Maddala Rajesh Kumar
-
మహిళలకు సముచిత స్థానం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఈ ఎన్నికల్లో రెండు సీట్లు కేటాయించింది. మహిళలపై ఎనలేని అభిమానం ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక సీటుతోనే సరిపెట్టడం గమనార్హం. కొవ్వూరు అభ్యర్థిగా తానేటి వనిత, చింతలపూడి అభ్యర్థిగా డాక్టర్ మద్దాల దేవిప్రియను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. కొద్దిరోజుల క్రితం వరకూ గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనిత ఏడాది క్రితం టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు ప్రజా సమస్యలపైనా పోరాటాలు చేశారు. కొద్దినెలల క్రితం ఆమెను కొవ్వూరు సమన్వయకర్తగా నియమించిన వైఎస్సార్ సీపీ తాజా ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ దేవీప్రియకు సీటిచ్చింది. దేవీప్రియ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ సతీమణి. మహిళలకు అవకాశం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఆమెకు చింతలపూడి సీటును కేటాయించారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకే ఒక సీటును మహిళలకు ఇచ్చింది. చింతలపూడిలో పీతల సుజాతను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో సుజాతకు చివరి నిమిషంలో చింతలపూడి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆమె మొదటి నుంచీ సీటు అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడిలో ఏదో ఒకచోట తనకు అవకాశం ఇవ్వాలని ఆమె పదేపదే కోరుతూ వచ్చారు. అయినా పట్టించుకోని బాబు చివరకు చింతలపూడి సీటు ఇవ్వడం విశేషం. సుజాత నియోజకవర్గానికి చెందిన వారు కాకపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లోనూ టీడీపీ ఒక మహిళకే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు, గోపాలపురం స్థానాలను మహిళలకు కేటాయించింది. పాలకొల్లులో కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి ఏకంగా పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని ఓడించి సంచలనం సృష్టించారు. -
'చంద్రబాబుకు భయం పట్టుకుంది'
ఏలూరు: వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. కుమ్మక్కై రాజకీయాలతో ఆరు కోట్ల సీమాంధ్ర ప్రజలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలోకి వస్తే జగన్ సుపరిపాలన ద్వారా టీడీపీ కనుమరుగవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాసంక్షేమం కోసం పోరాడింది వైఎస్ కుటుంబం మాత్రమేనని, రాజన్న రాజ్యం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వీరు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
సమైక్యాంధ్ర కోరితే సంకెళ్లు వే స్తారా!
చింతలపూడి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య రాష్ర్టం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్‌ను నిరసిస్తూ చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. సోనియా, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. రాజేష్‌కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాక మార్షల్స్‌తో గెంటించి అనంతరం అరెస్టు చేయడం అమానుషమన్నారు. అరె స్ట్‌లకు భయపడేది లేదన్నారు. సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.నవీన్‌బాబు, మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పట్టణ కన్వీనర్ గంధం చంటి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ ఎం.ఇమ్మానియేలు, నాయకులు ఎస్.కాంతారావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, వేమారెడ్డి, దాసరి వెంకన్న, చెంచమరాజు, భాస్కర్, ఏడుకొండలు, తాతారావు, మైసన్న, పండు పాల్గొన్నారు -
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
-
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
చింతలపూడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు- ఆయనను నేడు అదుపులోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కావూరి ఒత్తిళ్లకు లొంగి పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులపై కావూరి అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమపై పరుష పదజాలంతో దూషించిన కావూరి పై సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేయాలని మద్దాల రాజేష్ డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసే పోలీసు స్టేషన్లోనే బైఠాయిస్తామని అన్నారు. సొంత నియోజకవర్గంలో తనను అడ్డుకున్న సమైక్యవాదులపై మంగళవారం కావూరి విరుచుకుపడ్డారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. కాగా, మద్దాల రాజేష్ అరెస్టుకు నిరసనగా గురువారం చింతలపూడిలో బంద్ పాటిస్తున్నారు.