Minister mrunalini
-
వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం
-
వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం: వైఎస్ జగన్
హైదరాబాద్ : గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే గృహ నిర్మాణాలపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా 35 వేల ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్‌లో 44,895, అర్బన్‌లో 2,687 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేశారన్నారు. ప్రభుత్వం లక్షా 35వేల ఇళ్ల కట్టామని చెబుతోందని, ఒక్కో ఇల్లుకు లక్షన్నర వేసుకున్నా రూ.6వేల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా హౌసింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ పది లక్షల ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని, దానిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో అవినీతిని అరికట్టేందుకు జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నామన్నారు. -
అంత ఈజీ కాదట!
► బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై టెన్షన్ ► టీడీపీలో మారుతున్న సమీకరణాలు ► గట్టిగా పనిచేస్తున్న సుజయ వ్యతిరేక వర్గం ► ఓసీకి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ తెరపైకి వాదన ► మృణాళినిని తప్పిస్తే బీసీలకు ఇవ్వాలని డిమాండ్ ► వ్యూహాత్మకంగా మారిన బంగ్లా రాజకీయాలు ఏ ఒప్పందంతో అయితే టీడీపీలోకి వెళ్లారో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణకు అది నెరవేరేలా కనిపించడం లేదట. అది అంత ఈజీ కాదని ఆ పార్టీ వర్గీయులే గుసగుసలాడుకుంటున్నారు. రోజురోజుకు సమీకరణాలు మారుతుండటంతో ఆయన ఇప్పుడు ఉత్కంఠకు లోనవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందో లేదోనన్న అనుమానాలు కమ్ముకుంటున్నాయి. టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. నిన్నటి వరకు కలిసి ఉన్న నాయకులు వైరి వర్గాలుగా విడిపోయారు. ఆయనపై వ్యతిరేక వర్గం ఎక్కువైంది. మృణాళినిని తప్పిస్తే మంత్రి పదవి మళ్లీ బీసీలకే ఇవ్వాలి! అదీ మహిళలకే ఇవ్వాలని కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రేసులోకి వచ్చారు. పవర్ సెంటర్ మారితే ఇబ్బందని అంతర్లీనంగా అశోక్ గజపతిరాజు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. తన కుమారుడిని కేబినెట్లోకి తీసుకునేందుకు విస్తరణ చేపడుతున్నారు. ఈ క్రమంలో మరికొందరికి చోటు కల్పిస్తారని, ఉన్న వారిలో కొందర్ని తప్పిస్తారని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వ్యవహారం చర్చకొచ్చింది. మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీ మారారని, అందుకు తగ్గట్టుగా అదిష్టానం మాట ఇచ్చిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు ఆయన పరిస్థితిపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఆయనకంత సులువు కాదని, ఇస్తారన్న ధీమా కూడా లేదని టీడీపీలో ప్రస్తుతం చర్చ ఊపందుకుంది. అంతర్లీనంగా జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం. సీనియర్ల ఆవేదన మంత్రి పదవి డిమాండ్‌తో పార్టీలో చేరారని, ఆయనకే పదవి ఇస్తే తామంతా ఏమైపోవాలని సీనియర్లుగా ఉన్న నేతలు కొందరు అంతర్గతంగా అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించారు. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొచ్చి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే ఇబ్బందులే అన్న వాదనను విన్పిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి పెద్ద దిక్కుగా భావిసున్న అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పవర్ సెంటర్ మారిపోతుందన్న సెంటిమెంట్ తీసుకొచ్చారు. ఒకవేళ మృణాళినిని మంత్రి పదవి తప్పిస్తే ఆ స్థానంలో కాపులకు గాని, వెలమలకు గానీ అవకావం ఇవ్వాలే తప్ప కొత్తగా పార్టీలో చేరిన ఆయన్ను ఎలా తీసుకుంటారనే వాదన అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఓసీ వర్గానికి చెందిన ఆయనకు ఇవ్వడం వల్ల పార్టీకి మేలు జరగదని చెబుతున్నారట. వెలమ సామాజిక వర్గం నుంచైతే కోళ్ల లలితకుమారికి ఇవ్వాలని, కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికిచ్చినా ఫర్వాలేదనే వాదనలు ఊపందుకున్నాయి. తెలంగాణలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ మారిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారంటూ అక్కడ గగ్గోలు పెట్టిన నేతలు ఇక్కడెలా పార్టీ మారిన సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తారని, ఒకవేళ ఇస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పగలమనే వాదనలను అంతర్గతంగా