Merchants Use App
-
కెనరాబ్యాంక్ కస్టమర్లకు మెరుగైన డిజిటల్ సేవలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించే దిశగా ముందడుగు వేసింది. రోజువారీ లావాదేవీలను సులభతరం చేస్తూ, యూపీఐ ఎల్ఐటీఈ, కెనరా క్యూఆర్ సౌండ్‌బాక్స్, కెనరా ఏఐ1 మర్చంట్ యాప్‌లను ఆవిష్కరించింది. ‘యూపీఐ ఎల్ఐటీఈ’.. రూ.200 వరకూ తక్కువ స్థాయిలో విలువ లావాదేవీ నిర్వహించడంసహా పలు ప్రయోజనాలను అందించే ఒక ‘‘ఆన్–డివైస్’’ వాలెట్. గరిష్ట రోజువారీ వినియోగ విలువ పరిమితి రూ.4,000. ఇక ఇన్స్టెంట్ క్యూఆర్ పేమెంట్ కన్ఫర్మేషన్సహా పలు ప్రయోజనాలను ‘కెనరా క్యూఆర్ సౌండ్‌బాక్స్’ ద్వారా లభ్యమవుతాయి. ఆన్బోర్డెడ్ బీహెచ్ఐఎం క్యూఆర్ మర్చంట్స్‌కు ‘కెనరా ఏఐ1’ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది. ఈ కీలక ఫీచర్ల కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ సీనియర్ అధికారులను చిత్రంలో తిలకించవచ్చు. -
పేటీఎమ్: వరుసగా ఏడో ఏటా నష్టాలే
ముంబై, సాక్షి: దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎమ్ వరుసగా ఏడో ఏడాదిలోనూ నష్టాలు నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 2,833 కోట్ల నష్టం నమోదైంది. వెరసి పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 వరుసగా ఏడో ఏడాదీ నష్టాలను సాధించినట్లయ్యింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలు 28 శాతం తగ్గాయి. అంతేకాకుండా వ్యయాలను సైతం 20 శాతం తగ్గించుకుంది. దీంతో ఇవి రూ. 5,861 కోట్లకు చేరాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం గతేడాది పేటీఎమ్ రూ. 3,350 కోట్ల ఆదాయం సాధించింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1 శాతం తక్కువ. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) 2022కల్లా వచ్చే ఏడాది(2021-22)కల్లా నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాలని వన్97 లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాటలో పలు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌లలోకి అడుగుపెట్టింది. రుణాలు, బీమా, వెల్త్ మేనేజ్మెంట్, కామర్స్ తదితర విభాగాలలోకి కార్యకలాపాలు విస్తరించింది. కాగా.. యూనిఫైడ్ పేమెంట్ విభాగంలో ఈవ్యాలెట్ బిజినెస్‌కు పోటీ తీవ్రమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పే, మొబిక్విక్, భారత్ పే,అమెజాన్ పే తదితరాలు ఈవ్యాలెట్ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. (స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?) 1.7 కోట్ల మర్చంట్స్ పేటీఎమ్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్ల చిన్నతరహా బిజినెస్‌లు లిస్టయ్యాయి. ఈ కంపెనీలు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా సూక్ష్మ స్థాయి చెల్లింపులను సాధిస్తున్నాయి. తద్వారా చిన్సస్థాయి డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నట్లు టోఫ్లర్ పేర్కొంది. కంపెనీ ఇటీవల బిజినస్ యాప్, సౌండ్‌బాక్స్, బిజినెస్ కాటా తదితర మర్చంట్ మేనేజ్మెంట్ సర్వీసులను ప్రారంభించింది. -
కార్డు స్వైప్ లేకుండానే చెల్లింపులు!
రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పేటీఎం వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారుల కోసం పేటీఎం తన యాప్‌ను అప్డేట్ చేసింది. స్వైప్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లతోనే ఇన్నిరోజులు జరిగిన దుకాణాల లావాదేవీలు ఇక నుంచి తమ పేటీఎం యాప్ ద్వారా కూడా చేసేవిధంగా వీలు కల్పించింది. ఈ మిషన్ల అవసరం లేకుండా తమ లేటెస్ట్ పేటీఎం యాప్ వెర్షన్‌తో దుకాణదారులు కార్డు పేమెంట్లను అంగీకరించవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌లోని తాజా అప్డేట్ చిన్న వర్తకులకు ఎంతో సహకరిస్తుందన్నారు. యూజర్ల దగ్గర పేటీఎం అకౌంట్ లేనిసమయంలో, దుకాణదారులు వారివద్ద నున్న పేటీఎం యాప్ ద్వారా బిల్లును జనరేట్ చేయడానికి మీ కార్డు వివరాలు, ఫోన్ నంబర్ నమోదు చేయనున్నారు. ఆ సమయంలో యూజర్ల మొబైల్‌కు ఓ ఓటీపీ(ఒన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దుకాణ దారుడి ఫోన్లో ఆ ఓటీపీ నమోదుచేయగానే, తమ బిల్లు చెల్లింపు జరిగిపోతోంది. తాజా అప్డేట్ ద్వారా చిన్న దుకాణాదారులకు.. ఇటు చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మేలు జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కేవలం 14 లక్షల మెషిన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే, దేనినైనా మార్చే విధంగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు హఠాత్తు నిర్ణయంపై ప్రతిపక్షం కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లను ఆయన తోసిపుచ్చారు. ఇదంతా అనవసర రాద్ధాంతమని, ఈ కష్టం భవివ్యత్తులో భారీ మొత్తంలో లబ్దిచేకూరుస్తుందని శర్మ చెప్పారు.