MLA Shivaji
-
అడుగడుగునా అరాచకమే!
అన్యాయం జరిగింది.. తమకు న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకుంటే తిరిగి బాధితులనే భయభ్రాంతులకు గురిచేస్తారు. ఇంకా ప్రశ్నిస్తే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తారు. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి మౌనం వహించడం, షాడో నేత అంతా తానై వ్యవహరించి అవినీతిపరులకు, అక్రమార్కులకు కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు గోడపత్రికల రూపంలో ఆవేదన వెల్లగక్కుతున్నారు. సాక్షి, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయి. ఏ మూలచూసినా.. ఏ నోట విన్నా ‘వెంకన్న’ లీలలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే శివాజీ మౌనం వహించడంతో సదరు షాడో నేత పరిపాలనకు కేంద్ర బిందువుగా మారారు. ఏ పని జరగాలన్నా ఆయన ఆమోదం ఉండాల్సిందే. ఎదిరిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టించడం, జైలుకు పంపించడం, అధికారులతో దాడులు జరి పించడం వంటి కార్యకలాపాలకు పాల్పడతారని భయపడి కొందరు ఎక్కడికక్కడ ‘గోడపత్రికలు’ విడుదల చేసి తమ గోడు వినిపిస్తున్నారు. నువ్వలరేవులో వాల్‌పోస్టర్ల కలకలం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామంటూ జన్మభూమి కమిటీలు, టీడీపీ నాయకులు ప్రజల నుంచి వేల రూపాయల్లో కమీషన్లు దండుకుంటున్నారు. ప్రధానంగా నువ్వలరేవులో ఎంపీటీసీ సభ్యుడు, మరో ఎంపీటీసీ ప్రతినిధి, జన్మభూమి కమిటీ సభ్యుడు కలిసి సంక్షేమ పథకాల మంజూరు పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ వాటాలలో కొంత ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కుపల్లి, మెట్టూరు గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. మరుగుదొడ్డి కావాలంటే రూ.1800, ఇంటి కోసం రూ.15వేలు–రూ.20 వేలు, చంద్రన్న బీమా అందించాలంటే రూ.20,000, పింఛన్ కావాలంటే రూ.1500 నుంచి రూ.3000.. ఇలా ఒక్కో పథకానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ‘పెద్ద’ల అండదండలు ఉండటం వల్లే ఇలా దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి ఆగడాలను భరించలేక నువ్వలరేవులో కొందరు గోడ పత్రికను విడుదల చేసి నాయకులు బండారాన్ని బయటపెట్టారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. బెదిరింపుల పర్వం.. పలాస ఎమ్మెల్యే అల్లుడు, రెండేళ్ల క్రితం పనిచేసిన కాశీబుగ్గ పోలీసు అధికారి, కొంతమంది సొంపేట పోలీసుల వల్ల తనకు ప్రాణభయం ఉందని, ఏం జరిగినా ఎమ్మెల్యే అల్లుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పలాసకు చెందిన ఓ వైశ్య కుటుంబం పేరిట విడుదలైన గోడపత్రికలు అప్పట్లో కలకలం రేపాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే శివాజీ అల్లుడిపై విడుదలైన కరపత్రాలను సైతం ఇప్పటికీ మరవలేక పోతున్నారు. వైశ్యుల్లో ఆగ్రహావేశాలు.. బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన వైశ్య యువకుడు డోకి హరీష్ కాశీబుగ్గ ఓ మిఠాయి దుకాణంలో బతుకు తెరువుకోసం కూలిపనిచేసే వాడు. ఇతడిపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ దాడి చేసి మరణానికి కారకుడయ్యాడు. ఈ ఉదంతాన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ ముక్తకంఠంతో ఖండించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీల వరకు విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జంట పట్టణాలను స్తంభింపజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేయించిన ఎమ్మెల్యే.. తిరిగి నెలరోజుల్లోనే బయటకు తీసుకువచ్చి ప్రస్తుతం ప్రచారంలో వెంటవేసుకుని తిరుగుతున్నారు. ఎలా మర్చిపోగలం.. తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు జంట పట్టణాల పరిధిలోని వైశ్య కుటుంబాలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వైశ్యులపై జరిగిన దాడులను గుర్తు చేసుకుని కొందరు సమావేశం మధ్యలోనే వెనక్కువచ్చేసినట్లు తెలిసింది. -
నే చెప్పిందే వేదం
► నియోజకవర్గాల్లో అచ్చెన్న మితిమీరిన జోక్యం ► సీనియర్ ఎమ్మెల్యేలకు మింగుడుపడని ధోరణి ► అవమాన పడుతున్న ప్రభుత్వ విప్ ► గంటా పర్యటన రద్దుతో కూనకు మరోమారు భంగపాటు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు తాను చెప్పిందే వేదమనే ధోరణిలో ముందుకు పోతున్నారు. అందుకు అడ్డుతగిలితే స్వపక్షీయులనూ సహించడం లేదు. తనకు తెలియకుండా జిల్లాలో ఎవరూ అడుగు కూడా పెట్టడానికి వీలు లేదంటున్నారు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమదాలవలస పర్యటన రద్దు వెనుక ఇదే కారణమంటున్నారు. అమాత్యులు సర్వం తానై వ్యవహరిస్తూ పార్టీలో ఇంటిపోరును రాజేస్తున్నారు. అయినదానికీ కానిదానికీ అన్ని నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతూ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అచ్చెన్న స్వపక్ష బాధితుల చిట్టాలో తొలి పేరు విప్ కూన రవికుమార్‌దే కావడం విశేషం. శ్రీకాకుళం టౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రి అచ్చెన్నాయుడు హవా సాగించడం పార్టీ నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. సీనియర్ శాసనసభ్యులు శివాజీ, కళావెంకటరావుల నియోజక వర్గాలనూ మంత్రి వదలడం లేదు. దీనిపై ఇటీవల ఎమ్మెల్యే శివాజీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వద్దే పంచాయితీ పెట్టారు. అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో తన నియోజక వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రి అడ్డుకుంటున్నారని ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. కళావెంకటరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎచ్చెర్లలో జోక్యం చేసుకోవద్దని అచ్చెన్నకు సీఎం సూచించారంటే పరిస్థితి అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విషయంలో మంత్రి అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్న చర్చ మొదలైంది. జిల్లాలో మంత్రి తర్వాత పెద్ద హోదాలో రవికుమార్ కొనసాగుతున్నారు. రవికుమార్ దూసుకువెళ్తున్న తీరు అచ్చెన్నకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన దూకుడు కళ్లెం వేయాలని మంత్రి అడుగడుగునా అడ్డుపడుతున్నారని రవికుమార్ సన్నిహితులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆది నుంచే అడ్డుకునే ప్రయత్నం ఆర్అండ్బి శాఖ అతిథి గృహాన్ని విప్‌కు కేటాయించవద్దంటూ ఆరంభంలోనే ఆశాఖ అధికారులపై మంత్రి ఒత్తిడి పెంచారు. ఆమదాలవలసలో ఏపని మంజూరు చేయాలన్నా విప్ అనుమతి అవసరం లేదని తాను చెపితే చాలని హుకుం జారీ చేశారు. విప్ తెలియకుండా కనుగులవలస రక్షిత మంచినీటి పనులకు జడ్పీ చైర్పర్సన్ ద్వారా రూ.15లక్షలు మంజూరు చేరుుంచారు. మంత్రి కొల్లు రవీంద్రను టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపనకు రానీయకుండా అడ్డుపడ్డారు. రాజీవ్ విద్యామిషన్‌లో డెప్యూటేషన్‌పై కూన మోహనరావు అనే ఉద్యోగిని మూడు నెలల క్రితం విప్ రవికుమార్ తీసుకు వచ్చారు. నాలుగు నెలలుగా జీతం చెల్లించపోగా ఆయనకు కుర్చీకూడా ఇవ్వలేదు. మంత్రి సమ్మతిస్తేనే సీటు కేటాయిస్తామని ఆశాఖ ఉన్నతాధికారి చెబుతున్నారు. తాజాగా విప్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజక వర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం పర్యటించాల్సి ఉంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తోడు బహిరంగసభ నిర్వహించాలని విప్ ఏర్పాట్లు చేశారు. చివరినిమిషంలో గంటా పర్యటన రద్దరుుంది. జిల్లాలో తాను లేని సమయంలో వెళ్దొద్దని అచ్చెన్న చెప్పడంతో గంటా గంటా వెనక్కి తగ్గారని తెలిసింది. దీంతో మరోమారు అచ్చెన్నవల్ల రవికి భంగపాటు తప్పలేదు. రవి కంట్లో ‘ఇసుక’ ఇసుక రేవుల విషయంలో విప్ మాట చెల్లడం లేదు. ఈయన వర్గీయులుగా భావిస్తున్నవారి ట్రాక్టర్లను కలెక్టరు ఇటీవల సీజ్ చేయించారు. పెద్దెత్తున అక్రమాలు జరుగుతన్న నరసన్నపేట ,పాతపట్నంలో ఒక్క ట్రాక్టరునూ పట్టుకోని అధికారులు తమ నేత నియోజకవర్గం లోనే చెలరేగుతున్నారని విప్ వర్గీయులంటున్నారు. మంత్రి ఆదేశాలమేరకే అధికారులు ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అచ్చెన్న అవమానాలు భరించలేనని రవి సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. సీంఎ చంద్రబాబు ముందు పంచాయితీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మంత్రి..విప్ల మధ్య విభేదాలు అధికారులకు తలనొప్పిగా తయూరయ్యూయి. ఎటువెళ్తే ఏం ముప్పు వస్తుందోనని హడలిపోతున్నా రు. వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారు. అచ్చెన్న తీరుపై మండిపడ్డ పార్టీ నేతలు శ్రీకాకుళం టౌన్ ః జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏకపక్ష నిర్ణయాలను ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. టీడీపీ నియోజకవర్గ స్థాయిలో మంత్రి ద్వితీయ శ్రేణి వర్గాలను కూడగడుతున్నారని ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు శివాజీ, బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో వర్గాలను తయారు చేస్తే పార్టీకి నష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఆర్అండ్ బీ అతిథి గృహంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు మినహా మిగిలిన ఎవరినీ లోపలికి అనుమతించలేదు. వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన ఇటీవల బహిరంగంగా టీడీపీ నాయకులపై చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయిలో కమిటీని సిద్ధం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీదేవికి సూచించారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, అందువల్ల ఎప్పటికప్పుడు ఆయన వ్యాఖ్యలను ఖండించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సమర్ధవంతమైన వారిని కమిటీలో వేయాలని మంత్రి సూచించారు. సమావే శానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషతోపాటు జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనల క్ష్మి, విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే శివాజి, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తదితరులు హాజరయ్యారు. -
మత్స్యకార ఐక్యవేదికపై టీడీపీ నేతల మాటల తూటాలు
* ఐక్యవేదికగా ఏర్పడితే సమస్యలు పరిష్కారమవుతాయూ అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే శివాజీ * వంతపాడిన ప్రభుత్వ విప్ కూనరవికుమార్ * ఐక్యవేదిక సభ్యులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన వైనం * నివ్వెరబోయిన సభ్యులు * నేతల తీరుపై ఆందోళన చిన్నకర్రివానిపాలెం(కవిటి): మత్స్యకార ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది... దాని వయసు ఎంత... వారు చెబితేనే పనులు చేస్తున్నామా.. 1983లో ఎన్టీఆర్ గద్దెనెక్కినప్పుడు ఈ మత్స్యకార ఐక్యవేదిక ఉందా? ఈ ఐక్యవేదిక కోరితేనే అప్పుడు ఈ నియోజకవర్గంలో మత్స్యకారులకు కరెంట్,రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించారా?, సభలో దివంగత నేత ఎన్టీఆర్ చిత్రప టం కూడా ఏర్పాటుచేయకపోవడం ఏమిటంటూ మత్స్యకార ఐక్యవేదిక సభ్యులపై ఎమ్మెల్యే శివాజీ మాటల తూటాలు పేల్చారు. ఆగ్రహం, అసహనంతో ఊగిపోయూరు. ప్రపంచమత్స్యకార దినోత్సవంలో భా గంగా మండలంలోని చిన్నకర్రివానిపాలెంలో మత్స్యకారుల సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ ఐక్యవేదిక ఏర్పాటే ఒక అనిర్వచనీయమైనదిగా పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏర్పడిన మత్స్యకార ఐక్యవేదికకు వయసెంతంటూ నిలదీశారు. అనంతరం మాట్లాడిన ప్రభుత్వ చీఫ్‌విప్ కూన రవికుమార్ సైతం శివాజీ బాటలోనే తన ప్రసంగం కొనసాగించడంతో మత్స్యకార నేతల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. సముద్రపు ఇసుక తరలించడం వల్ల అనర్ధాలు తలెత్తుతాయన్నది ఎక్కడా చదవలేదన్నారు. ఇసుకమైనింగ్లో కేవలం 16 శాతం ముడిఖనిజాలు సేకరించిన తర్వాత మిగిలిన 84 శాతం ఇసుకను మళ్లీ ఎక్కడ సేకరించారో అక్కడే సంస్థ విడిచిపెడుతుందంటూ సెలవిచ్చారు. ముందుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం మత్స్యకార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మడ్డు రాజారావు మాట్లాడుతూ తరతరాలుగా సముద్రమే ఆధారంగా బతుకుతున్న మత్స్యకారులకు సముద్రంపై హక్కును కల్పించకపోవడం విచారకరమన్నారు. తీరంపై మత్స్యకారుల హక్కులను హరిస్తూ, ఇసుకను అమ్మేస్తూ మత్స్యకారుల బతుకుల్లో చిచ్చురేపుతున్న పరిశ్రమలను రద్దుచేసి రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్‌లు మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వానికి నివేదికలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎకువూరుకు చెందిన శాస్త్రవేత్త గంటా వెంకటరావు స్వీయరచనలో రూపుదిద్దుకున్న ‘ఫిషర్మెన్ లైవ్లీ హుడ్’ అనే పుస్తకాన్ని నేతలు, అధికారులు ఆవిష్కరించారు. సభకు ముందు మత్స్యకార యువకులు చేసిన సాంప్రదాయ నృత్యం చూపరులను అలరించింది. ఈ సమావేశంలో కవిటి, సోంపేట జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, సూరాడ చంద్రమోహన్, ఎంపీపీలు బెందాళం కిరణకుమారి, చిత్రాడ శ్రీనివాసరావు, కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్ర, బి.ప్రకాష్, సర్పంచ్ గంతి దాశరథి, కర్రి పండయ్య, మాదా సోమయ్య, ఫిషరీస్ డెప్యూటీ డెరైక్టర్ యూకూబ్ బాషా, మత్స్యకార ఐక్యవేదిక సభ్యులు గంతి శ్రీను, మాదా సోమయ్య, కర్రి పండయ్య, వాసుపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.