Mining University
-
‘వర్సిటీ’ ఊసేది..?
సాక్షి, కొత్తగూడెం: ఉన్నత విద్యను యువతకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గతంలో రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం ఇప్పటివరకు ఒక్క వర్సిటీ కూడా మంజూరు కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ వర్సిటీని ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ తప్పకుండా ఏర్పాటు చేస్తారనే ఆశలు ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉన్నాయి. సింగరేణి కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రి సైతం ఉంది. దీంతో సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా.. అది కూడా ఎప్పటికప్పుడు వెనక్కే వెళుతోంది. చివరకు మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ దీనిపైనా స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అనుకూలంగా సిఫారసు చేసినప్పటికీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. దినదినాభివృద్ధి చెందుతున్న ‘గూడెం’.. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, సింగరేణి పుట్టిల్లయిన ఇల్లెందు ప్రాంతాలు బొగ్గు గనులతో భాసిల్లుతున్నాయి. మరోవైపు జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా కూడా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోంది. కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి వివిధ దశల్లో కసరత్తు సైతం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సానుకూలంగానే వెళ్లాయి. సింగరేణి గనులతో పాటు పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో భారజల కర్మాగారం, ఐటీసీ పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మణుగూరు–పినపాక మండలాల సరిహద్దుల్లో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇలా పారిశ్రామిక రంగంలోనూ జిల్లా దూసుకెళుతోంది. మైనింగ్ స్కూల్‌నే యూనివర్సిటీగా... జిల్లాలో 400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను ధన్‌బాద్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ లేదా మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో మైనింగ్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఐటీ కోర్సులు ఉన్నాయి. ఇందులో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. కొత్తగూడెం ఏరియాకు పలుమార్లు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్ 26న చివరిసారిగా పర్యటించి.. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ‘మైనర్ అండ్ టెక్నలాజికల్ డీమ్డ్ యూనివర్సిటీ’గా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని సూచించింది. అసెంబ్లీలో చర్చ... 2017 చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశా ల్లోనూ ఈ అంశం చర్చకు రాగా, నాటి మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. 2018 మార్చిలో మైనింగ్ విశ్వవిద్యాలయం పై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని భావించినా అది నిరాశే అయింది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై మైనింగ్ వర్సిటీ ఏర్పాటుపైనా చొరవ తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు. -
మరో ‘గని’హారం!
సాక్షి, కొత్తగూడెం: మన్యానికి ముఖద్వారంగా ఉన్న కొత్తగూడెం సిగలో మరో మణిహారం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే బొగ్గు గనులతో విలసిల్లుతుండడంతో పాటు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ఇక్కడ ఇప్పటికే సింగరేణి కేంద్ర కార్యాల యం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింతగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మూడేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారీ స్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందు, ఆసియాలోనే అతిపెద్ద మణుగూరు ఉపరితల గని, బొగ్గు అధారితమైన పాల్వంచ కేటీపీఎస్, అశ్వాపురం భారజల కర్మాగారం, ఐటీసీ ఉన్నాయి. ఈ క్రమంలో 400 ఎకరాలకు పైగా భూమి ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను ధన్‌బాద్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ లేదా మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. పలుసార్లు కొత్తగూడెం ఏరియాకు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్ 26న చివరిసారిగా పర్యటించింది. అనంతరం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ‘మైనర్ అండ్ టెక్నలాజికల్ డీమ్డ్ యూనివర్సిటీ’గా చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని కమిటీ సూచనలు చేసింది. పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఏజెన్సీ కావడంతో ఇక్కడ మైనింగ్ డీమ్డ్ వర్సిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే జలగం తీవ్ర కృషి చేస్తున్నారు. కొత్తగూడెంలో