జాతి కొద్ది పాలు.. | should be taken before buying of dairy cattle | Sakshi
Sakshi News home page

జాతి కొద్ది పాలు..

Published Fri, Nov 21 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

should be taken before buying of dairy cattle

 ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పాడిపరిశ్రమ పెట్టుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే డెయిరీ పెట్టే రైతులు ఎలాంటి పశువులు కొనాలి.. ఏం చూడాలి..ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వామా సహాయ సంచాలకులు మధుసూదనరావు వివరిస్తున్నారు. కృత్రిమ పాల దిగుబడితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాల విక్రయం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చు. ఇందుకోసం ఆరోగ్యవంతమైన పశువులను ఎంచుకోవాలి. ‘పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు’ అన్నారు. మేలుజాతి పశువులతోనే మంచి పాల దిగుబడి వస్తుంది. తద్వారా పాడి పరిశ్రమ లాభసాటిగా సాగుతుంది.

 కొనే ముందు జాగ్రత్తలివి..
 పశువును కొనుగోలు చేసే ముం దు శరీర లక్షణాలు, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి
 వీలైనంత వరకూ ఏ ప్రాంతంలో డెయిరీఫాం పెట్టాలనుకుంటున్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెయిరీఫారంలో అమ్మకానికి ఉంటే అట్టి పాడి పశువులను కొనడం మంచిది.
 ఎందుకనగా, ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, కేరళ నుంచి తెచ్చిన పాడిపశువులు మంచివే. కానీ ఆ పశువులు అక్కడి మేతకు అలవాటు పడి ఉంటాయి.  
 వాటికి అనుగుణంగా దాణా, నిర్వహణ లేకుంటే దూడలు చనిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోతాయి.
 కొన్ని రోజుల వరకు అక్కడ అలవాటు పడిన మేతతోపాటు మనకు అందుబాటులో ఉన్న దాణా కూడా అందించాలి.

 ఇవి గమనించాలి
 దూర ప్రాంతాల పశువలను కొనే ముందు వాటి, జాతి రికార్డులు చూడడం మంచిది
 పాడిపశువులు నిండుగా చురుకగా ఉండాలి
 {తికోణాకారంలో ఉండి, చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి
 మెడ పొట్టిగా, డొక్కులు నిండుగా పొదుగు విస్తరించి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు.
 నాలుగు చనుకట్లు సమానంగా ఉండాలి, కాళ్లు , కాలిగిట్టలు ధ్రుడంగా కనిపించాలి.
 బెదరకుండా ఎవరు పాలు పితికినా ఇచ్చేలా ఉండాలి
 నవంబర్, డిసెంబర్ నెలల్లో పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అనువైన సమయం.
 కొనుగోలు చేసే ముందు ఎన్నో ఈతనో గమనించి 4 ఈతల లోపు పశువులే కొనాలి.
 పాడిపశువు కొనాలనుకుంటే రెండు మూడురోజులు దగ్గర ఉండి పాల ఉ త్పత్తిని  రెండుపూటల గమనించాలి.
 
ముందు నుంచే గడ్డి పెంచుకోవాలి
 డెయిరీ ఫాం పెట్టే ముం దు 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం పెంపకం చేపట్టాలి.
 తృణజాతి, గడ్డిజాతి గ్రాసాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే పశువులు తెచ్చుకోవాలి.
 సంకరజాతి ఆవు రోజు కు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ముర్ర జాతి గేదె అయితే 8 నుం చి 10 లీటర్ల పాలిస్తాయి.
 ఈనిన గేదె, ఆవు దూడ తో కొనడం మంచిది.
 పశువు కొనేందుకు వెళ్లినప్పుడు ఆ పాడిపశువు నిర్వహణ ఎలా ఉంది అనేది గమనించాలి. అదే పద్ధతి కొనసాగించడం పాల ఉత్పత్తి నిలకడగా ఉండడానికి దోహద పడుతుంది.    
    
 వాహనంలో తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలివి..
 దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చేటప్పుడు రవాణా సమయంలో వాహనాన్ని ఆపి, పశువులను దించి కొంత దూరం నడిపించాలి
 నీరు, దాణా పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల కాళ్ల మధ్య వాహనంలో వరిగడ్డి మందంగా పరిచి వాహనంలోపలి అంచులకు గడ్డితో నింపిన సంచులను వేలాడదీయాలి.
 {పయాణంలో రాపిడివల్ల గాయాలు కాకుండా చూడాలి.
 పశువుల మధ్యలో వెదురుకర్రలు కట్టి తలభాగంపైన ఉండేలా చూడాలి.
 వేసవిలో అయితే రాత్రి ప్రయాణం చేయ డం మంచిది.రవాణా బీమా చేయించాలి.
 మంచిపాడి పశువు కొనుగోలు ఎంతముఖ్యమో కొన్న పశువును క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా అంతే ముఖ్యం.
 పాడిపశువుల కొనుగోలు, రవాణాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువు, డెయిరీఫాంలో కాసుల కురిపించే కనక మహాలక్ష్మీ కాగలదనడం నిర్వివాదాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement