలు చెప్పి, ఆమెను మభ్యపెట్టి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుంటే అది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 366 కింద నేరం అవుతుంది. అందుకు పదేళ్ల శిక్ష పడుతుంది. కానీ యుక్తవయసు వచ్చినవారు ప్రేమించుకుంటే, వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారైనంతమాత్రాన దాన్ని ‘లవ్ జిహాద్’గా ఎలా పరిగణిస్తారు? ‘గజం మిథ్య... పలాయనం మిథ్య’ అన్నట్టు ఈ లవ్ జిహాద్‌ను నిరూపించే కేసు దేశంలో ఒక్కటీ లేదు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పునకు మూలకారణమైన ఉదంతంలో యువతి ప్రియాంక ఖర్వార్ తండ్రి ఆమె పెళ్లాడిన సలామత్ అన్సారీపై చిన్నపిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వర్తింపజేసే అత్యంత కఠినమైన పోక్సో చట్టంకింద, మరికొన్ని సెక్షన్లకింద కేసులు పెట్టాడు. ఈ పెళ్లి దురుద్దేశపూరితమైనదని, మోసపూరితమైనదని ఆయన అభియోగం. వీటిని కొట్టేయాలన్న జంట వినతిని హైకోర్టు అంగీ కరించింది. తాము ఎవరితో కలిసివుండాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ యువజంటకు వుంటుందని తేల్చిచెప్పింది. ఈ వ్యక్తిగత సంబంధంలో జోక్యం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో 2014లోనూ, మొన్న సెప్టెంబర్‌లోనూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవి కాదని ధర్మాసనం చెప్పడం ఇక్కడ గమనార్హం. ప్రియాంక, సలామత్‌లను తాము హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారిగా చూడటం లేదని... ఎదిగిన ఇద్దరు వ్యక్తులుగా, స్వేచ్ఛాయుతంగా నిర్ణయం తీసుకున్నవారిగా పరిగణిస్తున్నామని చెప్పింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలో ఖాప్ పంచాయతీలు అనాగరిక తీర్పులకు పెట్టింది పేరు. ఆడపిల్లల వస్త్రధారణ మొదలుకొని కులాంతరవివాహాలవరకూ అవి తీర్పులిస్తుంటాయి. అడపా దడపా మరణశిక్షలు విధించిన చరిత్రకూడా వాటికుంది. ఆ పంచాయతీలను ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేయడం సరికాదని, వాటి అదుపునకు చట్టం తీసుకురావాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చట్టం రాలేదు సరికదా... ఇప్పుడు మతాంతర వివాహాల నియంత్రణకు ఏకంగా రాజ్యమే ఖాప్ పంచాయతీ అవతారమెత్తింది. చట్టాలు సమాజశ్రేయస్సుకూ, దాని పురోగతికి తోడ్పడాలి తప్ప రాజ్యాంగబద్ధంగా తమకు నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకునేవారిని నేరస్తులుగా పరిగణించకూడదు. తమ ఇష్టానికి భిన్నంగా పెళ్లి చేసుకున్న సంతానంపై తల్లిదండ్రులు అలకబూనటాన్ని, కోపగించటాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ స్వయంగా రాజ్యమే అందులోకి జొరబడి, ఆ పిల్లల ఇష్టాయిష్టాలను నియంత్రించాలనుకోవడం, వాటిని నేరపూరితం చేయడం సామాజికంగా తిరోగమనం తప్ప మరేమీ కాదు. పౌరుల్లో రాజ్యాంగ నైతికతను పెంచాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా ప్రవర్తించడం అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచదు. -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
ప్రేమే నేరమా..!
సాక్షి, సిటీబ్యూరో: మరోసారి పరువు పడగ విప్పింది.. ఉన్మాదమై బుసకొట్టింది.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచం గుప్పెట్లోకి వచ్చినా.. మానవ సంబంధాల్లోని బూజు మాత్రం తొలగిపోలేదు. మనిషితనం అదేపనిగా మాయమవుతూనే ఉంది. గచ్చిబౌలికి చెందిన హేమంత్ హత్య మరోసారి అత్యంత అమానవీయమైన కుల ఉన్మాదాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు అవంతి, హేమంత్లు. మైనారిటీ తీరి మేజర్లయ్యారు. కులాలు వేరైనా మనస్సులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. అవంతి కుటుంబానికి ఇది మింగుడుపడలేదు. హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. మిర్యాలగూడ తరహాలో నగరంలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య మరోసారి చర్చనీయాంశమైంది. కుల, మతాంతర వివాహాలకు రక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించకపోవడం వల్లనే నేరాలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, మనస్తత్వ నిపుణులు హేమంత్ హత్యను తీవ్రంగా ఖండించారు. ప్రేక్షకపాత్ర మంచిది కాదు వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. కానీ సమాజంలో పలుకుబడి గల వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందించడం లేదు. తప్పును తప్పు అని చెప్పకపోవడం కూడా నేరమే. పరువు హత్యలను కొంతమంది మనోభావాలకు ముడిపెట్టి ఇలా ప్రేక్షకపాత్ర వహించడం వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా అగ్రకులాలకు చెందిన వారి పిల్లలు, దళితుల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అగ్రకులాల మధ్య కూడా కుల ఉన్మాదం పెరిగింది. (మరో ‘పరువు’ హత్య) ఒక కులాన్ని మరో కులం సహించలేని దారుణమైన కుల ఆధిపత్యం ఇది. చాలా దారుణం. ఇలాంటి హత్యల వల్ల మానవత్వం నశిస్తుంది. నేరస్తులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్ల కూడా నేరాలు పెరుగుతున్నాయి. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడుతుంది. ప్రేమ పెళ్లిళ్లలో ఇష్టమైతే తల్లిదండ్రులు ఆ జంటను ఆశీర్వదించాలి. లేదా వారి ఇష్టానికి వారిని వదిలేయాలి, కానీ ఇలా హత్యలకు పాల్పడటం దారుణం. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు రావాలి కులాంతర, మతాంతర వివాహాలకు సంబంధించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బలంగా లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. 1954లో తెచ్చిన ఈ చట్టం మొక్కుబడిగా కొద్దిపాటి నగదు ప్రోత్సాహం ఇవ్వడానికే పరిమితమైంది. కానీ సరైన రక్షణ కల్పించలేకపోతోంది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు చట్టబద్ధమైన రక్షణ, సామాజిక భద్రత ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే ఇలాంటి హత్యలు జరగవు. ‘ఆడ పిల్లలు కుటుంబ గౌరవానికి ప్రతీక’ అనే పాతకాలం నాటి భావాల్లో కూడా మార్పు రావాలి. ఆడైనా, మగైనా సమానమే. కుల, మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు కూడా సాధ్యమైనంత వరకు ఇరువైపులా తల్లిదండ్రులను, కుటుంబాలను ఒప్పించడం మంచిది. పోలీసుల ద్వారా, ఇతరత్రా సంస్థల ద్వారానైనా సరే ఒప్పించడం ఒత్తిడి తెచ్చి ఒప్పించడం వల్ల ఇలాంటి హత్యలను ముందస్తుగానే అడ్డుకున్నట్లవుతుంది. – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త హత్యలతో పంతం నెగ్గించుకోవడం దారుణం అప్పటి వరకు మనిషిలో నిద్రాణంగా దాగి ఉన్న నేర స్వభావం తన అధిపత్యానికి విరుద్దమైన ఘటనలు జరిగినప్పుడు ఇలా బయటకొస్తుంది. ఈ రోజుల్లో కూడా కులపిచ్చి హత్యలకు పాల్పడే స్థాయిలో ఉండటం చాలా దారుణం. సాధారణంగా కుటుంబంలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. కేరింగ్ అండ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. కేవలం ఒకరిద్దరు వ్యక్తులు తమ పంతాన్ని నెగ్గించుకోవడం, తాము చెప్పిందే చెల్లుబాటుకావాలనుకోవడం హత్యల వరకు దారితీయడం శోచనీయమే. ఇలాంటి దారుణాలు మరోసారి పునరావృతం కాకుండా సమాజం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ రాధికా ఆచార్య, మనస్తత్వ నిపుణులు -
ప్రేమ తలనొప్పికి.. కరోనా నివారణ
కరోనా వైరస్ విరహ వేదనతో కొందరిని కష్టాల కడలిలో ముంచేస్తే మరికొందరిని సుఖసంతోషాలతో నదుల కెరటాలపై తేలియాడుతూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అని పాడుకునేలా చేసిందట. పెద్దలకు టోకరా వేసి రిజిస్టర్ మ్యారేజీ చేసుకునే ప్రేమికులకు కరోనా వైరస్ చెక్ పెట్టిందని రిజిస్ట్రార్‌శాఖ అధికారి ఒకరు బయటపెట్టారు. లాక్డౌన్ పుణ్యమానితమ పిల్లలు సేఫ్ అంటూ పెద్దలు సంబరపడుతున్నారని ఆయన చమత్కరించారు. సాక్షి, చెన్నై : పెద్దలు నిశ్చయించే వివాహాలకు దాదాపు కాలం చెల్లిపోగా ప్రేమ పెళ్లిళ్లవైపే నేటి యువతరం మొగ్గుచూపుతోంది. అమ్మాయి లేదా అబ్బాయిని ఖరారు చేసుకునే ముందు గతంలో పెద్దలు కుల గోత్రాలతోపాటు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలను ఆరా తీసేవారు. ఇరుపక్షాల పెద్దల సమ్మతితో బంధుమిత్రుల సమక్షంలో జరిగే వివాహాలకు ఒక భద్రత ఉంటుందని గతంలో పిల్లలు కూడా విశ్వసించేవారు. వాటన్నింటినీ నేటి తరం చాదస్తంగా కొట్టిపారేస్తోంది. పెద్దలు చేసిన వివాహాలు పెటాకులు కాలేదా, మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్ల ముచ్చటై విడాకులకు దారతీయాలేదా అని వాదిస్తోంది. కలిసి జీవించేది మేము కాబట్టి జీవిత భాగస్వామిని కూడా మేమే ఎంచుకుంటాం, మీకు నచ్చితే ఓకే, నచ్చకున్నా ఓకే పెళ్లి మాత్రం ఆగదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి స్నేహితులే పెళ్లి పెద్దలుగా రిజిస్టర్ మ్యారేజీలు చేసేసుకుంటున్నారు. అమ్మాయి, అమ్మాయి తరఫువారికి తెలియకుండానే పెళ్లిళ్లు రిజిస్టర్ కావడం, విదేశాల్లో ఉన్నవారితో పెళ్లి జరిగినట్టుగా నమోదు చేయడం వంటి ఘటనలు జరిగేవి. ఇలాంటి సందర్భాల్లో వధూవరుల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రిజిస్ట్రార్ ఆఫీసులో అడ్డుకోవడం, భిన్న కులమతాల వారైతే పరువు హత్యలకు సైతం దారితీయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ వివాదాలు కోర్టు కేసులుగా మారినపుడు రిజిస్ట్రార్, పెళ్లి చేసుకున్నవారు, సాక్షి సంతకం పెట్టినవారు అంతా చిక్కుల్లో పడిపోతున్నారు. వివాహం రిజిస్టర్ చేయాలంటే వధూవరులు ఇద్దరూ రిజిస్ట్రార్ సమక్షంలో నిలవాలని, పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగినా వివాహ సంప్రదాయ దుస్తులతోనే రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లడం, వివాహ వేడుకను వీడియోలో విధిగా చిత్రీకరించడం, పెళ్లి ఫొటో, శుభలేఖ జతచేయడం వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాగా ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తున్న దశలో అన్ని వ్యవహారాలు స్తంభించి పోయాయి. లాక్‌డౌన్‌తో అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కరోనా వైరస్ వేళ ఇలాంటి ప్రేమ వివాహాలకు కళ్లెం పడింది. ప్రేమకు సై..పెళ్లి మాత్రం నై పెద్దలకు తెలియకుండా మరికొంతకాలం ప్రేమకు సై..పెళ్లి మాత్రం ఇప్పట్లో నై అనే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా పెద్దలకు తెలియకుండా జరుగుతున్న పెళ్లిళ్లతో తలెత్తే తలనొప్పులు తగ్గిపోయాయని ఆనందపడిపోతున్నట్లు రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు. లాక్డౌన్ వల్ల దాదాపుగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగవచ్చు. ఆఫీసు పేరుతో బయటకు వచ్చి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ప్రేమికులకు లేకుండా పోయిందని అంటున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజీలు చేసుకునేవారితో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కరోనా వైరస్ వల్ల అందరితోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రేమికుల వల్ల వచ్చే తిప్పల నుంచి మాత్రం తప్పించుకున్నామని తెలిపారు. ఆలయాల్లో పెళ్లి చేసుకుని అక్కడ ఇచ్చే రశీదును చూపి కూడా కొందరు రిజిస్టర్ చేసుకునేవారు. లాక్డౌన్ వల్ల ఆలయాల తలుపులు కూడా మూసివేయడం వల్ల ఆ బాధ కూడా తప్పిందని చెప్పారు. రాష్ట్రంలో నమోదయ్యే రిజిస్టర్ వివాహాల్లో 5 శాతం పెద్దలకు తెలియకుండా చేసుకున్నవేనని అన్నారు. అందులోనూ అధిక శాతం చెన్నైలో జరుగుతున్నాయని తెలిపారు. లాక్డౌన్ వల్ల ఇళ్ల నుంచి పారిపోయి చేసుకునే వివాహాలే కాదు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని రిజిస్ట్రారు కార్యాలయానికి వచ్చేవారి 50 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు. 2019–20లో 1.32 లక్షల రిజిస్టర్ మ్యారేజీలు జరగగా ఇక ఈ ఏడాదిలో ఇంతవరకు 50 వేలు కూడా దాటలేదని వివరించారు. -
‘ప్రేమ పెళ్లి’కి ప్రోత్సాహం
భద్రాచలంఅర్బన్: ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సాధారణం అయ్యాయి. ఇందులో కులాంతర వివాహాలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఈ పెళ్లిళ్లను అంగీకరించకపోవడంతో ఇల్లు వదిలి బయట జీవిస్తున్న జంటలే అధికం. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహిస్తోంది. అయితే దంపతుల్లో ఒకరు తప్పకుండా దళితులై ఉండాలి. అలా చేసుకున్న వారికి రూ.2.50 లక్షల నగదు అందిస్తోంది. గతంలోరూ.50 వేల సాయం అందించేవారు. గత నవంబర్‌లో ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచింది. అయితే జిల్లాలో ఇలాంటి వివాహాలు చేసుకున్న వారు చాలా మంది ఉన్నా.. దీని గురించి తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు.ఈ పథకం 1980 నుంచే అమల్లో ఉంది. నాడు కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ. 3,000 అందించేవారు. 1993లో రూ.10 వేలకు పెంచారు. 2011లో రూ.50 వేలు చేశారు. గత నవంబర్ నుంచి రూ. 2.50 లక్షలు అందిస్తున్నారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేలకు పెంచిన తర్వాత జిల్లాలో 84 జంటలు దరఖాస్తు చేసుకోగా, 73 జంటలకు సాయం అందింది. ఇంకా 11 జంటలకు రావాల్సి ఉంది. ప్రభుత్వ సాయం రూ. 2.50 లక్షలకు పెంచిన తర్వాత 15 దరఖాస్తులు రాగా, 2 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటకు బాండ్ అందజేస్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ (ఫైల్) దరఖాస్తు చేయడం ఎలా..? ఈ పథకం కోసం దంపతులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల, ఆదాయ, వయస్సు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ జాయింట్ అకౌంట్, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలను జతచేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాతే అదే దరఖాస్తును జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన జంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందిస్తారు. మూడేళ్ల తర్వాత డబ్బులు చేతికొస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఈ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో మొదట లబ్ధి పొందిన జంట మన జిల్లావారే. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 15 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెండు జంటలకు ప్రోత్సాహక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు అందించాం. మూడేళ్ల తర్వాత నగదు తీసుకోవచ్చు.– వెంకటేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి అధికారి. -
ప్రేమికుల దినోత్సవం; ఇవి మీకు తెలుసా
ప్రేమ రెండక్షరాల పదం.. ప్రేమ రెండు హృదయాల స్పందన..ప్రేమ రెండు మనస్సుల్లో చెదిరిపోని మధుర జ్ఞాపకం.. ప్రేమ నీకు నేనున్నానని తోడుగా నిలిచేది..ప్రేమ కష్టాల్లోనూ.. సుఖాల్లోనూ వెన్నంటి ఉండేది.. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు రెండు మనుస్సులు ఎప్పుడూ పరితపిస్తుంటాయి. స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా నిలిచిన పలువురి అభిప్రాయాలు వాలంటైన్స్‌డే సందర్భంగా.. ప్రేమికుల రోజు వచ్చిందిలా ప్రేమికుల రోజు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వాలంటైన్. వాలంటైన్ డేను జరుపుకోవడానికి కారణం ఆయనే. రోమ్‌నగరంలో మతాచార్యుడిగా వాలంటైన్ పనిచేసేవాడు. క్లాడియస్ అనే రాజు పాలించేవాడు. తన సామ్రాజ్యంలో సైనిక దళాల్ని ఏర్పాటు చేయాలనేది ఆయన కోరిక. రాజ్యంలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవడానికి వీల్లేదని శాసిస్తాడు. వాలంటైన్ దీనిని వ్యతిరేకించారు. రహస్యంగా వివాహాలు చేశాడు. దీంతో అతనికి మరణశిక్ష విధించి కారాగారంలో బంధించాడు. జైల్లో ఉన్నప్పుడు తన కోసం చాలా మంది యువత వచ్చేవారు. కిటికీల్లోంచి వారు అందించిన పువ్వులు, సందేశాల(లేఖలు)తో జైలు గది నిండిపోయేది. సందర్శకుల్లో జైలు సంరక్షణ అధికారి కూతురు ఉండేది. వాలంటైన్‌తో మాట్లాడుతుండేది. ఆమె చూపే ప్రేమకు కృతజ్ఞతలు చెబుతూ ‘ప్రేమతో నీ వాలంటైన్’ అనే సందేశాన్ని లేఖలో రాస్తాడు. ఆ లేఖ రాసింది ఫిబ్రవరి 14, క్రీ.