madhusudana rao
-
అడ్వొకేట్ అరాచకం
విజయనగరం (క్రైమ్): నలుగురికీ న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఎం.దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్‌తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్ఐఆర్ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని బుధవారం ఆ ఇంటికి వెళ్లి మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. -
పదో తరగతి పరీక్షా టైమ్ టేబుల్ విడుదల
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : మార్చి 2015లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. -
జాతి కొద్ది పాలు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పాడిపరిశ్రమ పెట్టుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే డెయిరీ పెట్టే రైతులు ఎలాంటి పశువులు కొనాలి.. ఏం చూడాలి..ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వామా సహాయ సంచాలకులు మధుసూదనరావు వివరిస్తున్నారు. కృత్రిమ పాల దిగుబడితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాల విక్రయం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చు. ఇందుకోసం ఆరోగ్యవంతమైన పశువులను ఎంచుకోవాలి. ‘పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు’ అన్నారు. మేలుజాతి పశువులతోనే మంచి పాల దిగుబడి వస్తుంది. తద్వారా పాడి పరిశ్రమ లాభసాటిగా సాగుతుంది. కొనే ముందు జాగ్రత్తలివి.. పశువును కొనుగోలు చేసే ముం దు శరీర లక్షణాలు, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి వీలైనంత వరకూ ఏ ప్రాంతంలో డెయిరీఫాం పెట్టాలనుకుంటున్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెయిరీఫారంలో అమ్మకానికి ఉంటే అట్టి పాడి పశువులను కొనడం మంచిది. ఎందుకనగా, ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, కేరళ నుంచి తెచ్చిన పాడిపశువులు మంచివే. కానీ ఆ పశువులు అక్కడి మేతకు అలవాటు పడి ఉంటాయి. వాటికి అనుగుణంగా దాణా, నిర్వహణ లేకుంటే దూడలు చనిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోతాయి. కొన్ని రోజుల వరకు అక్కడ అలవాటు పడిన మేతతోపాటు మనకు అందుబాటులో ఉన్న దాణా కూడా అందించాలి. ఇవి గమనించాలి దూర ప్రాంతాల పశువలను కొనే ముందు వాటి, జాతి రికార్డులు చూడడం మంచిది పాడిపశువులు నిండుగా చురుకగా ఉండాలి {తికోణాకారంలో ఉండి, చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి మెడ పొట్టిగా, డొక్కులు నిండుగా పొదుగు విస్తరించి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. నాలుగు చనుకట్లు సమానంగా ఉండాలి, కాళ్లు , కాలిగిట్టలు ధ్రుడంగా కనిపించాలి. బెదరకుండా ఎవరు పాలు పితికినా ఇచ్చేలా ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. కొనుగోలు చేసే ముందు ఎన్నో ఈతనో గమనించి 4 ఈతల లోపు పశువులే కొనాలి. పాడిపశువు కొనాలనుకుంటే రెండు మూడురోజులు దగ్గర ఉండి పాల ఉ త్పత్తిని రెండుపూటల గమనించాలి. ముందు నుంచే గడ్డి పెంచుకోవాలి డెయిరీ ఫాం పెట్టే ముం దు 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం పెంపకం చేపట్టాలి. తృణజాతి, గడ్డిజాతి గ్రాసాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే పశువులు తెచ్చుకోవాలి. సంకరజాతి ఆవు రోజు కు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ముర్ర జాతి గేదె అయితే 8 నుం చి 10 లీటర్ల పాలిస్తాయి. ఈనిన గేదె, ఆవు దూడ తో కొనడం మంచిది. పశువు కొనేందుకు వెళ్లినప్పుడు ఆ పాడిపశువు నిర్వహణ ఎలా ఉంది అనేది గమనించాలి. అదే పద్ధతి కొనసాగించడం పాల ఉత్పత్తి నిలకడగా ఉండడానికి దోహద పడుతుంది. వాహనంలో తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలివి.. దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చేటప్పుడు రవాణా సమయంలో వాహనాన్ని ఆపి, పశువులను దించి కొంత దూరం నడిపించాలి నీరు, దాణా పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల కాళ్ల మధ్య వాహనంలో వరిగడ్డి మందంగా పరిచి వాహనంలోపలి అంచులకు గడ్డితో నింపిన సంచులను వేలాడదీయాలి. {పయాణంలో రాపిడివల్ల గాయాలు కాకుండా చూడాలి. పశువుల మధ్యలో వెదురుకర్రలు కట్టి తలభాగంపైన ఉండేలా చూడాలి. వేసవిలో అయితే రాత్రి ప్రయాణం చేయ డం మంచిది.రవాణా బీమా చేయించాలి. మంచిపాడి పశువు కొనుగోలు ఎంతముఖ్యమో కొన్న పశువును క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా అంతే ముఖ్యం. పాడిపశువుల కొనుగోలు, రవాణాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువు, డెయిరీఫాంలో కాసుల కురిపించే కనక మహాలక్ష్మీ కాగలదనడం నిర్వివాదాంశం. -
‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి
పెద్దమోదుగపల్లిగ్రామంలో టీడీపీ నేతల అరాచకం మృతుడు మధుసూదనరావు మాజీ సర్పంచి వివాదం వద్దని సర్ది చెబుతుండగా దాడి వత్సవాయి : టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆదివారం మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ మాజీ సర్పంచి కల్యాణం మధుసూదనరావు(61)కు గ్రామ శివారున మామిడితోట ఉంది. అక్కడ ఆయన కుమారుడు విద్యాసాగర్ జేసీబీతో కాలువ తీయిస్తున్నాడు. తోట పక్కన నివాసం ఉంటున్న వారు కట్టెలను తీసి గట్టుపై ఉంచారు. జేసీబీకి అడ్డు వస్తున్నాయి.. వాటిని తీయాలని విద్యాసాగర్ చెప్పారు. ఇది పోరంబోకు స్థలం తియ్యమని చెప్పడానికి నీవెవరు అంటూ అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న మధుసూదనరావు తోట దగ్గరకు వెళ్లగా, అప్పటికే వివాదం ముదిరింది. ఘర్షణ వద్దని మధుసూదనరావు సర్ది చెబుతుండగా, టీడీపీ నేతలై న గ్రామ ఉప సర్పంచి నందమూరి శ్రీను, రాము, కనగాల గణపతిలు దాడికి దిగారు. ఈ ఘటనలోమధుసూదనరావు అక్కడిక్కడే కుప్పకూలారు. గ్రామస్తులు ఆటోలో జగ్గయ్యపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ వీరయ్యగౌడ్ హామీతో శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముందస్తుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయభాను పరామర్శ తెలుగుదేశం నాయకుల దౌర్జన్యానికి బలైన గ్రామ మాజీ సర్పంచి మధుసూదనరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు కనపర్తి శేషగిరిరావు, మారెళ్ల పుల్లారెడ్డి, ఇంటూరి చిన్నా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి, చౌడవరపు జగదీష్ తదితరులు వసందర్శించి నివాళులర్పించారు. మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
పారదర్శకంగా ఓటర్ల విచారణ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్ల విచారణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రోల్ అబ్జర్వర్, వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు వెల్లడించారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్ల విచారణ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మధ్యాహ్నం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఓటర్ల నమోదుపై విచారణ పూర్తి చేస్తామన్నారు. గతంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన అభ్యంతరాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఓటర్ల విచారణ ప్రక్రియకు సంబంధించి ఇతర శాఖల నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విచారణపై ఎవరికైనా అనుమానాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓటర్ల వివరాలను కంప్యూటరీకరించే సమయంలో ఏ ఆపరేటరైనా ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ రెండు గ్రామాల్లో పూర్తిస్థాయిలో విచారించాలి : కేవీ రమణారెడ్డి ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, బద్దిపూడి గ్రామాల్లో ఓటర్ల నమోదుపై పూర్తిస్థాయిలో విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆ రెండు గ్రామాల్లో పెద్దఎత్తున బోగస్ ఓట్లను చేరుస్తున్నారని రోల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలులో వాస్తవ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను 10లోపు విచారించాలి ఓటర్ల నమోదుకు సంబంధించి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు విచారించి కంప్యూటరీకరించాలని మధుసూదనరావు ఆదేశించారు. 16వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రచురించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గ నమోదు అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం సాయంత్రం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరుగా నమోదు కావడానికి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి ఓటర్ల జాబితాలపై అనుమానాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చిన అర్జీలన్నింటినీ రెండురోజుల్లో కంప్యూటరీకరించాలన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై కొంత గందరగోళం ఉందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ పద్మజ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, డిప్యూటీ కలెక్టర్లు పీ గ్లోరియా, కొండయ్య, రవీంద్ర, కందుకూరు, మార్కాపురం ఆర్డీఓలు టీ బాపిరెడ్డి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.