milk price
-
కరోనా ట్రీట్మెంట్ ఫైల్‌పైనే స్టాలిన్ తొలి సంతకం
చెన్నె: అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ముతువేల్ కరుణానిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తన తండ్రి స్మృతిస్థలి వద్ద కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా తొలి సంతకాలు వేటిపై చేశారనే ఆసక్తి అందరిలో ఉంది. మహమ్మారి కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి స్టాలిన్ తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద మే, జూన్ నెలలకు సంబంధించి రూ.4 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది. రెండు విడతలుగా ఆ సహాయం అందించనున్నారు. 2.7 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బీమా ఉన్న వారందరికీ కరోనా చికిత్సకయ్యే ఖర్చంతా భరిస్తుందనే ఫైల్‌పై స్టాలిన్ సంతకం చేశారు. సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణానికి సంబంధించిన ఫైల్‌పై సీఎంగా స్టాలిన్ సంతకం చేశారు. మే 8వ తేదీ నుంచి మహిళలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పాల ధర తగ్గింపుపై స్టాలిన్ సీఎంగా సంతకం చేశారు. మే 16 నుంచి లీటర్‌పై మూడు రూపాయలు తగ్గనున్న ధర. ‘మీ నియోజకవర్గ ముఖ్యమంత్రి’ అనే సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. దీనిపై ఐదో సంతకం చేశారు. ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్ణయం. వంద రోజుల్లోపు ఆ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి. చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..? ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
పాల ధర 140.. పెట్రోల్ కన్నా ఎక్కువ!
కరాచీ: మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ, సింధు ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ. 140 వరకు వసూలు చేశారు. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర కన్నా మించి పాల ధరలు పెరిగిపోవడం గమనార్హం. రెండ్రోజుల కిందట పాక్‌లో లీటరు పెట్రోల్‌కు రూ. 113, లీటరు డీజిల్‌కు రూ. 91 ధర ఉంది. సింధ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో లీటరు పాలకు రూ. 140 వరకు ధర పలికింది. పాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో రూ. 120 నుంచి 140కి లీటరు పాలు అమ్మినట్టు ఒక దుకాణదారుడు వెల్లడించినట్టు పాక్ మీడియా తెలిపింది. మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి సబీల్స్ (స్టాల్స్) ఏర్పాటుచేసి.. ఉచితంగా పాలు, పళ్లరసాలు, తాగునీరు అందిస్తారు. ఇలా సబీల్స్ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి. పాల ధర నియంత్రణకు కరాచీ కమిషనర్ ఇఫ్తీకార్ షాల్వానీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ధరలు ఆకాశాన్నంటినా ఆయన పట్టించుకోలేదని పలు పాక్ పత్రికలు పేర్కొన్నాయి. ఇక,కమిషనర్ కార్యాలయంలోనే లీటరు పాలను రూ. 94లకు అమ్మడం గమనార్హం. -
పాల దోపిడీ
జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోచేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంలో మొండిచేయి చూపుతుండడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 3.80 లక్షల రైతు కుటుంబాలు పంటల సాగుతోపాటు పాడి ఆవులు, గేదెల పెంపకాన్ని జీవనాధారం చేసుకున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం పాడి ఆవులు 9,27,776 ఉండగా, గేదెలు 84,605 ఉన్నాయి. అందులో ప్రస్తుతం పాలు ఇస్తున్న ఆవులు 3.75 లక్షలు, గేదెలు 35 వేల వరకు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 32 లక్షల నుంచి34 లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువులను, కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ రూ.కోట్లలో కొల్లగొడుతున్నాయి. నిలువు దోపిడీ.. పాడి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు అదుపులేకుండా పోతోంది. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రైవేటు డెయిరీలు చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు రూ.30కి తక్కువ లేకుండా వస్తేనే కొంతమేర గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు డెయిరీలు ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, వాటిలోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా ఎస్ఎన్ఎఫ్ 8.5, ఫ్యాట్ 4.5 మేరకు వస్తే లీటరుకు రూ.30 పైబడి నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.18 నుంచి రూ.24 వరకు మాత్రమే ధరను ఇస్తున్నాయి. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 49 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. వీటికి రోజుకు 16 లక్షల నుంచి 17 లక్షల లీటర్ల మేరకు రైతులు పాలను విక్రయిస్తున్నారు. స్వలాభం కోసం సహకారం నిర్వీర్యం.. జిల్లాకే తలమానికంగా నిలిచిన∙సహకార విజయా డెయిరీని చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లావ్యాప్తంగా 5 లక్షల రైతు కుటుంబాలు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నాయి. 2002 ఆగస్టు 31న చంద్రబాబు తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నష్టాలను సాకుగా చూపెట్టి మూయించి వేశారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్ డెయిరీకి మళ్లించుకున్నారు. 2014లో తిరిగి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పాడి రైతుల కష్టాలు మరింతగా పెరిగాయి. హెరిటేజ్ డెయిరీలో దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ల పేరుతో లీటరు ఆవు పాలకు రూ.18 నుంచి రూ.22 వరకు, గేదెపాలు లీటరుకు రూ.26 నుంచి రూ.28 వరకు మాత్రమే ఇస్తూ నిట్టనిలువునా దోచేస్తోంది. వైఎస్సార్ చొరవతో.. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 2006లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ)లను ఏర్పాటు చేశారు. పాలకు గిట్టుబాటు ధర రావడంతో రైతులు మళ్లీ పాడి పరిశ్రమపై ఉత్సాహం చూపారు. జిల్లా వ్యాప్తంగా 94 బీఎంసీల మేరకు వెలిశాయి. ఈ పాలశీతలీకరణ కేంద్రాల ద్వారా రోజుకు 2.36 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇక్కడ పాలుపోసే వారికి ఆవు పాలకు లీటరుకు రూ.25 నుంచి రూ.29 వరకు, గేదెపాలకు లీటరుకు రూ.32 నుంచి రూ.40 వరకు ఇస్తున్నారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రాలకు పాలుపోసే పాడి రైతులకు మాత్రం కొంత ఊరట కలుగుతోంది. -
కష్టాల పాలు!
బైరెడ్డిపల్లె మండలంకూటాలవంకకు చెందినరెడ్డెమ్మకు రెండు పాడిఆవులు ఉన్నాయి. అందులో ఒకటి పాలు ఇస్తోంది. పూటకు ఐదు లీటర్ల చొప్పున రోజూ పది లీటర్ల పాలు డెయిరీకి పోస్తోంది. 15 రోజుల కోసారి లీటరు ధర రూ.25 చొప్పున రూ.3,750 బిల్లు వస్తోంది. అంటే నెలకు రూ.7,500 వస్తుంది. ఇందులోపశువుకు దాణా, మేత, వైద్యం తదితరాలకు నెలకు రూ.5000పోగా నెలకు మిగిలేదిరూ.2,500 మాత్రమే. దీంతోనే ఆమె కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక రెడ్డెమ్మ బాధేకాదు పడమటి కరువు మండలాల్లో 30వేల మంది పాడి రైతులుపడుతున్న కష్టమిదీ. పలమనేరు: పశుదాణా ధర పెరగడం, పాలకు ఆశించిన ధర లభించకపోవడంతో పాడి పశువుల పెంపకం రైతులకు భారంగా మారింది. వేసవిలో పాలకు డిమాండ్ ఉన్నా పాల ధర మాత్రం పెరగలేదు. వేసవిలో పాల డిగ్రీ 30, వెన్నశాతం 4.2 ఉంటే లీటరు ధర రూ. 25 ఉంటోంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో లీటరు పాలకు డిగ్రీని బట్టి రూ.30 దాకా ఇస్తుంటే ఇక్కడి డెయిరీలు మాత్రం లీటరు ధర సరాసరిగా రూ.25 ఇస్తున్నాయి. ఇక్కడి మార్కెట్లో ప్రైవేటు కంపెనీలు మాత్రం లీటరు పాలు రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నాయి. కొండెక్కిన పాడిఆవుల ధరలు జిల్లాలో ఎక్కువగా హెచ్ఎఫ్, జెర్సీ రకాల సీమజాతి ఆవులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని కర్ణాటక, తమి ళనాడు నుంచి కొనుగోలు చేయాల్సిందే. లీటరు పాలిస్తే రూ.5 వేలుగా 10 లీటర్ల పాలిచ్చే ఆవు రూ.50 వేలు ధరతో కొనేవారు. ప్రస్తుతం లీటరుకు రూ.8 వేలు చొప్పున పది లీటర్ల పాలిచ్చే ఆవును కొనాలంటే రూ.80 వేలకు పైగా వెచ్చించాలి. పాడిఆవు ధర, రవాణా, మూడేళ్ల ఇన్యూరెన్స్‌కు మరో రూ.6 వేలు పెట్టాల్సిందే. డెయిరీల సిండికేట్.. జిల్లాలోని మదనపల్లె డివిజన్లో 45 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. గతంలో ఈ డెయిరీలు రోజుకు 30 నుంచి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి 25 లక్షల లీటర్లు దాకా ఉంటుంది. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు సరఫరా ఎక్కువగా ఉందని ధరలను తగ్గించడం, డెయిరీల నుంచి అమ్మకాలు తగ్గితే ధరలు తగ్గించడం చేస్తున్నారు. రైతులకు డెయిరీలు లీటరు ధర రూ.25 నుంచి రూ.26 దాకా ఇస్తున్నాయి. కర్ణాటకలో డెయిరీలు రూ.30 నుంచి 32 దాకా ధర చెల్లిస్తున్నాయి. అక్కడ ప్రైవేటు పాల ఫ్యాక్టరీలున్నా ప్రభుత్వ డెయి రీ ఉన్నందున ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం సాగడంలేదు. ఇక్కడ ప్రభుత్వ పాల డెయిరీలను ప్రభుత్వం మూసేయడంతో ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం కొనసాగుతోంది. జిల్లాలోని రెండు పాల డెయిరీలు ధరను శాశిస్తున్నాయి. పెరిగిన దాణా ధరలు.. ఒక పాడి రైతు రోజుకు 10 లీటర్ల పాలు పితికే ఆవును ప్రస్తుతం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.80వేలు పెట్టాల్సిందే. దాంతో పాటు పాడి ఆవు సంరక్షణకు ఉపయోగించే దాణా ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో బూసా (50 కేజీలు) రూ.1350 గానుగపిండి మూట రూ.2500, మొక్కజొన్నలు 50 కేజీలు రూ.1000, బుడ్డశెనగ పొట్టు 24 కేజీలు రూ.500లుగా ఉన్నాయి. తవుడు 50 కిలోలు రూ.850 గా ఉంది. దీనికి తోడు వరిగడ్డి ట్రాక్టరులోడ్డు రూ.13వేలుగా ఉంది. ఆలెక్కన మొత్తం రూ.19వేల దాకా ఖర్చు అవుతుంది. ఆవు ధర, పోషణలో తేడాలివీ.. ♦ పది లీటర్ల పాలిచ్చే హెచ్ఎఫ్ లేదా జెర్సీ ఆవు ధర కర్ణాటక, తమిళనాడులో రూ.80 వేలుదాకా పలుకుతోంది. ♦ జిల్లాలోని పడమటి మండలాల్లో అదే జాతి ఆవు ధర రూ. 60 వేలకు దొరికినా అక్కడి ఆవులు ఇచ్చినంత పాలు ఇక్కడి ఆవులు ఇవ్వడంలేదు. ♦ అందుకే రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి ఆవులను కొనుగోలు చేస్తున్నారు. ♦ కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఉండే ఉష్ణ్రోగ్రతలు సీమజాతి ఆవులకు సరిపడేలా ఉండడం. వారు ఎక్కువగా పచ్చిమేతను పెట్టడం, సరైన సంరక్షణ చర్యల కారణంగా బలిష్టంగా ఉంటున్నాయి. ♦ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల తగినంత పచ్చిగడ్డి లేదు. ఎక్కువగా ఎండుగడ్డి, బూసా వాడుతున్నారు. ♦ కర్ణాటక నుంచి కొన్న ఆవులు సైతం ఇక్కడికి తెచ్చిన తొలినాళ్లలో ఇచ్చినంత పాలు మరుసటి ఈతకు ఇవ్వడం లేదు. సరైన పోషణ లేకపోవడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులే అందుకు కారణాలు. ఏమీ గిట్టడం లేదు ధరల విషయంలో పాల డెయిరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అసలే మేత లేక ఏడు లీటర్లు పాలిచ్చే ఆవు ఐదు లీటర్లే ఇస్తోంది. పొద్దస్తమానం ఆవులకు చాకిరీచేసి వాటికి మేత, గానుగపిండి పెట్టి పోషిస్తే కూలి కూడా మిగలడంలేదు. ఏదో చేయాలి కాబట్టి గత్యంతరం లేక పశువులను మేపుతున్నాం.– రెడ్డెమ్మ, కూటాలవంక, బైరెడ్డిపల్లె మండలం పాలధరలు మరీ మోసం ఇక్కడ ఉన్నవంతా ప్రైవేటు పాల డెయిరీలే. దానికి తోడు రైతులకు జరిగే అన్యాయంపై ప్రైవేటు డెయిరీలను ప్రశ్నించే అధికారం ఈ ప్రభుత్వానికి కూడా లేదు. ఇక ఐకేపీ వారి బీఎంసీయూలు ఉన్నప్పటికీ అవి ప్రైవేటు డెయిరీలను ఎదుర్కొనలేకపోతున్నాయి. పాల ధరలు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయి. పాడి ఆవులను సంరక్షించడం కంటే అమ్ముకోవడం మేలుగా మారింది.-బాలయ్య, జంగాలపల్లె,పలమనేరు మండలం -
మళ్లీ పెరగనున్న పాల ధర
హైదరాబాద్: పాల ధర మళ్లీ పెరగనుంది.డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టోన్డ్ మిల్క్ ధర రెండు రూపాయలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. 10-15 రోజుల్లో ఈ సవరణ పూర్తి చేయాలని కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టోన్డ్ పాల ధర లీటరుకు రూ.42 ఉండగా విజయ బ్రాండ్ మాత్రమే రూ.41కు విక్రయిస్తోంది. ప్రైవేటు రంగంలోని హెరిటేజ్, జెర్సీ బ్రాండ్లు తాజాగా హోల్ మిల్క్ ధరను రూ.2 పెంచడంతో లీటరు రూ.56కు చేరింది. జెర్సీ టోన్డ్ ప్రీమియం ధర రూ.42 నుంచి రూ.44కు చేరింది. టోన్డ్ మిల్క్ ధరను కూడా ఈ కంపెనీలు పెంచుతాయని డీలర్లు చెబుతున్నారు. పాల కొరత, దాణా సమస్యలు దేశంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పాల సరఫరా లేదు. ప్రస్తుతం పాల కొరత 20 శాతం దాకా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ స్థాయిలోనే కొరత ఏర్పడిందని నల్గొండ-రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చైర్మన్ జి.జితేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అముల్, నందిని రాకతో తెలుగు రాష్ట్రాల్లో పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ కంపెనీలు తక్కువ ధరకు విక్రయించడంతో ఇతర కంపెనీలు ధర తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని కంపెనీల ధర ఒకేలా ఉంది. మరోసారి ధర సవరించాల్సి వస్తోంది. పాల కొరతకు తోడు దాణా ఖర్చులు అధికంగా ఉండడం కూడా ఇందుకు కారణం. విజయ డెయిరీ రైతులకు లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది. నార్ముల్‌కు కూడా దీనిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం అని వివరించారు. ఇక దాణా విషయానికి వస్తే క్వింటాలు దాణా ధర 2014లో రూ.1,600 పలికింది. ఇప్పుడు రూ.2,100 ఉంది. జనవరి-ఫిబ్రవరిలో ఇది రూ.2,500 దాకా వెళ్లింది. అవసరానికి తగ్గట్టుగా గడ్డి కూడా దొరకడం లేదు. దాణా ధరలు పెరగడం భారంగా ఉందని మహబూబ్‌నగర్ సమీపంలోని చుక్మాపూర్ పాడి రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు. నాణ్యతనుబట్టి లీటరుకు రూ.33 దాకా రైతుకు వస్తున్నా ఖర్చులు పెరగడంతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోందని చెప్పారు. వర్షాలు ప్రారంభమైతేగానీ గడ్డి లభ్యత సాధ్యం కాదని జితేందర్‌రెడ్డి తెలిపారు. -
తెలంగాణ, ఆంధ్రాలో పాల ధరల యుద్ధం!
-
పాడికి తోడేదీ?
-
పాడికి తోడేదీ?
* ఆంధ్రప్రదేశ్‌లో డెయిరీ పరిశ్రమను దెబ్బతీస్తున్న అధికార పార్టీ * ప్రభుత్వ డెయిరీలకు ప్రోత్సాహకాలివ్వకుండా ఎగనామం.. సొంత డెయిరీలపైనే దృష్టి * తెలంగాణ, కర్ణాటకల్లో ప్రభుత్వ దన్ను * రూ. 4 ప్రోత్సాహం ప్రకటించిన తెలంగాణ * రాష్ట్ర రైతులను పట్టించుకోని ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: అదే తీరు. నాడూ... నేడూ... ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానిది అదే వైఖరి. తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వ సంస్థల్ని బొందపెట్టడం. అయితే వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం... లేదంటే తమ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించటం. చక్కెర కర్మాగారాల్ని పప్పుబెల్లాల్లా అమ్మేసినా... నూలు మిల్లుల్ని రియల్టీ భూముల కోసం నలిపేసినా... డెయిరీల్ని దారుణంగా చిదిమేసినా... అన్నిటా అదే మార్కు. ఇన్నాళ్ల తరవాత మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు మళ్లీ ఇపుడు అదే మార్కును కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది. మెల్లగా ప్రభుత్వ డెయిరీ పరిశ్రమను చిదిమేసేలా వ్యవహరిస్తోంది. కావాలంటే మీరే చూడండి... రాష్ట్రంలో 50 లక్షల మందికి జీవనాధారంగా ఉన్న పాడి పరిశ్రమకు ప్రోత్సాహమే లేదు. వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగంగా పాడి పరిశ్రమకున్న ప్రాధాన్యం దృష్ట్యా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా... తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం టీడీపీ ప్రభుత్వం మాత్రం సాచివేత ధోరణినే కొనసాగిస్తోంది. ప్రభుత్వ డెయిరీలకు పాలు విక్రయిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 ఇస్తామని చెబుతూ... పాల సేకరణ ధరను లీటరుకు రూ.4 మేర పెంచుతూ ఇటీవలే తెలంగాణ సర్కారు జీవో కూడా జారీ చేసింది. తెలంగాణ కన్నా దాదాపు 5 రెట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. కారణం... ఏపీ గనక ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచితే రైతులంతా ప్రభుత్వ రంగంలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీడీడీసీఎల్) సారథ్యంలోని డెయిరీలకే పాలు పోస్తారు. అపుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీలు కూడా పోటీ తట్టుకోవటానికి తప్పనిసరిగా పాల సేకరణ ధర పెంచాలి. అలా పెంచితే వాటికొచ్చే లాభాలు తగ్గుతాయి. అందుకే ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచకుండా... రైతులు తమను మాత్రమే ఆశ్రయించేలా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. అదీ కథ. రాష్ట్రంలో సుమారు 90 లక్షల గేదెలు, 18 లక్షలకు పైగా సంకర జాతి ఆవులు, 55 లక్షల దేశవాళీ ఆవులున్నాయి. తీవ్రంగా పెరుగుతున్న పశుగ్రాసం ధర, నీటి కొరత, తవుడు, చెక్కల ధర వంటివి పాడి రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. రోజుకు సగటున దాదాపుగా 50 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఏపీ డెయిరీ సేకరిస్తున్నది కేవలం 1.70 లక్షల లీటర్లు. మిగిలినదంతా ప్రయివేటు డెయిరీల చేతుల్లోకే వెళుతోంది. కారణం ఒక్కటే. సేకరణ ధర. ఉదాహరణకు హోల్ మిల్క్‌ను ఏపీ డెయిరీ రూ.55.50 ఇచ్చి సేకరిస్తుండగా ప్రయివేటు డెయిరీలు రూ.57 ఇచ్చి సేకరిస్తున్నాయి. సహజంగానే ప్రయివేటు డెయిరీల ధర ఎక్కువగా ఉంటోంది కనక రైతులు వాటినే ఆశ్రయిస్తున్నారు. నిజానికి సేకరణ ధర పెంచాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ప్రధాన ప్రయివేటు డెయిరీలుండటంతో వారు చాకచక్యంగా వ్యవహరిస్తూ తమ నేతృత్వంలోని ప్రయివేటు డెయిరీల సేకరణ ధరే కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరకంగా ప్రభుత్వ డెయిరీల వంక ఏ రైతూ వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వ డెయిరీలు కునారిల్లటమే కాదు. రైతులకూ గిట్టుబాటు ధర రావటం లేదు. రాష్ట్రంలో అత్యధిక శాతం పాలను సేకరిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కావటం ఇక్కడ గమనార్హం కూడా. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను ప్రభుత్వ సహకార డెయిరీ కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే పాలను సేకరిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. రూ.4 ప్రోత్సాహకంగా ప్రకటించిన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం లీటరు పాలకు అదనంగా రూ.4ను ప్రోత్సాహకం ప్రకటించాక ప్రభుత్వ సమాఖ్య ద్వారా పాల ఉత్పత్తి పెరిగింది. గత పదిరోజుల్లోనే రోజుకు అదనంగా 40 వేల లీటర్ల పాల సేకరణ జరగటం విశేషం. పాల సేకరణలో లీటరుకు 4 రూపాయలు పెరగడంతో ప్రభుత్వ డెయిరీకి పాలు ఇవ్వడానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా ప్రభుత్వ పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలను ప్రకటించి అమలు చేస్తోంది. ఏపీ రైతులకు ఎందుకివ్వరు? ఆంధ్రప్రదేశ్ పాడి రైతులు ఎప్పట్నుంచో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ, పొరుగునున్న కర్ణాటక ప్రభుత్వాలు పాడి రైతుల్ని ప్రోత్సహిస్తుండగా.. ఎంతో ఆర్భాటంగా వ్యవసాయ మిషన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు సమీప ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలో వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఏపీ డెయిరీ మరింతగా విస్తరించాలంటే ప్రభుత్వ చేయూత లేకుండా సాధ్యం కాదు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటిస్తే అటు ప్రైవేటు డెయిరీల ఆట కట్టించడంతో పాటు రైతులకూ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి ముకుతాడు వేయాలంటే మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం.. ఏపీ డెయిరీ క్రమేణా నిర్వీర్యమవుతుండటం, సహకార రంగంలోని ఒకటి రెండు సంస్థలు మినహా మిగతావి దివాళా తీయడంతో ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలే పాల ఉత్పత్తిదారుల భవిష్యత్తును శాసిస్తున్నాయి. పాల సేకరణ ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా ఈ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు, వారి బంధువులకు సొంత డెయిరీలు ఉండడంతో పాల సేకరణ ధర పెంచేందుకు పాలకులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. అన్నిటా తెలంగాణ కంటే తమదే అగ్రస్థానం అనే చంద్రబాబు పాల రైతులకు బోనస్ విషయంలో వెనుకాడటానికి ఇదే కారణమని రైతు సంఘాల నేతలంటున్నారు. కర్ణాటకలో మాదిరి ప్రైవేటు డెయిరీల ఆటకట్టించి, ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయాలని టీడీపీ ప్రభుత్వం అనుకుంటే తక్షణమే రైతులకు బోనస్ ప్రకటించేదని పాడి పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు చెబుతున్నారు. హెరిటేజ్ కోసం రైతుల్ని బలిచేయొద్దు తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాలరైతులకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి. చంద్రబాబు గతంలో మాదిరి కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వ రంగంలోని ఏపీడీడీసీఎల్ను, ఇతర సహకార సంస్థలను బతికించేలా చూడాలి. తన హెరిటేజ్ కోసం పాడి రైతుల్ని బలిపెట్టడం తగదు. ప్రైవేటు సంస్థల ఆగడాలు అరికట్టేలా, రైతు శ్రేయస్సును పట్టించుకునేలా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. రూ.4 నగదు ప్రోత్సాహం అవసరం. అనివార్యం. - కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రైవేటు డెయిరీల ఒత్తిడే కారణం ఏపీ ప్రభుత్వం పాల రైతును విస్మరిస్తోంది. సేకరణ ధర పెంచేందుకు వెనుకాడుతోంది. ప్రైవేటు డెయిరీల ఒత్తిడే దీనికి కారణం. లాభం వచ్చే పని ఏదైనా చేస్తామనేది రిలయెన్స్ నినాదం. ప్రస్తుతం హెరిటేజ్ విధానం కూడా అలాగే ఉంది. దీన్ని ప్రజలు తిరస్కరించాలి. పాల సేకరణ ధరలో రాజకీయ జోక్యాన్ని నివారించి సహకార రంగం బలపడేలా చూడాలి. ప్రభుత్వం మిగతా పంటలకు ఇచ్చినట్టే పాలకూ గిట్టుబాటు ధర కల్పించాలి. - నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నేత -
పాల రచ్చ!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆవిన్ పాల ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకే సారి లీటరు పాలపై రూ.పది పెంచడాన్ని ప్రజలు, రాజకీయ పక్షాలు జీర్ణించుకోలేకున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధరను తగ్గించడం లక్ష్యంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కదిలాయి. మంగళవారం డీఎండీకే నేతృత్వంలో నిరసన సాగగా, బుధవారం నుంచి ఆందోళనలు రాజుకున్నాయి. డీవైఎఫ్ఐ, ఐద్వాలతో పాటుగా పలు సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో ఆయా నగరాల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. పాల ధరను తగ్గించాల్సిందేనని నిరసన కారులు నినదించారు. చెన్నై సెంట్రల్ ఆవరణలో డీవైఎఫ్ఐ, ఐద్వా నేతృత్వంలో భారీ నిరసన జరిగింది. ఉద్రిక్తత : నిరసనకారులు బుధవారం ఉదయాన్నే రోడ్డెక్కారు. పాల ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శవయాత్ర నిర్వహించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా పూందమల్లి హైరోడ్డులో బైఠాయించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఆందోళనకు తరలి వచ్చిన వారిలో అత్యధికంగా మహిళలు ఉండడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. చివరకు మిహ ళా పోలీసులు పెద్ద ఎత్తున రప్పించి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కొందరు అయితే, రోడ్డుపై అడ్డంగా పడుకోవడం, మరి కొందరు వాహనాల చక్రాల కింద పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పూందమల్లి హైరోడ్డు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రంగంలోకి దించి, నిరసనకారుల్ని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ నిరసనతో రెండు గంటల పాటుగా వాహన చోదకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చక తప్పలేదు. గురువారం నుంచి పాల ధర పెంపునకు నిరసనగా రోజుకో రాజకీయ పార్టీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. -
పాడి రైతు నెత్తిన పాలు!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతుకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పాల సేకరణ ధరను రూ. 4 పెంచి, ఆ మేరకు భారాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా డెయిరీకి ప్రాణం పోయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. పాల సేకరణ ధర పెంపు ఫైలును ఏపీ డెయిరీ ఎండీ ఎ.శ్రీనివాస్ శనివారం సీఎం కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నారు. సేకరణ ధర పెంచిన ప్రతిసారీ సహజంగా అమ్మకపు ధర కూడా పెరుగుతుంది. కానీ సీఎం మాత్రం విజయ పాల అమ్మకపు ధర పెంపుపై విముఖతతోనే ఉన్నారు. సేకరణ ధర పెంచినా అమ్మకపు ధర పెరగకుండా చూడాలని భావిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. ఇందులో ఏపీ డెయిరీ 4.5 లక్షల లీటర్లు విక్రయిస్తుంది. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల లీటర్లు అమ్ముతుంది. అంతా ప్రైవేటు గుత్తాధిపత్యమే నడుస్తోంది. ప్రైవేటు సంస్థలు రైతుకు పాల సేకరణ ధర అధికంగా ఇస్తుండటంతో ఏపీ డైయిరీకి పాలు పోసే వారే కరువయ్యారు. 4.5 లక్షల పాల సేకరణలో 2 లక్షల లీటర్లను కర్ణాటక నుంచే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. అందుకే సేకరణ ధర పెంచాలని విజయ డెయిరీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏపీ డెయిరీ లీటరు పాల సేకరణకు రైతులకు రూ.53 ఇస్తోంది. ప్రైవేటు సంస్థలు లీటరుకు రూ. 57కు మించి ఇస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు డెయిరీలకే పాలు పోస్తున్నారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయి రీ రోజుకు 50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. అక్కడ పాడి రైతుకు ప్రభుత్వమే లీటరుకు రూ.4 ప్రోత్సాహం ఇస్తుండటంతో రైతులంతా సర్కారు సంస్థకే పాలు పోస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సేకరణ ధర పెంచినా ఆ భారం ఏపీ డెయిరీపై కాకుండా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. -
విజయ పాల వడ్డింపు.. రూ. 2 పెంపు
మార్చి 1 నుంచి లీటర్ ధర రూ. 38.. నెలలో రెండుసార్లు పెరుగుదల సాక్షి, హైదరాబాద్: విజయ పాల విక్రయ ధర నెలరోజుల్లోనే మరోసారి పెరిగింది. లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య బుధవారం ప్రకటించింది. దీంతో లీటర్ పాల ధర రూ. 38కి చేరనుంది. పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నెలసరి కార్డులను తీసుకున్న వారికి పాత ధరపై మార్చి 10 వరకే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 2న కూడా లీటర్‌పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే. -
పెరిగిన పాల ధర
సాక్షి, బళ్లారి : నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో పాల ధరను స్వల్పంగా పెంచుతున్నట్లు కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి లీటరు పాలపై రూ. 2 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా నగరంలోని రాయచూరు, బళ్లారి, కొప్పల జిల్లాల సహకార పాల సమాఖ్య కేంద్రంలో వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు ప్రభుత్వం తొలుత రూ.2 ఇచ్చిందని, తర్వాత మరో రూ.2 ఇవ్వడంతో లీటరు రూ.4 ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా పాలసేకరణ ఖర్చులు, వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన పాలను పంపిణీ చేయడానికి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో లీటరుకు మరో రూ.2 పెంచడం అనివార్యమవుతోందన్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన పాల సమాఖ్య మహామండలి సభ్యుల సమావేశంలో పాల ధర పెంపునకు తీర్మానించి ప్రభుత్వానికి నివేదిక పంపామని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం కూడా పాల ధర పెంపునకు అంగీకారం తెలిపిందన్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోలి స్తే కర్ణాటకలో లీటర్ పాల ధ ర తక్కువగా ఉన్నట్లు వివరించారు. రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేఎంఎఫ్ చూసుకుంటుందన్నారు. నందిని శుభం పాల ధర ఇకపై లీటరుకు రూ.36 ఉంటుందన్నారు. నందిని శుభం గోల్డ్ పాల ధర లీటరు రూ.37, నందిని శుభం గోల్డ్ పాల ధర అర లీటరు రూ.19, నందిని టోన్డ్ పాల ధర లీటరు రూ.30 ఉంటుందని వివరించారు. వినియోగదారులపై అధిక భారం పడకుండా కేవలం రూ.2ను మాత్రమే లీటర్‌పై పెంచామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మోత్కూ రు శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పాలపై లీటరుకు రూ. 2 వడ్డింపు
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ‘ఏపీ డెయిరీ’ పాల విక్రయ ధరను లీటరుకు రూ.2 పెంచనున్నట్లు సమాచారం. ఏపీ డెయిరీ రోజుకు దాదాపు 4.5 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. హైదరాబాద్‌లోనే 3.75 లక్షల లీటర్ల పాలను అమ్ముతోంది. లీటరుకు రెండు రూపాయల చొప్పున రోజుకు రూ.9 లక్షలు, నెలకు రూ.27 కోట్ల భారం వినియోగదారులపై మోపేందుకు ఏపీ డెయిరీ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ఏపీ డెయిరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
రేపటి నుంచి మదర్ డెయిరీ పాల ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: మదర్ డెయిరీ పాల ధరను సోమవారం నుంచి పెంచుతున్నట్లు డీజీఎం రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు టీఎం పాలను లీటరుకు రూ.34 చొప్పున విక్రయిస్తుండగా సోమవారం నుంచి రూ.36కు పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు డెయిరీలు ఇదివరకే పాల ధరను పెంచాయని, ఉత్పాదక వ్యయం పెరిగిన దృష్ట్యా తాము సైతం పాల ధరలను పెంచాల్సి వస్తోందని ఆయన వివరించారు.