శ. 269 అందుకే అప్పటి నుంచి ఫిబ్రవరి 14న వాలంటైన్డేగా జరుపుకుంటున్నారు. మధురమైన జ్ఞాపకం... మంచిర్యాలటౌన్: రెండక్షరాలు... రెండు మనసులు.. ఆ రెండక్షరాలే రెండు గుండెల్లో ప్రేమను చిగురింపజేసే రెండు హృదయాల కలయిక. మదిలో పదిలంగా దాచుకున్న మాటను కానుకలతో.. ఆ మదిలోని మాటలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు ఏర్పడిన రోజే ప్రేమికుల దినోత్సవం. పిల్లల విషయంలో పెరిగే వయసుతో పాటు పిల్లల మనస్తత్వాలు మారుతుంటాయి. వారికి మంచి, చెడు, తప్పు, ఒప్పులను బేరీజు వేసుకోలేరు. టీనేజ్‌లో శరీరంలో జరిగే మార్పులు, ఆలోచనలో వచ్చే తేడాలతో వారు సతమతమవుతూ ఉంటారు. ఈ వయస్సులో వారిలో కలిగే అనుమానాలను వచ్చే మార్పులను, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వివరించాలి. టీనేజ్ పిల్లలు బయటి వ్యక్తులు చూపే ప్రేమకే లొంగిపోయే ప్రమాదం ఉంది. ప్రేమతో గెలవండి ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అందమైన అనుబంధం, అపురూప జ్ఞాపకం, మరుపురాని మధురఘట్టం. అనుభవించే వారికి మాత్రమే ప్రేమలోని మాధుర్యం అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు... అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. అందరూ కలిసిమెలసి ఉన్నప్పుడే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. ‘ప్రేమ’ మోసానికి గురికావద్దు.. ప్రేమ పేరిట అబ్బాయిలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తరగతి గదుల్లోనో, కళాశాలల్లోనో, ఒకే ఊరిలోనో వెల్లివిరిసిన స్నేహం ప్రేమగా మారడానికి స్మార్ట్‌ఫోన్, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల యుగంలో ఎక్కువ కాలం పట్టడం లేదు. అబ్బాయిలు చూపించే విపరీత ప్రేమకు పలువురు యువతులు త్వరగానే ఆకర్షణకు గురవుతున్నారు. చిన్న వయస్సులో ఏర్పడే ప్రేమలతో జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోలేక కొందరు, ప్రేమ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం సమాజంలో అంతరాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. కులాంతర వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ప్రేమించుకున్న జంటల్లోనే కనిపిస్తుంది. అమ్మాయిలో, అబ్బాయిలో ఒకరు ఎస్సీ కులానికి చెందిన వారిని ఇతర కులానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే గతంలో రూ.50 వేలు ఉన్న ప్రోత్సాహకంను గతేడాది నవంబర్ నుంచి రూ.2.50 లక్షలకు ప్రభుత్వం పెంచింది. బీసీలకు చెందిన వారు ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే వారికి రూ.10వేలను బీసీ సంక్షేమశాఖ ద్వారా అందిస్తున్నారు. ప్రేమ పెళ్లిల్లోనే 90 శాతానికి పైగా కులాంతర వివాహాలే జరుగుతుండడంతో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహం వారికి కొంతమేర ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ మైకంలో యువత... మంచిర్యాలక్రైం: ప్రేమ.. ఆకర్షణ... స్నేహం అనే ఈ పదాలకు అర్థాలు తెలియని జీవి తాలు... అన్నీ తమకే తెలుసనుకునే నేటి యు వతరం.. మంచి చెప్పే మనుషులు కానీ జీవి తాలు చక్కదిద్దే గురువులు, తల్లి§దండ్రుల మా టలు కూడా వినని కనిపించని నేటి సమాజంలో.. ప్రేమ మైకంలో యువత తమ వయసును మరిచిపోయి విషవలయంలో చిక్కుకొని తెలిసితెలియని వయస్సులో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో మో సపోయిన సంఘటనలు జిల్లాలో కొన్ని ప్రేమి కుల దినోత్సవం సందర్భంగా మీ కోసం... ప్రేమ పేరుతో మోసపోయిన కొన్ని సంఘటనలు.. మందమర్రికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో మోస పోయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతి చేసి తప్పించుకు తిరుగడం మొదలు పెట్టాడు. యువతి తల్లిదండ్రులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అదే రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ పసికందును ఆసుపత్రిలోనే మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిపోయారు. మంచిర్యాలకు చెందిన సౌమ్య, శివకృష్ణలు (పేర్లు మార్చాము)ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలు గడిచాక నువ్వు బాగ లావయ్యావు... నీ అందమంత తగ్గిపోయింది.. నీ ప్రేమలో కట్నం కానుకలు లేకుండా నిన్నుపెళ్లి చేసుకున్నాని, వేధింపులకు గురి చేయడంతో సౌమ్య ఎవరికి చెప్పుకోలేక పోలీసులకు ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు కూతురును దగ్గర తీసుకొని కోర్టుకు వెళ్లారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనికి చెందిన మంద ప్రశాంత్ అదే కాలనికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమ వ్యవహారం సాగించాడు. చివరికి యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ప్రశాంత్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రశాంత్ ఇంటిముందు సూపర్వాస్మల్–33 సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇవి మీకు తెలుసా ► వాలంటైన్స్ డే సందర్భంగా దాదాపుగా 151 మిలియన్ల కార్డులు అమ్ముడు పోతాయి. ► 400 మిలియన్ డాలర్ల విలువ చేసే పూలు అమ్ముడుపోతాయి. ►భారత్ తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్లలో ఈ డే ను జరుపుకుంటారు. ►వాలంటైన్ డే అంటే సందేశాలు ఇచ్చిపుచ్చుకునే రోజు అని .. కలానుగనంగా ఇది ప్రేమికుల రోజుగా మారింది. ►మనుషులే కాదు. పక్షుల ప్రేమకు ఇదే రోజు ఎంపిక చేశారు. ఫిబ్రవరి లోనే పక్షులు ఎక్కువగా జంటలను వెతుక్కుంటాయని అందుకే ఇదే రోజును ఎంపిక చేశారని విశ్లేషకుల అభిప్రాయం. ప్రేమ కవితలు ప్రియా.. ఓ ప్రియతమ.! దివిలేని దేవతలంతా ఒక్కటై ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ‘రా..రమ్మని’స్వర్గపు వాకిలి తెరిచినా..నే మాత్రం నిను వీడీ పోలేను.. ఎందుకంటావా..? చెలీ – అమృతం తాగిన దేవతలా చహచర్యం – కన్నా అమృతం ఒలకిస్తూనీ అధరాల – నుంచి జారే ‘ప్రేమ సందేశమే’ నాకు – అమూల్యం.... అపూర్వం..! అవును.. నిజమే.. ఒక ప్రేమకుడికి ప్రేయసి సన్నిధానమే.. స్వర్గం..! – జలకాలాడిన జలమే గంగాజలం.!! – మరో ప్రేయసికి ప్రియుని తోడే – లోకం.. అమ్మా నాన్నా.. అన్నం నీళ్లు అన్నీ అతనే.. – జ్ఞాపకాలే.. జ్ఞానగుళికలు, జీవన ప్రదాతలు..!! ‘ప్రేమ’అనేది ఒక ఉప్పెన..అది ఎప్పుడు ఎలా పుడుతుందో.. ఎవరిని చుడుతుందో చెప్పలేరు. కానీ ‘ప్రేమ ప్రవాహం’ లో ‘ప్రేమ ముత్తు’లో మునిగి పోయినప్పుడుమాత్రం అంతా పరవశ..! అన్నింటా అతిశయమే..!!మధురమైన ఊసులతో ఊరించి మైమరపించినా తియ్యటి తలపులతో కవ్వించి కలవర పెట్టినా.. ఏం చేసినా.. అది ప్రేమకే చెల్లు..!! కెరమెరి(ఆసిఫాబాద్) -
నువ్వు ఆకాశం.. నేను నీకోసం..
ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెనన ుకో ఈ బతుకే మనుసు తీరా.. అన్నాడొక కవి. దివిసీమ తుపాను బతుకులో కల్లోలం రేపినా.. ప్రేమ స ుమాలు పూయించి.. సేవాభావంతో పరిమళిస్తున్న నాగరాజు, లక్ష్మి దంపతుల బంధం ఆదర్శంగా నిలుస్తు ంది. ప్రమాదంలో కంటి చూపు పోయినా.. నా కన ులు నీవిగా చేసుకుని చూడు.. అంటూ భరోసా ఇచ్చిన భారతితో జీవితం పండించుకున్న వెంకటరమణను చూస్తే ముచ్చటేస్తుంది. నిజమైన ప్రేమ అజరామరమని.. రాఘవేం ద్రరావు, నాగమణి దం పతుల విజయవంతవై ున జీవితాన్ని పరిశీలిస్తే అవ గతమవుతుంది. వ ునల్ని ప్రేమించేవారు పక్కనే ఉంటారని.. జ్ఞాపకా లలో వాళ్లెప్పుడూ చిరంజీవులని వందేళ్ల క్రితం హెలెన్ చెక్కించిన శిలా ఫలం రుజువు చేస్తుంది. నిన్న పరిచయమై.. నేడు ముగిసిపోయే ప్రేమ కథలు కావివి. నిఖార్సయిన ప్రేమతో నిజాయితీగా సాగి పోతున్న బంధాలివి. పచ్చగా పరిమళిస్తున్న ప్రేమ సుగంధాలివి. నీకు నేను నాకు నువ్వు బతుకుల్లో అల్లకల్లోలం రేపిన 1972 నాటి దివిసీమ ఉప్పెనను చాలామంది మరిచిపోయారేమో.. నాగరాజుకు మాత్రం చేదు జ్ఞాపకం. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన ఇసకపల్లి నాగరాజు కుటుంబాన్ని ఉప్పెన మింగేసింది. ఇంటికప్పు విరిగిపడి కుడిచేయి పోయింది. దీంతో సహాయానికి వచ్చిన సైనికులు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత రుషికేష్‌లోని కాలా కంబల్ ఆశ్రమంలో చేరి గురువు వద్ద మూలికా వైద్యం నేర్చుకున్నాడు. గురువు చనిపోవటంతో భిక్షాటన చేస్తూ ఎస్.కోటలో పుణ్యగిరి చేరాడు. కింతాడ లక్ష్మిది విశాఖ జిల్లా పెదబయలు సమీపంలోని ముంచంగిపుట్టు గ్రామం. ఈమెకు 14యేళ్ల ప్రాయంలో పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా చూడటంతో ఆమె ఎస్.కోటలోని పుణ్యగిరి వచ్చేసి యాచనే మార్గంగా ఎంచుకుంది. ఆమెకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చింది. అప్పుడే నాగరాజు, లక్ష్మిల మధ్య పరిచయం అయ్యింది. ఆమెను తన కాళ్లపై నడిపిస్తానంటూ భరోసా ఇచ్చాడు. ఆమె వండి పెడతానని మాటిíచ్చింది. నాటి నుంచి తనఖా పెట్టిన స్థలంలో చిన్న పాక వేసి అనాధలకు అన్నదానం ప్రారంభించారు. తర్వాత అన్నపూర్ణాశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి భిక్షాటన చేసిన మొత్తంతో నిత్యం అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. దివ్యాంగులైన వీరిద్దరి పవిత్రమైన ప్రేమ మరింత మంది ఆకలి తీర్చాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. – శృంగవరపుకోట ఒకరికి ఒకరు వారిద్దరూ దివ్యాంగులు.. ఇద్దరి మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారే మెరకముడిదాం మండలం సిరిదేవిపురా నికి చెందిన పళ్ల లక్ష్మి, విజయనగరం పట్టణానికి చెందిన బొందల గణపతి. లక్ష్మి విజయనగరంలోని మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు.. అదే కళాశాల బయట వ్యా పారం చేసుకుంటున్న బొం దల గణపతిల మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ సుమారు ఐదేళ్లు ప్రేమించుకున్నాక తల్లి దండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2017లో ఇద్దరికి విజయన గరంలోని గణపతి ఇంటి పెద్దలు వివాహం చేశారు. ప్రస్తుతం లక్ష్మి గుర్ల గ్రంథాలయంలో లైబ్రేరి యన్‌గా పనిచేస్తోంది. గణపతి విజయనగరంలోని రోడ్డుపై దుకాణం ఏర్పాటు చేసుకొని బెల్ట్‌లు, హెల్మెట్లు, కళ్లజోళ్లు అమ్ముతున్నాడు. వీరికి మూడేళ్ల చిన్నారి భాగ్యశ్రీ, కుమారుడు సాత్విక్ ఉన్నారు. వివా హమైనప్పటి నుంచి ప్రేమానురాగాలతో ఉంటూ ఆదర్శంగా నిలిచారు. నా తోడువై నా నీడవై సీతానగరం–పెదబోగిలి కాలనీకి చెందిన నడు కూరు శ్రీనివాస రావు, కల్యాణి దివ్యాంగులు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. శ్రీని వాసరావు 2014లో మార్చి8న పెద్దల సమక్షంలో కల్యాణిని వివాహం చేసుకు న్నారు. ఇరువురికీ స్థిరాస్తులు లేక పోయినా తల్లిదండ్రులకు ఉన్న మంచిపేరును ఆస్తిగా భావించి జీవనం సాగిస్తున్నారు. శ్రీని వాసరావు తండ్రి సంగ మేశ్వరరావు స్థానికం గా మంచి పేరుంది. గ్రామ పురోణీలు, దరఖాస్తులు రాస్తూ కుటుంబాన్ని పోషిసు ్తన్నారు. ఈ దంపతులకు 6 ఏళ్ల వయసున్న కుమార్తె, మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. నీవుంటే వేరే కనులెందుకు.. బాడంగి మండలం ఆకు లకట్ట గ్రామానికి చెందిన యువకుడు బోనుమద్ది వెంకటరమణ, శ్రీకాక ుళం జిల్లా పాలకొండ వద్ద నర్సిపురానికి చెందిన వ రసకు మేనత్త కువ ూర్తె అయిన భారతితో ప్రేమలో పడ్డాడు. కొన్నా ళ్లయ్యాక వెంకటరవ ుణ గ్యాస్ ప్రమాదంలో ఎడమ కంటికి గాయమై చూపు కోల్పోయాడు. ఈ సంఫ ుటన వీరి ప్రేమనుప్ర భావితం చేయలేదు. చూపు లేదని భారతి మన సు మార్చుకోలేదు. వెం కటరమణతోనే జీవి తమని పెద్దలకు స్పష్టం చేసింది. వీరిద్దరూ 2017లో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 14న ఒక్కటయ్యారు. వెం కటరమణ వడ్రంగి వృ త్తిలో స్థిరపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఏడాది న్నర క్రితం చాందిని అనే కుమార్తె జన్మించింది. స్నేహితులే పెద్దలై.. బొబ్బిలి రూరల్: బొబ్బిలి పంచాయతీ కార్యదర్శిగా పనిచే స్తున్న తీళ్ల రాఘవేంద్ర రావు 2001 నుంచి స్వగ్రామానికి చెందిన మత్స నాగమణిని ప్రేమించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీ కరించకపోవడంతో స్నేహితుల సహకారంతో 2003లో పెంట గ్రామంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఓ పాప, బాబుతో హాయిగా ఉంటున్నారు. ఆదర్శ దంపతులు మండలంలో అలజంగికి చెందిన యజ్జల విజయానంద్ కుమార్, చిన్నమ్మలు ప్రేమికులు. దివ్యాంగుడైన విజయానంద్, అదే గ్రామా నికి చెందిన చిన్నమ్మలును 12ఏళ్ల క్రితం ప్రేమించాడు. వీరిద్దరు తమ ప్రేమను పెద్దలకు చెబితే తొలుత ససేమిరా అన్నారు. అనం తరం వీరి ప్రేమను గుర్తించి వివాహం జరిపారు. దివ్యాంగుడైన విజయానంద్, చిన్న మ్మలు ఎంతో అప్యాయతానురాగాలతో హాయిగా ఉన్నారు. వీరికి కుమార్తె ఆశాజ్యోతి, కుమారుడు సూర్య నాగచైతన్య ఉన్నారు. ప్రేమకు వైకల్యం అడ్డు కాదని వీరు నిరూపించారు. – బొబ్బిలి రూరల్ హాయిగా ఉన్నాం ఎంతో హాయిగా ఆనందంగా జీవ నం సాగిస్తున్నాం. పెద్ద లను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నా ప్రస్తుతం అం దరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం. పెద్దలు మమ్మల్ని అంగీకరించారు. – రాఘవేంద్రరావు,పంచాయతీ కార్యదర్శి, బొబ్బిలి అర్థం చేసుకున్నాం ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ఒకరి భావాలను ఒకరం గౌరవిం చుకుంటున్నాం. పిల్లలతో ఆనందంగా.. ఆదర్శంగా జీవిస్తున్నాం – నాగమణి, బొబ్బిలి అన్నపూర్ణాశ్రమంలో భార్య లక్ష్మికి అన్నం తినిపిస్తున్న నాగరాజు -
ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నావో..
త్రేతా యుగంలో సీతారాముల ప్రేమ లోకానికి రావణుడి పీడను వదిలించింది. ద్వాపరంలో సత్యభామ ప్రేమ నరకాసురుడి కథను అంతం చేసింది. కలియుగంలో పద్మావతి ప్రేమ శ్రీనివాసుడి సాక్షాత్కారాన్ని సకల జనులకు కలిగించింది. ప్రేమ ఎప్పుడూ అంతే మంచినే కోరుతుంది. అందుకే ప్రేమ అఖిలం.. అమరం. హారంలో దారంలా కనిపించదు. కానీ రెండు గుండెలను కలిపి ఉంచుతుంది. భావాలకు అందదు. మౌనంలో మాత్రం ప్రతిధ్వనిస్తుంది. మన జిల్లాలోనూ వేలాది ప్రేమకథలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని. అచ్చమైనవి.. స్వచ్ఛమైనవి. కులాల కట్టుబాట్లు కాదని, ఆస్తుల అంతరాలను దాటుకుని ప్రేమను గెలిపించిన జంటలివి. మీది ఏ కులమంటే.. ప్రేమికులమని చెప్పిన ఫేమస్ లవర్స్ గురించి.. సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఆయన ఇప్పుడు మేఘాలయ కలెక్టర్. ఆమె గుంటూరులో డీసీటీఓ. ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలే. ఉన్నత ఉద్యోగాలు రాకముందే వీరి మధ్య ప్రేమ చిగురించింది. మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే దశలో ప్రేమ వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. నరసన్నపేట మండం జమ్ము గ్రామానికి చెందిన సాధు శిబిచక్రవర్తి ఏసీటీఓగా కాకినాడలో శిక్షణ పొందుతున్న రోజుల్లో అదే కేంద్రంలో శిక్షణ పొందుతున్న గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన అంజనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కులాలు వేరయినా, మనసులు మాత్రం కలిశాయి. కలెక్టర్ శిబిచక్రవర్తి దంపతులు అదే సమయంలో ఐఏఎస్‌కు ప్రిపేర్ అయిన శిబి చక్రవర్తి 2011వ సంవత్సరం మేఘాలయ రాష్ట్రంలో నార్త్ గోరోహిల్స్ జిల్లాకు కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. తాను ఉన్నతి స్థితికి చేరుకున్నప్పటికీ స్నేహితురాలు అంజనకు ఇచ్చిన మాట తప్పలేదు. 2013లో కట్నం అనే మాటే లేకుండా అన్నవరం సత్యనారాయణ సాక్షిగా ఇరువురూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం శిబి చక్రవర్తి మేఘాలయ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేస్తుండగా, అంజనా గుంటూరు జిల్లాలో డీసీటిఓగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు కుమారు, కుమార్తెలున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రేమ అనేది మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలే తప్ప అదే ప్రేమ పేరిట వినాశనానికి దారి తీయకూడదని సూచించారు. శాండ్లవ్ ఎల్.ఎన్.పేట: ఇసుక రేణువులతో రూపొందించిన సైకత చిత్రాలు ప్రేమకు అసలైన అర్థం చెబుతున్నాయి. లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత ప్రేమ చిత్రమాలిక. అంతరాలు చెరిపిన ప్రేమ టెక్కలి: అంతరాలు చెరిపిన ప్రేమ వారిది. నిజమైన అభిమానం, ఆప్యాయతకు ఆస్తులు అడ్డుగోడలు కావని నిరూపించిన బంధం వారిది. వైఎస్సార్ సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల ప్రేమకథ స్వచ్ఛమైనది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో పలుకుబడి ఉన్న సంపతిరావు రాఘవరావు కుమార్తె దువ్వాడ వాణి. అప్పటికి దువ్వాడ శ్రీనివాస్ ఓ సామాన్య వ్యక్తి. దూరపు బంధువులే అయినా వారిద్దరికీ పరిచయమే లేదు. ఏదో ఒక సందర్భంలో కలిశారు. అంతే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ప్రేమ జ్ఞాపకాలను చెబుతున్న దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ఇరువైపులా రెండు కుటుంబాల వాళ్లతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఐశ్వర్యంలో పెరిగిన తనకు కష్టం అనే పదం లేకుండా శ్రీనివాస్ కంటికి రెప్పలా చూసుకున్నారని దువ్వాడ వాణి తన భావాన్ని పంచుకోగా...శూన్యంగా ప్రారంభమైన తన జీవితానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి వాణి అంటూ శ్రీనివాస్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో చిన్న పాటి మనస్పర్థలు రావడం సహజమని అయితే ఆ మనస్పర్థలకు ప్రాణాలు తీసుకోవడం విడాకులతో విడిపోవడం చేస్తే వారి ప్రేమలో ఎలాంటి నిజాయితీ లేనట్లేనని దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శ్రీనివాసరావు దంపతులు కులాల గోడలు బద్దలుగొట్టి.. ఇద్దరూ టీచర్లు. ఉన్నత భావాలు కలవారు. పదిమందికీ మంచిని చెప్పేవారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ ఆ ఆదర్శం ఫాలో అయ్యారు. కులాల గోడలు బద్దలుగొట్టిని ప్రేమను గెలిపించారు. నరసన్నపేట మండలానికి చెందిన అక్కివలస శ్రీనివాస రావు 2010లో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఇచ్ఛాపురం మండలం బాలకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా చేరారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో బోధనలో శిక్షణ పొందుతున్నప్పుడు సోంపేట మండలానికి చెందిన పి.ప్ర త్యూష అనే ఉపాధ్యాయురాలితో స్నేహం ఏర్పడింది. మూడేళ్ల పాటు కొనసాగిన వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి వివాహానికి కులాలు అడ్డు గోడలుగా నిలిచాయి. వీరికి బాసటగా స్నేహితుడు సాధు శిబి చక్రవర్తి (మేఘాలయ రాష్ట్రం నార్త్ గోరోహిల్స్ కలెక్టర్) అండగా నిలిచారు. ఇద్దరి భావాలు ఒకటే కావడంతో 2013వ సంవత్సరంలో అన్నవరంలో అదే స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాసరావు బాలకృష్ణాపురంలో, ప్రత్యూష ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రేమించడం తప్పులేదు గానీ, ఆ ప్రేమ పేరుతో మోసం, దగా చేయకుండా ప్రేమ పవిత్రతను చివరి వరకూ కాపాడుకుంటు వెళ్లాలంటూ నేటి ప్రేమికులకు ఈ దంపతులు సూచిస్తున్నారు. కుటుంబంతో మందస ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ మేధావి ప్రేమికులు మందస: ఇద్దరూ మేధావులే. అన్ని విషయాలను తర్కంతో ఆలోచించగలిగిన వారే. ప్రేమ విషయంలోనూ అంతే. మందస పోలీసు స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న చిట్టిపోలు ప్రసాద్ ప్రేమకథ ఎంతో మందికి ఆదర్శం. ప్రసాద్ సొంత గ్రామం విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని మామిడిపల్లి. ఆయనది కాపుకులం. ఆయన మనసుపడిన మేడిబో యిన లతది సారవకోట మండలంలోని ఓ పల్లెటూరు కాగా, శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. ఆమెది తెలగ కులం. విజయనగరంలో 2002 సంవత్సరంలో ఎంఎస్సీ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరూ వివాహం చేసు కోవడానికి నిర్ణయించుకున్నారు. ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్డీ చేసిన ప్రసాద్ కాకినాడలో పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంఫిల్ చదివిన లత కాకినాడలోనే బీఈడీ, డైట్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈ తరుణంలో ఇద్దరి బంధం బలపడింది. కులాలు వేరు కావడంతో కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. కానీ ఇరువర్గాలను అంగీకరింపజేసి, ఒక్కటయ్యారు. పెద్ద చదువులు చదువుకున్న ఇద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇద్దరు పిల్లలతో వీరి కుటుంబం అల్లారుముద్దుగా సాగుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్, లత దంపతులు ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. లిల్లీపుష్పనాథం, లిల్లీరాణి ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పాలకొండ: కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. కానీ చదువులు వదల్లేదు. ఉద్యోగాలు వచ్చే వరకు ఒకరికొకరు సహకరించుకున్నారు. పెద్ద వాళ్లు ముందు ఒప్పుకోలేదు. అయినా వారు పట్టు విడవలేదు. ఇరు కుటుంబాలను కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పాలకొండ నగరపంచాయతీ కమిషనర్ ఎ.లిల్లీపుష్పనాథం, హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం లిల్లీరాణిల ప్రేమకథ అందరికీ ఆదర్శం. వీరిద్దరూ ఇంటర్ చదువుకునే సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డా రు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. విజయనగరంలో డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రేమలో ఉన్నామన్న విషయం అర్థమైంది. ప్రేమలోనే ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువు పూర్తి చేసిన తరువాత లిల్లీరాణి 1985లో ఉద్యోగంలో చేరాక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే అప్పటి ఇంకా ఉద్యోగం పొందని లిల్లీపుష్పనాథం ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నారు. అదే పంతంతో 1989లో ఉద్యోగం సాధించారు. అదే ఏడాది ఇద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో ఏర్పడాలని, ప్రేమించడంతో పాటు తమ భవిష్యత్ లక్ష్యాలు సాధించుకోవాలని వీరు చెబుతున్నారు. కవిటి: కుమార్తె జాగృతితో సాయిరాజ్, విజయ నొప్పించకుండా.. ఒప్పించి కవిటి: ప్రేమంటే ఎదురించడం మాత్రమే కాదు ఒప్పించడం కూడా. డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా కన్వీనర్ పిరియా విజయలది పెద్దలకు కుదిర్చిన వివాహం. కానీ ఈ కుదర్చడం వెనుక మరో కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. 1997–98లో విశాఖ మహిళా కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న విజయను గాయత్రీ కాలేజీలో బీఏఐఆర్పీఎం చదువుతున్న సాయిరాజ్ తొలిసారి చూశారు. ముందు స్నేహితులయ్యారు. కొత్త మిలీనియం మొదలయ్యే సరికి ప్రేమికులయ్యారు. ప్రేమికులంటే పెద్దవాళ్లకు భయపడడం రివాజు. కానీ ఇక్కడ మేటర్ కాస్త రివర్స్. ఒక రోజు విజయ తన తండ్రి వద్ద కెళ్లి ‘మీకు అభ్యంతరం లేకుంటే నా స్నేహితుడు సాయిరాజ్‌ను పెళ్లిచేసుకుంటా’ నని కోరింది. అందుకు ఆయన అంతే హుందాగా బదులిచ్చారు. ‘నీవు ఎంత ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటానన్నావో అక్కడ ఎదురయ్యే కష్టాన్ని కూడా అంతే ఇష్టంగా భరించాలి’ అని పెళ్లికి పచ్చ జెండా ఊపేశారు. 2000లోనే సాయిరాజ్‌తో విజయ వివాహం జరిగింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ ‘సాక్షి’తో మాట్లాడుతూ జీవితంలో స్వశక్తిపై నమ్మకం ఉంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. అప్పుడు ప్రే మ వివాహాలను సమాజం కూడా సమర్థిస్తుందని అన్నారు. తల్లిదండ్రు ల మనస్సులు గుర్తెరిగి వారి మనసులు గెలుచుకోవడం ద్వారా ప్రేమ వివాహాల్ని పెద్దలు కుదిర్చిన వివాహాలుగా చేసుకోవచ్చని సాయిరాజ్, విజయ వెల్లడించారు. లల్లూ దంపతులు జై ఆంధ్రా అంటూనే.. కంచిలి: ఆయన ఓ రాజకీయ నాయకుడు. జీవిత సహచరి కూడా ప్రజా సేవకురాలే. నిత్యం గంభీరమైన ప్రసంగాలు, చర్చలు వీరి జీవితంలో సాధారణం. జనాల ముందు సీరియస్‌గా కనిపించే ఈ దంపతుల మధ్య కొండంత ప్రేమ ఉంది. కాలేజీ రోజుల్లో మొదలైన కథ అది. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు వీరు. ఇచ్ఛాపురం మాజీ శాసనసభ్యుడు నరేష్కుమార్ అగర్వాలా(లల్లూ), ఆయన భార్య కంచిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు అనిత అగర్వాలాల గతంలోకి వెళ్తే.. వీరిద్దరూ సోంపేటలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. 1972–73 కాలంలో జై ఆంధ్రా ఉద్యమం జోరుగా జరుగుతోంది. విద్యార్థులంతా యాక్టివ్‌గా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమమే వీరికి ప్రేమకు వేదికైంది. కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వీరిద్దరూ జీవితాంతం కలిసే ఉండాలని ఆ నినాదాల మధ్యే అనేసుకున్నారు. అయితే చదువుకు పక్కన పెట్టి ప్రేమించడం లాంటి పనులు వీరు చేయలేదు. లల్లూ తన బి.ఎ. డిగ్రీ విద్యను అనకాపల్లిలో చేయగా, అనిత శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో పూర్తిచేశారు. న్యాయవిద్యను ఆమె విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో పూర్తిచేయగా, లల్లూ తన న్యాయవిద్యను ఒడిశా బరంపురంలో గంజాం లా కళాశాలలో పూర్తిచేశారు. విడివిడిగా చదువుకున్నా ప్రేమ మాత్రం తగ్గలేదు. చివరకు పెద్దలు కాదన్నా, కులాలు ఒకటి కాకపోయినా అందరినీ ఎదురించి 1983 సెప్టెంబర్4వ తేదీన ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. లల్లూ రావడమే కాకుండా భార్యను కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి ప్రేమికుడికి అసలైన అర్థం చెప్పారు. ప్రేమ ఓ ప్రేమ రామతత్వం ఓ ప్రేమ హరిశ్చంద్రుని సత్యం ఓ ప్రేమ అహల్య శాపం ఓ ప్రేమ బుద్ధుని రూపం ఓ ప్రేమ కార్తీక దీపం ఓ ప్రేమ కబీరు గానం ఓ ప్రేమ విశ్వకవి రవీంద్రుని ధ్యానం ఓ ప్రేమ మథర్ థెరిసా వాత్సల్యం ఓ ప్రేమ రైతన్న బసవన్నల అనుబంధం ఓ ప్రేమ అబ్ధుల్ కలాం ఆశయం ఓ ప్రేమ గాంధీమార్గం ఓ ప్రేమ అన్నాచెల్లెళ్ల రాఖీబంధనం ఓ ప్రేమ మన భవిష్యత్ భవబంధనాల సోపానం ఓ ప్రేమ మల్లె మకరందాల తుమ్మెదల ఓంకారనాదం ఓ ప్రేమ కుటుంబ వ్యవస్థకు ప్రాకారం ఓ ప్రేమ త్రివేణి సంగమం ప్రేమంటే ప్రేరేపించే మమకారం అంటుంది నా అంతరంగం ప్రేమ సృష్టికి మూలం, సత్యం, సనాతన ధర్మం – ఎస్. పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయుడు పెద్దదూగాం, జలుమూరు మండలం -
ప్రేమించడం పాపమా.. శాపమా?
