Minister prattipati
-
మిర్చి మంట
ఆగని ధరల పతనం.. సర్కారు మీనమేషాలు మిరప రైతు కడుపు రగిలిపోతోంది. ఏ అన్నదాతను కదిలించినా ఒకటే ఆవేదన.. సాయం చేస్తుందనుకున్న సర్కారే.. వ్యాపారులను మించిన లెక్కలు వేస్తోంది. నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక అయినకాడికి సరుకును తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిర్చి యార్డులో ఖాళీ లేక, ఆరుబయట నిల్వ ఉంచితే అకాల వర్ష భయం రైతన్న గుండెను తొలిచేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో: సరుకును ఇంట్లో ఉంచుకోలేక, మార్కెట్ యార్డుకు తెచ్చి వ్యాపారులు అడిగిన ధరకు అమ్మలేక మిర్చి రైతులు అయోమయంతో తల్లడిల్లిపోతున్నారు. మిర్చిని ఇంట్లో ఉంచితే వేడికి రంగు మారుతుందని, కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసి పోతుందనే బెంగ రైతన్నను పట్టిపీడిస్తోంది. నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజిలు అందుబాటులో లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొస్తే.. వ్యాపారులు, మార్కెటింగ్ పాలక వర్గం చుక్కలు చూపుతోంది. సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు నిల్వ అధికంగా ఉందనే సాకు చూపి వ్యాపారులు ధరలు పడిపోయేలా చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామ మాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ‘కాయలు పాడయిపోతున్నాయయ్యా.. ఇంట్లో ఉంచితే రంగు మారుతున్నాయి.. కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసిపోతాయి.. తేజ మేలు రకం కాయలు మొదటి కోతయ్యా.. ఇంతకు మునుపు క్వింటాలు రూ.6000 కు అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వ బోనస్ వస్తుందని ఇక్కడకు తెస్తే, ఇక్కడ క్వింటా రూ.3500 – 4000కు మించి కొనుగోలు చేయడం లేదు. మీరే న్యాయం చేయండి’ అంటూ గుంటూరు మార్కెట్ యార్డులో శుక్రవారం ఉదయం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యార్డులో 7 లక్షల టిక్కీల సరుకు.... రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతుకు 20 క్వింటాలు, క్వింటాకు రూ.1500 బోనస్ ప«థకమే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.5000 గురించి ఆలోచించడం లేదు. రైతులు అందోళన చెందాల్సిన పని లేదని, జూలై చివరి వరకు మిర్చిని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం ఉదయం స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన సరుకును ఇక్కడే ఉంచి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు వ్యాపారులు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మక్కై ధరలు తగ్గించి అడుగుతున్నారు. దీంతో శుక్రవారం వచ్చిన 3.5 లక్షల టిక్కీలు, బయట 3.5 లక్షల టిక్కీలు.. మొత్తం 7 లక్షల టిక్కీల సరుకు ఉన్నట్లు సమాచారం. యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం మళ్లీ సరుకు అదనంగా వస్తే తిప్పలు తప్పవు. రూ.3 వేలకు కూడా కొనడం లేదు నేను మిర్చి యార్డుకు ఐదు క్వింటాళ్ల మిర్చిని తీసుకొచ్చా. ‘రాయితీ పథకం కింద వద్దు.. మామూ లుగా సరుకు అమ్ముకొని పో.. లేదంటే రెండు నెలల వరకు డబ్బులు రావు’ అని వ్యాపారులు చెబుతున్నారు. ‘తేజ’ రెండో కోత కాయలు క్వింటాలు రూ.3000కు కూడా అడగటం లేదు. ఇలాగైతే రైతుల గతేంటి? – బెల్లం అంజనేయలు, చీమకుర్తి రవాణా ఖర్చులూ రావట్లేదు మొన్నటి వరకు క్వింటాలు రూ.4000 – 5000 అమ్మిన మిర్చి.. ఇప్పుడు రూ.1500 – 2000కు కూడా అడగటం లేదు. రైతు పరిస్థితి దారుణంగా మారింది. ఆదుకునే నాథుడే లేరు. కోత కూలీల మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదు. – కేతవత్ గాసిరాం, హసన్‌బాద్ తాండ, మాచర్ల ఐదు కేంద్రాల్లో మిర్చి కొనుగోళ్లు శని, ఆదివారాల్లో గుంటూరు జిల్లా నడికుడి, వినుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, కర్నూలు, ఒంగోలులో మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా అనందబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నందిగామ, నడికుడిలో శనివారం నుంచి, ఇతర ప్రాంతాల్లో ఆ తర్వాత మిర్చి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ మార్కెట్లలో మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రవాణా చార్జీల్లో రాయితీ, అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. కాగా, గుంటూరు మిర్చి యార్డుకు మే 16 నుంచి జూన్ 4 వరకు సెలవులు ప్రకటించారని, అయినా శని, ఆదివారాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 రాయితీ పథకం ద్వారా ఇప్పటి వరకు 6,500 మంది రైతుల నుంచి 1.10 లక్షల క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోళ్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. క్వింటాల్‌కు మద్ధతు ధర రూ.8 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు వెల్లడించింది. సమీక్షలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మిర్చి యార్డు చైర్మెన్ మన్నవ సుబ్బారావు, జెసీ – 2 ముంగా వెంకటేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి దివాకర్, ఏడీ వరలక్ష్మి, పోలీసు, రవాణా, కార్మిక శాఖల అధికారులు, ఎగుమతి వ్యాపారుల సంఘం నాయకుడు దుగ్గిరాజు, హమాలీల సంఘం నాయకుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
