medium projects
-
మధ్యతరహా ప్రాజెక్టులకూ కొత్త భూచట్టం
- భూసేకరణ చట్టం–2013లోని పలు చాప్టర్ల నుంచి మినహాయింపు - కొమురంభీమ్, జగన్నాథ్‌పూర్, నీల్వాయి తదితర ప్రాజెక్టులకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే చర్యల్లో భాగంగా కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని పలుఅధ్యాయాలను మినహాయిస్తూ నిర్ణయం చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని మధ్యతరహా ప్రాజెక్టులకూ వర్తింపచేయాలని భావిస్తోంది. ఏళ్లకుఏళ్లు భూసేకరణ ముందుకు కదలక, నిలిచిపోయిన పనుల పూర్తికి తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వర్తింపజేసి భూసేకరణ చేయాలని నిర్ణయించి నట్లుగా తెలుస్తోంది. ముందుగా పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులకు ఈ మినహాయింపులు వర్తింపజేసే అవకాశాలున్నాయి. నిర్మాణాల జాప్యంతో మార్పులు... రాష్ట్రంలో చాలా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను 2004లోనే చేపట్టినప్పటికీ నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. ఇందులో ప్రధాన కారణం భూసేకరణే ఉంటోంది. భూసేకరణ జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమై వ్యయం భారీగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవో 123 ద్వారా కొద్దిమేర సేకరించినా పూర్తిస్థాయి సేకరణ జరగలేదు. ఈ దృష్ట్యానే కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం కొత్త చట్టాన్ని తెచ్చింది. దీని మార్గదర్శకాలకు అనుగుణంగా ఇటీవల పాలమూరు, డిండి, కాళేశ్వరం, సీతారామ, ప్రాణహిత వంటి ప్రాజెక్టు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కేంద్రం చట్టంలో ఉన్న చాప్టర్–2, 3 అధ్యాయాలను పూర్తిగా తొలగించారు. భూసేకరణ చేయడానికి ముందు సామాజిక ప్రభావ మదింపు చేయడం, గ్రామ సభ నిర్వహించి వాటి ఆమోదం తీసుకోవడం వంటి వాటికి మినహాయింపునిచ్చారు. ఇవే అంశాలను ప్రస్తుతం కొమురంభీమ్, ఎన్టీఆర్ సాగర్, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, గొల్లవాగు, లోయర్ పెనుగంగ ప్రాజెక్టులకు వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం చేసినట్లు తెలిసింది. కొమురంభీమ్‌లో 519 ఎకరాలు సేకరిస్తే 45,500 ఎకరాలకు, జగన్నాథ్‌పూర్‌లో 118 ఎకరాలు సేకరిస్తే 15వేల ఎకరాలకు, నీల్వాయిలో 104 ఎకరాల సేకరణ పూర్తయితే 13వేల ఎకరాలకు, గొల్లవాగులో 360 ఎకరాలు సేకరిస్తే 9,500 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర చట్టానికి అనుగుణంగా భూసేకరణ చేసేలా త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే అవకాశాలున్నట్లు నీటిపా రుదల వర్గాలు తెలిపాయి. -
ఖరీఫ్‌లోగా మధ్యతరహా ప్రాజెక్టులు
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల పథకాలన్నీ వచ్చే ఖరీఫ్‌లోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధి కా రులను ఆదేశించారు. ఈ పథకాలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ధపాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ వేసవిలోగా కాలువల పూడిక తొలగింపు, ‘అటవీ’క్లియరెన్స్ తదితర కార్యక్రమాలు పూర్తిచేస్తేనే ఖరీఫ్‌లో రైతులకు సాగునీరం దించగలమని తెలిపారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకా లను పూర్తిస్థాయి అంచనాలు రూపొందించి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింది నిధుల కోసం ప్రతిపాదనలు పంపాల న్నారు. జిల్లాల వారీగా పెండింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షిం చారు. అలాగే జిల్లాల వారీగా మైనర్ ఇరిగే షన్ కింద ఖరీఫ్, రబీలో జరుగుతున్న ఆయ కట్టు వివరాలను సమీక్షించారు. ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ కింద పెరి గిన, అదనపు ఆయ కట్టును కచ్చితంగా నమోదు చేయాలని.. ఆ మేరకు తనకు నివే దికలు ఇవ్వాలన్నారు. ఇదివరకే పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వాస్తవంగా జరగవలసిన ఆయకట్టులో ’గ్యాప్’ ఆయకట్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై పదిరోజులకోసారి మిషన్ కాకతీయ మీడియా కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలి పారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలు వల పరిస్థితిపై రెండు, మూడు రోజులలో సమీక్షిస్తానని, సింగూరు కాల్వల వెంట క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్సీ విజయప్రకాశ్, సీఈలు సునీల్, అనిల్, లింగరాజు, నాగేందర్ రావు, సురేశ్ కుమార్, బంగారయ్య, శంకర్‌నాయక్, శంక ర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. -
వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది. 146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు... కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు.