MDMK leader Vaiko
-
త్వరలోనే ఇంటికి జయలలిత!
ఎండీఎంకే నేత ఆశాభావం చెన్నై: తీవ్ర అనారోగ్యానికి గురై గత 15 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని ఎండీఎంకే నేత వైకో ఆశాభావం వ్యక్తం చేశారు. వైకో శనివారం అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించారు. అనంతరం ఆయన తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును ’స్నేహపూర్వకంగా’ కలిశారు. ఈ సందర్భంగా వైకో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి బాగున్నారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. మంచి ఆరోగ్యంతో ఆమె ఇంటికి చేరబోతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన దూరమవుతుంది’ అని పేర్కొన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో తాను స్నేహపూర్వకంగా భేటీ అయ్యాయని, ఒకప్పటి విషయాలు తాము చర్చించుకున్నామని, కానీ రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని చెప్పారు. సీఎం జయలలిత కోలుకునేవరకు గవర్నర్ తాత్కాలికంగా పాలనాపగ్గాలు చేపట్టాలన్న డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. అలాంటి అవసరం లేదని పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు ప్రయోజనాలను సీఎం జయలలిత కాపాడుతున్నారని వైకో ప్రశంసించారు. -
సుష్మా ఒత్తిడి తెచ్చేనా?
శ్రీలంక పాలకులపై ఒత్తిడి తెచ్చి తమిళులకు మద్దతుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ నిలిచేనా అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగాయి. ఓ వైపు తమిళ జాలర్లు, మరో వైపు ఈలం తమిళాభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఏ మేరకు సుష్మా వమ్ముకాకుండా చూస్తారోనన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. శ్రీలంక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కరుణానిధి, వైగోతో పాటు తమిళాభిమాన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సాక్షి, చెన్నై: యుద్ధం పేరుతో శ్రీలంకలో సాగిన నరమేధంలో ఈలం తమిళులు చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే సర్కారు పతనం, సిరిసేన సర్కారు అధికారంలో రావడంతో తమిళులకు అండగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, అమల్లో జాప్యాలు తప్పడం లేదు. అలాగే, తమిళ జాలర్లపై శ్రీలంక సేనలుకడలిలో సాగిన వీరంగాలకు హద్దే లేకుండా పోతున్నాయి. ఓ వైపు ఈ దాడులకు అడ్డకట్ట లక్ష్యంగా, మరో వైపు ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనకు మద్దతుగా రాష్ర్టంలో గళం విప్పే వారి సంఖ్య పెరుగుతోంది. అధికార ప్రతి పక్షాలు సైతం ఈ రెండు నినాదాలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఆమె పర్యటన ద్వారా శ్రీలంక వెనక్కుతగ్గేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఏ మేరకు ఆమె శ్రీలంకతో సంప్రదింపులు జరుపుతారో, భారత ప్రభుత్వం తరపున ఒత్తిళ్లు తెచ్చి సమస్యల పరిష్కారానికి దోహద పడుతారోనన్న ఎదురు చూపుల్లో తమిళాభిమానులు, రాష్ట్ర జాలర్లు ఉన్నారు. శ్రీలంకకు సుష్మా : రెండు రోజుల పర్యటన నిమిత్తం సుష్మా స్వరాజ్ శుక్రవారం కొలంబోకు వెళ్లారు. అక్కడ ఆ దేశాధ్యక్షుడు, ప్రధానితో పాటు, విదేశీ వ్యవహారాల మంత్రితో సమావేశం కాబోతున్నారు. భారత రాయబారుల ద్వారా అక్కడి అధికారులతో సమాలోచన సాగించనున్నారు. ఈ పర్యటనలో సుష్మా స్వరాజ్ ఎలాంటి అస్త్రాల్ని సంధించి తమిళులకు, జాలర్లకు మద్దతుగా