ప్రేమించడం పాపమా.. శాపమా? అనే ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. కొందరు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఆ ధైర్యం చేయలేక తనువు చాలిస్తున్నారు.. అందరికీ తెలిసిపోయిందని కొందరు.. తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో మరికొందరు.. వారిని ఎదురించలేక ఇంకొందరు.. ఇలా వేర్వేరు కారణాలతో ప్రేమికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆరునెలల కాలంలో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 20 నుంచి 25 మందికి పైగా ఉండగా జంట ఆత్మహత్యలే 10 వరకు ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రేమికుల జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. ప్రేమించడం పాపం కాదు.. కానీ ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు షాపంగా మార్చడమే సరైంది కాదు. అయితే వీరందరూ ఒక్కక్షణం ఆలోచించినా.. ఆత్మస్థైర్యం నింపుకున్నా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో బయటపడేవారని సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు. మహబూబ్‌నగర్ రూరల్: దేశానికి పట్టుగొమ్మలు అయిన అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రతి ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద పలు విడతల్లో రైతులకు ఎకరాకు రూ.16 వేల పెట్టుబడి సాయం వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా పెట్టుబడి సాయం అందిస్తుండగా.. కేంద్రం తొలి విడతగా ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ లెక్కన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏడాదికి రూ.755.33 కోట్ల సాయం అందినట్లయింది. వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం నుంచి మొదలుకొని సాగు చేసే వరకు అయ్యే ఖర్చును కొంత వరకు ప్రభుత్వమే భరిస్తున్నందున రైతులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు, బోరు బావులు, చెరువుల కింద పంటలు సాగు చేసే రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రేమే లోకం కాదు ప్రేమించిన వ్యక్తి నిరాకరించారని, ప్రేమించి మోసం చేశారని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంలో ప్రేమ ఒక్కటే లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఇలా అందరినీ దుఃఖసాగరంలో ముంచి ఆత్మహత్యకు పాల్పడి సాధించేదేముంది. విలువైన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలి. కన్నవారి కలలను తీర్చాలి. పుట్టి.. పెరిగిన ఊరికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి. ధైర్యం చెప్పేవారేరీ..? ‘సమాజంలో మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు’ అంటారు పరమహంస యోగానంద. రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు. చనిపోవడం అనేక దోషాలకు కారణమవుతుంది. బతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అని ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. బలమే (ధైర్యమే) జీవితం.. బలహీనతే మరణమని అందరూ నమ్మాలని స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యేకొద్దీ ధైర్యవచనాలు చెప్పే వారు కరువవుతున్నారు. క్షణికావేశానికి లోనై బలవన్మరణం చేసుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే వెల్లడించింది. వీరిలో అత్యధికులు ప్రేమలో విఫలం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఏటా వెయ్యి మందిలో 150 మంది ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది దీని సారాంశం. ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక శాతం పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సంవత్సరానికి సుమారు పది లక్షల మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్నారు. మనిషి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం, మానవ అపసామాన్య స్థితిని తెలియజేస్తుంది. వ్యక్తి వారి జీవితాన్ని అంతం చేసుకోవాలని విపరీతమైన ఆలోచనలు చేయడాన్ని వైద్య భాషలో పారాసూసైడ్ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆత్మహత్యా ప్రయత్నం రెండూ తీవ్రమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మనుషులు వారికి అనుకున్నది సాధించలేకపోయినప్పుడు.. నిస్సహాయులై మిగిలిపోయినప్పుడు.. భవిష్యత్‌ను అంధకారంగా భావించినప్పుడు తట్టుకోలేని మానసిక ఒత్తిడికి గురైనప్పుడు.. జీవితంలో మనోవ్యాధికిలోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణుల మాట. ఇవిగో ఘటనలు.. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన లోకేష్‌నాయుడు, కస్తూరిలు సోమవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే తెలకపల్లి మండలం దాసుపల్లికి చెందిన గణేశ్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని పురుగు మందు తాగి మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలన్నీ కేవలం క్షణికావేశంలో చోటుచేసుకున్నవేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మూడు కారణాలు ఆత్మహత్య చేసుకోవడం వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం, ప్రేమ విఫలం కావడం, తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినే వారు ఎవరూ లేరనే భావనతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినే వారు ఉన్నారు అని వారు భావించినప్పుడు వారిలో ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. గెలిచి.. చూపించాలి ప్రతీ వ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి అకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నాం. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసును పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపోటముల సంగ మం అని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల ని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలు పు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక్క మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాలి. మనం ఎదగడంలో, ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని, మన ఎదుగుదలకు వారు ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి. మార్పు గమనించాలి.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటారు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచన చేస్తారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటి నుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ ఆ.. ఆలోచననే తుంచేయాలి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సరైన అవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం.. ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. ప్రేమలో విఫలం చెందిన వారి మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏమీ చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. – వంగీపురం శ్రీనాథాచారి, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు -
లవింగ్ డాటర్స్
అమ్మానాన్న తర్వాతే ఆడపిల్లలకు ఏదైనా! చిక్కేమిటంటే.. ప్రేమను కూడా వాళ్లు.. అమ్మలానో నాన్నలానో చూస్తారు. ప్రేమ అనే అమ్మ ఒడిలో సేద తీరుతారు. ప్రేమ అనే నాన్న భుజాలెక్కి ‘చల్ చల్ గుర్రం’ అంటారు. ప్రేమను అంతగా నమ్ముతుంది అమ్మాయి. అమ్మానాన్నే.. ప్రేమను అస్సలు నమ్మరు. కూతురిపై అంత ప్రాణం. పరువునెక్కడ తోసేస్తుందోనని! పరువంటే అంత ప్రేమ.. ప్రాణాల్నెక్కడ తీసేస్తుందోనని! పెళ్లంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తాం. తర్వాతేమౌతుందో మనం చూడబోయేది లేదు. ‘నీలాగే నన్ను చూసుకుంటాడు నాన్నా’ అని కూతురు నమ్మకంగా చెప్పినా కూడా.. పరువును పక్కన పెట్టి, కూతుర్ని దగ్గరకు తీసుకోలేమా?! ఒక యేడాది కిందటో.. అంతకు ముందో స్టార్ గోల్డ్ సెలెక్ట్ అనే చానల్ ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అనే పాట లైన్‌తో ఓ యాడ్ వీడియో తీసింది. టామ్మీ లమ్కిన్ అనే 41 ఏళ్ల విదేశీ మహిళను పెళ్లి చేసుకున్న 22 ఏళ్ల హితేశ్ చావ్డాను ‘క్రాస్ కాంటినెంటల్ కనెక్షన్’గా, మాధురి (ట్రాన్స్ జెండర్), జయ్ శర్మ జంటను ‘ట్రాన్స్ కన్వెన్షనల్ వాలంటెన్స్’గా సయ్యద్ అలీ, ఇందర్జిత్ నాగి (సేమ్ సెక్స్ లవ్) లను‘ పార్ట్నర్స్ ఇన్ ప్రైడ్’గా, అయిదుగురు మనమలు, మనమరాండ్ల తాత.. 76 ఏళ్ల మహేశ్ భై, తొమ్మిది మంది మనమలు, మనమరాండ్ల అమ్మమ్మ.. 65 ఏళ్ల రంజనా బెన్ల సహజీవననాన్ని ‘ఫుల్ టైమ్ లవ్ ఇన్ లవర్స్’గా, ఇద్దలు పిల్లల తల్లి అయిన జెన్ని ఫర్ బరూచా, ఓ బిడ్డ తండ్రి అయిన సందీప్ నైతానీని పెళ్లాడడం ‘సెకండ్ టైమ్ లక్కీ ఇన్ లవ్’గా, వరుణ్ షా, అలిషా అహ్మద్ అనే యువజంటను ‘ఇంటర్ ఫెయిత్ బ్యూస్’గా, యాసిడ్ అటాక్‌కు గురైన లలితా బన్స. రవిశంకర్ అనే జంట ప్రేమను ‘సోల్ మేట్స్ బియాండ్ ఆర్డినరీ’ గా వర్ణించింది ఆ యాడ్! ఇప్పుడెందుకీ ప్రస్తావన? వాలంటైన్స్ డే ఎప్పుడో అయిపోయింది కదా! చిరాగ్గా ఐబ్రోస్ కలుసుకుంటాయని తెలుసు! కానీ సందర్భం ఉంది. మారుతీరావు దగ్గర్నుంచి నిన్నమొన్న హైదరాబాద్‌లో ఒక అన్న తన చెల్లెలు ఇష్టపడి పెళ్లిచేసుకున్న అబ్బాయిని నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపడం వరకు.. యేడాది కాలంలో దాదాపు అరడజను ప్రేమ హత్యలు జరిగి ఉంటాయి. వాట్సాప్‌లో వైరల్ కాకుండా దాక్కున్న దారుణాలు ఇంకొన్ని ఉండొచ్చు! కులం, మతం, ప్రాంతానికి అతీతంగా జరిగినవే ఇవన్నీ! అంటే కులం, మతం కాదు ప్రాబ్లం.. ప్రేమ కదా సమస్య! కాదు... స్త్రీ! ఆమెకు మెదడు ఉండడం, ఆలోచించగలగడం, ఆమెకు అభిరుచి ఉండడం, ఆస్వాదించాలనుకోవడం! ఆమెకంటూ స్వంత వ్యక్తిత్వం ఉండాలనుకోవడం నచ్చని సమాజం చేసే ఘాతుకం అది. అనాగరికం అని నిర్థారించిన కాలం నుంచి నాగరికం అనుకుంటున్న నేటి దాకా మార్పు రానిది.. రాలేనిది మహిళల విషయంలోనే. మారనిది.. ఆమెను ప్రాపర్టీగా చూస్తున్న అభిప్రాయమే! స్త్రీని సొంత ఆస్తిగా భావించడం వల్లే ప్రేమ హత్యలైనా.. దాడులైనా! అవును కుల వ్యవస్థను కాపాడుకోవడానికి వివాహ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతోందో.. స్త్రీని ప్రాపర్టీగా స్థిరపర్చడానికి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అలాగే తోడ్పడుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ఆ మాటకొస్తే మన దగ్గర పిల్లలను పెద్దవాళ్లందరూ తమ ప్రాపర్టీగానే చూస్తారు.. ఇందులో అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసం లేదు అంటున్నారు కొందరు.నిజమే.. కాని మేజర్ అయ్యాక అబ్బాయి స్వతంత్రుడయి తన ఈడు అమ్మాయిని తన ఆస్తిగా పరిగణించే కోవలోకి వచ్చేస్తాడు అని వాదన లేకుండా ఒప్పుకుంటున్న వాళ్లూ ఎక్కువే. అందుకే కుల, మత, ప్రాంతాలకతీతంగా తండ్రి, సోదరుడి చేతుల్లో ప్రేమ హత్యకు గురవుతోంది. తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు సంరక్షణలో ఉంటోంది స్త్రీ ఓ ఆస్తిగా! ‘‘అబద్ధం ఎందుకు చెప్పావ్?’’ మెడిసిన్ చదువుతున్న కూతురిని గద్దిస్తాడు తండ్రి. ‘‘కాలేజ్కే కాదు.. హాలిడేస్‌లో హ్యాంగవుట్కీ వెళ్లాలనుంటుంది.. ఆడ, మగ ఫ్రెండ్స్‌తో! వాళ్లను ఇంటికి పిలవాలనుంటుంది.. కాని మీరు ఒప్పుకోరు. అందుకే అబద్దం చెప్పా. మీరు ఒప్పుకుంటే నిజమే చెప్పేదాన్ని... చెప్తా కూడా’’ అంటుంది ఆ అమ్మాయి ఏడుస్తూ! ఇది గల్లీ బాయ్ సినిమాలో డైలాగ్. అంటే ఏంటీ? పిల్లలు.. మెయిన్‌గా ఆడపిల్లలు ఆడింది ఆట, పాడింది పాటగా చూడమంటారా? కన్నెర్ర చేయకండి. ఆడపిల్లలే కాదు.. ఏ పిల్లల విషయంలో గుడ్డిగా ఉండమని ఎవరూ చెప్పరు! కాని మన కఠిన నిబంధనల వల్ల పిల్లలు మన కళ్లుగప్పే ప్రమాదం ఉందని సూచించడానికే పైన సన్నివేశం. వాళ్లు వేసుకునే బట్టల దగ్గర్నుంచి చదువు, కెరీర్.. అమ్మాయిలకైతే కట్టుకోబోయే మొగుడిని కూడా మనమే నిర్ణయిస్తున్నాం. వాళ్లను ఇండివిడ్యువల్స్‌గా కాక డిపెండెంట్స్‌గా పెంచుతున్నాం. ఫ్రెండ్స్‌లా కాక బానిసలుగానే చూస్తున్నాం (తప్పు పట్టుకోకండి.. ఆలోచించండి.. ఎక్కువ శాతంగా ఉన్న పరిస్థితి గురించే). ఆ సినిమాలోని ఆ అమ్మాయి నిజాయితీని గ్రహించినట్టే.. మన పిల్లల్లోని నిజాయితీని గుర్తిస్తే.. వాళ్లకు బెత్తం పట్టుకున్న మాస్టర్లా దర్శనమివ్వకుండా హగ్ చేసుకునే ఫ్రెండ్‌లా కనిపిస్తాం. చనువుగా దగ్గర కూర్చుంటారు. చర్చిస్తారు. విశ్లేషణ నేర్చుకుంటారు. చేయబోయేది చెప్తారు. తల్లీదండ్రిని గైడ్‌లా చూస్తారు. కాలం మారింది. కానుగ బడులు లేవు (ఉండాలని ఉద్దేశం కాదు). కార్పోరేట్ స్కూల్స్ వచ్చాయి.ఇంటర్నేషనల్ సిలబస్ కరిక్యులమ్‌తో. సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్.. పిజ్జాలు, బర్గర్స్,.. ఇంకా ఇతరత్రా ఆధునిక అలవాట్లకు వాళ్లను ఎక్స్పోజ్ చేస్తున్నాం. పెద్దయ్యాక మంచి కెరీర్‌తో రూపాయిల్లో కాకుండా డాలర్స్ అండ్ పౌండ్స్లలో వాళ్ల సంపాదన ఉండాలని బలంగా కోరుకుంటున్నాం, ఇంత చక్కటి ఫౌండేషన్ వేస్తే ఉండకుండా పోతుందా అనీ అంతే బలంగా విశ్వసిస్తున్నాం! ఈ మొత్తం ప్రయాణంలో వాళ్లు ఎక్స్ప్లోర్ చేసుకున్న థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. కుల, మత, ఆస్తి, అంతస్థుల (ఇప్పుడైతే జెండర్ కూడా)ను చూడని ప్రేమ కుడా వాటిల్లో ఒకటి. పేరెంట్స్ అన్నిటికీ బాధ్యత వహించాలి. వాళ్ల ప్రేమకు కూడా. పెద్దల అభిప్రాయాన్ని గౌరవిస్తే ఓకే.. తమ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా ఓకే. భరోసా ఇస్తే సమస్యలను పరిష్కరించుకునే తెగువ చూపిస్తారు. భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటారు. బెదిరిస్తే పారిపోతారు. వెంటబడి ప్రాణాలు తీస్తే మనక్కాకుండా పోతారు. అర్థంలేని జీవితాన్ని మనకు మిగిలిస్తారు. పిల్లలు.. అందునా అమ్మాయిలు మన పరువు ట్యాగ్‌ను మోసే బ్యాగేజ్ కారు. మనకు ప్రేమను పంచే వారసులు. కులం, మతం, ఆస్తి, అంతస్తు, ప్రాంతాల మధ్య సరిహద్దులు చెరిపేసే వారధులు! పైన యాడ్ చెప్పే విషయం కూడా అదే! ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు కాదు.. ప్రేమ ఉండాలి.. భిన్న మనస్తత్వాలను గౌరవించుకుని ముందుకు సాగే స్నేహం కావాలి. అన్నీ చూసుకొని సమ ఉజ్జీలమని నిర్ధారించుకున్న తర్వాత రెండు కుటుంబాలు కలిసి చేసిన పెళ్లిళ్లెన్నో విచ్ఛిన్నమైన ఉదాహరణలు బోలెడు. లక్షల్లో కట్నాలు తీసుకొని మోసం చేసి పోయిన భర్తలు.. దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని బిడ్డకు ఇవ్వలేక అదే పరువు పేరుతో నోట్లో భాధను కుక్కుకొని బయటి ప్రపంచానికి మొహం చూపించకుండా బతుకీడుస్తున్న తల్లిదండ్రులూ కోకొల్లలు. మంచిచెడులు అన్నిట్లో ఉంటాయి. పరువు అనే పురుగును పక్కన పెడితే... అంతా మనవాళ్లే. ఈగోను ఈగలా తోలేస్తే అంతా ప్రేమమయమే! – సరస్వతి రమ ఇండివిడ్యువల్‌గా పెంచాలి పిల్లలను ఇండివిడ్యువల్‌గా పెంచడం చాలా ఇంపార్టెంట్. అల్లరి చేస్తుంటే భరించమని కాదు. సరిచేయాలి. కాని వాళ్ల అభిరుచులను.. అంటే చదువు, కెరీర్, లైఫ్ పార్ట్నర్ దాకా అన్నీ పెద్దవాళ్లే నిర్ణయిస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్లు రియలైజ్ కావాల్సింది ఏదీ పర్మినెంట్ కాదు అని. పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలి. గైడెన్స్ ఇవ్వాలి. – స్వేచ్ఛ, అడ్వకేట్, హైదరాబాద్ మా నాన్న పెంచినట్టే నేనూ..! స్వేచ్ఛ నా కూతురు. తన చిన్నప్పటి ఫ్రెండ్ గౌతమ్‌తో సహజీవనం చేద్దామనుకుంటున్నాను అని నాతో చెప్పినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. అది నా కూతురి వ్యక్తిగత విషయం. మా నాన్న మమ్మల్ని ఇండివిడ్యువల్‌గానే పెంచాడు. నేనూ నా కూతురిని అలాగే పెంచాను. తను సంతోషంగా ఉండడమే నాకు కావల్సింది. ఉంటుంది అన్న నమ్మకమూ ఉండింది. గౌతమ్ కూడా అడ్వకేట్. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఈగో కాదు ఫ్రెండ్షిప్. స్వేచ్ఛ, గౌతమ్‌ల మధ్య ఉన్నది అదే. ఈ ఫ్రెండ్షిప్ ఒకరిపట్ల ఒకరికి గౌరవాన్ని పెంచుతుంది. పెళ్లికి ముందు పరిచయం, స్నేహం, ప్రేమ లేకపోతే ఇది సాధ్యపడదని నా అభిప్రాయం. – బి. జ్యోతి, ‘మహిళామార్గం’ పత్రిక ఎడిటర్, (మానవ హక్కుల న్యాయవాది దివంగత పురుషోత్తమ్ రెడ్డి సహచరి) ప్రాపర్టీ అనే భావనతోనే..! పరువు హత్యలకు కారణాలుగా కులం, మతం బయటకు కనపడుతున్నాయి. కాని మహిళను ప్రాపర్టీగా భావించడం వల్ల జరుగుతున్న దారుణాలు అవి. నేను హిందూ అమ్మాయిని (యెదుళ్ల జ్యోతి) పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు కూతుళ్లు. ఇన్నేళ్లలో మా మధ్య మతం ఇష్యూయే కాలేదు. మా పిల్లల స్కూల్, కాలేజ్ అప్లికేషన్స్‌లో కూడా నేనెక్కడా మతాన్ని మెన్షన్ చేయలేదు. ఇండియన్ అనే రాశా. ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వెనక్కి పోలేదు. పోరాడాను. నిన్న మా పెద్దమ్మాయి రోషిణీ జబీన్ పెళ్లి అయింది. ఫ్రాన్స్‌లో ఎమ్మెస్ చేసింది. అక్కడే క్లాస్మేట్ (కర్ణాటకకు చెందిన అబ్బాయి)ను ఇష్టపడింది. మాకు చెప్పింది. ముందు నుంచీ మా పిల్లలను ఇండివిడ్యువల్స్గానే పెంచాం. ఏదైనా మాతో షేర్ చేసుకునే చనువిచ్చాం. అందుకే తన ప్రేమ విషయమూ చెప్పింది. మంచి చెడులు చర్చించాం. అబ్బాయీ వాళ్ల తల్లిదండ్రులతో చెప్పాడు. మా మతాంతర వివాహం గురించి ప్రస్తావించాం. ఒప్పుకున్నారు. స్టేజ్ మ్యారేజే చేస్తామన్నాం. దానికీ ఒప్పుకున్నారు. నిన్ననే అందరి ఆశీస్సులతో మ్యారేజ్ అయింది. – మహ్మద్ వహీద్ -
ఆర్యసమాజ్ C/o ప్రేమ వివాహాలు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి అనగానే ప్రేమ జంటలకు టక్కున గుర్తొచ్చేది ఆర్యసమాజ్ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలు స్తోంది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. మహర్షి దయానంద సరస్వతి శిష్యుల్లో ఒకరైన స్వామి గిరిజానంద సరస్వతి సుల్తాన్‌బజార్‌లోని బడిచౌడీలో వందేళ్ల క్రితం ఆర్యసమాజాన్ని స్థాపించారు. స్వాతంత్రానికి ముందు నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన అనేక ఉద్యమాలకు ఇది వేదిగా నిలిచింది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హిందూమత పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అనేక ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలిచింది. ఎలాంటి ఆడంభరాలు లేకుండా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఒక్కటి చేస్తోంది. ‘శుద్ధి సంస్కారం’ తర్వాతే:ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో చాలా వరకు కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని వివాహాలే. ఒక వేళ ప్రేమికులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారేతై.. వారిని ముందు çశుద్ధిసంస్కారం(మత మార్పిడి) చేసి, ఆ తర్వాత వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కేవలం ప్రేమికులే కాకుండా పెళ్లికి ఆర్థిక స్తోమత లేని పేద జంటలు ఈ వేదికపై ఒక్కటవుతుండటం గమనార్హం. ఈ వేదికపై వివాహం చేసుకున్న వారిలో అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏటా 2 వేలకుపైగా పెళ్లిళ్లు: దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడంతో పాటు పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడటం వల్ల ప్రేమ పెళ్లిళ్లకు వారు పెద్దగా అభ్యంతరం చెప్పక పోవడమే ఇందుకు కార ణమని ఆచార్య అమర్‌సింగ్ ఆర్య పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆర్యసమాజ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. పిల్లల పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచుతుండటంతో పాటు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్ల వారి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. -
గుళ్లో ప్రేమపెళ్లిళ్లకు బ్రేక్?
కర్ణాటక / శివాజీనగర: తల్లిదండ్రులను ఎదిరించి గుళ్లో పెళ్లి చేసుకుందామనుకునే ప్రేమ జంటలకు ఇకనుంచి అది కుదరకపోవచ్చు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల్లో ఇకపై ప్రేమ జంటలు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దంపతుల్లో ఎవరో ఒకరు ఇతరులతో రావడం, యుక్తవయసు రాని బాల బాలికలు, ఇళ్లలో గొడవపడి వచ్చినవారు ఆలయాల్లో దండలు మార్చుకుని ఒక్కటవుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ విధగా చట్ట ఉల్లంఘన వివాహం, వివాదాస్పద వ్యక్తులు దేవాలయాల్లో గుట్టుగా పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడి అర్చకులు కేసులను ఎదుర్కొంటున్నారు. అర్చకులు సతమతం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఆ ఆలయ అర్చకులను సాక్షులుగా పరిగణిస్తున్నారు. దీంతో అర్చకులు కోర్టు, పోలీసు విచారణకు నిత్యం పరుగులు తీయాల్సి వస్తోంది. దీంతో 1996లోనే ఈ తరహా వివాహాలను జరపరాదని దేవదాయ శాఖ ఒక నోటీస్ జారీచేసింది. కానీ ఎవరూ అమలు చేయడం లేదు. తాజాగా పాత చట్టాన్ని అమలుపరచాలని దేవాదాయశాఖ ఆలోచిస్తోంది. మరికొన్ని సంఘటనల్లో అర్చకులను బెదిరించి వివాహం చేయాలని ఒత్తిడి చేసేవారు. అన్ని పత్రాలూ ఉంటేనే అనుమతి ఇకపై ఏ వివాహం జరగాలన్నా, తగిన అనుమతి, ఆమోద పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రేమికులు, వివాహం చేసుకునేవారి తల్లిదండ్రుల ఆమోదం ఉంటే, వయస్సు ధ్రువీకరణలతో పాటు ఇతర అవసరమైన అనుమతి పత్రాలు ఉంటే దేవాలయాల్లో సులభంగా వివాహం చేసుకోవచ్చు. -
ఆలోచనలు మారి..అంతరాలు తగ్గి..
సాక్షి, హైదరాబాద్ : ఆలోచనలు మారుతున్నాయి. అంతరాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ప్రధానంగా పరిగణించే కులం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడు తున్న ఈ తరుణంలో సామాజికంగా వస్తున్న మార్పులు పెళ్లి సంబంధాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కులాగోత్రాలు చూసి బంధాలు కలుపుకోవడం కన్నా వృత్తులు, ఆర్థిక అంశాలే ప్రధానమవుతు న్నాయి. మారుతున్న పని విధానంతో ప్రేమ పెళ్లిళ్లు సహజమవుతున్నాయి. దీంతో కులాంతర పెళ్లిళ్ల సం ఖ్య పెరుగుతోంది. గతంలో నూటికొకటి వంతున జరిగే కులాంతర వివాహాలు... ఇప్పుడు 8కి పెరిగాయని ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో తేలింది. మూడు రెట్లు పెరిగిన వివాహాలు... రాష్ట్రంలో గత పదేళ్ల క్రితం నాటితో పోలిస్తే కులాంతర వివాహాల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రతీ వంద పెళ్లిళ్లలో ఎనిమిది కులాంతర వివాహాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో జరిపిన ఓ పరిశీలనలో గుర్తించారు. ఇందులో పావు వంతు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. కులాంతర వివాహాల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య అధికంగానే ఉంటోంది. గత నాలుగేళ్ల గణాంకాలు పరిశీలిస్తే కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఎస్సీల సంఖ్య 2వేల వరకు ఉంది. ఈ గణాంకాలు అధికారికమే అయినప్పటికీ... వీటి సంఖ్య రెట్టింపు ఉంటుందని, ఎస్టీల్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహకం... కులాంతర వివాహాలు చేసుకున్న దళిత, గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ జంటకు గతంలో రూ.50వేలు ఇచ్చేది. తాజాగా ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2018–19 సంవత్సరం నుంచి రూ.2.5లక్షలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. మరోవైపు పేదింటిలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అమలు చేస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ రెండు పథకాలతోనూ లబ్ధి చేకూరనుంది. -
ఆ ఊరిలో ప్రేమపెళ్లిళ్లు నిషేధం..
అమృత్సర్ : ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే ఆ జంటలను గ్రామం నుంచి బహిష్కరించేందుకు కొన్ని గ్రామాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ విధమైన సంఘటన పంజాబ్‌లోని లుథియానా జిల్లా చాంకోయిన్ ఖుర్ద్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామ పెద్దలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ గ్రామంలో ప్రేమ వివాహలను నిషేధిస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటను సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని తెలిపింది. అంతేకాక ఆ గ్రామంలో వారితో ఎవరూ మాట్లాడకూడదు.. ఆ జంటకు సహకరించకూడదని ఆదేశించింది. ఇది ఊరు మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని ఓ పంచాయితీ సభ్యుడు తెలిపాడు. ఏప్రిల్ 29న ఓ జంట కులాంతర వివాహం చేసుకుంది. అది జీర్ణించుకోలేని గ్రామస్తులు.. తమ ఊర్లలో ప్రేమ వివాహం, కులాంతర వివాహాలు చేసుకోవడం తగవని చెప్పారు. దీనిపై గ్రామపంచాయితీలో గ్రామస్తులు సమావేశమయ్యారు. ఇక మీదట గ్రామంలో లవ్ మ్యారేజేస్ను నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యువకుడి తాత జన్ సింగ్ మాట్లాడుతూ.. ‘వారిద్దరూ ప్రస్తుతం మా గ్రామంలో లేరు. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆ అమ్మాయిని బంధువులు ఇంటికి రమ్మని పిలిచారు. అందుకు ఆ యువతి నిరాకరించింది’ అని ఆయన తెలిపారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఈ విధమైనవి తమ దృష్టికి రాలేదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
పెరుగుతున్న ‘అరేంజ్డ్ మ్యారేజెస్’
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక ప్రపంచంలో కూడా భారత దేశంలో 90 శాతం ‘అరేంజ్డ్ మ్యారేజెస్ (తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు)’ జరుగుతుండగా, యావత్ ప్రపంచంలో సగానికన్నా ఎక్కువగానే అరేంజ్డ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దక్షిణాసియాతోపాటు మధ్యప్రాచ్యంలో, కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో, జపాన్, చైనా లాంటి తూర్పు ఆసియా దేశాల్లో ఈ కుదుర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. షాదీ, జీవన్ సాథీ లాంటి ఆన్లైన్ వెడ్డింగ్ వెబ్సైట్ల కూడా కుదిర్చిన పెళ్లిళ్లు పెరగడానికి కారణం అవుతున్నాయి. మారుతున్న ప్రపంచంలో ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా పెరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారుగానీ అందులో వాస్తవం లేదని లెక్కలు తెలియజేస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. వారి సంఖ్య రెండు శాతం కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అమ్మాయి లేదా అబ్బాయి తమ తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా అన్న అంశాన్నే పరిగణలోకి తీసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబ పెద్దలకు నచ్చే వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అలా ప్రేమించిన వారిని తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అనుమతితోనే ఎక్కువగా పెళ్ళి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఈ ఆన్లైన్ ప్రేమ పెళ్లిళ్లు కూడా ఒక విధంగా కుదుర్చుకున్న పెళ్లిళ్లే అనవచ్చు. ఎక్కువ మంది తమ అభిరుచులకంటే తమ సామాజిక వర్గానికి లేదా ఆర్థిక వర్గానికి చెందిన వారా, కాదా, తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా ? లేదా తమ సంస్కృతిని గౌరవిస్తారా, లేదా? అన్న అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకొని ప్రేమించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రేమ పండితులు చెబుతున్నారు. కుదుర్చుకుని చేసుకున్న పెళ్లిళ్లు పెటాకులు కాకపోవడమే పెళ్లిళ్లకు ఆదరణ పెరగడానికి ఎక్కువ కారణం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న అమెరికాలో విడాకుల సంఖ్య 40 శాతానికి పైగా ఉండగా, భారత దేశంలో కుదుర్చుకున్న పెళ్లిళ్లో విడాకుల సంఖ్య ఒక శాతం మాత్రమే. భారత్‌లో కూడా ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకుల శాతం ఎక్కువగా ఉంటోంది. అది ఎంత శాతం అన్నదానికి అందుబాటులో లెక్కలు లేవు. అమెరికాలో తల్లిదండ్రులు పెళ్లిళ్లను కుదర్చడం కష్టం కనుక ఇంతకాలం అక్కడ కుదుర్చుకున్న పెళ్లిళ్లు ఎక్కువగా జరగలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఈహార్మనీ, ఓకేక్యూపిడ్, ది రైట్స్టఫ్ లాంటి ఆన్లైన్ పెళ్లి వెబ్సైట్లు అందుబాటులోకి రావడంతో కుదుర్చుకున్న పెళ్ళిళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ‘అరేంజ్డ్’ అన్న పదాన్ని ఉపయోగించవుగానీ, అవన్నీ అరేంజ్డ్ పెళ్లిళ్లే. పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు తరఫు వారు కలుసుకునేందుకు అవి ‘అరెంజ్’ చేస్తాయి. ఈహార్మని తమ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా, ఓకేక్యూపిడ్ ప్రశ్నావళి ద్వారా, ది రైట్ స్టఫ్ అభ్యర్థుల ప్రొఫైళ్ల ఆధారంగా పెళ్లిళ్లను కుదుర్చుతున్నాయి. -
ప్రేమ పెళ్లిళ్లపై కేసులొద్దు
మేజర్ల ప్రేమ పెళ్లిళ్లపై ఇరు రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కుల, మతాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులపై కేసుల నమోదు విషయంలో ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మేజర్లయిన ప్రేమికులు చేసుకునే పెళ్లిళ్లకు ఆధారాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అటువంటి యువతీ, యువకులను పోలీసులు, తల్లిదండ్రులు వేధింపులకు గురి చేయరాదని సూచించింది. ప్రేమ పెళ్లిళ్ల వెనుక ఒత్తిడి, భయం, బెదిరింపు, ప్రలోభం, మత్తు మందు ఇవ్వడం వంటి కారణాలున్నట్లు తేలితేనే కేసులు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పోలీసులకు పంపాలని ఉభయ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ ఇటీవల తీర్పునిచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్న తనపై ...తన భార్య తండ్రి కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు పంపారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా గుడిపల్లికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు వేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పరస్పర ఇష్టంతో పెళ్లి జరిగినా:పిటిషనర్ తరఫు న్యాయవాది వి.ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ మేజర్లయిన పిటిషనర్, అతను పెళ్లి చేసుకున్న యువతి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదైందన్నారు. పరస్పర అంగీకారంతోనే వివాహం జరిగినట్లు ఆధారాలను పోలీసులకు సమర్పించి నా పిటిషనర్‌ను జైలుకు పంపారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌కు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం దేశ యువత ఆలోచనలు విస్తృత పరిధిలో ఉంటున్నాయని, కులమతాంతర, పెళ్లిళ్లు చేసుకోవడానికి వారు వెనుకాడట్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందువల్ల యువత వారి దారిలో ముందుకెళ్లేందుకు సహకరించడం తల్లిదండ్రుల బాధ్యతన్నారు.