MLA Shankar
-
నిన్న వార్నింగ్.. నేడు క్షమాపణ
-
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
సాక్షిపై ఎమ్యెల్యే శంకర్ అక్కసు
ఆయన ఒక ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాల్సిన వ్యక్తి. మూడేళ్లుగా రోడ్డు పనులు చేయించకపోవడంపై స్థానికలు నిలదీయడంతో విచక్షణ కోల్పోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై చిందులేశారు. వార్త రాసి ఏం పీకుతారంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సంఘటన పెద్దమండ్యం మండలంలో బుధవారం జరిగింది. ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు, పెద్దమండ్యం: మండలంలోని మందలవారిపల్లె నుంచి తుమ్మలవంకతండా వరకు రూ.4.50 కోట్లతో తారు రోడ్డు, పెద్దేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్యె ల్యే శంకర్‌యాదవ్ బుధవారం శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పరిధిలోని దేనేనాయక్ తండాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ తండాలను కలుపుతూ రోడ్డు వేశామని తెలిపారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తండాల్లో సిమెంటు రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తండాలో సిమెంటు రోడ్లు వేసేందుకు మూడేళ్ల క్రితం కంకర, ఇసుక తోలి అలాగే వదిలేశారని మండిపడ్డారు. తండాల్లో సిమెంటు రోడ్ల కోసం రూ.60 లక్షలు వచ్చిందని చెప్పి కంకరు, ఇసుక తోలి వదిలేస్తే ఏం ఉపయోగమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి ఫొటోలు తీస్తుండగా ఎమ్యెల్యే గమనించారు. విచక్షణ కోల్పోయారు. సాక్షి పేపరులో వార్త రాసి ఏం పీకుతారంటూ చిందులేశారు. అనంతరం దండువారిపల్లెకు రూ.1.23 కోట్లతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడా ఎమ్మెల్యేకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఐదేళ్లుగా రోడ్డు వేయకుండా ఇప్పుడు వచ్చారా అంటూ నిలదీశారు. -
జెడ్పీ మీట్లో రచ్చ..రచ్చ
ఎమ్మెల్యే నారాయణస్వామితో టీడీపీ సభ్యుల వాదన తిప్పికొట్టిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పోటాపోటీగా నినాదాలు అరుపులతో అర్ధగంటపాటు స్తంభించిన సమావేశం ఎమ్మెల్యే శంకర్ జోక్యంతో సర్దుబాటు చిత్తూరు (టౌన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. చిత్తూరు జెడ్పీ మీటింగ్ హాల్లో ఆదివారం జరిగిన సమావేశంలో అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఒకదశలో తోపులాటలు కూడా జరిగాయి. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ సభ్యులు, కుదరదంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సభ్యులు వాదోపవాదాలకు దిగారు. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. చివరకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ జోక్యంతో సద్దుమణిగింది. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 11.55 గంటలకు ప్రారంభమైన రచ్చ 2.30 గంటల వరకు కొనసాగింది. అంతకుముందు హుదూద్ తుపానులో మరణించిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పథకాల్లో అక్రమాలు: నారాయణస్వామి అనంతరం జరిగిన సమావేశంలో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్ని మంజూరయ్యాయి? ఎవరెవరికి అందుతున్నాయి? పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్నాయని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెరకు కషర్ల విషయానికొస్తే అధికారులు చెప్పేదానికి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదానికి తేడాలున్నాయని ఆరోపించడంతో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. అధికారులు చెప్పాల్సిన సమాధానాన్ని టీడీపీ సభ్యులే చెబుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని విమర్శించారు. గత ప్రభుత్వానికి ( కిరణ్ సర్కారుకు) మీరు, మీ నాయకుడు చంద్రబాబు సహకరించబట్టే అధికారులంతా జైలుకెళ్లాల్సి వచ్చిందంటూ నారాయణస్వామి విమర్శించారు. వెనుక వరుసలో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటుకు వెళ్లి జెడ్పీ మీటింగ్‌లో చంద్రబాబు మాటెందుకు ప్రస్తావిస్తారంటూ వాదనకు దిగారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆర్కే. రోజా, అమరనాథరెడ్డి, సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఏకంగా వారి వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కాస్త తోపులాట జరిగింది. ైవైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించడంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వారికి పోటీగా వ్యాఖ్యలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రతి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రోజాతో వాదన ఇంతలో నగరి ఎమ్మెల్యే ఆర్కె.రోజాతో టీడీపీకి చెందిన ఓ మహిళా సభ్యురాలు వాదనకు దిగారు. దీంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అసలు విషయం దారి మళ్లించిన టీడీపీ సభ్యులు ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. రోజా ఏమాత్రం వెరవకుండా ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పేదిలేదదన్నారు. దీంతో టీడీపీ సభ్యులు తమ పార్టీ మహిళా సభ్యులను రెచ్చగొట్టి పోడియం వద్దకు పంపారు. రోజా క్షమాపణ చెప్పేవరకు దిగేదిలేదంటూ నినాదాలు చేశారు. ఈ స్థితిలో జోక్యం చేసుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సభ్యులు సంయమనం పాటిం చాలని, సజావుగా సభ జరిగేందుకు హుందాగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన విషయాలను వదిలేసి ఇకపై సభ సజావుగా జరిగేందుకు అంతా సహకరించాలని కోరడంతో సభ్యులంతా వారివారి సీట్లలో ఆశీనులయ్యారు -
బాబువన్నీ మాటలేనా!
బి.కొత్తకోట: ‘తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు, వెనుకబాటుతనం, పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతకాలం పెత్తందారి వ్యవస్థలో నలిగిపోయింది. ఇక్కడ అవసరమైన అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను తీరుస్తాన’నని బుధవారం అంగళ్లులో జరిగిన జన్మభూ మి సభలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏం చేయబోతున్నారో ఒక్క మాటైనా చెప్పలేదు. అభివృద్ధిపై ఆశలు పెంచుకున్న నియోజవర్గ ప్రజల్లో నిరాశను మిగిల్చారు. ఎన్నో సమస్యలున్నా వాటి ప్రస్థావన లేదు. సభలో నియోజకవర్గానికి చంద్రబాబు ఇచ్చింది ఐదు హామీలు. బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిని 30 పడకల స్థాయికి పెంచడం, బి.కొత్తకోటకు డిగ్రీ కళాశాల, టమాట రైతులకు ప్యాకేజీ, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధి, రూ.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి. బి.కొత్తకోట డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో హామీ ఇచ్చారు. దీనిపై చర్యలు సైతం ప్రారంభమయ్యాయి. తర్వాత రాష్ట్ర విభజన కారణంగా చర్యలు ఆగిపోయాయి. ఇదే హామీని చంద్రబాబు తిరిగి ఇచ్చారు. ఇక 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం చంద్రబాబు 1995-2003 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదనలున్నాయి. దీనికీ హామీ ఇచ్చారు. కొత్తగా రూ.50 కోట్లతో రోడ్లు, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధికి హామీ ఇవ్వడం మినహా చేసిందేమీలేదు. తంబ ళ్లపల్లె పరిస్థితులపై జాలిపడిన చంద్రబాబు అందుకు తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళిక ప్రకటించలేకపోయారు. సమస్యలపై మాటేలేదు.. నియోజకవర్గంలోని తీవ్ర సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఏర్పాటు, తంబళ్లపల్లెకు విద్యుత్‌సబ్‌స్టేషన్, సరిహద్దు రహదారుల అభివృద్ధి, హార్సిలీహిల్స్ అభివృద్ధి, కురబలకోట చింతపండుకు మార్కెటింగ్, హంద్రీ-నీవా కోసం భూ ములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ, బి.కొత్తకోట బైపాస్‌రోడ్డు, గట్లమీదపల్లెలకు రహదారి, కురబలకోటకు ప్రభుత్వ కళాశాలలు, మదనపల్లెలో నడుస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల నిర్మాణం తదితరాలు ప్రస్తావించలేదు. రూ.50 కోట్లు ఏ మూలకు.. నియోజకవర్గంలోని సుమారు 600 పల్లెలకు రోడ్డు వసతి లేదని ఎమ్మెల్యే శంకర్ సభల్లో పదేపదే చెబుతుంటారు. వీట న్నింటికీ రోడ్లు వేయాలంటే రూ.50 కోట్లు సరిపోతాయా?. ప్రస్తుతం కిలోమీటరు రోడ్డుకు అయ్యే ఖర్చెంత, సీఎం ప్రకటించిన నిధులతో ఎన్నిపల్లెలకు రోడ్డువేయెచ్చో అంచనా వేయేచ్చు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజలకు రోడ్డు బాధలు ఇప్పట్లో తీరేలా లేవు.