ఖరీఫ్‌లోగా మధ్యతరహా ప్రాజెక్టులు
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల పథకాలన్నీ వచ్చే ఖరీఫ్‌లోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధి కా రులను ఆదేశించారు. ఈ పథకాలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ధపాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ వేసవిలోగా కాలువల పూడిక తొలగింపు, ‘అటవీ’క్లియరెన్స్ తదితర కార్యక్రమాలు పూర్తిచేస్తేనే ఖరీఫ్‌లో రైతులకు సాగునీరం దించగలమని తెలిపారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకా లను పూర్తిస్థాయి అంచనాలు రూపొందించి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింది నిధుల కోసం ప్రతిపాదనలు పంపాల న్నారు. జిల్లాల వారీగా పెండింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షిం చారు.
అలాగే జిల్లాల వారీగా మైనర్ ఇరిగే షన్ కింద ఖరీఫ్, రబీలో జరుగుతున్న ఆయ కట్టు వివరాలను సమీక్షించారు. ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ కింద పెరి గిన, అదనపు ఆయ కట్టును కచ్చితంగా నమోదు చేయాలని.. ఆ మేరకు తనకు నివే దికలు ఇవ్వాలన్నారు. ఇదివరకే పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వాస్తవంగా జరగవలసిన ఆయకట్టులో ’గ్యాప్’ ఆయకట్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై పదిరోజులకోసారి మిషన్ కాకతీయ మీడియా కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలి పారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలు వల పరిస్థితిపై రెండు, మూడు రోజులలో సమీక్షిస్తానని, సింగూరు కాల్వల వెంట క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్‌సీ విజయప్రకాశ్, సీఈలు సునీల్, అనిల్, లింగరాజు, నాగేందర్ రావు, సురేశ్ కుమార్, బంగారయ్య, శంకర్‌నాయక్, శంక ర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు.