MLA CHINTAMANENI
-
మరుగుదొడ్లు పూర్తికాలేదని విద్యుత్ మీటర్ల తొలగింపు
దెందులూరు : మరుగుదొడ్లు పూర్తి కాని ఇళ్లకు విద్యుత్ మీటర్లు తొలగించిన వైనం దెందులూరులో చోటు చేసుకుంది. మరుగుదొడ్లు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సానిగూడెం గ్రామ కార్యదర్శి అవినాష్‌పై విరుచుకుపడ్డారు. అతనిని దుర్భాషలాడారు. మరుగుదొడ్లు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఇళ్ల చుట్టూ మురుగు ఉంది. మీరు ఏం చేస్తున్నారంటూ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం సానిగూడెం దళితపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లకు డోర్లు పెట్టకుండా, ప్లాస్టింగ్ చేయకుండా, పైపులు కలపకుండా వివిద దశల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని చూసి గ్రామ కార్యదర్శిని, లబ్ధిదారులను మందలించారు. ఇలా అయితే కుదరదంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిచి వెంటనే మరుగుదొడ్లు పూర్తి చేయని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది గ్రామంలో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో నిర్మించని ఎనిమిది ఇళ్లకు విద్యుత్ మీటర్లను తొలగించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్టర్‌ను వదలిపెట్టి లబ్ధిదారులు, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయటం ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా చిన్నపిల్లలతో విద్యుత్ లేకుండా ఉన్నామని బాధితులు వాపోయారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని
► గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని తోసివేత సాక్షి, ఏలూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గ్రామస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. ఏలూరు మండలం కోటేశ్వరదుర్గాపురం గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని డ్రైనేజీపైకి తోశారు. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా.. అంటూ చిందులు తొక్కారు. శని వారం జరిగిన ఈ సంఘటన ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులను ఉలికిపాటుకు గురి చేసింది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన కోటేశ్వరదుర్గాపురం, గుడివాకలంక, మొండికోడు గ్రామాల్లో పర్యటించారు. కోటేశ్వరదుర్గాపురంలో పంచాయతీ కార్యదర్శి గ్రామానికి సరిగా రావడం లేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ఆగ్రహంతో ఏయ్.. సెక్రటరీ, ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నేను వస్తుంటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కూడా తెలియదా? అంటూ కార్యదర్శి అనిల్‌కుమార్ మెడపట్టుకుని పక్కనే ఉన్న డ్రైనేజీ వద్దకు తోసుకెళ్లారు. చూడు డ్రైనేజీ అధ్వానంగా ఉంది... నీకు కళ్లు కనబడడం లేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యదర్శిని పక్కకు లాగి వెనక్కి పంపారు. భీతిల్లిన కార్యదర్శి ‘సార్.. నాకు నాలుగు గ్రామాల ఇన్చార్జి ఇచ్చారు...’ అని చెప్పారు. వాస్తవానికి కార్యదర్శి అనిల్‌కుమార్ మేజర్ పంచాయతీలైన శనివారపుపేట, చాటపర్రు, మాదేపల్లితో పాటు కోటేశ్వరదుర్గాపురం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. నలుగురి పని ఒక్కడు చేస్తున్నా ఎమ్మెల్యే ఇలా దూషించడం అన్యాయమని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఏలూరులో జనసేన ధర్నా
ఏలూరు: సినీ హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలు ప్లకార్డులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఎమ్మెల్యే చింతమనేని గూండాగిరి
-
‘సాక్షి’ విలేకరులపై దాడి
ఏలూరు, సాక్షిప్రతినిధి : సాక్షి మీడియా విలేకరులపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి యత్నించారు. కెమేరాలు, సెల్ఫోన్లు లాక్కున్నారు. తొలుత పెదవేగి మండలం బి.శింగవరంలోని తమ్మిలేరు సమీపంలో బుధవారం వనం–మనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కార్యకర్త ఒకరు చింతమనేనిని నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో సాక్షి మీడియా జిల్లా సిబ్బంది ఆ ఘటనను చిత్రీకరించేందుకు శింగవరం గ్రామానికి బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని గ్రామంలో ఉన్న తన అనుచరులైన చింతమనేని సతీష్, మరో 30 మందిని రంగంలోకి దింపారు సాక్షి సిబ్బందిపై దాడికి యత్నించారు. అంతే కాకుండా వెంటపడి సిబ్బంది వద్దనున్న కెమేరాలు, సెల్ఫోన్లు, టీవీ చానల్‌కు సంబంధించిన చిప్‌లను సైతం లాక్కున్నారు. అతి కష్టమ్మీద ఏలూరు చేరుకున్న సిబ్బంది ఈ ఘటనపై డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. -
’వృద్ధురాలిని లాక్కెల్లిన టీడీపీ ఎమ్మెల్యే’
-
'చింతమనేని చిందులు'
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దురహంకారం మరోమారు బయటపడింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు విరుచుకుపడ్డారు. గౌరవప్రదమైన ప్రభుత్వ విప్ పదవిలో ఉండి దుర్భాషలాడారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోండని విన్నవించుకున్న వారిపై పత్రికల్లో రాయలేని భాషలో అవమానకరంగా మాట్లాడారు. గుడ్లు, పప్పులు అమ్మేసుకునే మీకెందుకే జీతాలు అంటూ మొదలుపెట్టిన చింతమనేని.. 'అసభ్య పదం..... మీకు వచ్చేవి సరిపోక జీతాల కోసం రోడ్లెక్కారా. మాకే జీతాలు లేవు. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారు. బెడ్రూమ్లు ఇస్తాం. కావాలంటే తీసుకోండి' అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. 'పెంచిన జీతాలు కాదయ్యా.. ప్రతి నెలా ఇచ్చే జీతాలే ఇచ్చి మూడు నెలలైంది' అని ఓ పెద్దావిడ చెబుతుండగా.. మళ్లీ అసభ్య పదజాలం... ఆ వెంటనే సీఐటీయూ డివిజన్ నాయకుడు ఎం సుందరబాబును ఉద్దేశించి ఆడవాళ్లను మూటగట్టి తీసుకొచ్చి ప్రభుత్వంపై ఉసిగొల్పుతావా అంటూ రెచ్చిపోయారు. -
ఇక తాడో పేడో..
రెవెన్యూ అసోసియేషన్ సమరశంఖం ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ ‘తెలుగుదేశం పార్టీ నేతల నైజం బయటపడింది. గతంలో మాదిరిగానే అధికారులు, ఉద్యోగులపై టీడీపీ నాయకులు, కార్యకర్తల వేధింపులు, దాడులు మొదలయ్యాయి. ఛోటా మోటా నాయకుల పైరవీలు, ఒత్తిళ్లను ఇకపై ఉపేక్షించకూడదు. ఇటువంటి ఘటనలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే వరుస దాడులు జరుగుతాయి..’ ముసునూరు తహశీల్దారుపై టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటనపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు వెల్లడించిన అభిప్రాయాలివి. విజయవాడ : తహశీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడటం, ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలతో ఆమెపై కేసు కూడా పెట్టించడంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిందిగాక ఆమెపై తప్పుడు కేసు పెట్టించి ఎమ్మెల్యే డబ్బులిచ్చి ధర్నా జరిపించటంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్.. రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల రెవెన్యూ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి కేవలం కొద్ది గంటల్లో ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీకి, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులకు ముసునూరు తహశీల్దార్‌పై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేశారు. రౌడీ రాజకీయాలకు తలొగ్గం... ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే పోరాటం ఉధృతం చేయాలని గురువారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తహశీల్దార్ వనజాక్షికి రాష్ట్రంలోని రెవెన్యూ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు. రౌడీ రాజకీయాలకు రెవెన్యూ అసోసియేషన్ తలొగ్గదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను, అతని అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రేక్షకప్రాత్ర పోషించిన ముసునూరు ఎస్ఐని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలన్నారు. నేడు కార్యాలయాలకు తాళాలు... అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనీల్ జన్నిసన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలలోపు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నారు. లేకుంటే జిల్లాలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి రోజంతా ధర్నాలు చేస్తామన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇసుక విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బోజరాజు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలపై సమైక్య పోరాటం అవసరమన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు. న్యాయ పోరాటం చేస్తా ఈ ఘటనలో తాను న్యాయ పోరాటం చేస్తానని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి అన్నారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. తన సిబ్బందిని నిర్బంధించారని తెలిసి.. తాను ఆ ప్రదేశానికి వెళ్లానని చెప్పారు. అప్పటికే దెందులూరు ఎమ్మెల్యే, అతని అనుచరులు 25 ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్రాక్టర్లను ఆపమంటూ తాను అడ్డుకోగా ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని వివరించారు. సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించిన తరువాత ఇసుక తవ్వుకోండని ఎమ్మెల్యేకు చెప్పినా ఆయన తనపై దాడిచేయించారని చెప్పారు. 500 మీటర్లు దాటి లోపలకు వచ్చి ఇసుకను తవ్వుకుపోతున్నారనే ఫిర్యాదుపై తాను అక్కడకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని ఆమె వివరించారు. ఈ ఘటనపై ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేదిలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, గన్నవరం తహశీల్దార్ మాధురి, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి పాల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సంఘీభావం తహశీల్దార్ వనజాక్షికి జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో తాను పూర్తి మద్దతు ఇచ్చి రెవెన్యూ అసోసియేషన్‌కు అండగా ఉంటానన్నారు. విజయవాడ సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నూజివీడు ఆర్డీవో రంగయ్య తదితరులు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఎంపీడీవోల అసోసియేసన్, వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వో, వీఆర్ఏల అసోసియేషన్లు కూడా ఈ ఘటనను ఖండించి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐద్వా మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడిని ఖండించారు. -
తొడగొట్టిన రౌడీ రాజ్యం