నిలుస్తారోనన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అలాగే, ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా శ్రీలంకతో ఏ మేరకు సంప్రదింపులు జరుపుతారో, ఎలాంటి కీలక నిర్ణయాల్ని ఈ పర్యటన ద్వారా ఆమె ప్రకటిస్తారో అన్నది వేచిచూడాల్సిందే. ఇక విదేశీ మంత్రి శ్రీలంకకు వెళ్లడంతో, ఆ దేశ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకించే విధంగా చర్యలు చేపట్టాలన్న నినాదం తెర మీదకు వచ్చింది. కొత్త చట్టానికి వ్యతిరేకత : శ్రీలంక సర్కారు కొత్తగా తీసుకొచ్చిన చట్టం, సర్వం కోల్పోయి స్వదేశంలోనే శరణార్థులుగా ఉన్న ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనకు గండి కొట్టే పరిస్థితిని సృష్టిస్తున్నదని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే మెలికలు అందులో ఉన్నాయని తమిళ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. అందులో సవరణలు తప్పని సరిగా సూచించారు. సింహళీయుల్ని ఉన్నత స్థితికి తీసుకొస్తూ, ఈలం తమిళులకు తదుపరి స్థానం ఇచ్చే విధంగా ఇందులో అంశాలు ఉన్నాయని, ఇది మున్ముందు ఈలం తమిళులకు వ్యతిరేకంగా పరిస్థితులకు దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశీ మంత్రి ఆ చట్టం మీద పరిశీలన చేసి, సవరణలకు చర్యలు చేపట్టే విధంగా ఒత్తిడి పెంచాలని విన్నవించారు. -
ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య
-
'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య'
చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎండీఎంకే అధినేత వైగో సహా 400 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఇది క్రూరమైన హత్య. ఎన్ కౌంటర్ కానేకాదు. అత్యంత క్రూరంగా జరిగింది. చెట్లు కొట్టుకుంటున్న కూలీలను హతమార్చారు. వాళ్లను చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. వాళ్ల శరీరంపై ఉన్న గాయాలే అందుకు నిదర్శనం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతాల్లోను నిరసనలు జరుగుతున్నాయి. -
వైగో రచ్చ
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగోకు కమలనాథుల బెదిరింపు రచ్చకెక్కింది. బీజేపీ జాతీయ నేత రాజా ఇంటిని ముట్టడించేందుకు ఎండీఎంకే వర్గాలు ప్రయత్నింయి. సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? అని వైగో ప్రశ్నించారు. ఇకనైనా మోదీని విమర్శించొద్దంటూ ఎండీఎంకే, పీఎంకే నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి ఎండీఎంకే పయనించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం బీజేపీ తీరుపై ఎండీఎంకే నేత వైగో శివాలెత్తారు. ఈలం తమిళులు, జాలర్ల విషయంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం వైగోకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే పనిలో పడ్డారు. ఇది కాస్త కమలనాతుల్లో ఆగ్రహాన్ని రేపింది. బీజేపీ జాతీయ నేతలు సుబ్రమణ్య స్వామి, హెచ్ రాజా వైగోను టార్గెట్ చేసి తీవ్రంగానే స్పందించారు. తమ కూటమిలో నుంచి వెళ్లకుంటే గెంటాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, మోదీని టార్గెట్ చేసి విమర్శలు మానుకోకుంటే, వైగోకు భద్రత కరువు అవుతుందని, కేంద్రంలో ఉన్నది తామన్న విషయాన్ని గుర్తెరగాలంటూ రాజా తీవ్రంగానే స్పందించారు. ఇది ఎండీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. తమ నేత భద్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా రాజా వ్యాఖ్యలు చేయడాన్ని ఎండీఎంకే వర్గాలు తీవ్రం గా పరిగణించాయి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆదివా రం ఉదయం రాజా ఇంటిని ముట్టడించేందుకు యత్నిం చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. రాజా ఇంటిని ముట్టడించే ఎండీఎంకే వర్గాలను అరెస్టు చేయకుంటే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ రద్దు కు తాను సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని సుబ్రమణ్య స్వామి హెచ్చరికలు జారీ చేయడం ఆ పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపింది. దీంతో ఎండీఎంకే వర్గాల్ని అడ్డుకునే విధంగా పోలీసులు రంగంలోకి దిగారు. రాజా ఇంటి ముట్టడికి యత్నించిన ఎండీఎంకే వర్గాలను మార్గ మధ్యలోనే అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన విషయాన్ని సుబ్రమణ్య స్వామికి సమాచారం రూపంలో పంపినట్టు తెలిసింది. సుబ్రమణ్య స్వామి అమిత్ షానా: కమలనాథుల చర్యపై ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా స్పందించారు. తాను గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తీవ్రంగానే విమర్శించానని గుర్తు చేశారు. అయితే, ఆయన్ను తాను కలుసుకున్నప్పుడు మర్యాద పూర్వకంగా వ్యవహరించారన్నారు. ఆ సమయంలో తాను చేసిన విమర్శలు గుర్తు చేయగా, సిద్ధాంత పరంగా చేసే విమర్శల జోలికి తాను వెళ్లబోనని పేర్కొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అదే విధంగా తాను మరెందర్నో విమర్శించానని, ఆరోపణలు గుప్పించానని, వారెవ్వరూ ఇంత వరకు తనను బెదిరించిన దాఖలాలు లేవన్నారు. అయితే, తమిళుల కోసం తాను పోరుడుతూ కేంద్ర తీరును విమర్శిస్తే బెదిరించడం శోచనీయమన్నారు. తనను బెదిరించడం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం బెదిరింపులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజా ఇంటిని ముట్టడించే వాళ్లను అరెస్టు చేయకుంటే, జయలలిత బెయిల్ రద్దు చేయిస్తానని సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించడం శోచనీయమని, దీన్ని బట్టి చూస్తే కొందరు కమలనాథులు ఏ మేరకు బెదిరింపులతో పబ్బం గడుపుతున్నారో స్పష్టం అవుతోందన్నారు. తనను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లమని చెప్పడానికి సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? ఆయనెవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు వద్దు : ఎన్డీఏ కూటమిలో ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించ వద్దని ఎండీఎంకే , పీఎంకే నేతల్ని బీఊసీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. విమర్శలు వివాదాలకు దారి తీయకూడదని, అందరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. అయితే, హెచ్ రాజా, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలపై స్పందించక పోవడం గమనార్హం. ఎండీఎంకే నేత వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అయితే, వైగోను టార్గెట్ చేసిన కమలనాథుల చర్యల్ని పలు పార్టీల నాయకులు, తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైగోకు బెదిరింపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయనకేదైనా జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ హెచ్చరించారు. -
‘కరుణ’కు వైగో షాక్
సాక్షి, చెన్నై:డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ఎండీఎంకే నేత వైగో షాక్ ఇచ్చారు. కరుణ ఆహ్వానాన్ని తిరస్కరించిన వైగో, డీఎంకే కూట మిలో చేరబోనని, తనకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కరుణానిధి పావులు కదుపుతున్నారు. తన నేతృత్వంలో మెగా కూటమి కసరత్తుల్లో మునిగారు. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకేలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో పడ్డారు.రెండు రోజుల క్రితం మహాబలి పురం వేదికగా జరిగిన పీఎంకే అధినేత రాందాసు ఇంట శుభకార్యాన్ని కరుణానిధి తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. ఈ వేడుకలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగోలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఇద్దరూ కలిసి మరుసటి రోజు ఒకే విమానంలో మదురైకు వెళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎండీఎంకే వస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధం అని కరుణానిధి సైతం ప్రకటించారు. దీంతో త్వరలో కరుణ నివాసం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టుగా తమిళ మీడియా కోడై కూసింది. రాందాసు ఇంటి వివాహ వేడుక తమకు కలిసి వచ్చినట్టుగానే ఉందన్న ఆనందంలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, ఆ ఆనందానికి, సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ వైగో స్పందించడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలింది.కూటమిలో చేరబోను: ఈ రోడ్ జిల్లా ఎండీఎంకే కార్యదర్శి గణేష మూర్తి కుమారుడు కపిలన్ వివాహం దివ్యతో ఆదివారం జరిగింది. కాంగేయంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులను ఆశీర్వదిస్తూ వైగో ప్రసంగించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పటి సీఎం జయలలితను కలుసుకున్నానన్నారు. అంతమాత్రాన తాను అప్పట్లో అన్నాడీఎంకే కూటమిలో చేరలేదని గుర్తు చేశారు. తాను పాదయాత్రగా వెళ్తున్న వైపుగానే సీఎంగా ఉన్న జయలలిత కాన్వాయ్ వెళ్లిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఇద్దరం ఒకే మార్గంలో ఎదురు పడ్డామని, మర్యాద పూర్వకంగా పలకరించుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరిగిందంటూ స్టాలిన్‌ను కలుసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాందాసు ఇంటి వేడుకలో తనకు స్టాలిన్ ఎదురు పడ్డారని, అదే విధంగా ఆయనకు తాను ఎదురు పడ్డానని, ఇద్దరం మర్యాద పూర్వకంగా పలకరించుకున్నట్లు తెలిపారు. అంత మాత్రాన డీఎంకే కూటమిలో ఎండీఎంకే చేరినట్టు కాదని స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే, డీఎంకే కూటమిలోకి వెళ్లాలన్న యోచన తనకు ఇప్పటి వరకు లేదన్నారు. ఎన్నికలకు సమయం ఇంకా ఉందని, కూటమి విషయం అప్పడు చూసుకోవచ్చన్నారు. త న పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. అలాగే, తాను మాత్రం డీఎంకే కూటమిలో చేరబోనని స్పష్టం చేశారు. -
తమిళమే ప్రతీక
సాక్షి, చెన్నై:ప్రపంచంలోని పలు భాషలకు, నాటక, నాట్య, సంగీతంతోపాటు వీరత్వానికి తమిళం ప్రతీకగా నిలుస్తున్నదని ఎండీఎంకే నేత వైగో అన్నారు. వీర చరిత్రకు శివగంగై వేలు నాచ్చియార్ దృశ్య కావ్యం దర్పణంగా అభివర్ణించారు. తమిళ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఎస్ఆర్ఎం వర్సిటీ ఆవరణలో సోమవారం ఘనంగా జరిగింది. వివిధ భాషల్లో నిష్ణాతులు, మేధావులు, వివిధ రంగాల్లోని వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారాల్ని ప్రకటిస్తుంది. ఈ పురష్కారాలకు దీటుగా తమిళ భాషాభ్యున్నతికి కృషి చేసిన వాళ్లను ప్రతి ఏటా సత్కరించుకునే రీతిలో ఎస్ఆర్ఎం వర్సిటీ తమిళ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇందు కోసం ఆ వర్సిటీ నేతృత్వంలో తమిళ అకాడమి ఆవిర్భవించింది. సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఎస్ఆర్ఎం వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో కోలాహలంగా జరిగింది. ముందుగా బ్రిటీషు వారిని తరిమి కొట్టడంలో తన వీరత్వాన్ని చాటిన శివగంగై వేలు నాచ్చియార్ జీవిత కావ్యాన్ని నాట్య నాటకం రూపంలో వీ శ్రీరామ్ శర్మ బృందం ప్రదర్శించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా, మాతృ భూమి రక్షణ ధ్యేయంగా సాగిన ఈ నాటిక ఆహుతుల్ని అలరించింది. అనంతరం జరిగిన వేడుకలో అవార్డులను ప్రకటించారు. అవార్డులు : ఎండీఎంకే నేత వైగో, ఎస్ఆర్ఎం చాన్సలర్ పారివేందన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం చేశారు. నాటకం, డాక్యుమెంటరీ, నవల రంగానికి గానూ పుదుమై పిత్తన్ అవార్డును పూమణికి అందజేశారు. అనువాద రంగానికి గాను జీవీ పోప్ మోళిపెయర్పు అవార్డును ఁచిన్నచిన్నరూ. కావ్యం రచయిత వీ శ్రీరాంను ఎంపిక చేశారు. విజ్ఞాన శాస్త్రాని(తమిళం)కి గాను పేనా అప్పుస్వామి అవార్డును మధుమేహం-క్యాన్సర్ వరకు ఁఆహారపుటలవాట్లురూ. రచయిత డాక్టర్ ఎస్ నరేంద్రన్‌కు ప్రదానం చేశారు. చేతి వృత్తి రంగంలో అనంత కుమార స్వామి అవార్డును ఇందిరన్కు, తమిళ సంప్రదాయ సంగీతానికి గాను ముత్తాండవర్ తమిళిసై అవార్డును పీ చోళనాథన్, వలర్ తమిళ్ అవార్డును యువ తమిళ పరిశోధకుడు పి ఇలమారన్కు బహుకరించారు. వీరందరికీ తలా రూ. 1.5 లక్షల నగదుకుగాను చెక్కును, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఇక, పరిది మార్ కలైంజర్ అవార్డు, రూ.2 లక్షల చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను పీ సుబ్రమణియన్‌కు, పారివేందన్ ప్రాచీన తమిళ జీవిత సాఫల్య పురస్కారాన్ని జార్జ్ హట్స్‌కు ప్రదానం చేశారు. రూ.5 లక్షలకు గాను చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ సంపాదకులు షణ్ముగనాథన్ రచించిన తమిళనాట సంగకాలం నుంచి సెమ్మోళి కాలం వరకు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తమిళ అకాడమి -2014 సావనీర్‌ను విడుదల చేశారు. భారతీయార్ కవితా అవార్డు, తమిళ బాల మేధావులకు అల్లవళ్లియప్ప కులందై సాహితీ అవార్డుకు ఎంట్రీలు రాని దృష్ట్యా, వాటిని పక్కన పెట్టారు. మూలం తమిళం: ముందుగా ఎండీఎంకే నేత వైగో తన ప్రసంగంలో తమిళ వైభవాన్ని వివరించారు. తమిళుల వీరత్వాన్ని చాటే రీతిలో అక్కడ ప్రదర్శించిన శివగంగై నాచ్చియార్ నాట్య నాటకం గురించి విశదీకరిస్తూ, ప్రపంచంలో సర్వం తమిళంతో ముడిపడి ఉన్నదని పేర్కొన్నారు. పలు భాషలు, నాటక, సంగీతం గ్రంథాల ఆవిర్భావానికి తమిళం మూలంగా నిలిచిందని వివరించారు. తెల్ల దొరల్ని తరిమి కొట్టే యత్నంలో నాటి వీరపాండి కట్టబొమ్మన్, నాచ్చియార్ తదితరుల నుంచి నేటివేలుపిళ్లై ప్రభాకరన్ వరకు ప్రదర్శించిన ధైర్య సాహసాలు మరువలేమన్నారు. అన్ని రంగాల్లోని రాణించాలని, దేశానికే ఆదర్శంగా తమిళ విద్యార్థులు నిలవాలని సూచించారు. ఎస్ఆర్ఎం చాన్సలర్ పారివేందన్ మాట్లాడుతూ, తమ అవార్డుల ప్రకటన, ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రతి ఏటా ఈ అవార్డులకు గాను రూ.20 లక్షలు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆ వర్సిటీ వీసీ పొన్న వైకో మాట్లాడుతూ, ప్రపంచ భాషలకు తమిళం తల్లిలాంటిదని వివరించారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లోని తమిళ మేధావులు, ప్రొఫెసర్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.