mastermind arrest
-
ఐసిస్ మాడ్యూల్ నేత సహా 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి సాకిబ్ నచాన్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో!
న్యూఢిల్లీ: చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని హుసిస్ కన్సల్టింగ్, బెంగళూరులోని ఫినిన్టీ లిమిటెడ్, గురుగ్రామ్‌లోని జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా కార్యాలయాల్లో సెప్టెంబర్ 8న సోదాలు నిర్వహించిన మీదట ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘జిలియన్ ఇండియా బోర్డులో డోర్సె సభ్యుడిగా ఉన్నారు. చైనాతో లింకులు ఉన్న అసంఖ్యాక డొల్ల కంపెనీలను భారత్‌లో ఏర్పాటు చేయడం, వాటి బోర్డుల్లో డమ్మీ డైరెక్టర్లను చేర్చడం వెనుక తనే మాస్టర్‌మైండ్ అని తేలింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం తను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంత వాస్తవ్యుడిగా డోర్సె నమోదు చేసు కున్నారు. ఢిల్లీ నుంచి బీహార్ రోడ్డుమార్గంలో విదేశాలకు పారిపోయే ప్రయత్నాలకు చెక్ చెప్పిన ఎంసీఏ బీహార్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అరెస్ట్ చేసింది. ఎస్ఎఫ్ఐవో ప్రత్యేక టీమ్ సెప్టెంబర్ 10న డోర్సెను అరెస్టు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపర్చిందని ఎంసీఏ వెల్లడించింది. -
'బుల్లిబాయ్' యాప్ మాస్టర్ మైండ్?! ఈ శ్వేత ఎవరు!
సోషల్ మీడియా..దూరంగా ఉన్న వారిని దగ్గరకు చేరుస్తూ సరికొత్త బాటలు వేస్తోంది. అయితే ఈ సోషల్ మీడియాను ద్వేషపూరిత వ్యక్తుల చేతిలో పడితే ప్రమాదాలను మోసుకొస్తోంది. అందుకు తాజా ఉదాహరణే ఈ 'బుల్లిబాయ్' ఘటన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బుల్లిబాయ్ ఉదంతంలో కీలక వ్యక్తి ఓ టీనేజర్. ఎంతోమందికి మేలు చేస్తున్న సోషల్ మీడియాని ఆమె ఎలా దుర్వినియోగం చేసిందనే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ‘బుల్లీ బాయ్’ కేసు వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారి 18 ఏళ్ల శ్వేతాసింగ్‌ను మంగళవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో నిందితుడు 21ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈ యాప్ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో శ్వేతా సింగ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వయస్సు 18 ఏళ్లే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఓ వర్గానికి చెందిన యువతుల్ని టార్గెట్ చేసిన 18ఏళ్ల శ్వేతా ఆమె సహచరులు..వారి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఆన్లైన్ వేదికగా బుల్లిబాయ్ అనే యాప్‌లో వేలం వేశారు. ఆరునెలల క్రితం గిట్‌హాబ్ అనే సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో 'సు**డీల్స్' పేరుతో అకౌంట్ నిర్వహించిన వారే దాన్ని బుల్లీ బాయ్ మార్చినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. అయితే బుల్లియాప్ వేలంలో వ్యక్తిగత ఫోటోలు వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.ఈ యాప్ మాస్టర్ మైండ్ శ్వేతా సింగ్ పూర్వాపరాల్ని పరిశీలిస్తుండగా..వీటన్నింటికి కారణం ఆమె కుటుంబ పరిస్థితులేనని పోలీసులు అనుమానిస్తున్నారు.మరోవైపు అసలు నిందితురాలు శ్వేతేనా? లేదంటే ఆమెతో ఇంకెవరైనా ఇలా చేయిస్తున్నారా? అనే విషయాల్ని తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయింది బుల్లీ యాప్ మాస్టర్ మైండ్ శ్వేతా సింగ్ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. 2020-21 మధ్య కాలంలో క్యాన్సర్‌తో తల్లిని, గతేడాది కోవిడ్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఇక ఆమెకు డిగ్రీ చదివిన అక్క, స్కూల్‌కు వెళ్లే తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. శ్వేతా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కోసం ప్రిపేర్ అవున్నట్లు పోలీసులు గుర్తించగా..కుటుంబ పోషణ కోసమే నిందితురాలు ఇలా చేస్తుందనే ఆధారాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్విట్టర్ ఫేక్ అకౌంట్ ఇక ఆమె JattKhalsa07 పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తుందని.. ద్వేషపూరిత పోస్ట్‌లు, అభ్యంతరకరమైన ఫోటోలు, కామెంట్స్ చేసేందుకు ఉపయోగించేదని ముంబై పోలీసుల చెబుతున్నారు. ఆమె సహచరులు సైతం ఇదే తరహాలో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించేవారు. ఇక శ్వేతా నేపాల్‌లో ఉన్న తన స్నేహితురాలి సూచనల మేరకు పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈకేసుకు సంబంధం ఉన్న నిందితుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం..నేపాల్‌కు చెందిన జియో' అనే వ్యక్తి ఈ యాప్‌లో నిర్వహించాల్సిన కార్యకలాపాలకు సంబంధించి ఆమెకు సూచనలు ఇచ్చినట్లు దర్యాప్తు బృందం వర్గాలు తెలిపాయి. అతనితో పాటు ఆమెతో సంబంధం ఉన్న మరికొందరి పాత్రపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చదవండి: బుల్లీ బాయ్’ కేసు దర్యాప్తు ముమ్మరం -
తెలుగు అకాడమీ స్కాం: మరో సూత్రధారి అరెస్ట్
సాక్షి, గుంటూరు: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన సమీప బంధువైన సాంబశివరావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపాజిట్ల గోల్ మాల్ చేసిన ముఠాకు సాంబశివరావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం సాంబశివరావు దాదాపు రూ.50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు గుర్తించారు. ఆయనను గుంటూరులో అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
ఎన్ఐఏ అధికారి కేసులో మాస్టర్‌మైండ్ దొరికాడు
లక్నో: దేశంలో సంచలనం సృష్టించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్యకు సంబంధించి కీలక సూత్రధారిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. నోయిడా అనే ప్రాంతంలో ఈ హత్య కీలక నిందితుడు మునీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్ నెలలో తన భార్యతో కలిసి కారులో వస్తున్న తాంజిల్‌ను మధ్యలో అడ్డగించిన కొందరు దుండగులు బైక్‌పై వచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 24 బుల్లెట్లు దిగి తాంజిల్ అక్కడికక్కడే చనిపోగా నాలుగు బుల్లెట్లు తగిలి పది రోజులపాటు ఆస్పత్రిలో ఉండి ఆయన భార్య కన్నుమూసింది. ఈ కేసుపై వేగంగా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అంతకుముందు రిజ్వాన్, తాంజీమ్, రెహాన్, జైనుల్ అనే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. వీరిలో రెహాన్ అనే వ్యక్తి అహ్మద్ భావ మేనళ్లుడు. అలాగే జైనుల్ కూడా. కుటుంబ పరమైన కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.