massive rally
-
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్‌ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
అమెరికాను గొప్పగా చేస్తా
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా. మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది. -
దమ్ముంటే అరెస్టు చేసుకోండి!
న్యూఢిల్లీ/కోల్‌కతా: బీజేపీ చీఫ్ అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు. భారత్–బంగ్లా స్నేహానికి ఇబ్బంది! సరైన ఓటర్లను ఎన్నార్సీలో కలపకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయం చేస్తోందని మమత విమర్శించారు. రేపు తననూ చొరబాటుదారు అంటారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టారనే జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. అదృష్టవశాత్తూ నా వద్ద ఆ పత్రాలున్నాయి. కానీ నా తల్లిదండ్రులకు లేవని నన్ను చొరబాటుదారు అంటారేమో?’ అని మమత ఎద్దేవా చేశారు. ‘2019లో విపక్షాలు ఏకమవుతాయి. బీజేపీ పని అయిపోయినట్లే’ అని ఆమె అన్నారు. ‘నన్ను బీజేపీ ఆపలేదు. నేను వారి పనిమనిషిని కాను’ అని∙ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కున్న సత్సంబంధాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని.. విపక్షాలన్నీ కలిసే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటాయన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా వైఎస్సార్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ సహా పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీ నేత అడ్వాణీ, బీజేపీ నుంచి సస్పెండైన కీర్తీ ఆజాద్‌లను కలిశారు. ఎన్నార్సీపై రచ్చ అస్సాం ఎన్నార్సీ విషయంలో పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సహా పలువురు ఎంపీలు ఈ డిమాండ్‌తో సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే రికార్డులను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఎంపీలకు భరోసా ఇచ్చారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గకపోవడంలో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ తృణమూల్ ఎంపీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
‘మీకెందుకా శ్రమ.. అప్పటికి జైలులో ఉంటారు’
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ మధ్య ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆయనపై మరోసారి కేసుల పరంపర మొదలైంది. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ఐదు రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును ఆపించే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇక లాలూ నేరుగా కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఆగస్టు చివరివారంలో పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఓ భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న కక్షపూరిత విధానాలను, ప్రధాని నరేంద్రమోదీని విమర్శించగానే కేసులు పెడుతున్న వైనాన్ని దాదాపు ఆరోజు సభకు హాజరయ్యే ఐదు లక్షలమందితోపాటు దేశ ప్రజానీకానికి చెప్పాలని అనుకుంటున్నారు. ఈ భారీ బహిరంగ సభలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఉంటారని స్పష్టం కాగా తాను కూడా వస్తున్నానంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఇప్పటికే ఆహ్వానం పంపించారంట. ములాయం సింగ్, వామపక్ష నేతలైన సీతారాం ఏచూరి, డీ రాజా కూడా వస్తారని లాలూ హింట్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సంప్రదించలేదని లాలు చెప్పుతున్నారు. మరోపక్క, ప్రస్తుతం తన మద్దతుతో బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న నితీశ్ కుమార్ ఈ వేదికను పంచుకుంటారా లేదా అని ఇంకా సుస్పష్టం కాలేదు. ఈలోగా, లాలూ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా బిహార్ బీజేపీ ఉన్నత శ్రేణి నేత సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ.. ‘లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి పనులు చేయాలనుకోవడం అవగాహన రాహిత్యం, పరిపక్వత లేని చర్య. ఎందుకంటే వచ్చే ఆగస్టు నాటికే ఆయనను బహుశా జైలులో ఉండొచ్చు. కాబట్టి లాలూ అంత శ్రమపడకుండా ఉండటమే మంచిది’ అంటూ ట్వీట్లో విమర్శించారు. దీనికి వెంటనే స్పందించిన లాలూ కూడా ‘హా..హా.. నా పేరు లాలూ.. ఇలా నన్ను కుంగదీయాలనుకునే వారిని చూసి జాలేస్తుంది’ అంటూ లాలూ రీ ట్వీట్ చేశారు. అన్న ప్రకారం లాలూ భారీ బహిరంగ సభ పెట్టి తీరతారా? లేదా సుశీల్ మోదీ చెప్పినట్లు మరోసారి జైలు పాలవుతారా అనేది వేచి చూడాల్సిందే. -
గుజరాత్లో దళితుల భారీ ర్యాలీ
అహ్మదాబాద్: పశు కళేబరాల తొలగింపును ఆపేయాలని గుజరాత్ దళిత సంఘాలు నిర్ణయించాయి. ఉనాలో ఆవు చర్మం ఒలుస్తున్న దళితులపై గోసంరక్షకుల దాడి నేపథ్యంలో ఆదివారం అహ్మదాబాద్‌లో ఈ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. తమపై దాడులు ఆగేంతవరకు కళేబరాలను తొలగించొద్దని, పారిశుద్ధ్య పనులూ ఆపేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకు భూములు కేటాయిస్తే.. వ్యవసాయం చేసుకుని గౌరవప్రదంగా బతుకుతామన్నారు. దాడులకు నిరసనగా అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు ఈ నెల 5న పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు. ఉనాలో దాడులకు పాల్పడ్డ వారిని పాసా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు ఆగకపోతే 2017 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాగా, ఉనా ఘటనకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసిన హీరాభాయ్ సోలంకి(25) అనే యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందతూ ఆదివారం మృతిచెందారు. ఉత్సవాలు వాయిదా.. దేవాలయ కార్యక్రమాల నిర్వహణ విషయంలో దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య చర్చలు విఫలమవ్వటంతో తమిళనాడులోని నాగపట్టిణం అమ్మవారి ఉత్సవాలు రద్దయ్యాయి. గుళ్లో జరిగే పూజల్లో తమకు అవకాశ మివ్వకపోతే ఇస్లాం స్వీకరిస్తామని దళితులు హెచ్చరించారు. జిల్లా అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఉత్సవాలు మినహా ఎప్పుడు దళితులు పూజ చేసినా తమకు అభ్యంతరం లేదని అగ్రవర్ణాల నేతలు ఒప్పుకున్నారు. దళితులు మాత్రం ఉత్సవాల్లోనే తమకు అవకాశం ఇవ్వాలన్నారు. -
కదం తొక్కిన విద్యార్ధులు,ఉద్యోగులు,ప్రజాసంఘాలు