Minister atchannaidu
-
కోనసీమలో మంత్రి అచ్చెన్నకు జనసేన కార్యకర్తల షాక్
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది.జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
అచ్చెంనాయుడికి ముచ్చెమటలు!
-
యధా బాబు..తధా మంత్రులు!
-
నేనే రాజు.. నేనే మంత్రి!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో సంబంధిత మంత్రి ఆదేశాల మేరకు కార్యకలాపాలు నడవాలి. మంత్రుల నిర్ణయం మేరకు ఆయా శాఖల్లో ఉత్తర్వులు వెలువడుతుంటాయి. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాకు ఏమాత్రం వర్తించదు. ఏ జీవో అయినా ఆ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి నచ్చకపోతే ఆగాల్సిందే. విద్యాశాఖకు సంబంధించి మంత్రి గంటా ఇచ్చిన ఆదేశాలకు తాజాగా ఈ గతి పట్టింది. జిల్లా విద్యాధికారిగా గంటా నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదంటూ అచ్చెన్న వెనక్కు పంపేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇద్దరు మంత్రుల వివాదంగా మారింది. ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే...! ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారుల పోస్టులలో రెగ్యులర్ డీఈఓలను నియమిస్తూ మానవవనరుల శాఖ శుక్రవారం జీఓ 268 విడుదల చేసిన సంగతి తెలిసిందే. 11 జిల్లాలకు రెగ్యులర్ డీఈఓలను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు. కలెక్టర్ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీచేయడంతో ఆ అధికారి ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అక్కడ ఉన్న కొందరు మంత్రి దృష్టికి తేగా... ‘ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే. ఏ శాఖ అయినా నామాట ప్రకారం నడవాల్సిందే. నా మాటే జీఓ‘ అని మంత్రి స్పష్టం చేశారు. తన మనిషే ఇన్‌ఛార్జి: విజయనగరం జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్ ప్రభాకరరావును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి డీఈఓగా ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు లేకుండానే ఆయన ఇన్ఛార్జిగా కొనసాగటం గమనార్హం.ఇంతకు ముందు ఏడాదిన్నర ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. కొత్త డీఈఓల నియామకం తరువాత ఆయన్ను విజయనగరం డైట్‌కు పంపినా మళ్లీ రప్పించి ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందే: మంత్రి గంటా తన శాఖ ఉత్తర్వులు అమలు కాకుండా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడం, అధికారిని వెనక్కు పంపడంపై మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ మంత్రి గంటాను సంప్రదించగా.. అన్ని జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందేనని, ఇన్‌ఛార్జి డీఈఓలను కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇన్‌ఛార్జి డీఈఓగా కొనసాగుతున్న అధికారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మంత్రి సుజయకృష్ణ రంగారావుకు గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇసుక ర్యాంపు పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకుండా మంత్రి అచ్చెన్న అడ్డుకున్నారు. సుజయకృష్ణ సూచనల మేరకు మైనింగ్ శాఖ కార్యదర్శికి విన్నవించినా.. ‘అచ్చెన్నాయుడిని కలసి ఏదో సర్దుబాటు చేసుకోండి. ఆ జిల్లాలో మేమైనా అచ్చెన్న మాట ప్రకారం నడవాల్సిందే’ అని చేతులెత్తేయటం గమనార్హం. -
' అచ్చెన్నాయుడుకు అప్పుడే సారీ చెప్పా'
హైదరాబాద్: నోటీసులు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాను మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని దూషించినట్లు బుద్ధప్రసాద్ కమిటీ...నివేదిక ఇచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పిందన్నారు. ' మేం పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు మా పార్టీని, మా నాయకుడిని తిట్టారు. మా పార్టీని సైకో పార్టీ అని, మా నాయకుడిని సైకో అని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పుడు ఆవేశంగా కొన్ని మాటలు అన్నమాట వాస్తవమే. అదే కమిటీ ముందు చెప్పాను. అదేరోజు అచ్చెన్నాయుడు బాధపడి ఉంటే సారీ అని చెప్పాను. అచ్చెన్నాయుడు నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కొంతకాలం ఒకేపార్టీలో ఉన్నాం. ఆయనకు బాధ కలిగించి ఉంటే అప్పుడే సారీ చెప్పాను. మా మీద చర్య తీసుకోమని బుద్ధప్రసాద్ కమిటీ చెప్పిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పింది. అలాగే నిర్ణయం తీసుకోమని కమిటీకి చెప్పాం' అని ఎమ్మెల్యే నాని తెలిపారు. -
'జిల్లాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆయనే'
-
'జిల్లాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆయనే'
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో అవినీతికి కేంద్ర బిందువు రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండు దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని ధర్మాన ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల బదిలీలు, ఎమ్మార్పీ ధరలు పెంచుకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేందుకు మంత్రి లక్షల్లో వసూలు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. జిల్లాలో 230 మద్యం దుకాణాల ఉండగా ఒక్కొక్క షాపు నుంచి లక్షల్లో ముడుపులు దండుకుంటున్నారని ఆయన చెప్పారు. -
గంగిరెద్దులా తలూపడం వల్లే సమస్య
గవర్నర్‌పై మంత్రి అచ్చెన్నాయుడి మండిపాటు ⇒ సెక్షన్ 8 అమలు చేయమంటే కుంటిసాకులు చెబుతారా ⇒ హైదరాబాద్‌లో ఏపీ పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేస్తాం ⇒ కేసీఆర్‌పై నమోదైన కేసుల దర్యాప్తునకు సిట్ సాక్షి, హైదరాబాద్: ‘పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్దేశించిన గవర్నర్ పదవికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దు’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ స్పందించకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ హోం మంత్రి నాయిని చెప్పారు. ఆ రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మాత్రం ట్యాపింగ్ చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని రాత పూర్వకంగా హామీ ఇవ్వగలరా అని సవాల్ విసిరితే స్పందించలేదు. అంటే.. చంద్రబాబుసహా 120 మంది ఏపీ మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసినట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం అధీనంలోకి వెళుతుందని, అలాంటప్పుడు ఓటుకు నోటు వ్యవహారంలో కేసు నమోదు చేసే అధికారం ఏసీబీకి లేదన్నారు. మా పోలీసులతో మాపైనే కేసులా ఉమ్మడి రాజధానిలో తమ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న 45 బెటాలియన్ల పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ‘మా ప్రభుత్వంవద్ద జీతాలు తీసుకుంటున్న పోలీసులతోనే మాపై కేసులు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేసి తీరతామన్నారు. తెలంగాణ సర్కారుకు నోటీసులు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో సహా 87 కేసులు ఏపీలో నమోదయ్యాయన్నారు. ఆ కేసులపై విచారణకోసం సిట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబుతోసహా 120 మంది మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేసీఆర్‌పై నమోదైన కేసులతోపాటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ బుధవారం నుంచి చట్టం తన పని తాను చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు కూడా కుప్పకూలడం ఖాయమన్నారు. దాటవేత ధోరణి ఓటుకు నోటు కేసును ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యగా చిత్రీకరించి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కేసును పక్కదోవ పట్టించాలని చూస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు సమాధానం దాటవేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నకు మంత్రి పుల్లారావు స్పందిస్తూ.. సమయమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు.