మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్.. షబ్బీర్‌అలీ
సాక్షి, మాచారెడ్డి: ఇచ్చిన మాటకు కట్టుబడేది కాంగ్రెస్ పార్టీయేనని మండలి విపక్షనేత, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్‌అలీ షబ్బీర్ అన్నారు. బుధవారం మండలంలోని లచ్చాపేట్, ఘన్పూర్(ఎం), మాచారెడ్డి చౌరస్తా, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, బండరామేశ్వర్‌పల్లి, యెల్పుగొండల్లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. కేసీఆర్ మాయ, మాటలు నమ్మే రోజులు పోయాయన్నారు. ప్రతి రెండు బోర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి రైతులకు విద్యుత్ కొరత తీర్చానని షబ్బీర్‌అలీ వివరించారు.
మండలంలోని యువతకు ఎన్నో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో ఇప్పించానన్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పాలనలో హౌసింగ్బోర్డులు తొలగించేశారన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, పంపరి శ్రీనివాస్, ప్రజాకూటమి నేతలు వీఎల్ నర్సింహారెడ్డి, రాజిరెడ్డి, మాణిక్యరెడ్డి, రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు భూంరెడ్డి, అలీఖాన్, బ్రహ్మనందారెడ్డి, రమేశ్‌గౌడ్, రాజ్‌కుమార్ ఉన్నారు.
కాంగ్రెస్‌లో పలువురి చేరిక
సాక్షి, కామారెడ్డి రూరల్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం ప్రతినిధులు 20 మంది సభ్యులు, స్టార్ బాయ్స్ యూత్ సభ్యులు 10 మంది షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి పెద్ద నారాయణ, బండారి యాదవరెడ్డి ఉన్నారు.
పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
సాక్షి, కామారెడ్డి టౌన్: పట్టణంలోని 23, 24 వార్డుల్లో కాంగ్రెస్ పట్టణ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేశారు. మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తు ఓటర్లను అభ్యర్థించారు. పదేళ్లుగా అభివృద్ధిని నోచుకోని కామారెడ్డిని అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కన్నయ్య, నాయకులు ఇర్ఫాన్, రాజు, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాకూటమి తరఫున...
పట్టణంలో మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి మద్దతుగా సీపీఐ, తెలుగుదేశం, నాయకులు బుధవారం పట్టణంలో ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తు వచ్చాడని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిచంచాలన్నారు. చేతి గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, నాయకులు బాల్‌రాజ్, దశరథ్, ప్రవీన్, టీడీపీ నాయకుడు మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.