మమ్మల్ని పట్టించుకోవడం లేదు
సాక్షి, విజయవాడ : ‘దుర్గగుడి అధికారులు పనితీరు ఏ మాత్రం బాగాలేదు. తిరుమలలో ఎమ్మెల్యే లెటర్ హెడ్‌పై రోజుకు ఏడుగురు భక్తులను అనుమతిస్తున్నారు. దుర్గగుడిలో మాత్రం మా లెటర్స్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మేము అధికార పార్టీలో ఉన్నామా... ప్రతిపక్షంలో ఉన్నామా.. మాకే అర్థం కావడం లేదు..’ అంటూ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యాన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దుర్గగుడి అధికారులు ఏ మాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదని, దీనివల్ల తాము కార్యకర్తల వద్ద పలుచనైపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి పుల్లారావు వెంటనే స్పందించి దుర్గగుడి ఈవో ఎ.సూర్యకుమారిని పిలిపించేందుకు ప్రయత్నించగా.. ఆమె వెలగపూడిలోని సెక్రటేరియేట్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో మంగళవారం దుర్గగుడి అధికారులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. నగరంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు చేసుకునే వ్యాపారులకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంత్రి దృష్టికి తెచ్చారు. దీన్ని సాధ్యమైనంత తర్వగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్‌ను మంత్రి ప్రత్తిపాటి ఆదేశించారు. రికార్డ్ డ్యాన్స్‌లకు అనుమతివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో సంబరాలు, ఉత్సవాల సమయంలో రికార్డింగ్ డాన్స్‌లకు అనుమతించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. అశ్లీలతకు తావులేకుండా డ్యాన్సులను అనుమతిస్తామని నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ హామీ ఇచ్చారు. పెనమలూరు, పోరంకిలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేసేటప్పుడు ముందుగా తమకు సమాచారం ఇవ్వాని ఎమ్మెల్యేలు మంత్రులను కోరారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, సబ్ కలెక్టర్ సుజన తదతరులు పాల్గొన్నారు. -
మంగళగిరిలో ఎయిర్‌పోర్టు.. విశాఖలో గోల్ఫ్ కోర్సు
- రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం - ఉడీ కాల్పుల్లో మృతిచెందిన జవాన్లకు శ్రద్ధాంజలి సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త రాజధాని అమరావతికి అతిసమీపంలో మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రి మండలి వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు, విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలో పీపీపీ పద్ధతిన ప్రైవేట్ విద్యా సంస్థలకు భూములను కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. శుక్రవారంలోగా పరిహారం అందేలా ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. జమ్ముకాశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ పరిధిలో సైనిక్ శిబిరంపై తీవ్రవాదుల నరమేధాన్ని కేబినెట్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ ఘటనలో శత్రుమూకలను తరిమికొట్టిన సైనికులను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించింది. మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మెరైన్ అవుట్ ఫాల్ పైప్‌లైన్ నిర్మాణంలో నష్టబోయిన నిర్వాసితులకు జీవో ఎంఎస్ నెంబర్ 68 ప్రకారం రూ. 61 కోట్ల ప్రత్యేక బడ్జెట్ మొత్తాన్ని పరిహారంగా మంజూరుకు అనుమతి. ఏపీఐఐసీ చెల్లించే ఈ ప్యాకేజీ ఐదు వేల కుటుంబాలకు వర్తిస్తుంది. ► పశుసంవర్థక శాఖలో స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం. ► విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి, ఉలిభద్ర గ్రామాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలకు 90 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల మంజూరుకు ఆమోదం. ► మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం. విశాఖ విమానాశ్రయం నుంచి 60 శాతం ఎయిర్ ట్రాఫిక్ పెంచాలని, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలని నిర్ణయం. ► విశాఖ జిల్లా అడవివరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్థతిలో ఇంటర్నేషనల్ స్కూల్‌ను అభివృదికి తగిన అభివృద్ధిదారుగా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా ఎడ్యుకేషనల్ సొసైటీలతో కూడిన కన్సార్షియం ఎంపిక చేయడానికి అనుమతి. ► జిల్లా స్థాయి టూరిజం కౌన్సిళ్లు. గోల్ఫ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం విశాఖ జిల్లా ముదసరిలోవలో 12.71 ఎకరాల పురపాలకశాఖ భూమిని మెస్సర్స్ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌కు కేటాయింపు. పట్టణ ఇళ్ల పథకంలో సబ్సిడీ: నారాయణ పట్టణ ప్రాంతాల ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు లబ్ధిదారుల పేరిట బ్యాంకులోన్లు ఇప్పించి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణానికి సొంత భూమి ఉన్న లబ్ధిదారులకు కేం ద్రం లక్షన్నర, రాష్ట్రం మరో లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. -
