mediation talks
-
రూ.4,411.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24కి) తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రూ.4,411.68 కోట్ల బడ్జెట్‌ను ఫిబ్రవరి 15న జరిగిన పాలకమండలి సమావేశం ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అప్పుడు ఈ వివరాలు వెల్లడించలేదని తెలిపారు. తిరుమలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ప్రజలంతా, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గతనెలలో జరిగిన పాలకమండలి సమావేశంలో కొన్ని పాలనపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు.. ♦ వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. ♦ కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1,200 కోట్ల కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. ♦ భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్లో జారీచేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తిచేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ♦ అలిపిరి నుంచి వకుళమాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం. ♦ ఏప్రిల్ 5వ తేదీన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పి స్తారు. ♦ వేసవిలో మూడునెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల సిఫారసులు బాగా తగ్గించాలని కోరుతున్నాం. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం. ♦ తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.5.25 కోట్లు మంజూరు చేశాం. ♦తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల పడమర వైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునికీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ.4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం. ♦ శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.990 కోట్లకు వడ్డీ ఆదాయం టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా పెద్ద ఎత్తున వడ్డీ ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం మరో రూ.177 కోట్లు పెరిగి మొత్తం రూ.990 కోట్లు వస్తాయని పేర్కొంది. హుండీ ద్వారా రూ.1,591 కోట్ల రాబడి అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,591 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో టీటీడీ అంచనా వేసింది. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్ రూ.1,315.28 కోట్ల మేర పెరిగింది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పందసేవ సిబ్బంది జీతాలకు రూ.1,532 కోట్లు వెచ్చించనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.690.50 కోట్లు కేటాయించారు. కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నిల్వ రూ.291.85 కోట్లుగా అంచనా వేశారు. ఇటీవల కొన్ని వసతి గదులు, కల్యాణమండపాల అద్దె పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వీటిద్వారా ప్రస్తుత సంవత్సరం రూ.118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. -
మధ్యవర్తిత్వం చేస్తా
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది. లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్– చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. కశ్మీర్ అంశంలోనూ భారత్, పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కశ్మీర్ విషయంలో మూడో జోక్యాన్ని అంగీకరించబోమని భారత్ తేల్చిచెప్పింది. ‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం కూడా మాకుంది. ఈ విషయాన్ని భారత్, చైనాలకు తెలియజేశాం’ అని ట్రంప్ బుధవారం తెల్లవారుజామున ఒక ట్వీట్ చేశారు. భారత్ సరిహద్దుల్లో చైనా తరచూ ఘర్షణలకు దిగుతోందని, యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని గతవారం అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ దౌత్యవేత్త అలిస్ వెల్స్ ఆరోపించారు. చైనా దూకుడుకు అంతేస్థాయిలో అడ్డుకట్ట వేయాలని కూడా ఆమె భారత్‌కు సూచించారు. పదవీ విరమణకు కొన్నిరోజుల ముందు మే 20న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ మర్నాడే చైనా స్పందించింది. ఆ వ్యాఖ్యలను నాన్సెన్స్ అని కొట్టేసింది. వివాద పరిష్కారానికి దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వాస్తవాధీన రేఖగా పేర్కొనే సరిహద్దుకు సంబంధించి భారత్, చైనాల మధ్య చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో సరిహద్దుల వెంట ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు సరిహాద్దుల్లో బలగాలను, మౌలిక వసతులను భారీగా పెంచుకుంటున్నాయి. ప్రశాంతంగానే పరిస్థితి భారత్‌తో సరిహద్దు వివాదం విషయంలో చైనా బుధవారం కొంత సంయమన ధోరణిలో స్పందించింది. భారత్‌తో సరిహద్దుల వెంబడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘భారత్ సరిహద్దుల్లో మొత్తానికి పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన దౌత్య, సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉంది’ అన్నారు. ఆయా మార్గాల ద్వారా వివాదాలను ఇరుదేశాలు పరిష్కరించుకోగలవన్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి భారత్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రశ్నకు.. దౌత్య మార్గాల్లో, సరిహద్దుల్లోని బలగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉందన్నారు. సరిహద్దు విషయాలకు సంబంధించి చైనా స్పష్టమైన ధోరణితో ఉందన్నారు. ‘రెండు దేశాల నేతల సమక్షంలో కుదిరిన ఏకాభిప్రాయానికి, రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య జరిగిన అనధికార భేటీలను ప్రస్తావిస్తూ జావొ వ్యాఖ్యానించారు. యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలంటూ తమ ఆర్మీని జిన్‌పింగ్ ఆదేశించిన మర్నాడే ఆ దేశ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
వ్యాజ్యాలకు ముందే మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ: వ్యాజ్యం దాఖలు కంటే ముందే మధ్యవర్తిత్వం జరిగేలా ‘తప్పనిసరి మధ్యవర్తిత్వ చట్టం’ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ‘ప్రపంచీకరణలో మధ్యవర్తిత్వ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మూడవ ఎడిషన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యాజ్యం దాఖలుకు ముందే మధ్యవర్తిత్వం జరిగితే కోర్టు తీర్పుల నాణ్యత పెరుగుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన ‘ఆర్బిట్రరీ బార్’ భారత్‌లో తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి అనుభవంతో పాటు విషయ పరిజ్ఞానం కలిగిన లాయర్లు అవసరమవుతారని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యం, కామర్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో మధ్యవర్తిత్వం మౌలిక అంశమని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వాణిజ్యం జరుగుతున్న ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం అత్యవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం కంటే రాజీ కుదర్చడం ఇంకా ఉత్తమమైనదని చెప్పారు. వాణిజ్య న్యాయస్థాన కోర్టుల చట్టం కూడా మధ్యవర్తిత్వం గురించి, సెటిల్మెంట్ గురించి చెప్పిందన్నారు. -
మధ్యవర్తిగా ఉంటాం..
కఠ్మాండు: భారత్, పాకిస్తాన్ల మధ్య విభేదాల పరిష్కారంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు నేపాల్ ముందుకువచ్చింది. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా సార్క్(దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)ను పునరుత్తేజం చేస్తామని తెలిపింది. శాంతియుత చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని సార్క్ చైర్మన్‌గా ఉన్న నేపాల్ పేర్కొంది. -
సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేజారకముందే సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి సోమవారం లేఖ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె. కేశవరావు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న కేశవరావు.. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానన్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
న్యూయార్క్: కశ్మీర్ చాన్నాళ్లుగా సాగుతున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. అయితే, అందుకు భారత్, పాక్‌లు రెండూ ఒప్పుకోవాలన్నారు. తాను చాలా గొప్ప మధ్యవర్తినని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా సోమవారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, పాక్‌లు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధమే’ అన్నారు. భారత ప్రధాని పాల్గొన్న హౌడీ మోదీ కార్యక్రమంపై ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే ట్రంప్ ప్రశంసలు కురిపించడం విశేషం. ‘ఉగ్రవాదంపై ఇక యుద్ధమేనని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం సొంత దేశాలనే సరిగ్గా నడుపుకోలేని కొందరికి నచ్చడం లేదు. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, మూడో దేశం జోక్యం ఇందులో అవసరం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత నెలలో జీ7 సదస్సు సందర్భంలోనూ ట్రంప్ తో మోదీ ఇదే విషయాన్ని చెప్పారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్)గా విభజించింది. దీంతో భారత్–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని లండన్: జమ్మూకశ్మీర్ అన్నది భారత్–పాకిస్తాన్ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్ మాట్లాడుతూ..‘కశ్మీర్ సమస్యను భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్–బ్రిటన్లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు. ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్ కలుసుకోనున్నారు. -
అయోధ్య కేసు : బెడిసికొట్టిన మధ్యవర్తిత్వం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తుల ప్యానెల్ పరిష్కార అన్వేషణలో విఫలమైందని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈనెల 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడతామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వాదనలు ముగిసే వరకూ కేసును రోజువారీ విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్ధుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. తొలి విచారణ తేదీ నుంచి వంద రోజుల అనంతరం నవంబర్ 17న కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి పార్టీలు తమ వాదనలు, ఆధారాలతో కూడిన నకళ్లను రిజిస్ర్టీకి సమర్పించాలని కోర్టు కోరింది. అయోధ్య వివాద పరిష్కారం దిశగా మాజీ సుప్రీం కోర్టు జడ్జి ఎఫ్ఎం కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీం కోర్టు మార్చి 8న నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు ఇతర సభ్యులుగా ఉన్నారు. -
అయోధ్యపై సత్వర విచారణ చేపట్టాలి
న్యూఢిల్లీ: అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. ప్రాముఖ్యమున్న వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనే దిశగా ఎటువంటి అడుగులు పడలేదని విశారద్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై సత్వరం విచారణ చేపట్టాలన్న ఆయన వినతిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే 10న ఉత్తర్వులిచ్చింది. -
‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అయోధ్యకు 7 కిలో మీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతాయనీ, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని యూపీ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ చర్చలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన వివరాలు పత్రికల్లో, టీవీల్లో రాకూడదని తాము కోరుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ మధ్యవర్తిత్వ చర్చలపై వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీ చానళ్లను నిలువరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు జస్టిస్ కలీఫుల్లాకు కోర్టు అధికారం కల్పించింది. పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక.. మధ్యవర్తిత్వ చర్చలు ప్రారంభించిన తర్వాత వాటిలో ఎంత వరకు పురోగతి వచ్చిందో తెలుపుతూ చర్చలు మొదలు పెట్టిన నాలుగు వారాల్లో ఓ నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతించడంలో న్యాయపరమైన చిక్కులేమీ తమకు కనిపించలేదని పేర్కొంది. ‘మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై ఈ కేసులో భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సిఫారసులను మేం పరిశీలించాం. త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించాం. అవసరమనుకుంటే మరికొందరిని ఈ కమిటీలో భాగం చేసుకునేందుకు ప్రస్తుత మధ్యవర్తులకు స్వేచ్ఛనిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ప్రతిపాదన వచ్చినప్పుడు ముస్లిం సంస్థలు దానిని సమర్థించగా, నిర్మోహి అఖాడా మినహా మిగిలిన హిందూ సంస్థలన్నీ వ్యతిరేకించాయి. అయితే మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై హిందూ సంస్థలు కూడా పేర్లను సిఫారసు చేశాయి. కాగా, చర్చల సమయంలో వివిధ భాగస్వామ్య పక్షాలు తెలిపే అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఏమైన సమస్యలు ఎదురైనా మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయవచ్చనీ, ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ఏం కావాలో అడగొచ్చని కూడా న్యాయమూర్తులు తెలిపారు. అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇక మధ్యవర్తిత్వంలో ఈ కేసు ఎంత వరకు తేలుతుందో వేచి చూడాల్సిందే. ఆలయ నిర్మాణం జరగాల్సిందే: బీజేపీ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, అయితే రామాలయ నిర్మాణం ఒక్కటే ఈ కేసుకు పరిష్కారమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ ‘అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. మసీదును ఆలయానికి దూరంగా ఎక్కడైనా కట్టుకోవచ్చు’ అని అన్నారు. ‘సమస్యను పరిష్కరించడం ముఖ్యమే. కానీ శ్రీరామ జన్మభూమి వద్ద గుడి కట్టడం మరింత ముఖ్యం. ఎక్కువ కాలం ఈ విషయాన్ని నాన్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు పేర్కొన్నారు. పిటిషన్‌దారుల్లో ఒకరైన సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరగకపోవడం అన్న ప్రశ్నే లేదనీ, వీలైనంత త్వరలో గుడి కట్టాలని బీజేపీ పట్టుదలతో ఉందని చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం: కాంగ్రెస్ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది. కేసు పరిష్కారానికి ఇదే చివరి ప్రయత్నం కావాలనీ, అన్ని పార్టీలు ఈ మధ్యవర్తిత్వంలో వచ్చే ఫలితానికి కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మతాలకు సంబంధించిన అంశాన్ని బీజేపీ గత 27 సంవత్సరాలుగా రాజకీయాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ 1992 నుంచి ప్రతీ ఎన్నికలోనూ లబ్ధి పొందుతోందనీ, ఎన్నికలు పూర్తవ్వగానే ఆ అంశాన్ని మరుగున పడేస్తోందని ఆయన మండిపడ్డారు. రవిశంకర్‌కు చోటు విచారకరం మధ్యవర్తిత్వం చేసే త్రిసభ్య కమిటీలో రవిశంకర్‌కు చోటు కల్పించడం విచారకరమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన తటస్థ వ్యక్తి కాదనీ, గతంలో ఈ అంశంపై రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘వివాదాస్పద స్థలంపై ముస్లింలు మొండిపట్టు పడితే ఇండియా కూడా సిరియాలా తయారవుతుందని రవిశంకర్ 2018 నవంబర్ 4న వ్యాఖ్యానించారు. ఆయన ఏ పక్షం తరఫున ఉన్నారో గతంలోనే చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మధ్యవర్తిగా పెట్టడం విచారకరం’ అని ఒవైసీ అన్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని అనుమతించాలన్న కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. మధ్యవర్తులు ఎవరంటే.. జస్టిస్ కలీఫుల్లా గతంలో ప్రఖ్యాత లాయర్‌గా పేరొందిన ఈయన 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా 2016లో రిటైర్‌అయ్యారు. 2000 సంవత్సరంలో మద్రాసు హైకోర్టుకి శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. కశ్మీర్ హైకోర్టు సీజేగానూ చేశారు. 2012లో ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. పదవిలో ఉండగా ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ)లో సంస్కరణల తీర్పు ప్రముఖమైనది. భారతీయ యూనివర్సిటీల్లో జాతకశాస్త్రంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించే కోర్సులు ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఆయన 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఎన్నో హిందూ, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఆయన అయోధ్యలో పర్యటించి వివిధ వర్గాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో ఆయన శాంతి స్థాపన కోసం అంబాసిడర్‌గా పనిచేశారు. కొలంబియా, ఇరాక్, ఐవరీకోస్ట్, బిహార్‌ల్లో వివాదాల పరిష్కారానికి ఇరుపక్షాలను ఒక్క చోటికి చేర్చి నేర్పుగా సంప్రదింపులు జరపడం ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది. శ్రీరామ్ పంచు సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ పంచు మధ్యవర్తిత్వానికి మారుపేరు. భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. 2005లో తొలిసారిగా భారత్‌లో కోర్టు వ్యవహారాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభించారు. అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య 500 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీరామ్ పంచుని సుప్రీంకోర్టు మధ్యవర్తిగా నియమించింది. దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మధ్యవర్తుల్లో శ్రీరామ్ పంచు ఒకరిగా గుర్తింపు పొందారు. బోర్డు ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఇనిస్టిట్యూషన్‌కు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ కలీఫుల్లా, శ్రీశ్రీరవిశంకర్, శ్రీరామ్ పంచు -
అయోధ్య మధ్యవర్తిత్వం.. ఒవైసీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు. ‘‘రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించబోమని గతంలోనే స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఆయన్ని(రవిశంకర్) ఎలా నియమిస్తారు’’ అని ఒవైసీ మండిపడ్డారు. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, నిర్మోహి అఖాదా, ఏఐఎంపీఎల్బీ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్‌ను సంప్రదించిన విషయం తెలిసిందే. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 16న అయోధ్యలో పర్యటించనున్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని.. చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారమని రవిశంకర్ ఇది వరకే స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరితో సంప్రదింపులు చేపడతానని ఆయన పేర్కొన్నారు కూడా. ఇక చర్చలకు రవిశంకర్‌ను ఆహ్వానిస్తూ సీఎం యోగి ఓ ప్రకటన చేశారు. దేశం ఒక్కటిగా ఉండాలని రవిశంకర్ కొరుకుంటున్నారు. రెండు వర్గాలు అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అని యోగి ఆ ప్రకటనలో తెలిపారు. -
మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దై క్వాంగ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానొక మంచి మధ్యవర్తినని, సంబంధిత పక్షాలు కోరితే మధ్యవర్తిత్వానికి తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏర్పాటుచేస్తున్న సైనిక స్థావరాలు, కృత్రిమ ద్వీపాల్ని గత కొంతకాలంగా వియత్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో మొదటి నుంచి వియత్నాంకు అమెరికా మద్దతుగా ఉంది. వియత్నాంతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్లతో కూడా దక్షిణ చైనా సముద్రం విషయమై చైనాకు గొడవలున్నాయి. పరిష్కరించుకుంటాం: వియత్నాం మరోవైపు ట్రంప్ వియత్నాం పర్యటన ముగించుకుని ఫిలిప్పీన్స్ చేరగానే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వియత్నాంలో అడుగుపెట్టారు. ఆయనకు వియత్నాం ఘనస్వాగతం పలికింది. జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా.. ఇరు దేశాధినేతలు ఆర్థిక సంబంధాల్ని విస్తృతం చేసుకోవడంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న వివాదం పరిష్కారం దిశగా చర్చలు జరపనున్నారు. శాంతియుత మార్గంలో దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న విభేదాల్ని పరిష్కరించుకుంటామని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ పేర్కొన్నారు. కిమ్ పొట్టి, లావు అని అన్నానా?: ట్రంప్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. కిమ్ తనను ముసలివాడు అనడంపై ట్విటర్లో ట్రంప్ మండిపడ్డారు. ‘నన్ను ముసలివాడు అంటూ కిమ్ ఎందుకు అవమానిస్తున్నాడు. నేనెప్పుడైనా అతన్ని పొట్టి, లావు అన్నానా?’ అని ఎగతాళిగా ట్వీట్ చేశారు. కిమ్‌కు స్నేహితుడిగా ఉండేందుకు తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, ఏదొక రోజు అది జరగవచ్చేమో? అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
టాటా- మిస్త్రీ మధ్య చర్చలు?
ముంబై: టాటా- మిస్త్రీ వివాదంలో ఆసక్తికర పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. గత వారంరోజులుగా సంచలనంగా మారిన టాటా- మిస్త్రీ వివాదానికి తెరపడనుందా? రచ్చకెక్కిన టాటా బోర్డు రూం డ్రామా కు చర్చల ద్వారా ముగింపు పలకాలని రతన్ టాటా చూస్తున్నారా? జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ మేరకు రతన్ టాటా, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య మధ్యవర్తిత్వ చర్చలకు రంగం సిద్ధమైంది. సీనియర్ న్యాయవాది, టాటా సంస్థ ట్రస్టీ అయిన దారియస్ కాంబట ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్టు సీఎన్ బీసీ టీవీ -18 పేర్కొంది. ఈ మేరకు ఆయన ఇద్దర్నీ కలిసి చర్చించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారమని నివేదించింది. ఒకవైపు టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్, టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం ఆసక్తిగల కొనుగోలు దారులకోసం వెదుకుతోందని వార్తలు వచ్చాయి మరోవైపు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు తాజాగా సంస్థకు గుడ్‌బై చెప్పారు. టాటా సన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మధు కన్నన్, వ్యూహకర్త నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ ఉన్నారు. కాగా మహారాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ దరియాస్ కాంబట టాటా గ్రూపునకు అత్యంత సన్నిహితులు. మరోవైపు ఈ వార్తలపై అటు టాటా సంస్థలనుంచి గానీ, మిస్త్రీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.