mandava venkateswar rao
-
మండవకు ‘రాజ్య’యోగం దక్కేనా..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం అయింది. రెండు సాధా రణ స్థానాలు కాగా, ఒకటి ఉప ఎన్నిక. జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి శ్రీనివాస్ పదవీకాలం వచ్చే నెల 21న ముగియనుంది. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు సభ్యత్వం కాలపరిమితి ముగియనుంది. మరొక స్థానం విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి ఈ నెల 19 వర కు నామినేషన్ల గడువు ఉంది. మిగిలిన రెండు సాధారణ స్థానాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే జిల్లా నుంచి డీఎస్ ఖాళీ చేస్తున్న స్థానాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ ఆశిస్తున్నారు. కాగా జిల్లా నుంచి ఇప్ప టికే రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి ఉన్నా రు. రాజ్యసభ సీట్లను ఆశించేవారి సంఖ్య అధికార పార్టీలో భారీగానే ఉంది. దీంతో అనేక స మీకరణాలు ప్రభావితం కానున్నాయి. ఈ మేర కు సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారేనే విషయ మై వివిధ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆశావహుల్లో ప్రధానంగా మండవ వెంకటేశ్వరరావు పేరు మాత్రమే వినిపిస్తోంది. -
‘గ్రేటర్’లో టీడీపీ ఖాళీ..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్లోకి వలసలు భారీగా సాగుతున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరు శనివారం అధికార పార్టీలో చేరారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తన నివాసంలో మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని ఈ ఇద్దరు నేతలు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తానని వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్లోకి పగిడిపాటి దేవయ్య... అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో మహాకూటమి తరఫున తెలంగాణ జనసమితి అభ్యర్థిగా పోటీ చేసిన పగిడిపాటి దేవయ్య శనివారం టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి దేవయ్యను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దేవయ్య 2015 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సీనియర్లను గౌరవిస్తాం: కేటీఆర్ తెలుగు దేశం పార్టీనుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన సీనియర్ నేతలను సముచితంగా గౌరవిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. టీడీపీ హైదరాబాద్ నగర విభాగ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్, కార్యదర్శి, వివిధ విభాగాల అధ్యక్షులు శనివారం టీఆర్ఎస్లోకి మారారు. కేటీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరికతో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. టీడీపీ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చేరికల సందర్భంగా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో మిగిలిన సీనియర్ నేతలు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ సముచితంగా గౌరవిస్తుందని తెలిపారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
టీఆర్ఎస్లో చేరిన మండవ, గాయత్రి రవి
సాక్షి, హైదరాబాద్ : మాజీమంత్రి, తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్...ఈ సందర్భంగా మండవకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ కీలకపాత్ర పోషఙంచారు. కాగా సీఎం కేసీఆర్ నిన్న స్వయంగా హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కాగా టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ టీఆర్ఎస్లో చేరడంతో నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో అధికార పార్టీకి బలం పెరిగినట్లు అయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు మిగిలున్న కేడర్ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా మండవను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన డిచ్పల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, నిజామాబాద్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త గాయత్రి గ్రూప్ ఇండస్ట్రీస్ యజమాని గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) గులాబీ కండువా కప్పుకున్నారు. గాయత్రి రవి ఇవాళ సాయంత్రం తన అనుచరులతో కలిసి ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. ఆయన 2018 వరంగల్ (తూర్పు) నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రవి పోటీ చేశారు. -
టీఆర్ఎస్లోకి మాజీ మంత్రి మండవ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ కీలకపాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం స్వయంగా హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా మండవ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతుండడంతో నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో అధికార పార్టీకి బలం పెరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఉదయం మండవ వెంకటేశ్వర్రావు ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. టీఆర్ఎస్లో చేరేందుకు మండవ వెంకటేశ్వర రావు సుముఖత వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కేసీఆర్ వెంట ఉన్నారు. టీడీపీ ఓటు బ్యాంకు లక్ష్యం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి తీసుకోవడంతోపాటు మిగిలున్న కేడర్ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. దీంట్లో భాగంగా మండవ వెంకటేశ్వర్రావును పార్టీలోకి ఆహ్వా నించింది. మండవ వెంకటేశ్వర్రావు డిచ్పల్లి నియోజకవర్గం నుంచి 4సార్లు, నిజామాబాద్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. -
మోగుతున్న రెబెల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ నుంచి ఇంకా ముప్పు తప్పలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేత లు అసంతృప్తి సెగలు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీ అధిష్టానాలు బుజ్జగింపులు మొదలు పెట్టినప్పటికీ నామినేషన్లు వేసిన తిరుగుబాటు అభ్యర్థులు మెత్తపడడం లేదు. ఇందుకు కాంగ్రెస్, టీ ఆర్ఎస్, టీడీపీ, బీజేపీలో ఏ పార్టీ అతీతం కాదు. ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు టికెట్ దక్కకపోగా, ఆశలు గల్లంతు కావడా న్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ చేజారిన ఆశావహులు అవమాన భారంతో ఇంటి గడప దాటడం లేదు. టీఆర్ఎస్ టికెట్ రాని నేతలు పార్టీ అభ్య ర్థులతో కలిసి తిరుగుతున్నా మనోవేదన నుంచి పూర్తిగా కోలుకోలేక పోతున్నారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన పొత్తులతో ఆశలు గల్లంతైనా బీజేపీ నేతలు చాలాచోట్ల టీడీపీ నేతల ఓటమిని కళ్లచూడాలన్న శపథంలో ఉన్నారు. బుధవారం నామి నే షన్ల పర్వం ముగియగా, రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. ‘బి’ఫారాలు సమర్పించకుండా, డమ్మీలుగా వేసిన పలువురి నామినేషన్లు గురువారం తిరస్కరణకు గురయ్యాయి. ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేందుకు అసంతృప్తులు సిద్ధమవుతున్నారు. రెబెల్స్ ఉప సంహరణకు టీడీపీ గురువారం రాత్రి వేసిన త్రిసభ్య కమిటీలో జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర్రావుకు స్థానం కల్పించగా, జిల్లాలో ఆ పార్టీకే ఎక్కువ మంది రెబల్స్‌గా ఉన్నారు. చేతికి చిక్కే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గోల రగులుతూనే ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు అసంతృప్తి పొంచి ఉంది. ఆయన అభ్యర్థి త్వాన్ని ఇతర నాయకులు కొందరు తట్టుకుని కలిసి నడిచే పరిస్థితిలో లేరు. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ కాసుల బాలరాజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్ వేసిన ఆ పార్టీ నేతలు సంగెం శ్రీనివాస్‌గౌడ్, మాసాని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగాధర్‌కు రెబల్‌గా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార ఉన్నారు. ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్‌కు మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ గండం ఉంది. కమలానికి ‘నో’ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఉన్న బీజేపీ అభ్యర్థిని టీడీపీ నేత బాన్సువాడ సుభాష్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎన్నికలలో ప్రచారానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నామినేషన్ వేయ గా, ప్రముఖ వ్యాపారవేత్త పొద్దుటూరి సదానందరెడ్డి పోటీగా ఉన్నారు. బాల్కొండలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డికి బీజేపీ నేత ముత్యాల సునీల్‌రెడ్డి, బోధ న్లో టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి బీజేపీ నేత కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి బెడద ఉంది. గులాబీకీ గుబులే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు అసంతృప్తి చాపకింది నీరులా ఉంది. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌పై ఇటు నాయకులలోనూ అటు కేడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహారాష్ర్టలో వ్యాపారిగా స్థిరపడిన బీబీ పాటిల్‌కు తెలుగు రాకపోగా, ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఆయన ఎలా నెట్టుకొస్తారన్న చర్చ కూడ ఆ పార్టీలో ఉంది. జుక్కల్ అభ్యర్థి హన్మంత్సింధేపై మాజీ ఎమ్మెల్యే పండరి పోటీకి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రెబల్స్‌గా నామినేషన్ వేసిన గంగాధర్‌రావు దేశాయి, డి మాదవ్ యాదవ్ ఈసారి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్త పట్ల పార్టీ ముఖ్య నేతల్లో సానుకూలత లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేత లు ఆయన వెంట తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా తెలియని అసంతృప్తిని క్యాడర్ వద్ద వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు అసంతృప్తుల భయం వెంటాడుతోంది. -
విలపించిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బాధను దిగమింగుకోలేక బుధవారం శాసన సభ లాబీల్లో సహచర నేతల వద్ద బోరున విలపించారు. పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు. ‘‘నేను అడగకపోయినా, రాజ్యసభ సీటు ఇస్తానని అధినేతే వంద సార్లు హామీ ఇచ్చారు. రాజ్యసభకు వెళ్తానన్న ఆశతో నియోజకవర్గంలో తిరగకుండా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కే పరిమితమయ్యా. చివరకు చేయిచ్చారన్నా. అభ్యర్ధుల ఎంపిక సమయంలో నాతో చర్చించనే లేదు. నేను అక్కడ ఉండగానే అభ్యర్థుల పేర్లు టీవీ ఛానళ్లలో వచ్చాయి. దళితుడిని కాబట్టే నన్ను అవమానించారు. అదే స్థితిమంతుడినైతే ఇలా చేసేవారా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధను దింగమింగుకోలేక బోరున విలపించారు. అంతటి సీనియర్ నేత తమ ముందు విలపించటంతో ఎర్రబెల్లి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకున్న ఎర్రబెల్లి ఆయన్ని అనునయించారు. లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ), టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా మోత్కుపల్లిని ఓదార్చారు. -
మేధోమథనం.. అంతర్మథనం..
సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : జిల్లా తెలుగుదేశంలో అయోమయం నెలకొంది. తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్ర విభజన పక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాం తం... ఢిల్లీలో దీక్ష ..సమన్యాయం పేరుతో పూటకో మాట.. తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పైగా పార్టీలోని కొందరు ముఖ్యనేతలు సమైక్యాంధ్ర కోసం కోర్టుకు వెళ్లటం వం టి అంశాలు కూడా తీవ్ర నిర్వేదానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్ల రాజకీయ భవితవ్యంపై చర్చ జరుగుతుండగా...పయనమెటనే విషయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికల నర్సారెడ్డిలతో పాటు పలువురి జిల్లా, నియోజక వర్గం స్థాయి నాయకుల రాజకీయ ముందడుగుపై రాజకీయ వర్గాలు, ముఖ్యంగా పార్టీ కేడర్‌లో రసవత్తరమైన చర్చ సాగుతోంది. అదేవిధంగా జీవోఎంకు విభజనపై అధినేత బాబు నివేదిక ఇవ్వక పోవటంపై కూడా తమ్ముళ్లను మరింత నైరాశ్యంలోకి నెట్టినట్లయింది. పైగా ముందున్న విభజన సమస్యపై స్పష్టత ఇవ్వకుండా రానున్న ఎన్నికల కోసం మేధోమథనసదస్సులు నిర్వహిం చటం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇదివరకే ఢిల్లీ దీక్షలకు కచ్చితంగా రావాలని ఒత్తిడి చేయటంతో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లి వచ్చారు. ఇది వారిని ఇరుకున పెట్టగా అంతర్మథనంలో పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడటం ఎలాగన్న ఆలోచనలు వారిని రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కునేలా చేస్తున్నాయి. ఇదే తరుణంలో ఈ నెల 11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించతల పెట్టిన మేధోమథన సదస్సుకు జిల్లా నుంచి 30 మందికి పైగా ప్రతి నిధులు హాజరుకావాలని అధిష్టాన వర్గం నుంచి పిలుపురావడం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. సదస్సుకు జిల్లా నుంచి 30 మంది ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కార్యవర్గం, నియోజక వర్గ ఇన్చార్జిలు, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో ఇన్చార్జిలు లేకపోవడంతో త్రిసభ్యకమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేధోమథన సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే అధినేత చంద్రబాబు సమన్యాయం పేరుతో సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో మేధోమథన సదస్సుకు హాజరు వారికి సందిగ్ధంగా మారింది.