భావదేవరపల్లిలో మత్స్య పరిశోధన కేంద్రం
భావదేవరపల్లి (నాగాయలంక) : గ్రామంలో మత్స్య పరిశోధన, ఉప్పు నీటì æపరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని రాష్ట్రవ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం–మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.81 లక్షలతో నిర్మించిన రైతుశిక్షణ కేంద్రం, విశ్రాంతి గదుల భవనాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలసి మంత్రి ప్రత్తిపాటి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. చేపల వేట విరామ కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం అందలేదని పలువురు మత్య్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయడంతో, పుష్కరాలు ముగిసిన వెంటనే ఉన్నతాధికారులను పిలిపించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని, విద్యార్థుల సీట్లసంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పేర్కొన్నారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మత్య, ఉప్పునీటి పరిశోధన కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఫిషరీస్ కాలేజీ, రైతుశిక్షణ æకేంద్రాలు దివిసీమ మానసపుత్రికలుగా అభివర్ణించారు. ఉప్పునీటి చేపల ప్రదర్శన నాగాయలంక కేజ్‌కల్చర్ శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్, విద్యార్థులతో కలసి ఏర్పాటు చేసిన 15 రకాల ఉప్పునీటి చేపల ప్రదర్శనను మంత్రి ప్రత్తిపాటి తిలకించారు. కళాశాల ప్రాంగణంలోని చెరువులలో వనామి జాతి రొయ్యపిల్లలు, రాగండి చేపపిల్లలను మంత్రి, ఉపసభాపతి వదిలారు. బాలబాలికల వసతిగృహాల మొదటి అంతస్తుకు శంకుస్థాపన కూడా చేశారు. ఎస్వీవీయూ ఫిషరీస్సైన్స్ డీన్ టి.వి.రమణ, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ మండలి బేబీసరోజినీ, ఎంపీటీసీ సభ్యులు బొండాడ గణపతిరావు, తలశిల స్వర్ణలత, నీటిసంఘం అధ్యక్షుడు మండలి ఉదయభాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీరభద్రరావు పాల్గొన్నారు. -
సీఎం ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా..
* మంత్రి ప్రత్తిపాటికి రాజధాని రైతు స్పష్టీకరణ * భూములిచ్చిన వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి భూములు ఇచ్చిన తమను అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని తగలబడతానని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన రైతు దాసరి కృష్ణ హెచ్చరించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆయనీ హెచ్చరిక చేయడం గమనార్హం. గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆవేదనతో మాట్లాడిన కృష్ణ ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించారు. భూములిచ్చిన రైతుల్ని తహసీల్దార్, ఎంపీడీవో ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని, అయినా మీరు అధికారులను అడగడం లేదని మంత్రిని నిలదీశారు. కృష్ణ ఆవేదనకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. మంత్రి మాత్రం ‘నీ ఆవేదన ఏమిటో నాకు అర్థమైంది, నేను తర్వాత మాట్లాడతా కూర్చో’ అంటూ బుజ్జగించారు. -
‘సాక్షి’పై పరువునష్టం దావా
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూములు కొనుగోళ్ల కథనాలపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ‘సాక్షి’ పత్రికపైన, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. తాము కొనుగోలు చేయని భూములను కొన్నట్లుగా ‘సాక్షి’లో వార్తలు రాశారని, దీంతో తమ భూముల ధరలు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని వారు చెప్పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై తాము పరువు నష్టం దావా వేయటంతోపాటు నోటీసులు పంపిస్తున్నామన్నారు. ‘సాక్షి’ పత్రికపై క్రిమినల్ కేసులు కూడా పెడతామన్నారు. తాను మూడువేల ఎకరాలు కొనుగోలు చేశానని, దాని విలువ రూ.పదివేల కోట్లని రాశారని మంత్రి నారాయణ అన్నారు. -
అన్నీ ఆవిష్కరణలే
హ చిలకలూరిపేటలో రూ.517.51 కోట్ల పనులకు పునాది హ హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పర్యటన గురువారం ‘అన్నీ ఆవిష్కరణలే’ అన్నట్టుగా సాగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం రూ. 517.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పైలాన్లు ఆవిష్కరించారు. తొలుత హెలికాప్టర్ దిగిన సీఎం, కేంద్రమంత్రి పురుషోత్తమపట్నం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్డిని పరిశీలించారు. రూ.23.08 కోట్లతో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్ పథకం’కు సంబంధించిన పైలాన్‌ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా ప్రకటించారు. శారద హైస్కూల్ రోడ్డులో రూ.1.40 కోట్లతో ఆధునికీకరించిన శ్మశానవాటిక శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవన సముదాయాన్నీప్రారంభించారు. పట్టణ మౌలిక వసతులు, మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ.143 కోట్లతో చేపట్టనున్న పనుల కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలి... ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద రూ.248.16 కోట్లతో 52.66 ఎకరాల్లో 4,512 జీప్లస్ -3 గృహ నిర్మాణ పనులకు సంబంధించి నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దీని పక్కనే రూ. 15 కోట్లతో చేపట్టే కల్చరల్ అకాడమీ హాలు, రూ.2.16 కోట్లతో శ్మశానాల అభివృద్ధి పనులు, 13వ ఆర్థిక సంఘం, ప్రణాళిక, ప్రణాళికేతర, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, మున్సిపల్ నిధులతో రూ.20.16 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకు లింకేజీ రుణాలు రూ.65.95 కోట్లకు సంబంధించిన చెక్కును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. రూ. 45 కోట్లు కేటాయించాలి : మంత్రి ప్రత్తిపాటి సీఎం కాన్వాయ్ కళామందిర్ సెంటర్‌కు చేరుకోగానే మక్కామసీదు వద్ద వేచి ఉన్న అంజుమన్ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని వెండి కిరీటాలతో సత్కరించారు. అండర్ డ్రైనేజీ విధానానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో 33 గ్రామాలకు మంచినీటి కొరత లేకుండా చే సేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా కోరారు. -
అట్టహాసంగా రైతుకోసం చంద్రన్న
విజయవాడ : స్థానిక ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘రైతు కోసం చంద్రన్న’ కార్యక్రమం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు జిల్లా నలుమూలల నుంచి రైతులను అధిక సంఖ్యలో తరలించారు. ఐదు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సభలా కాకుండా పార్టీ సదస్సులా నిర్వహించారు. మంత్రులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సబంధంలేని వ్యక్తులను వేదికపై కూర్చోబెట్టి ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేందుకు వేదికగా మార్చుకున్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజ యాల కంటే ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యకార్యకర్తలు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఇస్తామని ప్రకటించిన వివిధ శాఖల ఉన్నతాధికారులు బహిరంగ సభ జరిగిన తీరు చూసి పక్కకు వెళ్లిపోయారు. దీంతో కార్యక్రమం ఆసాంతం రాజకీయ వేదికగా, ఎన్నికల సభలా కొనసాగింది. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరై 117 మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.774.76 లక్షల విలువైన వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ నుంచి 58 మంది రైతులకు రూ.2 కోట్ల విలువైన యంత్రాలను అందజేశారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో లైవ్‌స్టాక్ యూనిట్లు, ఉద్యాన శాఖ అధికారులు ఫామ్ ఫ్రెష్ విజిటబుల్స్కు రుణ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వందకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ తదితరులు ఈ స్టాళ్లను సందర్శించారు. సంక్షేమ పథకాలపై సమాచార పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రులతో పాటు రైతులు కూడా తిలకించారు. రైతు నాయకులు చలసాని ఆంజనేయులు, ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 వేల మంది రైతులకు వాయిస్ మెసేజ్‌లు రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో వ్యవసాయశాఖ జిల్లాలో 50 వేల మంది రైతులకు నిత్యం వాయిస్ మెసేజ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రూపొందించింది. కలెక్టర్ బాబు.ఎ చొరవతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రత్తిపాటి ప్రారంభించారు. వ్యవసాయశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్ రూపంలో సలహాలు, సూచనలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీ దరఖాస్తుల స్వీకరణ రుణమాఫీ అందని రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందజేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ కుటుంబరావు రైతుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులు అందరికీ రుణామాఫీ అమలు చేస్తామన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి కొరిటెపాడు (గుంటూరు) : నకిలీ విత్తనాల విక్రయ దుకాణాలు, కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు వుండటానికి వీలులేదన్నారు. గుంటూరులోని కాటన్ అసోసియేషన్‌లో శనివారం ఆయన ఎ.పి కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై రైతులు తీసుకోవాల్సిన చర్యలుపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వేసి రైతులు నష్టపోరాదని, సర్టిఫై చేసిన, బ్రాండెడ్ కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేయాలని, టెక్నికల్‌గా సమస్య వున్న విత్తనాలను సీజ్ చేయరాద న్నారు. అలా చేస్తే విత్తన సమస్య వస్తుందని తెలిపారు. లెసైన్సు లేకుండా అనధికారికంగా విక్రయించే విత్తన షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీఐ ప్రత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ, విజిలెన్స్ అధికారుల నుంచి నివేదికరాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రంలో రెండు లక్షల బోర్లు వేసి 10 లక్షల ఎకరాలను అధనంగా సాగులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఎ.పి. కాటన్ అసోసిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందిమళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విత్తన కొనుగోళ్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 3 లక్షల కరపత్రాలను ముద్రించామని, వీటిని 13 జిల్లాల్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి రామారావు, సభ్యులు పాల్గొన్నారు. -
పదవుల కోసం పోటా పోటీ
►నామినేటెడ్ పోస్టులపై టీడీపీ, బీజేపీ నేతల కన్ను ►పైస్థాయిలో పావులు కదుపుతున్న ఆశావహులు ►20 తరువాత మంత్రి ప్రత్తిపాటితో భేటీకి బీజేపీ సన్నాహాలు ►భర్తీపై భారీగా ఆశలు పెంచుకున్న తెలుగుదేశం నేతలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని నామినేటెడ్ పదవులపై టీడీపీ, బీజేపీ నేతలు దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని నియామకాలను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో నామినేటెడ్ పదవుల రేసులో టీడీపీ, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మిత్ర పక్షంగా పనిచేసిన ఈ రెండు పార్టీలు నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అదే పంథాలో పయనించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల జిల్లా నేతలు ఓసారి సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని ఆలోచన చేస్తుంటే, ఆశావహులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎవరికివారే తమదైన లాబీయింగ్ నడుపుతూ పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, గెలుపొందిన స్థానాలను ఆధారం గా నామినేటెడ్ పోస్టుల సంఖ్య నిర్ణయించాలని టీడీపీ భావిస్తుంటే, తమతో పొత్తు కుదుర్చుకోవడం, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం వల్లనే టీడీపీ గట్టెక్కిందని బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాక తమతో పొత్తులేకపోతే ఓటమి పాలయ్యేదని ఘంటాపథంగా చెబుతున్నారు. ►రెండు పార్టీల నేతల మనోభావాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీలో సిగపట్లు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు. ►రద్దయిన పోస్టుల్లో ఎక్కువగా మార్కెట్‌యార్డు, ఆలయ కమిటీలు ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలకు సంబంధించిన వీజీటీఎం ఉడా కమిటీ కూడా ఉంది. ►కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ తరఫున గెలుపొందారు. ►మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో కేంద్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకోకుండా జిల్లా స్థాయి పోస్టులను బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. ►ముఖ్యంగా జిల్లాలోని మార్కెట్ యార్డు, ముఖ్య దేవాలయ కమిటీ చైర్మన్, సభ్యుల పదవులను ఆశిస్తున్నారు. ►ఈ మేరకు బీజేపీలోని ఆశావహుల నుంచి ఒత్తిడి పెరగడం తో నియోజకవర్గాల వారీగా పార్టీకి సేవ చేసిన నేతల పేర్లు తీసుకున్నారు. ►అంతేకాకుండా టీడీపీ బాధ్యులతో ఒకటికి రెండుసార్లు సంప్రదింపులు జరిపారు. రెండు, మూడు రోజుల్లో సమావేశమై అర్హుల జాబితా తయారు చేసే యోచనలో బీజేపీ ఉంది. ►ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఒకసారి సమావేశం కావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ సమావేశానికి జిల్లాలో ఆశిస్తున్న మార్కెట్, ఆలయ కమిటీల వివరాలు తీసుకువెళతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి వివరించారు. కమిటీల కేటాయింపులో టీడీపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ►పది సంవత్సరాల తరువాత అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెంచుకున్నారు. మంత్రులు, శాసన సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.