manjhi
-
‘పద్మశ్రీ’పై హేమచంద్ ఎందుకు మనసు మార్చుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్‌చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.హేమ్‌చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్‌లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్‌పూర్‌లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు. -
నితీష్ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ తినే ఆహారంలో విషం కలుపుతున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితన్ రాం మాంజీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకే నితీష్ మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని తెలిపారు. అయితే విషం కలిపే వారు సీఎం కుర్చీ కోసమే ఈ పనిచేస్తున్నారని మాంజీ చెప్పారు. పాట్నా అసెంబ్లీ బయట శుక్రవారం మాంజీ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్లే నితీష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేగాక పెద్దవాన్ని అని చూడకుండా అసెంబ్లీలో తనను కూడా నితీష్ తిట్టారని మాంజీ తెలిపారు. నితీష్ కుమార్‌కు ఇస్తున ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ చేయాల్సిందిగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని మాంజీ చెప్పారు. బీహార్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపైనా వివరిస్తాని తెలిపారు. ఇటీవలే రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుపై డౌట్లు లేవనెత్తినందుకుగాను మాంజీపై అసెంబ్లీలో సీఎం నితీష్ నోరుపారేసుకున్నారు. -
సామాన్యుడి 30 ఏళ్ల కృషి..
పాట్నా: బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి భగీరధ ప్రయత్నంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఆయన పేరు లంగీ భుయాన్. బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి. వర్షాకాలంలో ఆ ఊరి సమీపంలో ఉన్న కొండలపై కురిసిన వాన నీరు వృథాగా పోవడం గమనించిన లంగీ భుయాన్‌కు ఒక ఆలోచన వచ్చింది. వర్షం నీరు వ్యర్థంగా పోకుండా కాలువ తవ్వాలనే ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా ఒక కాలువ తవ్వి కొండ దగ్గర నుంచి దానికి మార్గం వేయాలనుకున్నాడు. 30 ఏళ్ల క్రితం కొండ కింద నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టి ఇన్నాళ్లకు పూర్తి చేశాడు. 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ ఉన్న పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల లంగీభుయాన్ ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారు. నేను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే నాకు సాయం చేసినవాళ్లే లేకుండా పోయారు. పశువులను మేత కోసం రోజు కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్లేవాడిని, ఆ సమయంలో కాలువ తవ్వే పనులను చేసేవాడిని ’ అని తెలిపారు. లంగీభుయాన్ కాలువ తవ్వడంతో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. చదవండి: రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం : మోదీ -
అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!
నవాజుద్దీన్ సిద్దిఖీ...వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రనైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేస్తారని విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి నవాజ్ ఇటీవల ఓ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట. నవాజుద్దీన్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న చిత్రం ‘మాంఝీ’. తన భార్యలాగే ఇంకెవరూ చనిపోకూడదన్న కారణంతో కేవలం ఓ సుత్తితో 22 ఏళ్ల పాటు కొండను తవ్వి రోడ్డును నిర్మించిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రొమాన్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందట. దర్శకుడు కేతన్ మెహతా ఈ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయానికి నవాజ్ చాలా సెలైంట్ అయిపోయేవారట. ఈ విషయమై రాధికా ఆప్టే మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాకు దూరంగా ఒంటరిగా కూర్చునేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటివరకూ బాగానే ఉన్నారు. సడన్‌గా ఏమైందా...? అని. నాకేమో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా లేదా అని భయం. కానీ యాక్షన్ చెప్పగానే సీన్లో లీనమైపోయేవారు’’ అని చెప్పారు. -
మద్దతివ్వండి.. మంత్రులవ్వండి
ఎమ్మెల్యేలకు బిహార్ సీఎం బహిరంగంగా తాయిలాలు.. అసెంబ్లీలో నేడు బలనిరూపణ చేసుకోనున్న ముఖ్యమంత్రి మాంఝీ జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించిన స్పీకర్ మండలిలో ప్రతిపక్ష నేతగా నితీశ్‌కుమార్; నిరసన వ్యక్తం చేసిన బీజేపీ మాంఝీకి అధికారికంగా మద్దతు ప్రకటించిన బీజేపీ పట్నా: ‘నాకు మద్దతుగా ఓటేయండి.. కావలసిన మంత్రి పదవి దక్కించుకోండి’ మంచి సమయం మించిన దొరకదంటూ సాక్షాత్తూ బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. గురువారం పట్నాలో జరిగిన గరీబ్ స్వాభిమాన్ సమ్మేళన్‌లో ఆయన మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపేలా ప్రజలు తమ ఎమ్మెల్యేలను కోరాలన్నారు. ‘‘నాకు మద్దతు ఇవ్వాలని మీ ఎమ్మెల్యేలను కోరండి.. మంత్రి పదవుల కోసమే వారు నాకు వ్యతిరేకంగా పోవాలనుకుంటున్నట్లయితే.. నా దగ్గర కూడా ఖాళీలు చాలా ఉన్నాయి. నేను వాళ్లను మంత్రులను చేస్తాను’’ అని అన్నారు. పేదల కోసం పని చేయటమే తాను చేసిన నేరమని ఆయన అన్నారు. తాను చనిపోవటానికైనా సిద్ధమే కానీ, తల వంచేది లేదని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల పాటు ఇతరుల ఆదేశాలను పాటించానని, ఆ తరువాత నిజం తెలుసుకుని ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టానని అదే తన ప్రత్యర్థులకు కంటగింపయిందన్నారు. ప్రతిపక్షంగా జేడీయూ.. ముఖ్యమంత్రి మాంఝీ శుక్రవారం బల నిరూపణ చేసుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కాగానే విశ్వాసపరీక్ష చేపడతారు. బుధవారం నాటి అఖిలపక్షంలో తేలని ప్రధాన ప్రతిపక్ష హోదా అంశాన్ని స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరీ గురువారం తేల్చేశారు. బీజేపీ స్థానంలో జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన విజయ్ చౌదరికి ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పించారు. సంఖ్యాబలం దృష్ట్యానే జేడీయూకి ప్రతిపక్ష హోదాను కల్పించినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. బుధవారం జేడీయూ బహిష్కరించిన ఏడుగురు మంత్రులకు కూడా ఆ పార్టీ గ్యాలరీలోనే సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి మాంఝీని జేడీయూ నుంచి బహిష్కరించిన తరువాత ఆయన్ను ఏ పార్టీకి చెందని సభ్యుడిగా స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు శాసనమండలిలో కూ డా జేడీయూకి ప్రతిపక్ష హోదా దక్కడమే కాదు నితీశ్‌కుమార్‌ను మండలిలో ప్రతిపక్ష నేతగా చైర్మన్ అవధేశ్ నారాయణ్‌సింగ్ ప్రకటించారు. మాంఝీకి బీజేపీ దన్ను మాంఝీ సర్కారుకు అంశాల వారీ మద్దతును ఇస్తున్నట్లుగా బీజేపీ అధికారికంగా గురువారం సాయంత్రం ప్రకటించింది. మద్దతు ఇవ్వటం అంటే ప్రభుత్వంలో చేరుతున్నట్లు కాదని బీజేపీ శాసనసభాపక్ష నేత నందకిశోర్ యాదవ్ అన్నారు. మహాదళిత్ వర్గానికి చెందిన నేత మాంఝీని జేడీయూ అత్యంత అవమానకరంగా పదవీచ్యుతుని చేసే ప్రయత్నం చేస్తోందని.. ఇంతకంటే దారుణం మరొకటి లేదని యాదవ్ అన్నారు. అదే విధంగా జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించటంపైనా ఆయన మండిపడ్డారు. స్పీకర్ కార్యాలయం జేడీయూ కార్యాలయంగా మారిందని విమర్శించారు. శుక్రవారం జరిగే విశ్వాస పరీక్ష లాబీ డివిజన్ లేదా రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించవచ్చు. ఏ పద్ధతిని అనుసరిస్తారనేది సభలోనే ప్రకటిస్తారు. కాగా గత జనవరిలో స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన మాంఝీ క్యాంపులోని నలుగురు ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షలో ఓటేయటానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని పట్నా హైకోర్టు తిరస్కరించింది. ఇది స్పీకర్ విచక్షణాధికారాల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలను కొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, మాంఝీ తరఫున ఆర్జేడీ ఎంపీ పప్పూయాదవ్ బేరసారాలు నడుపుతున్నారని జేడీయూ ఆరోపించింది. -
మోడీ ని కలిసిన భీహారు ముఖ్యమంత్రి మాంఝీ