Ministers review
-
8,500 కోట్లతో గోదావరి జిల్లాలకు వాటర్ గ్రిడ్
సాక్షి, తూర్పుగోదావరి: ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వాటర్ గ్రిడ్ విధివిధానాలపై చర్చించేందుకు ఉభయగోదావరి జిల్లాల మంత్రులు మంగళవారం రాజమండ్రిలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా వాటర్ గ్రిడ్ పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని.. వాటర్ గ్రిడ్ అమలులో పూర్తి బాధ్యత అధికారులదేనని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకానికి కన్సల్టెన్సీల పేరుతో రూ.38 కోట్లు వృధా చేసిందని విమర్శించారు. అనుభవజ్ఞులైన అధికారులతో వాటర్ గ్రిడ్ పనులు సమర్ధవంతంగా చేపడతామని వెల్లడించారు. 2051 సంవత్సరం వరకూ సరిపడేలా స్వచ్ఛ మైన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబాబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, అనురాధ, జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం.. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బాధిత కుటుంబానికి పది కేజీల వంతున బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేపట్టిందన్నారు. -
నిర్లక్ష్యం వద్దు.. బాధ్యతగా పనిచేయండి
సాక్షి, విశాఖపట్నం: నిర్లక్ష్యధోరణి వీడి.. వైద్యులు బాధ్యతయుతంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కింగ్ జార్జి ఆసుపత్రిలో వివిధ విభాగాలను డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పుష్పశ్రీవాణి, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. అనంతరం జెడ్పీ హాలులో సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గతంలో కొన్ని మరణాలు సంభవించాయని తెలిపారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టు మార్టం చేయడానికి కూడా గిరిజనులు, పేదల నుంచి లంచం తీసుకుంటున్నారని మండిపడ్డారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యులుగా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే కృత నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సంతృప్తిగా లేను.. మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తా: ఆళ్ల నాని కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. కేజీహెచ్‌లో పరిస్థితులు మారాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి నిరుపేదకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం నెరవేరేలా పనిచేయలన్నారు. వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని మళ్లీ మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న బ్లాక్‌ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎంసిహెచ్‌లో అదనపు బ్లాక్‌ను మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే అవినీతి: అవంతి పేదలకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందండం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేజీహెచ్‌లో అవినీతి పెరిగిపోయిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. బంధువులకి అప్పగించడానికి కూడా లంచాలు తీసుకుంటున్న దుస్థితి ఉందన్నారు. ఆసుపత్రిలో అవినీతిని రూపు మాపాలన్నారు. కేజీహెచ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్లో అధిక వాటాను ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ అభివృద్ధి: ద్రోణంరాజు శ్రీనివాస్ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ ఆసుపత్రి బాగా అభివృద్ధి చెందిందని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆయన హయాంలో రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వైద్యం, విద్యపై దృష్టి పెట్టారన్నారు. కేజీహెచ్‌కు రెండు కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌లో అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగింది: ఎంపీ సత్యవతి దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అన్నారు. కేజీహెచ్‌లో చిన్న పిల్లల వార్డుకి మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. -
సమస్యలపై ఏ‘కరువు’
హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలి రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలివ్వాలి విత్తన వేరుశనగ సబ్సిడీ చాలట్లేదు పండ్లతోటలకు రక్షక తడులు అందించాలి జిల్లా అభివృద్ధి సమీక్షలో ప్రజాప్రతినిధుల వినతి అనంతపురం అర్బన్ : రైతులు పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని, నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్, గ్రామీణ గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. గుంతకల్లు మండలం వైటీ చెరువు తెప్ప ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రసాయం, పంటల బీమా కలిపి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సాయం ప్రకటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కరువును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇలాగైతే రైతుల కష్టాలు ఎలా తీరుతాయని మండిపడ్డారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై లోతుగా చర్చించాలని కోరారు. ఇన్చార్జి మంత్రి స్పందిస్తూ ట్రయల్‌రన్ నిర్వహించి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి మంత్రి బాధ్యతలు తీసుకున్నాక.. పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చానని, త్వరలో మరో సమావేశం నిర్వహించి అన్ని సమస్యలపైనా విస్తృతస్థాయిలో చర్చిస్తానని చెప్పారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ, విత్తన వేరుశనగకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సరిపోవడం లేదని, దీనికి తోడు విత్తన నాణ్యత కూడా లేదని తెలిపారు. సైలేజ్ గడ్డిని పశువులు తినడం లేదని, రైతులు కోరిన గ్రాసాన్ని అందజేయాలని సూచించారు. పండ్లతోటలకు రక్షక తడులు అందించి కాపాడాలని, నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఇన్చార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి రథానికి రెండు చక్రాలు లాంటివారన్నారు. సమష్టిగా జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా కాలువ వెడల్పు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయన్నారు. ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, గోనుగుంట్ల సూర్యానారయణ, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వీరన్న, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తినసింహారెడ్డి, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, కలెక్టర్ జి.వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
వరి కొనుగోళ్ళపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అధికారులతో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్ సచివాలయంలో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. ఈ ఏడాది వేసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట సాగయిందన్నారు. సాధారణ విస్తీర్ణం 5.30 లక్షల హెక్టార్లకు గాను ఈ ఏడాది వేసంగిలో 8.68 లక్షల హెక్టార్లలో వరి సాగయిందని తెలిపారు. నీటి యాజమాన్య పద్ధతులు, నిత్యం మానీటరింగ్‌తో ఎకరాకు వరి దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రవాణాకు వాహనాలను సమకూర్చుకొని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటవెంటనే గోడౌన్లకు తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. -
ఆశల చిగుళ్లు!
►డబుల్ ఇళ్ల నిర్మాణంపై కదలిక ►వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా లక్ష ఇళ్ల నిర్మాణం ►ప్రత్యేకంగా పీఎంయూ ఏర్పాటు ►ఇప్పటికే 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తి ►మరుసటి విడతలో 70 వేల ఇళ్లకు ఒకేసారి... మంత్రుల సమీక్షలో నిడబుల్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 16562 ఇళ్లకు టెండర్లు పూర్తవగా..మిగతా వాటికి రెండు విడతల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేయాలని మంత్రులు భావిస్తున్నారు. డబుల్ ఇళ్ల నిర్మాణం పేదల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలని..ఇందుకు అనుగుణంగా పథకం మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు దక్కిన ఇళ్లను ఇతరులకు అమ్ముకోకుండా...తప్పనిసరిగా నివాసం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. తద్వారానే పేదల జీవన ప్రమాణాలు పెరిగి సామాజిక స్థాయి మెరుగవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తిచేయడం లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. మంగళవారం బేగంపేటలోని మెట్రోరైలు భవనంలో డబుల్ బెడ్రూమ్ అమలు తీరుపై మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీలో ఇప్పటికే 16,562 ఇళ్ల టెండర్లు పూర్తయి, చాలా చోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయన్నారు. మరో 16 వేల ఇళ్లకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. మిగతా దాదాపు 70 వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లకు అనుమతి తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల తీరును నేరుగా పర్యవేక్షిస్తామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చే బిల్డర్లకు జీహెచ్ఎంసీ తరపున కావాల్సినన్ని మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్యేలు నేరుగా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడటంతో ప్రస్తుతం పలు కంపెనీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నాయన్నారు. ‘డబుల్’ఇళ్లతో పేదల జీవితాల్లో గుణాత్మకమార్పు: మంత్రులు డబుల్బెడ్రూమ్ పథకంతో పేద ప్రజల జీవితాల్లో గుణాత్మకమార్పు వస్తుందని మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు అన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపి తమ నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. మురికివాడల్లోని పేదలను చైతన్యపరుస్తూ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. నగరంలో హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ఏర్పాటు చేయాల్సిందిగా హౌసింగ్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కేటీఆర్ కోరారు. నగరంలోని ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావాల్సిందిగా ఆయన హౌసింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో లక్షఇళ్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను నెరవేరుస్తామన్నారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ హౌసింగ్ స్కీమ్‌ను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల వల్ల ప్రజల జీవనప్రమాణాల్లో మార్పు వస్తుందని, లబ్ధిదారులు వీటిని అమ్ముకోకుండా కుటుంబానికి రక్షణఇచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ఈ హౌసింగ్స్కీమ్ పథకం మార్గదర్శకాల్లో ఈ నిబంధన చేర్చాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ నిబంధన లేకుంటే పేదల జీవితాల్లో మార్పు సాధ్యం కాదన్నారు. వారు ఈ ఇళ్లల్లో నివసించినప్పుడే వారి సామాజిక స్థాయిలో మార్పు వస్తుందని, ప్రభుత్వ లక్ష్యానికి సార్థకత చేకూరుతుందన్నారు. సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, జంటనగరాల ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, హౌసింగ్‌శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాల మంత్రుల సమీక్ష
కడప: పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కడప జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, పీతల సుజాత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, మైనింగ్ ద్వారానే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం అమ్మకాలు అడ్డుకోవాలని అధికారులకు హోమంత్రి చినరాజప్ప సూచించారు.