అగ్రగామిగా భారతీ సిమెంట్
ఒంగోలు: బిజినెస్ చానల్ పార్టనర్స్ సహకారం వల్లే భారతీ సిమెంట్ నేడు మార్కెట్లో అగ్రగామిగా నిలిచిందని భారతీ సిమెంట్ సీనియర్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. ఒంగోలు సెంట్రల్‌పార్కు కాన్ఫరెన్స్‌హాలులో బుధవారం నిర్వహించిన బిజినెస్ చానల్ పార్టనర్స్ మీట్లో వందమందికిపైగా ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత భారతీ సిమెంట్ విశిష్టత, మార్కెటింగ్ తదితర అంశాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.
అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మన్నిక, నాణ్యత, ధృఢత్వంతోపాటు కాలానుగుణంగా వస్తున్న మార్పులను తట్టుకునేలా భారతీ సిమెంట్‌ను తయారు చేస్తారని చెప్పారు. ఇందువల్లే 2009లో ప్రారంభించిన భారతీ సిమెంట్ నేడు పూర్తిస్థాయి మార్కెట్ ఆధిపత్యాన్ని చాటుకోవడంతోపాటు అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఏడాదికి 5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని కడప ప్లాంటులో తయారుస్తారన్నారు.
కర్నాటక జిల్లా గుల్బర్గాలో కూడా 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని భారతీ బ్రాండ్‌తోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వికాట్ గ్రూపు భారతీ సిమెంట్‌ను భాగస్వామిగా ఎంచుకోవడంలోనే దాని గొప్పతనం ఏమిటో అందరికీ అర్థమవుతుందన్నారు. నిర్మాణరంగంలో భారతీ సిమెంట్ వినియోగంలో మెళకువలు నేర్పించడం ద్వారా తాపీ మేస్త్రీల నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. తాపీ మేస్త్రీలకు ఉచిత ప్రమాద బీమా కూడా తమ సంస్థ కల్పిస్తోందన్నారు.