Maoist movement
-
సంస్మ‘రణం’
సాక్షి, హైదరాబాద్ : రెండువారాలుగా మన్నెంలో అలజడి మొదలైంది. మావోల రాక, పోలీసుల వేటతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త దళం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా గ్రీన్ టైగర్స్, కోబ్రా తదితర పేర్లతో కొన్ని దళాలు ఉండేవి. నక్సలైట్ల సానుభూతి పరులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు లక్ష్యంగా పనిచేసేవి. ఇపుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో తిరిగి అలాంటి పరిస్థితులే పునరావృతమవుతుండటం గమనార్హం. దీంతో ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీలు భయాందోళనలో గడుపుతున్నారు. నిత్యం మావోయిస్టులు, వారి వెనక కూంబింగ్ దళాల బూట్ల చప్పుళ్లతో భయభయంగా గడుపుతున్నారు. అప్పుడలా..ఇప్పుడిలా..! దండకారణ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మావో అగ్రనేతలు, మిలీషియా సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తాజాగా విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. దండకారణ్య ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి రామన్న అనారోగ్యకారణాలతో గతేడాది మరణించారు. ఈయన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. ఈసారి వార్షికోత్సవాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో రామన్న స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టు సభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే కీలకమైన ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన నిధులు, కొత్తవారి రిక్రూట్మెంట్ కోసం ఈసారి తెలంగాణలోకి మావోయిస్టులు అడుగుపెట్టారు. లాక్డౌన్ కాలంలో పోలీసులు కోవిడ్ విధుల్లో ఉండగా.. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు జనారణ్యంలోకి వచ్చారు. అందులో భాగంగానే బెదరింపులు, వసూళ్లు, రిక్రూట్మెంట్ యత్నాలు చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనివ్వం.. తెలంగాణలో పదేళ్లుగా పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవు. అలాంటిది లాక్డౌన్ కాలంలో పుంజుకోవడంపై హోంశాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆసిఫాబాద్‌లో భాస్కర్ దళం సంచారంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలు ఇక్కడ సాగనిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండటం మంగ్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్వయంగా ఆయనే కూంబింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్పుకోవాలి. పదేళ్ల నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మావోల కార్యకలాపాలు లేవు. అదే సమయంలో స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసుల్లో కొత్తగా చేరిన అధికారుల్లో మెజారిటీ మంది సుశిక్షితులేగానీ... వారికి ఎన్కౌంటర్లు ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే, వారిలో ఉత్సాహం నింపి, మావోయిస్టులను తరిమికొట్టాలన్న వ్యూహంతో పోలీసు బాసు పర్యటనలు చేస్తున్నారని సమాచారం. -
ఆపరేషన్ భాస్కర్..
సాక్షి, హైదరాబాద్ : వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్త మయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృ త్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్, టీఎస్ ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్డ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులతో భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆసిఫాబాద్‌లో దాదాపు 500 మంది, మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ దాదాపు 500 మంది వరకు పోలీసులు అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం సంచారం, 24 గంటల్లో రాష్ట్రంలో రెండుచోట్ల మావోయిస్టులతో పోలీసుల ఎదురు కాల్పులను హోం శాఖ తీవ్రంగా పరిగణించిందని సమాచారం. సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో మావోల రిక్రూట్మెంట్కు యత్నాలు మొదలుపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే అణిచివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకే భారీ ఆపరేషన్‌కు అప్పటి కపుడు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్ దళాన్ని పట్టుకోవడం, లేదా తెలంగాణ నుంచి తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పోలీసుశాఖ. డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం స్వయంగా ఆసిఫాబాద్‌కు వెళ్లి తాజా పరి స్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రకమిటీ సభ్యుడి రాకతో.. 2009 తరువాత రాష్ట్రంలో మావోయిస్టు సంచారం దాదాపుగా లేదు. ఇక్కడి గ్రేహౌండ్స్ దళాల దూకుడుకు మావో అగ్రనేతలంతా అంతా చత్తీస్ఘడ్, ఒడిశాలకు వలసవెళ్లారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా..చిన్నస్థాయి కొరియర్లు మాత్రమే వచ్చేవారు. కాని తాజాగా భాస్కర్‌తో పాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ (వీరిద్దరి తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది), చత్తీస్‌ఘడ్‌కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం ఆసిఫాబాద్‌లోని తిర్యాణీ మండలం పరిధిలో సంచరించింది. వీరు 24 గంటల్లో రెండుసార్లు స్పెషల్ పార్టీకి తారసపడ్డాయి. రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భాస్కర్ దళం తృటిలో తప్పించుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానిక యువత అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మావోల రిక్రూట్మెంట్లు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించండి: జగన్ కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలన కోసం అడవుల్లో భారీగా కూంబింగ్ చేపట్టడాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో కోరాడు. ప్రజలు, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. -
ఏవోబీలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు?
ముంచంగిపుట్టు(పెదబయలు): ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం అందినట్టు భోగట్టా. మావోయిస్టులు ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటలి జెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, కుమడ, డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి, బ్యాగులు తనిఖీ చేశారు.అనుమానిత వ్యక్తులను ప్రశ్నిం చి విడిచిపెట్టారు. ముంచంగిపుట్టు ఎస్ఐ ప్ర సాదరావు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్ వరుకు బాంబు స్క్వాడ్‌తో కల్వర్టులు,వంతెనల కింద తనిఖీలు చేశారు. కొన్ని నెలలుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్న నేప«థ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నారనే సమాచారంతో సరిహద్దులో ప్రాంతాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్ టీంలు సైతం రంగంలోకి దిగినట్టు పోలీసులు భావించి, సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్, కొత్తాపుట్టు జంక్షన్లలో పెదబయలు ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. -
జిల్లాలో ‘మావో’ల కదలికల కలకలం
సాక్షి, భూపాలపల్లి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, నకిలీ మందుపాతరలు అలజడి సృష్టించాయి. తాజాగా అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందన్న సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. టీంలోని సభ్యులకు సంబంధించిన ఫొటోలతో పోస్టర్లు ముద్రించి ఊరూరా అతికిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో సోదాలు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలో మావోయిస్టు కొరియర్లు.. సానుభూతిపరుల కదలికలు ఎక్కువయ్యాయి. వాజేడు, వెంకటాపురం, పలిమెల, మహదేవపూర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉండడంతో మావోలు తెలంగాణ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, వాజేడు, ఏటూరునాగారం మధ్య ఉన్న ముల్లకట్ట వంతెన వద్ద, వెంకటాపూర్, మంగపేట మండలాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీం కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసు బలగాలతో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల బాంబు స్క్వాడ్ ఏటూరునాగారం నుంచి మంగపేట వెళ్లే రహదారిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో భద్రతా చర్యలు చేపట్టడానికి ఎనిమిది కంపెనీల ప్రత్యేక బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలపై నజర్? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుకుమా, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12న ముగిశాయి. ఈ ప్రాంతాలన్నీ నక్సల్స్ ప్రాబల్యం ఉన్నవే కావడంతో అడపాదడపా ఘటనలు మినహా అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు కొంత సమయం ఉండడంతో ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రాణహిత, గోదావరి సరిహద్దున మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలితో సరిహద్దు ఉంది. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలకు మావోల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తయ్యారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అన్నింటిలో పొలింగ్ ను సాయంత్రం నాలుగు గంటల వరకే నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. మావోల వ్యూహాలను ముందుగానే పసిగట్టి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఊరూరా.. యాక్షన్ టీం పోస్టర్లు ఏటూరునాగారం: కొరియర్ల సహాయంతో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల వివరాలు తెలుసుకున్న పోలీసులు వారికి సంబంధించిన పోస్టర్లను ముద్రించి విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు పోస్టర్లను అంటించారు. అందులోని వ్యక్తులకు సహకరించినా.. ఆశ్రయం కల్పించినా చట్టరీత్యా నేరమని, ఆయా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైల ఫోన్ నంబర్లను వాటిలో ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టుర్లు అంటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని వణికిపోతున్నారు. -
తొలగిన భయం
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల ముఖచిత్రం మారిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల్లో యువత ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలంటే తీవ్ర ఒత్తిడికి గుర య్యే వారు. ఎన్నికలను బహిష్క రించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం.. మరోవైపు, కచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలంటూ పోలీసు లు, అధికారులు ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు నలిగి పో యే వారు. ఫలితంగా గ్రామీణ యువతతో పాటు భూస్వాములు, రాజకీయ నాయకులు గ్రామాలను ఖాళీ చేసి వెల్లిపోయే వారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నిక ల విధులు నిర్వహించడానికి సై తం ప్రభుత్వ ఉద్యోగులు భయాం దోళనకు గురయ్యేవారు. కానీ, 2018 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి అం తంత మాత్రంగానే ఉండేది. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు వారి సానుభూతిపరులు సైతం గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండే వారు. కమ్మర్పల్లి మండల కేంద్రం నుంచి ఇనాయత్నగర్కు వెళ్లే దారిలో మావోయిస్టులు రోడ్డుపై అమర్చిన బాంబులు పేలి ముగ్గురు కానిస్టేబుళ్లు గాయాల పాలయ్యారు. 1996 నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజే సిరికొండ మండలం రావుట్ల సమీపంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఎస్సై విక్టర్.. మావోయిస్టులు పేల్చిన బాంబు కారణంగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టుల దాడులకు భయపడి కమ్మర్పల్లి మండలం మానాల లాంటి మారుమూల గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి సైతం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసే వారు. ఈ క్రమంలో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మావోయిస్టులతో జరిపిన చర్చల తర్వాత జిల్లాలో మావోల ప్రభావం తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మారుమూల గ్రామమైన మానాలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేసి అధికారులతో పాటు ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గడం, రోడ్డు, రవాణా వ్యవస్థతో పాటు సెల్ఫోన్ల రాక కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై మావోయిస్టుల భయం నుంచి క్రమంగా బయటికి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొని రాజకీయ పార్టీల తరపున ప్రచారాలు సైతం నిర్వహించారు. తాజాగా 2018 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు మారుమూల గ్రామాల్లోకి సైతం వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని స్వాగతించడంతో పాటు వారు సైతం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటుండడం విశేషం. -
మావోయిస్టు ఉద్యమం.. ఆసక్తికర సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి ఇటీవల వెల్లడైన సమాచారం చర్చనీయాంశమైంది. మావోయిస్టు ఉద్యమకారులకు గట్టి పట్టున్న ‘రెడ్ కారిడార్’ క్రమంగా కుచించుకుపోతున్నదని, ఒకప్పుడు 100కుపైగా జిల్లాలను ప్రభావితం చేసిన ఉద్యమం.. నేడు 58 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని సీఆర్పీఎఫ్ ధృవీకరించిన నివేదికలో తేలింది. డ్రోన్ల వంటి ఆధునిక పరికరాలు, రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్‌తో చేపట్టే ప్రతివ్యూహాలు, పగలూ, రాత్రి తేడాలేకుండా సాగించిన ఆపరేషన్లు, ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ టాప్ లీడర్లను టార్గెట్ చేయడం.. తదితర వ్యూహాలతో బలగాలు సమిష్టిగా పనిచేస్తున్నందునే తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని అంశాలపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ మీడియాతో మాట్లాడారు. డౌన్ ఫాల్.. : ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్‌లలోని అతికొద్ది జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని, హింసకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో 90 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని రిపోర్టులో తెలిపారు. 2015నాటికి 75 జిల్లాల్లో బలంగా ఉండిన మావోయిస్టులు.. 2016 వచ్చేసరికి 67 జిల్లాలకు కుచించుకుపోగా, 2017 చివరినాటికి ఆ సంఖ్య 58 జిల్లాలకు పడిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో దశాబ్ధాల కిందటే కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో ప్రస్తుతం సీఆర్పీఎఫ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు పాలుపంచుకుంటున్నాయని, ఆయా శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వాలు.. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర పనులను శరవేగంగా చేపడుతున్నాయిన, అందుకే తీవ్రవాదం క్రమక్రమంగా బలహీనపడుతున్నదని సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ చెప్పుకొచ్చారు. ఆ మూడు ప్రాంతాలు.. : మావోయిస్టు ఉద్యమాన్ని పారదోలే క్రమంలో కేంద్ర బలగాలకు తోడు రాష్ట్రాల పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, బయటి నుంచి ఆయుధాలు చేరకుండా అడ్డుకోగలుగుతున్నామని, నిధుల ప్రవాహం కూడా దాదాపు క్షీణించిందని రిపోర్టులో వెల్లడైంది. ‘‘తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి 2017లో మేం చాలా సాధించగలిగాం. నక్సల్స్ స్థావరాల్లోకి చొచ్చుకుపోగలిగాం. ప్రస్తుతం మా దృష్టంగా మావోయిస్టు అగ్రనాయకత్వంపైనే ఉంది. 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న బస్తర్-సుక్మా రీజియన్, 2000చ.కి.మీల ఆంధ్ర-ఒడిశా బోర్డర్(ఏవోబీ), దాదాపు 4500 చ.కి.మీల అబూజ్మడ్ అడవులు.. ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టులు మనగలుగుతున్నారని, భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రభుత్వ సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోతున్నారు’’ అని భట్నాగర్ తెలిపారు. యాక్షన్ ప్లాన్ 2017-2022? : గత ఏడాది కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో సుమారు 150 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల వ్యూహాలకు సంబంధించి ‘2017-2022 యాక్షన్ ప్లాన్’ పేరుతోఉన్న కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది. -
ఆమే కీలకం!
- దండకారణ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళా మావోయిస్టులు - ప్రచారస్థాయి నుంచి కమాండర్ల స్థాయికి ఎదుగుదల - రెక్కీ నిర్వహించడంలో కీలకపాత్ర చింతూరు (రంపచోడవరం): మావోయిస్టు ఉద్యమంలో సానుభూతిపరులుగా ఉంటూ ‘చేతన నాట్య మండలి’ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు చేసే బాధ్యతలు నిర్వహించే మహిళలే నేడు మావోయిస్టుల కార్యకలాపాల్లో ఆరితేరిపోయారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బుర్కాపాల్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణని కూంబింగ్‌లో పాల్గొన్న జవాన్లు చెబుతున్నారు. గతంలో బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకులపై జరిగిన దాడిలోనూ వీరు అధికంగా పాల్గొన్నారు. ప్రస్తుతం దండకారణ్య పరిధిలోని ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో మహిళా కమాండర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముగ్గురు మహిళా మావోయిస్టు కమాండర్లపై భారీ రివార్డులు కూడా ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి ఏరియా కమిటీకి సైతం మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద అలియాస్ సమ్మక్క సారథ్యం వహిస్తున్నారు. రెక్కీలో కీలకం... ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్‌లోని ఏడు జిల్లాలతోపాటు తెలంగాణలోని భద్రాద్రి, ఆంధ్రాలోని తూర్పు గోదా వరి జిల్లాలను కలుపుకుని దండకారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం దండకారణ్య పరిధిలో భారీస్థాయిలో మహిళా మావోయిస్టుల రిక్రూట్మెంట్ జరిగి నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. వీరికి రహస్య ప్రాంతాల్లో ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. గ్రామీణుల వేషధారణలో పోలీసు బలగాల క్యాంపుల అతి సమీపం వరకు వెళ్లి రెక్కీ నిర్వహించి బలగాల కదలికలను పసిగట్టే అవకాశముండడంతో వీరికే ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో చురుకుగా వ్యవహరిస్తున్న చర్ల, శబరి ఏరియా కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని దర్బా, భెజ్జీ, పర్శేగఢ్, కుట్రు, ఛోటేడోంగర్, ఝారాఘాటీ, ఆవపల్లి, ఆమాబేడా, ఓర్ఛా వంటి ఏరియా కమిటీల బాధ్యతను మహిళా కమాండర్లే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక శిక్షణ... ప్రతి ఇంటినుంచి ఓ మహిళ దళంలో చేరాలని ఇప్పటికే మావోయిస్టులు దండకారణ్య పరిధిలో హుకుం జారీ చేశారు. దళాల్లో చేరిన మహిళలకు యుద్ధ తంత్రంపై రహస్య ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. వీరిని భారీస్థాయిలో రిక్రూట్మెంట్ చేసి కీలక బాధ్యతలు అప్పగించి బలగాలపై దాడులు నిర్వహించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులకు లభించిన డైరీల్లో ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు బస్తర్ రేంజ్ పరిధిలోని జైళ్లలో సుమారు 50 మంది మహిళా మావోయిస్టుల ఖైదీలుగా ఉన్నట్లు సమాచారం. -
గిరిజనులే సమిథలు
పోలీసులు-మావోయిస్టుల పోరులో గిరిజనులే సమిథలవుతున్నారు. గొబ్బరిపాడు ఘటనే ఇందుకు తార్కాణం. మావోయిస్టులు అపహరించుకుపోయిన ఇద్దరిలో ఒకరిని కాల్చి చంపి, మరొకరిని తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మందుపాతర పేలినా.. ఎన్కౌంటర్ జరిగినా మొదట బలయ్యేది గిరిజనులే..చివరకు మావోయిస్టులకు భయపడి గ్రామాలను వదిలిపోతున్న దుస్థితి. ఒకప్పుడు మావోయిస్టుల సమాచారం చెప్పాలని గిరిజనుల ఇళ్లను పోలీసులు ధ్వంసం చేసేవారు. ఇప్పుడు ఆ పనిని మావోయిస్టులు చేస్తున్నారు. - గిరిజనుడ్ని కాల్చి చంపిన మావోయిస్టులు - ఎన్కౌంటర్ జరిగినా.. మందుపాతర పేలినా..మారుమూల ప్రాంతాల వారికి నరకం - వీరవరం సంఘటన నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న దళసభ్యులు కొయ్యూరు/ముంచంగిపుట్టు: ఈస్టు డివిజన్లో 1980 దశకంలో మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైననాటి నుంచి గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మందుపాతరలు పేలిన సంఘటనలో ఎందరో గిరిజనులను పోలీసులు అరెస్టులు చేశారు. అప్పట్లో టాడా లేదా పోటా కింద జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గారు. అదే సమయంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటే దానికి పోలీసు ఇన్ఫార్మర్లే కారకులంటూ ఎక్కువ మందిని చంపారు. ఒక విధంగా చనిపోయిన మావోయిస్టుల కంటే వారి చేతిలో చంపబడిన గిరిజనులే అధికం. జూన్ 20న గబ్బురపాడులో జరిగిన ఎన్కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. దానికి ముంచంగిపుట్టు మండలం గొబ్బరిపాడు గ్రామస్తులే కారకులంటూ గ్రామంలోని జీనబంధు ఇంటిని శనివారం వేకువజామున పేల్చివేశారు. పాంగి రామన్న,లైకోన్ ఇళ్లను ధ్వంసం చేశారు. పాంగిరామన్న(28)ను తీసుకెళ్లి పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కాల్చిచంపారు. దోబులును కొట్టి విడిచిపెట్టారు. దోబులు రాత్రి అంతా మృతదేహం వద్ద లేవలేని స్థితిలో ఉండిపోయాడు. సరిహద్దు ఒడిశా అర్లోయిపడా గ్రామస్తుల సమాచారంతో ఆదివారం కుటుంబ సభ్యులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చి ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొందరు గ్రామాలను వదిలిపోతున్నారు. మొదట బలయ్యేది గిరిజనులే.. రెండు దశాబ్దాల కిందటి వరకు పోలీసులను చూస్తే గిరిజనులు భయపడేవారు.. మావోయిస్టుల సమాచారం చెప్పాలని నానా విధాల చిత్రహింసలు పెట్టేవారు. కేసులు పెట్టి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గే విధంగా చేసేవారు. దాని మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన పోలీసులు గిరిజనుల్లో మార్పును తీసుకురావడం ప్రారంభించారు. దీని కోసం ఎన్నో పథకాలను చేపట్టారు. సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. చివరకు ఉద్యోగాలకు అవసరమైన కేరీర్‌గెడైన్స్‌ను కూడా అందిస్తున్నారు. గతంలో మందుపాతర పేలుళ్లలో పోలీసులు మరణిస్తే అనుమానితులను ఇబ్బందులు పెట్టేవారు. కేసులు న మోదు చేసేవారు. ఎన్కౌంటర్లో ఎవరైనా మావోయిస్టులు మరణిస్తే దానికి కారణమైన వారిని తెలుసుకునేవారు. ఇన్ఫార్మర్లుగా వ్యవహరించవద్దని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవారు. ఇళ్లు ధ్వంసం చేయడం లాంటివాటికి పాల్పడేవారు కాదు. అయితే వీరవరం ఘటనలో శరత్,గణపతిలను గిరిజనులే చంపేయడాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