మైనింగ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రతిపాదన ఉంది. మొదట మైనింగ్ కళాశాలగా ఏర్పాటైన దీంట్లో తర్వాత వివిధ ఇతర ఇంజినీరింగ్ కోర్సులు వచ్చాయి. అనంతర కాలంలో యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం దీనిని సాకారం చేయాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా కొత్తగూడెం, పాల్వంచల్లో రెండుచోట్ల ఆటోనగర్లను మంజూరు చేయించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మైనింగ్ వర్సిటీపై జలగం చర్చకు తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. అయితే ప్రస్తుత సెషన్లోనే దీనిపై ప్రకటన చేయించే దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే చర్చకు కొత్తగూడెంలో మైనింగ్ యూని వర్సిటీ ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చి ప్రకటన చేయించేందుకు కృషి చేస్తున్నాం. –జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే -
కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు
ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్‌లకు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించిన సీఎం.. అధికారులతో సమీక్ష సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు ఒక్కోదానికి బడ్జెట్లో ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.5.70 కోట్లు, వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో రూ.3.50 కోట్ల ఆస్తి పన్ను పెనాల్టీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం ఖమ్మం వచ్చిన సీఎం.. నగరంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అధికారులతో జిల్లా పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని, భక్త రామదాసు ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేశామని వివరించారు. వచ్చే జూన్, జూలై నాటికి పనులు పూర్తి చేసి ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో 60 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. భద్రాచల సీతారాముడి ఆశీస్సులతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేసి 5 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. గతంలో చేపట్టిన రుద్రమకోట ఏపీలోకి వెళ్లడంతో సీతారామ ప్రాజెక్టు చేపట్టామని, దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారుస్తామన్నారు. కృష్ణా, దాని ఉప నదులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 200లకు పైగా ప్రాజెక్టులు నిర్మించారని, దీనివల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ప్రమాదం ఉందని, నాలుగేళ్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వర్షాలు పడి అక్కడి ప్రాజెక్టులు నిండితేనే ఇక్కడికి నీరు వస్తుందన్నారు. ఈ ఉద్దేశంతోనే గోదావరి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాణహిత, ఇంద్రావతి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం జిల్లాకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద 350 రోజులు 5వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉంటుందని, ఈ నీటితో ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా నీటిని అందించేలా డిజైన్ చేశామన్నారు. భద్రాచలం డివిజన్ నుంచి ఏపీలో కలిసిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని సీఎం తెలిపారు. రానున్న బడ్జెట్ నాటికి ఈ పంచాయతీలు తెలంగాణలోకి వస్తాయన్నారు. భద్రాచ లం పుణ్యక్షేత్రాన్ని వేములవాడ, యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాచలంకు చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదనంగా 3 వేల డబుల్ బెడ్రూమ్లు... ఖమ్మంకు ఇప్పటికే 2 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, ఈ బడ్జెట్లో మరో 3 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ ఇళ్లన్నీ నిర్మిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉన్నాయని, వీటన్నింటినీ ఒకేచోటకు తెచ్చేలా సమీకృత కార్యాలయాలను నిర్మిస్తామని వివరించారు. ఎన్నెస్పీలోని 39 ఎకరాల్లో ఈ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. ఖమ్మంలో కూరగాయల మార్కెట్, మాంసపు మార్కెట్ల కోసం 73 ఎకరాల్లో 6 మార్కెట్లను మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కూడా కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. లకారం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దేందుకు అదనపు నిధులిస్తామని, వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్‌ను హైదరాబాద్ కేబీఆర్ పార్కులా తీర్చిదిద్దుతామన్నారు. ఖమ్మం చుట్టూ రింగురోడ్డు నిర్మిస్తామని చెప్పారు. మిషన్ భగీరథను పూర్తిచేసి డిసెంబర్ నాటికి ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండకుండా చూస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్ తరహాలో ఖమ్మం కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. స్థలం చూస్తే ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే ఖమ్మం ప్రెస్‌క్లబ్‌కు ఎకరం స్థలం కేటాయిస్తామని, అందుకు స్థలం చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ లేదా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. జిల్లాల పునర్విభజన తర్వాత వర్సిటీ ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 153 అవుతాయన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో హమాలీలు, గ్రానైట్ కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని, అందులో వీరికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడున్న షాదీఖానా బాగాలేదని ముస్లింలు తన దృష్టికి తెచ్చారని, రూ.2 కోట్లతో మరో షాదీఖానా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని కూడా ఆధునీకరిస్తామన్నారు. -
‘గూడెం’లో మైనింగ్ యూనివర్సిటీ
కొత్తగూడెం(ఖమ్మం) : దక్షిణ భారతదేశంలో గుర్తింపు కలిగిన సింగరేణి సంస్థతో పాటు దేశంలోని వివిధ మైనింగ్ కంపెనీలకు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మైనింగ్ ఇంజినీర్లను అందించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మారనుంది. దీంతో ఇప్పటి వరకు సమస్యలతో సతమతమవుతున్న ఇంజినీరింగ్ కళాశాలకు కొత్త హంగులు చేరనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా టాస్క్‌ఫోర్స్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) సైతం ఈ కళాశాలను మైనింగ్ యూనవర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు అందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మూడు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కొత్తగూడెం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను మైనింగ్ యూనివర్సిటీగా మార్చడానికి రూ.55 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగరేణిలో బొగ్గుబావులు ఉండటం.. ఈ ప్రాంతం మైనింగ్ ఇంజినీరింగ్‌కు అనువుగా ఉండటం.. గనులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ కళాశాలను 1978లో ఏర్పాటు చేశారు. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఈ కళాశాలకు నామకరణం చేశారు. 390 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రేకుల షెడ్డులో తాత్కాలికంగా ల్యాబ్‌లు, తరగతి గదులు నిర్మించారు. 1986లో విద్యార్థుల కోసం హాస్టల్ భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం 1994లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్, కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చారు. అప్పటి నుంచి కళాశాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పిలుస్తున్నారు. ప్రారంభంలో కేవలం మైనింగ్ స్కూల్‌గా ఉన్న ఈ కళాశాలలో తర్వాత క్రమంలో మైనింగ్‌తో పాటు ఈసీఈ, ఈఈఈ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టారు. తీరనున్న సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కళాశాలను తరలించేందుకు తాత్కాలికంగా రేకుల షెడ్లతో నిర్మించిన గదులనే నేటికీ తరగతి గదులుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిలోనే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. అవికూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వెంటిలేషన్ ల్యాబ్, సర్వే ల్యాబ్, మినరల్ ప్రాసెసింగ్ ల్యాబ్, మైనింగ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ల్యాబ్, రాక్ మెకానిక్స్ ల్యాబ్, మైనింగ్ మ్యాచనరీ ల్యాబ్, మైనింగ్ ల్యాబ్‌లు ప్రస్తుతం వాడకంలో లేవు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మూడేళ్లుగా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. దీనికి తోడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ కళాశాల సమస్యలు తీరనున్నాయి. -
జిల్లాకు మరో యూనివర్శిటీ
సాక్షి, ఒంగోలు: జిల్లాకు మరో యూనివర్శిటీ వచ్చింది. ఇప్పటికే జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా, ఇక్కడ్నే వెటర్నరీ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్చూరు, ఒంగోలు జన్మభూమి సభల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించారు. ఒంగోలుగిత్త బ్రీడ్‌ను కాపాడేందుకు అన్నివిధాలా కృషి చేస్తామన్నారు. దొనకొండను ఇండస్ట్రియల్ సిటీగా మారుస్తామని, కనిగిరిలో జాతీయ పారిశ్రామికవాడతో పాటు రామాయపట్నం పోర్టు, ఒంగోలులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తామని, దాదాపు పూర్తిదశలో ఉన్న రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సద్వినియోగంతో ఆయకట్టుకు సరిపడా నీరిస్తామన్నారు. కొత్తపట్నానికి నాలుగులైన్ల రహదారిని విస్తరించి అభివృద్ధిచేస్తామని, ఒంగోలులో మినీ, అవుట్డోర్ స్టేడియంల అభివృద్ధికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించి ఎన్టీఆర్ సుజల పథకం కింద నీటిప్లాంట్లను నెలకొల్పుతామన్నారు. డ్వాక్రా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులతోపాటు, ఒంగోలులో మైసూర్‌పాక్, వేటపాలెం జీడిపప్పు వంటి రుచికరమైన ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు ‘ఇ-కామర్స్’ విధానం అమలు చేస్తానన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయాన్ని పెంచుతామని, స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో పైపులైన్ల ద్వారా గ్యాస్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తామని, వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందిస్తామన్నారు. ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమృలో చేపట్టిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల కోసం సభల్లో ప్రత్యేకంగా వివరించారు. భవిష్యత్‌లో ఇంటింటికీ బ్రాడ్‌బ్రాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు విద్యార్థులకు ఐపాడ్లు, టాబ్లు అందించి పేదరికంపై గెలుపును సాధిస్తామని చెప్పారు. పేదవిద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తెస్తామని.. దశలవారీగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేసి క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుతో వాహనసదుపాయం కూడా సమకూరుస్తామన్నారు. కూచిపూడి నాట్యం నేర్చుకున్న ప్రతి విద్యార్థినికి అదనంగా మార్కులు కలిపే ప్రతిపాదనపై ఆలోచిస్తామని, వచ్చేరోజుల్లో వివిధ అంశాల్లో పోటీతత్వ పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. తొలుత పర్చూరులోని స్థానిక వైఆర్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది రా..’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడి బయటనున్న పిల్లలను గుర్తించి విద్యను నేర్పించడంలో ప్రకాశం జిల్లా ప్రథమస్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. నియోజకవర్గ చుట్టుపక్కలనున్న 73 పాఠశాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో బాబు ముచ్చటించారు. వేదికపైన మాట్లాడిన చిన్నారుల వాగ్ధాటికి చంద్రబాబు ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో అధికసమయం చిన్నారుల అభిప్రాయాలకే కేటాయించారు. డ్రిప్,స్ప్రింక్లర్లతో సాగు ప్రోత్సాహం పర్చూరులోని నాగులపాలెంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం కాస్తంత పేలవంగా సాగింది. ఒకరిద్దరు రైతుల మినహా అందరూ ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలే ఉండటంతో సమావేశ ఉద్దేశం పక్కదారి పట్టింది. తొలుత అక్కడ పత్తిపంటను సందర్శించి చేనుగల రైతులతో బాబు మాట్లాడారు. శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ పొలంపిలుస్తోంది కార్యక్రమంలో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా తెలుసుకున్న అంశాలేంటని అడిగారు. ఈ సందర్భంగా శెనగరైతులు తమ బాధలను చెప్పుకున్నారు. 40 వేల పోరంబోకు భూముల్లో .. జిల్లాలోని 40 వేల పోరంబోకు భూముల్లో నీరు, చెట్టు పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. నాగులపాలెం జన్మభూమి వేదికపై బాబు చేతులమీదుగా చెట్టుపట్టాలను కలెక్టర్ విజయకుమార్ అందించారు. ఇక్కడ సభాధ్యక్షత వహించిన స్థానిక సర్పంచి గంగాభవాని, ఎంపీటీసీ వాణి, జెడ్పీటీసీ ఉషారాణి తదితరులు కోరిన గ్రామసమస్యలపై బాబు సానుకూలంగా స్పందించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, నీరు - చెట్టు, డ్వాక్రారుణాలు, పింఛన్లపంపిణీ తదితర అంశాలపై తయారుచేసిన పాటల సీడినీ బాబు ఆవిష్కరించి.. ప్రతీ పాటను వేదికపై నుంచి జనాలకు వినిపించారు. వేదికపైన రూ.50కోట్ల రుణాల చెక్‌ను లబ్ధిదారులకు అందించారు. రుణమాఫీ అమలుపై కట్టుడతా.. తమ్ముళ్లూ.. రుణమాఫీ అమలు సాధ్యం కాదన్నారు. ఆరునూరైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు విడతలవారీ మాఫీకి ప్రణాళిక రూపొందించాం. వందరోజులపాటు కేంద్రంతో మాట్లాడా.. ఆర్బీఐకి లేఖలు రాసా.. అన్నివైపుల నుంచి ప్రోత్సాహం కరువే.. నా సొంత ఆలోచనతో ‘రైతు సాధికారసంస్థ’ను నెలకొల్పాను. జిల్లాలో బాబు పర్యటన మంగళవారం అధికారిక షెడ్యూల్ సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. పర్చూరులోని మార్కెట్‌కమిటీ యార్డు ఆవరణలో హెలీప్యాడ్‌కు ఉదయం 10.30కి చేరుకోవాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడ జిల్లామంత్రి సిద్దా రాఘవరావు, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, మాజీ ఎంపీ కరణం బలరాంతో పాటు అధికార పార్టీ ప్రముఖులు ఆయనకు స్వాగతం పలకగా, అక్కడ్నుంచి బడిపిలుస్తోంది రా, పొలంపిలుస్తోంది, జన్మభూమి సభలు ముగిసేనాటికి సాయంత్రం ఐదుగంటలు దాటింది. అక్కడ్నుంచి ఒంగోలుకు చేరుకుని మినీస్టేడియం ఆవరణలో సభ ప్రారంభం సాయంత్రం ఏడుగంటలైంది. అన్నిచోట్ల జనాలతరలింపులో అధికారపార్టీ నేతలు విజయవంతం అయ్యారు. చంద్రబాబు రాత్రిబస స్థానిక ఎన్ఎస్పీ అతిథిగృహంలో చేశారు.