విన్పిస్తున్నారు. ఇవన్నీ సుజయకృష్ణకు ప్రతికూలంగానే తయారయ్యాయి. పెరుగుతున్న అంతర్గత పోరు జిల్లా టీడీపీలో తొలుత రెండు గ్రూపులుండేవి. మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ద్వారపురెడ్డి జగదీష్ ఒక గ్రూపుగా ఉండగా, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, మీసాల గీత మరో గ్రూపుగా ఉండేవారు. సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అటూ ఇటుగా ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చేరికతో టీడీపీలో సమీకరణాలు మారిపోయాయి. జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి వర్గీయులు సుజయకృష్ణ వైపు రాగా, కోళ్ల, ద్వారపురెడ్డి, కొండపల్లి ఒక వర్గంగా తయారైనట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో అంతర్గత పోరు ఎక్కువై, అసలుకు నష్టం వచ్చే అవకాశం ఉందనే సంకేతాలను అధిష్టానానికి పంపిస్తున్నారు. మరీ, వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం సుజయకు మొండి చేయి చూపిస్తుందో లేదంటే తొలుత ఇచ్చిన హామీ ప్రకారం కేబినెట్లోకి తీసుకుంటుందో చూడాలి. పవర్‌సెంటర్ మారుతుందనేనా... టీడీపీ ఆవిర్భావం నుంచి అశోక్ బంగ్లాయే చక్రం తిప్పుతోంది. అశోక్ గజపతిరాజే కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పదవులు ఎవరికి ఇవ్వాలన్నా అశోక్ నిర్ణయమే శిరోధార్యం. దశాబ్ధాలుగా ఒకే కేంద్రంగా టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. వన్ మేన్ షో కొనసాగుతూ వస్తోంది. అశోక్‌ను కాదనే పరిస్థితి పార్టీలో ఎప్పుడూ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న చర్చ ప్రకారం సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే పవర్ సెంటర్ మారుతుందనే భయం బంగ్లా నేతలకు పట్టుకుంది. బయటకు చెప్పుకోలేకపోతున్నా అంతర్గతంగా మదన పడుతూనే ఉన్నారు. బొబ్బిలి రాజులకు ఒకసారి అవకాశమిస్తే అశోక్ ప్రాబల్యం తగ్గుతుందని, అదే జరిగితే తమ పరిస్థితేంటన్న అభద్రతా భావం పట్టుకుంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. -
రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం
అచ్యుతాపురం: నూతన గహనిర్మాణ పథకంలో రెండు లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని గృహ నిర్మాణశాఖమంత్రి మృణాళిని అన్నారు. గురువారం ఆమె పూడిమడకలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిర్మించిన గహనిర్మాణ సముదాయాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులనుంచి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హుద్‌హుద్ బాధితులకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో జిల్లాలో 10వేల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేశామని చెప్పారు. దాతల సహకారంతో పూడిమడక, కొమ్మాది తదితర ప్రాంతాల్లో 2వేల ఇళ్లు పూర్తిచేశామని వివరించారు. ఇన్ఫోసిస్ ఒక్కో కుటుంబానికి ఇల్లు నిర్మాణానికి రూ.5.5 లక్షలు వెచ్చించిందని చెప్పారు. పూడిమడకలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇళ్లు నిర్మిస్తే, ప్రభుత్వం రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతులు కల్పించిందని చెప్పారు. నిర్మాణం పూర్తిచేసుకున్న 200 ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ప్రారంభిస్తారని మరో నాలుగు వందల ఇళ్లనిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మూడు వందల చదరపు అడుగుల స్థలం ఉంటేనే ఇళ్లు మంజూరుచేయాలనే నిబంధనను సడలించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, గహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
మంత్రి మృణాళినికి చుక్కెదురు
ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిలదీసిన గ్రామస్తులు చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినికి సొంత నియోజకవర్గ కేంద్రమైన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించాలని భావించిన మంత్రి మృణాళిని నిర్ణయాన్ని మేజర్ పంచాయతీ పరిధిలో గల వంగపల్లిపేట గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణాళినిని ఈ విషయమై గ్రామస్థులు, మహిళలు నిలదీశారు. తొలుత మంత్రిని కలిసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుని లోపలికి వెళ్లి కార్యాలయంలో బైఠాయించారు. మంత్రి వారివద్దకు వచ్చి దీని కోసం సిక్స్మ్యాన్ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ శాంతించని గ్రామస్థులు.. ఏ కమిటీలు వేసినా తమకు ప్రయోజనం లేదని, ఊరు ఖాళీ చేయించి ఆస్పత్రి నిర్మించుకోవాలి తప్ప తాముండగా నిర్మాణం జరగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మహిళలు, గ్రామస్థులను అక్కడి నుంచి పంపించేశారు. -
మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
♦ ఒకే ప్రాంతంలో 9 నగరాలా? ♦ అన్ని ప్రాంతాలనూ సమంగా చూడాలని విపక్షం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రీకృత అభివృద్ధితో వచ్చిన సమస్యల్ని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అవే తప్పులు చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రాంతాల మధ్య అసమానతలను, అవసరాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చను టీడీపీ సభ్యుడు బీకే పార్థసారథి ప్రారంభిస్తూ రాయలసీమ ఎడా రిగా మారడానికి కాంగ్రెసే కారణమన్నారు. 9 నగరాలూ ఒకే చోట ఎందుకు? శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి మొత్తాన్నీ ఒకే చోట కేంద్రీకరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. పాత అనుభవాలను మరిచి చంద్రబాబు మళ్లీ అవే తప్పుల్ని చేస్తున్నారని, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో అన్ని రకాల నగరాలను నిర్మిస్తామని చెబుతున్నారని, ఇలా అయితే సమతులాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 9 నగరాలు అమరావతి ప్రాంతంలో కట్టే బదులు తమ ప్రాంతాన్ని రెండో రాజధానిగాచేసి హైకోర్టును అక్కడ పెట్టొచ్చుకదా? అని నిలదీశారు. ఇది అప్ అండ్ డౌన్ ప్రభుత్వమా? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం సూచిస్తున్న అభివృద్ధి ఆర్థిక నమూనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. విభజన నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదన్నారు. చివరకు పరిపాలన ఎక్కడి నుంచి సాగుతుందో కూడా ప్రజలకు అర్థం కావడం లేదని, మంత్రులు విజయవాడలో, అధికారులు హైదరాబాద్‌లో ఉంటూ ‘అప్ అండ్ డౌన్’ ప్రభుత్వంగా మారిందన్నారు. సమతులాభివృద్ధే ధ్యేయం: మృణాళిని అనంతరం చర్చకు మంత్రి మృణాళిని సమాధానం చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సమతులాభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ప్రాంతాల వారీగానే కాకుండా మండలాల వారీగా వెనుకబాటు తనాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్టు వివరించారు. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయబోమన్నారు. -
కలెక్టర్‌తో ఢీ
ఉపాధి నిధులతో రోడ్లకు ప్రతిపాదించిన కలెక్టర్ నాయక్ ఆయన పెత్తనాన్ని సహించలేకపోతున్న చైర్పర్సన్ శోభారాణి ముఖ్యమంత్రికి... రాష్ట్ర మంత్రికీ ఫిర్యాదులు గతంలోనూ మంత్రి మృణాళిని, ఎమ్మెల్సీ జగదీష్‌తోనూ రగడ వారితోనూ ఉపాధి నిధులపైనే యుద్ధం జెడ్పీ చైర్పర్సన్ ఉపాధి నిధుల పనులకోసం యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్‌ను ప్రత్యక్షంగా ఢీకొంటున్నారు. ఆ మాటకొస్తే... ఆమె స్వపక్షీయులతో... అంటే సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి మృణాళిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌తోనూ పోరాడారు. అదీ ఉపాధి నిధులపైనే... అసలు వీటిపైనే ఆమె ఎందుకు అంత పట్టుబడుతున్నారనేదే చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రావకపోవడమా...? ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులు తప్ప మరే అవకాశమూ లేకపోవడమా...? సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదవి అన్నాక పెత్తనం ఉండకపోతే ఎలా? ఏదో ఒకటి చేయకపోతే ఎవరు పట్టించుకుంటారని అనుకున్నారో ఏమో తెలియదు గాని ఉపాధి హామీ పథకం మెటీరియల్ పనుల విషయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కలెక్టర్‌తో యుద్ధం చేస్తున్నారు. తమ ఆమోదం లేకుండా, జెడ్పీ తీర్మానం తీసుకోకుండా మెటీరియల్ కాంపోనెంట్ పనులను మంజూరు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఈ పనులు జోరుగా సాగడం లేదని, సుమారు రూ. 200కోట్లు ఖర్చు కాకపోవడంవల్ల వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, అటు సీఎం, ఇటు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో కలెక్టర్ పనులు మంజూరు చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్‌కు ఆ అధికారం లేదంటూ వాదన కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనులను మాత్రమే కలెక్టర్‌కు మంజూరు చేసే అధికారాన్ని ఇచ్చారని, పూర్తిస్థాయి ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు మంజూరు అధికారం లేదని జెడ్పీ చైర్పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మెటీరియల్ పనుల విషయంలో మంజూరు చేసే పూర్తి అధికారాలు కలెక్టర్‌కు ఉన్నాయని, పనుల మంజూరు విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని అధికార వర్గాలు చెబుతున్నాయి. పైగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంటే సంతోషించాలే తప్ప అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని జెడ్పీ చైర్పర్సన్ సీఎం, మంత్రుల దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేశారని మొర పెట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. గతంలోనూ ఇదే తీరు గతంలో మంత్రి కిమిడి మృణాళినితో నువ్వానేనా అన్నట్టు ఢీకొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పోరు సాగించారు. గతేడాది జనవరిలో ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల కేటాయింపు విషయంలో మంత్రి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వాతిరాణి మధ్య పెద్ద వివాదమే నడిచింది. రూ.35కోట్లతో చేపట్టే ఈ పనులకోసం జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మండలాల వారీగా కేటాయించి, ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను కోరారు. మరోవైపు మంత్రి మృణాళిని కూడా మండలానికి రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. విషయం తెలుసుకున్న జెడ్పీచైర్‌పర్సన్ సీరియస్‌గా స్పందించారు. ఉపాధి పనుల కేటాయింపులో మంత్రి పెత్తనమేంటని, తాను వేరేగా నాయకుల నుంచి పనుల ప్రతిపాదనలు తీసుకోవడమేంటని మండిపడ్డారు. తమ శాఖ పరిధిలోకి వచ్చే నిధుల కావడం వల్లనే ప్రతిపాదనలు తీసుకున్నామని మంత్రి సమర్ధించుకున్నప్పటికీ వారిద్దరి మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగింది. జగదీష్‌తో ఒకసారి మంత్రితో పోరు సద్దుమణిగిన కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో ఇవే పనుల విషయంలో రగడ చోటు చేసుకుంది. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.5.29కోట్లు విలువ గల 30 పనుల్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రతిపాదించారు. కలెక్టర్‌కు తమ ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సై అన్నారు. తనకు తెలియకుండా, తన ద్వారా కాకుండా ఉపాధి పనుల్ని జగదీష్ ప్రతిపాదించడాన్ని చైర్పర్సన్ స్వాతిరాణి జీర్ణించుకోలేకపోయారు. జగదీష్‌తో పరోక్షంగా పోరుకు దిగారు. మొత్తమ్మీద స్వాతి రాణి పోరాటం ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి. -
అన్ని ప్రశ్నలకూ ఆయనే సమాధానం
► మంత్రుల్ని, చైర్‌పర్సన్‌ను ఓవర్టేక్ చేసే యత్నం ► అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ► విస్మయపరచిన ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరు ► మంత్రి మృణాళినికీ ఆగ్రహం తెప్పించిన వైనం సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్ సమావేశం మొత్తాన్ని ఆయన భుజస్కంధాలపైనే మోస్తున్నట్టు తెగ హడావుడి చేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ తానే సమాధానం చెప్పేందుకు యత్నించారు. అధికారులకూ వకాల్తా పుచ్చుకుని వారివ్వాల్సిన సమాధానాలనూ ఆయనే ఇచ్చేశారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఒక దశలో మంత్రి మృణాళిని సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేయడం విశేషం. ఆయనెవరో కాదు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు. అంగన్వాడీ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పోస్టుల్ని ఇష్టానుసారంగా అమ్ముకుని, అర్హులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతులు కూడా న్యాయబద్ధంగా జరగలేదని మరికొందరు నేతలు అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాబర్ట్స్ సమాధానం ఇవ్వాల్సి ఉన్నా అప్పలనాయుడు అడ్డుతగిలి అంగన్వాడీ నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని, ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదని వాదించారు. అధికారుల్ని అడిగితే ఈయన సమాధానం చెప్పడమేంటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరకుండానే బొబ్బిలి నియోజకవర్గంలో కొన్నిచోట్ల ఎన్నికలు జరిగిపోయినట్టు, తామే ఎన్నికైనట్టు కొందరు టపాసులు కాల్చుకుంటున్నారని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని, వాస్తవ పరిస్థితులేంటో చెప్పాలని ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఇరిగేషన్ అధికారి సమాధానం చెప్పే లోపు ఎమ్మెల్యే అప్పలనాయుడు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగాయని, ఎమ్మెల్యే రంగారావు చెప్పినది సరికాదని ఖండించారు. దీంతో ప్రతిపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామంపై ఆయనకేం తెలుసని, అన్నీ తానై మాట్లాడటం సరికాదని అభ్యంతరం చెప్పారు. దీనిపై ఇరిగేషన్ అధికారి వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయన కూడా ఎమ్మెల్యే చెప్పినదే వల్లెవేసి కూర్చోవడంతో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడితే ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లో తిరగలేరని, ఇబ్బంది పడతారని ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర హెచ్చరించారు. మరొక సందర్భంలో మంత్రి మృణాళిని మాట్లాడుతుండగా జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణితో సైగలతో మాట్లాడే యత్నం చేశారు. దీంతో మంత్రి అసహనంతో ‘ అప్పలనాయుడూ... సైగలు చేసి మాట్లాడొద్దు.. మీరిద్దరూ అలా మాట్లాడటం వల్ల డిస్ట్రబెన్స్గా ఉంటుంది. సమావేశం తప్పుదారి పడుతుంది’ అని గట్టిగాచెప్పారు. అనుకోని ఝలక్‌తో అప్పలనాయుడు షాక్ తిని వెనక్కు తగ్గారు. -
మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మద్యం దుకాణాలు బంద్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు. తాము లాభాలను కోల్పోయి వ్యాపారం చేస్తుంటే మంత్రి తమను తప్పుబట్టడం తగదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మృణాళిని... ఎంఆర్పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని ఎక్సైజ్ అధికారులపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వ్యాపారులపై మండిపడ్డారు. ఇలా అయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలతో మద్యం వ్యాపారులు ఆవేదన చెందారు. జిల్లా వ్యాప్తంగా 202 దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. తమకొస్తున్న 18 శాతం కమీషన్లో 16 శాతం ప్రభుత్వానికి లెసైన్సు రూపేణా చెల్లిస్తున్నామని, రెండు శాతం లాభంతో వ్యాపారం చేయలేమని, మా డబ్బులను రిఫండ్ ఇస్తే మద్యం అమ్మకాలకు స్వస్తి చెబుతామని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగతా 12జిల్లాలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతున్నారని, అటు వైపు ఒకసారి చూడాలని, అక్కడి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వాపోయారు. బొబ్బిలిలోనైతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద డివిజన్ వ్యాపారులంతా నిరసన తెలియజేశారు. తమపై మండిపడుతున్న మృణాళిని... తన సొంత ఊరులో ఎంఆర్పీకి మించి జరుగుతున్న విక్రయాల్ని, బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారులే వ్యాపారులతో టెండర్లు వేయించడం వల్ల నూటికి నూరుశాతం దుకాణాలకు వేలం పాటలు జరిగాయని చెప్పారు. ఏజెన్సీలో అమ్మకాలు చేయలేని పరిస్థితి ఉన్నా అధికారులు బలవంతంగా మాతో దుకాణాలు నడిపిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తెలిసి మంత్రి సీరియస్ అయ్యారో మరేంటో గాని దుకాణాలు మూసేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం తరువాత ఒక్కొక్కరూ దుకాణాలు తెరిచారు. ఉదయం వరకూ దుకాణాలను బంద్ చేయడం వల్ల రూ.50 లక్షలమేర వ్యాపారం నిలిచిపోయింది. -
మంత్రి మృణాళినిపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు రాజుకుంటోంది. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి మృణాళినిపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల యత్నించి విఫలమైన ఆమె వ్యతిరేక వర్గీయులు ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వడంతో మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలిసింది. తాము సూచించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకునేందుకు జిల్లా తమ్ముళ్లు గురువారం హైదరాబాద్ బయలుదేరారు. పనిలో పనిగా డీసీసీబీ బినామీ రుణాల బాగోతం పైనా చంద్రబాబుకు వివరించనున్నారు. మరో పక్క వారేం చెబుతారో చూద్దామనే ధోరణిలో మంత్రి వర్గీయులు ఉన్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి వర్గీయులే కాకుండా, వివిధ పనులపై జిల్లాలోని పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోరడంతో వారందరితో శుక్రవారం ఉదయం చంద్రబాబు మాట్లాడనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర ఆధ్యక్షురాలు శోభ హైమావతి, జెడ్పీ చైర్పర్సన్ భర్త గణేష్‌లు చంద్రబాబును కలిసేందుకు వెళ్లినవారిలో ఉన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్ బయలుదేరిన వారిలో చాలా మంది మంత్రి కిమిడి మృణాళినే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు వెళ్తున్నారని సమాచారం. జిల్లాలో తమకు తెలియకుండా బదిలీలు జరుగుతున్నాయనీ, బదిలీలు జరిగిపోయిన తరువాత తాము తెలుసుకోవాల్సి వస్తోందని పలువురు నేతలు ఆవేదన చెందుతున్నారు. అంతే కాకుండా తాము సూచించిన మండలాల్లో తహశీల్దార్లను నియమించడం కానీ, బదిలీ చేయడం కానీ చేయలేదని మంత్రి వ్యతిరేక వర్గీయులు వాపోతున్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్ కూడా తాము చెప్పిన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, దీనికి కూడా మంత్రే కారణమనీ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ వర్గమంతా తమ ఇబ్బందులను చంద్రబాబుకు చెప్పకునేందుకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశం సందర్భంగా ప్రయత్నించినా వీలుపడ లేదు. అయితే తెలివిగా వ్యవహరించిన మంత్రి మృణాళిని వీరికన్నా ముందుగా సీఎంను కలిసి ఇక్కడి విషయాలను పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం. శుక్రవారం తనను కలుసుకునేలా జిల్లా నేతలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తహతహలాడుతున్నారు. పనిలో పనిగా ఇటీవల డీసీసీబీలో బయటపడిన బినామీ రుణాల వ్యవహారాన్ని కూడా చంద్రబాబుకు వివరించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. తాజా పరిస్థితిని వివరిస్తూ , తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో చెప్పేందుకు వెళ్తున్నారని తెలిసింది. చూద్దామంటున్న మంత్రి వర్గీయులు అసంతృప్తి నేతలు చంద్రబాబుతో భేటీ కావడంపై మంత్రి వర్గీయులు కూడా దీటుగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఎందుకు కొన్ని విషయాల్లో తటస్థంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేసే కారణాలను కూడా వీరు సిద్ధం చేసుకున్నట్టు భోగట్టా. అసమ్మతి వర్గీయులు చేస్తున్న అవినీతి కార్యకలాపాలు కూడా వివరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సీఎం వివరణ కోరితే తమ వాదనను వినిపిస్తామంటున్నారు. -
సీఎంను ముందే కలిసిన మంత్రి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నాయకులంతా సిద్ధమై విజయవాడ వెళ్లగా, ఈలోపే హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అసమ్మతివాదులందరికీ మంత్రి మృణాళిని ఝలక్ ఇచ్చారు. అసమ్మతి వాదులు ఫిర్యాదు చేయాలనుకున్న విషయాలపై తన తప్పులేదన్న కచ్చితమైన ఆధారాలతో వివరించినట్టు మంత్రి తెలిసింది. నేతల గూడు పుఠాణి, బదిలీలపై నేతల వైఖరీని స్పష్టంగా తెలియజేసినట్టు సమాచారం. అన్నీ విన్న చంద్రబాబు మీ పద్ధతిలోనే వెళ్లాలంటూ సూచించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ మాట చెల్లుబాటు కావడం లేదని మంత్రి మృణాళినిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీలోని కీలక నాయకులు తీవ్ర అసంతృప్తితో అటు అధినేతకు, ఇటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈమేరకు వారంతా బుధవారం సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్లారు. గురువారం జరిగే రాష్ట్ర పార్టీ సర్వ సభ్య సమావేశంలో తమకెదురైన పరిణామాలు, అవమానాలను తెలియజేసి తద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ఇవన్నీ పసిగట్టిన మంత్రి మృణాళిని ముందే అప్రమత్తమై సీఎం చంద్రబాబునాయుడిని బుధవారం సాయంత్రమే కలిశారు. ఒక్కొక్కరి అవినీతి చిట్టాను, అక్రమ వ్యవహారాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ముఖ్యంగా సెటిల్మెంట్ దందాలు, ఇతరత్ర వసూళ్లుపై క్లుప్తంగా వివరించినట్టు తెలియవచ్చింది. బదిలీల విషయానికొచ్చేసరికి డ్వామా పీడీ, డీఆర్డీఎ పీడీ పోస్టుల తప్ప మిగతా వాట్లో తమ ప్రమేయమేది లేదని, ఆయా మంత్రులే బదిలీలు చేసుకున్నారని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. డ్వామా, డీఆర్డీఎ పీడీలుగా నియమితులైన ఢిల్లీరావు, ప్రశాంతిలను వారి పనితీరు ఆధారంగా నియమించామని చెప్పినట్టు తెలిసింది. వారిద్దరి పనితీరు విషయంలో ఉన్నతాధి కారులు సంతృప్తి చెందడం వల్లే జిల్లాకు తెచ్చుకున్నామంటూ వివరించినట్టు తెలుస్తోంది. ఇక, ఏజేసీ, ఆర్డీఓలకు రిటెన్షన్ ఇవ్వాలని కోరుతూ అసమ్మతిరాగం విన్పిస్తున్న ఎమ్మెల్యేలంతా లేఖలిచ్చారని, వాటిని ఆధారంగా చేసుకుని సంబంధిత శాఖామంత్రులు సానుకూలంగా స్పందించారన్న విషయాన్ని కూడా తెలియజేసినట్టు సమాచారం. మిగతా అధికారుల బదిలీల విషయంలో తమకెటువంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది.అన్నీ విన్న తర్వాత చంద్రబాబు స్పందిస్తూ తమకు ఇంటిలీజెన్స్ నివేదికలు ఉన్నాయని, ఎవరేంటో తెలుసని, మీ పద్ధతిలో ముందుకెళ్లాలని మంత్రి మృణాళినికి సూచించినట్టు విశ్వసనీయ ంగా తెలిసింది. అయితే, మంత్రి వద్ద ఈ విధంగా స్పందించిన చంద్రబాబునాయుడు గురువారం అసమ్మతివాదులు కలిసిన తర్వాత ఎలా మాట్లాడుతారో చూడాలి. మృణాళిని చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని అసమ్మతివాదులకు క్లాస్ తీసుకుంటారా...? లేదంటే అసమ్మతివాదులు చెప్పిన దానికి కరిగిపోయి తిరిగి మంత్రిని హెచ్చరిస్తారేమో చూడాలి. మొత్తానికి టీడీపీ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. -
ట్రాన్స్‌వార్ !
అధికారుల బదిలీలు జిల్లా టీడీపీలో పెట్టిన చిచ్చు తార స్థాయికి చేరింది. మాటల యుద్ధం కాస్తా, అధినేతకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. మంత్రి తమను ఖాతరు చేయడం లేదంటూ అసంతృప్తి వాదులు మండిపడుతున్నారు. విజయవాడలో జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేసి, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాలో జరిగిన వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీలు టీడీపీలో కాక పుట్టించాయి. మంత్రి మృణాళిని తనకు ఇష్టమైన వారిని తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. బదిలీల్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు సంధిస్తున్నారు. ఎవరేమనుకున్నా మంత్రి మృణాళిని పట్టించుకోవడం లేదు. బదిలీల పై వస్తున్న విమర్శలపై కనీసం స్పందించలేదు. దీంతో అసమ్మతి నేతలు భగ్గుమంటున్నారు. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉద్వేగంతో ఊగిపోతున్నారు. కీలక అధికారుల బదిలీలు జరిగి వారం రోజులు కావస్తున్నా నేతల మధ్య లొల్లి చల్లారడం లేదు. గురువారం విజయవాడలో జరిగే రాష్ట్ర పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సిద్ధమయ్యారు. ఈమేరకు జిల్లా నేతలంతా పయనమవుతున్నారు. విభేదాలకు కారణాలివి... అనంతపురంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డి.రమణమూర్తిని జిల్లా పరిషత్ సీఈఓగా నియమించాలని, ఆయన కాని పక్షంలో ఇక్కడ పనిచేసిన మోహనరావునే కొనసాగించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి లేఖ ఇచ్చారు. కానీ ఆ లేఖల్ని పరిగణలోకి తీసుకోకుండా పాడేరు ఆర్డీఓగా పనిచేసిన గనియా రాజకుమారిని నియమించారు. దీంతో టీడీపీ నేతలంతా ఆశ్చర్యపోయారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు బావ అయిన వెంకటేశ్వరరావును డ్వామా పీడీగా నియమించాలని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలిచ్చారు. ఆయన్ని కాదని తొలుత కళ్యా ణ చక్రవర్తిని నియమించారు. ఆయనకిచ్చిన ఉత్తుర్వుల్ని రద్దు చేసి తాడ జాగా ప్రశాంతిని నియమించారు. డీఆర్డీఎ పీడీగా విశాఖపట్నంలో పనిచేస్తున్న వెంకటరావును ఇక్కడ నియమించాలని మరికొందరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. వాటిని కూడా పక్కన పెట్టేసి ఢిల్లీరావును నియమించారు. ఇక బదిలీ కావల్సిన ఆర్డీఓ వెంకటరావును, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావును ఉద్దేశపూర్వకంగా ఇక్కడే ఉంచారని, బదిలీ చేయాలన్న తమ ప్రతిపాదనలను లెక్కలోకి తీసుకోలేదని మరికొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తహశీల్దార్ల బదిలీలు కూడా మంత్రి ఇష్టపూర్వకంగా జరిగాయని కొందరు ప్రజాప్రతినిధులు ఆవేదనతో ఉన్నారు. కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తమ సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మంత్రి చెప్పినట్టే నడుచుకుంటున్నారని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకాలు, పోస్టుల కేటాయింపుల విషయంలో తమకు విలువ ఇవ్వలేదని మరికొందరు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విధంగా తమకెదురువుతున్న అవమానాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన బదిలీలన్నింటిపైనా అటు అశోక్ గజపతిరాజుకు, ఇటు సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేయాలన్న ఆత్రుతతో అసంతృప్తి వాదులంతా ఉన్నారు. కాంగ్రెస్‌కు అనుకూల వ్యక్తులను తీసుకొచ్చి, తన మార్కు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయా న్ని అధినేతల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి మం త్రి మృణాళిని లక్ష్యంగా చేసుకుని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమెను కూడా అంతగా పట్టించుకోవడం లేదు. ఇందుకు విశాఖపట్నంలోని కైలాసగిరిలో గిరిజన యూనివర్సిటీ కోసం సీఎం చంద్రబాబును కలిసినప్పుడు మృణాళిని అందరిలో చివర నిలబడ్డారు. ఆ ఫోటో చూస్తే మంత్రిపై టీడీపీ నేతలకున్న గౌరవమేంటో స్పష్టమవుతోంది. ఏదైతేనేమి తమ ఆవేదన, అక్కసు వెళ్లగక్కేందుకు విజయవాడలో జరిగే రాష్ట్ర పార్టీ సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు అసమ్మతి నేతలంతా కూడబలుక్కుని బయలుదేరుతున్నారు. పనిలో పనిగా గిరిజన యూనవర్సిటీ తరలిపోవడంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, తమకెదురవుతున్న అవమానాలు, జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూడా అశోక్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి, యూనివర్సిటీ జిల్లాకొచ్చేలా ఒత్తిడి చేసే యోచనలో ఉన్నారు. అయితే, అక్కడికెళ్లాక సాహసం ప్రదర్శిస్తారో లేదో చూడాలని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఎంతసేపు ఇక్కడేనని, అధినేతల వద్ద ఆవేదన వెళ్లగక్కే ధైర్యం లేదని చెప్పుకొస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం పార్వతీపురం : తోటపల్లి నిర్వాసిత గ్రామాల్లోని ఆర్అండ్ఆర్ సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి ఆదే శించా రు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో పలు శాఖల అధికారుల తో సమావేశమయ్యారు. నిర్వాసిత గ్రామాల్లో ముందుగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణాలు, విద్యుత్, తాగునీరు, మౌలిక వసతులపై దృష్టి సారించాలని చెప్పారు. -
అధికారులను అప్రమత్తం చేశాం: మంత్రి మృణాళిని
-
మంత్రి ఇలాకా అని గుర్తులేదా?
మెరకముడిదాం: సాక్షాత్తు మంత్రి ఇలాకా అని తెలిసినప్పటికీ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు మెరకముడిదాం పీహెచ్‌సీపై అలక్ష్యం వహిస్తున్నారు, ఇక్కడి వైద్యాధికారిని మరో ప్రదేశానికి డిప్యుటేషన్‌పై పంపించేశారు. ఫలితంగా ఈ పీహెచ్సీలో వైద్యసేవలు అందడం గగనమైపోయింది. మండల కేంద్రమైన మెరకముడిదాం పీహెచ్సీ వైద్యాధికారిగా ఎస్.మాధురి కొద్ది కాలంగా పని చేస్తున్నారు. ఆమె వచ్చి మూడు నెలలు కూడా కాకముందే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెను ఎల్.కోట పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో ఆమె ఈనెల 4వతేదీ నుంచి పీహెచ్‌సీకి రావడం లేదు. వైద్యులు లేకపోవడంతో పీహెచ్సీలో వైద్యసేవలను ఇక్కడి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న అన్నామణి అందిస్తున్నారు. వాస్తవానికి మెరకముడిదాం పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఒక్క వైద్యాధికారే ఉన్నారు. రెండో ైవె ద్యాధికారి పోస్టు కొన్నేళ్లగా ఖాళీగానే ఉంది. జిల్లా అధికారులు రెండో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తారని అంతా ఆశిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఉన్న ఒక్క వైద్యాధికారికీ డిప్యుటేషన్ వేయడంతో విస్తుపోతున్నారు. ఈ పీహెచ్సీలో నిత్యం వందలాది మంది రోగులు వైద్యసేవలు పొందుతూ ఉంటారు. అలాంటి పీహెచ్సీలో ఉన్న ఒక్క వైద్యాధికారినీ మరో పీహెచ్‌సీకి డిప్యుటేషన్ వేయడం దారుణమని, మెరకముడిదాం పీహెచ్సీ పరిధిలోని రోగులను గాలికి వదిలేద్దామని జిల్లా అధికారులకు అనిపించిందో ఏమోనంటూ స్థానికులు ఆశ్చర్యం వెళ్లగక్కుతున్నారు. ఇంత జరిగినా అటు మంత్రి మృణాళిని కానీ, ఇటు స్థానిక పాలకులకు కానీ చీమకుట్టినట్లు అయినా లేకపోవడం చూస్తున్న పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పీహెచ్సీలో ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ జిల్లావైద్యాధికారులకు చిన్న చూపెందుకో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండాల్సిన ల్యాబ్టెక్నీషియన్ను గర్భాం, దత్తిరాజేరు పీహెచ్‌సీలకు డిప్యుటేషన్‌పై వేశారు. ఈ విషయమై మంత్రి మృణాళిని కల్పించుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిన వైద్యాధికారిణి మాధురి డిప్యుటేషన్‌ను రద్దు చేయించి కనీసం ఆమె ఒక్కరినైనా మళ్లీ ఇక్కడ వైద్యాధికారిగా నియమించాలని పలువురు కోరుతున్నారు.