హృదయగత ప్రపంచం
సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. సుచిత్ర విజయవంతమైన హిందీ సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. 1960లలో ఉద్యోగమనేది కనుచూపు మేరలో కనబడేది కాదు. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతావారివి జాతి లేదా మత పరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. గతాన్ని తలబోస్తూ గడిపేవారికి జ్ఞాపకాల కలబోత ఏమంత మంచి వార్త కాదు. వయసు విషాద గీతిక ఉపరితలానికి దిగువన ఉండే పొరలాగా కనబడకుండా దాక్కోవాలని ఎంత గట్టిగా ప్రయత్నించినా విఫలవుతుంటుంది. వర్తమానం భవిత దిశగా ఎప్పటిలాగే పరుగులు తీస్తూ పోతుంటే గతానికి ఉండే ఆకర్షణ విముక్తం కాని ఆత్మలను ఆచరణాత్మక ప్రయోజనమేమీ లేని ఆలోచనల్లో మునిగిపోయేలా చేస్తుం ది. అలా అని జ్ఞాపకాల కలబోతంటే అంతానికి సంబంధించిన విచారమేమీ కాదు. అది ఒక అన్వేషణ. బహుశా విషాదకరమైన అన్వేషణ. కాలం చెత్త కుప్పలో బంగారం ఇటుకలను వెతుక్కునే అన్వేషణ. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో సుచిత్రాసేన్ తన జీవితం చివ రి రోజులను గడుపుతుండటం ఇక ఎంత మాత్రమూ వార్త కాదు. 1950లు, 1960లలో సమ్మోహన మూర్తి సుచిత్రాసేన్ గురించి తప్ప... ప్రత్యేకించి ఆమె తన ప్రియుడు, నట జీవిత భాగస్వామి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి వెండితెరపై కనిపించడం గురించి తప్ప... బెంగాల్‌కు సంబంధించిన మరే వార్తా పట్టించుకోదగినది కాదనిపిస్తుండేది. సుచిత్ర ఎవరికీ తెలియని వారినెవరినో పెళ్లి చేసుకుంది. అతగాడినెవరూ పట్టించుకోలేదు. సుచిత్ర, ఉత్తమ్‌ల మధ్య రసాయనిక శాస్త్రానికి అందని రసాయనిక బంధం ఏదో ఉండేది. దాని ముందు వివాహం అర్థరహితమైనదని అనిపించేది. ఈనాటికి భిన్నంగా అప్పట్లో... నేడు బలహీనపడుతున్న శ క్తులైన తల్లిదండ్రులే అందరి పెళ్లిళ్లు చేసేవారు. అయినాగానీ ఎందరు కళ్లు మిరుమిట్లు గొలిపే అందగత్తెలు, అందగాళ్లు ప్రమాదకరమైన, పాపిష్టి ప్రేమలో పడలేదు? హృదయం ఇరుసు మీదే ప్రపంచం అల్లుకుంది. మీసం మొలవక ముందు తొలిసారిగా నేను వారిద్దరినీ జ్యోతి సినిమా థియేటర్ వెండితెరపై చూశాను. నల్లులను మంచం పురుగులని తప్పుగా పిలుస్తున్నారనే నా అభిప్రాయం సరైనదేనని ఆ హాల్లో రుజువైంది. మంచానికి వెలుపల కూడా నల్లులకు చాలా జీవితం ఉంది. అప్పట్లో మేం ఒంపులు తిరుగుతూ పోయే హుగ్లీ నదికి అభిముఖంగా, నది ఒడ్డునే ఉన్న ఒక జనపనార మిల్లుకు శివారు గ్రామంలో ఉండేవాళ్లం. ఊహాగానం సదా సరిహద్దుల బంధనాలకు అతీతంగా ఒకదానితో ఒకటి కలగలిసిపోయిన కలల కలగూర గంపలోకి జారిపోతూ ఉంటుంది. సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. ఉత్తమ్‌కుమార్ సంతోషంగా ఆ దేవత ముందు పెద్ద పిల్లాడైపోయేవాడు. ఆ సినిమా పేరేమిటో గుర్తుకు రావడం లేదు. బహుశా సప్తపది కావొచ్చు, కాకపోవచ్చు. ఆధునిక ఇంటర్నెట్ వినువీధుల్లో ఆ పేరును అతి సునాయసంగా తెలుసుకోవచ్చు. అది తెలుపు-నలుపు సినిమాల కాలం. ముకమల్ శకం. ముకమల్ మెరుపు దానికదే ఒక ప్రత్యేకమైన రంగులా కనిపించేది. జ్ఞాపకం వ్యక్తిగతమైనదిగా కంటే వ్యాప్తి చెందినప్పుడే ఎక్కువ ఉపయోగపడుతుంది. 1960ల కాలం ముళ్ల గొంగళిని కప్పుకుని ఉండేది. ఉద్యోగం కనుచూపు మేరలో కనబడేది కాదు, అవకాశాలు ఉండేవి కావు. ఆకాంక్షలకులాగే ఆర్థికవ్యవస్థకు కూడా ఆదరణ కరువై ఉండేది. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతా వారివి జాతి లేదా మతపరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఉత్తమ్‌కుమార్ సాంగత్యం కూడా అలాంటిదే. నిజమే, అలాంటి కులాసా కాలాక్షేపం అదొక్కటే కాదు. దేవానంద్ కూడా తోడు ఉండేవాడు. అతి చురుకైన సామాన్యునిగా దేవానంద్ చిల్లర మల్లర నేరాల దారుల్లో అడ్డదిడ్డంగా సంచరించడమే (బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లమ్మడం, జేబులు కత్తిరించడం, జూదగృహంలో ధైర్యాన్ని ప్రద ర్శించడం) అతని మనుగడకు ఏకైక ఆధారం. అది కూడా సుచిత్ర అంతగానూ ఆకట్టుకునేది. దేవానంద్, సుచిత్ర కలిసి నటించిన సినిమా బొంబయ్ కా బాబు ఒక్కటే. అందులో వారిద్దరూ ఒకరికొకరు అంత దూరంగా ఎందుకున్నారో నా కెప్పుడూ అర్థం కాలేదు. ఆ చిత్ర నిర్మాణమంతా లోపరహితంగానే జరిగింది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తారస్థాయిలోనే న టించారు. సంగీతం దివ్యం. ఇక కథ... అవలింతలు తెప్పించే అర్థరాహిత్యానికి భిన్నమైనది. సుచిత్ర, దేవానంద్‌ల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యా లేదు. అయినా వారిద్దరూ ఉదాసీనంగా కనిపించారు. బెంగాలీ సినిమా గురించి తెలిసిన మాలాంటి వారికి అది ఉపశమనాన్ని కలిగించింది. ఉంటే సుచిత్ర, ఉత్తమ్ ఉండాలి లేదా సుచిత్ర ఒక్కరే ఉంటారు లేదా ఎవరూ ఉండరు. సుచిత్ర, ఉత్తమ్‌లు బెంగాలీ ఒథెల్లోలో నటించారు. సుచిత్ర హిందీ సినిమాకు అలవాటు పడలేకపోయారు. అలాగే ఉత్తమ్‌కుమార్ కూడానూ. ఉత్తమ్ స్థానంలో మరొకరు అవసరం కానప్పుడే సుచిత్ర హిందీ సినిమాల్లో విజయవంతమయ్యారు. అలాంటి సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత మీరు చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. అది భగ్న ప్రేమ, వంచిత జీవితం సినిమా. అందులో లతా మంగేష్కర్ పాడిన రహతే థే కభీ జిన్కే దిల్ మే హమ్ జాన్ సే బీ ప్యారో కీ తరా / బైతే హై ఉన్హీ కే మెహ్ఫిల్ మై హమ్ ఆజ్ గునాగారోంకి తరా, హేమంత్‌కుమార్ అజరామార గీతం చుపాలో యే దిల్ మే ప్యార్ మెరా అనే రెండు పాటలూ క్లాసిక్స్. హిందీలో సుచిత్ర రెండో విజయవంతమైన సినిమా ఆంథీ. ఆ సినిమాలో సుచిత్ర ఇందిరాగాంధీ లాంటి రాజకీయవేత్త పాత్రను పోషించింది. సుచిత్ర బెంగాలుకు చె ందినది, బెంగాలీయే. ఉత్తమ్‌కుమార్ హఠాత్తుగా మరణించి మూడు దశాబ్దాలకు పైగానే అయింది. అప్పుడు నేను సండే వార్తా వారపత్రికకు సంపాదకుణ్ణి. ఉత్తమ్ సంస్మరణ సంచిక... ఒక్క కలకత్తాలోనే కాదు ప్రతి చోటా దుకాణాలకు చేరిన మరుక్షణమే అమ్ముడై పోయింది. ఉత్తమ్ అమితంగా ప్రేమించిన కలకత్తా నగర వీధుల గుండా అతడు అంతిమ యాత్ర సాగిస్తుండగా... యువ అభిమానులు తమ ఆరాధ్య నటుడ్ని తాకాలని ఉన్మాదంతో కుమ్ములాడారు. అప్పుడు సుచిత్ర మనతోనే ఉన్నారు. అనివార్యమైనదాన్ని విధి అతి ఉదారంగా వీలయినంత ఎక్కువ అలస్యం చేస్తుందని ఆశిద్దాం. ఆమె పట్ల ఆరాధనాభావం సజీవంగా ఉన్నంత కాలం ఆమె జ్ఞాపకానికి మరణం లేదు. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు